సినిమా వార్తలు

Biggboss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో లవ్ ట్రాక్ స్టార్ట్..!

బిగ్‌బాస్ 10 తెలుగు ఆరంభమే చాలా ఆసక్తికరంగా జరిగింది. కంటెస్టెంట్స్ అంతా బీభత్సమైన కంటెంట్ ఇస్తున్నారు. ప్రారంభంతోనే రైవలరీ ప్రారంభమైంది. ఇప్పటి వరకూ ప్రారంభం కానిది.. లవ్ ట్రాక్ మాత్రమే. ప్రస్తుతం అది కూడా ప్రారంభం కానుందా? లవ్ ట్రాక్ ఏమైనా నడవనుందా? పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తున్నాయి. ఎవరెవరికి మధ్య అంటారా? దేబ్జాని, రోహిత్ మధ్య. లైవ్ చూస్తున్నవారంతా ఇదే విషయమై చర్చించుకుంటున్నారు. తాజాగా దేబ్జాని, రోహిత్ కూర్చొని మాట్లాడుకున్నారు. తన తెలుగు పట్టించుకోవద్దని తన మాటల్లోని భావాన్ని తీసుకోమని రోహిత్‌కు దేబ్జాని చెప్పింది. తెలుగు సరిగా రాకపోవడం వలన తన మాటలు రాంగ్‌గా కన్వే అవ్వొచ్చేమో.. అదే జరిగితే మీరు.. త్రిగుణ్ అయినట్టు మనం కూడా అయిపోతామని రోహిత్‌కు దేబ్జాని చెప్పింది. అలా అవడం తనకు ఇష్టం లేదని చెప్పింది.

ఇప్పటి వరకూ జరిగిందంతా మర్చిపోదాం. ఇక ముందు మంచిగా ఉందని దేబ్జాని చెప్పింది. ఆమె మాటలు శ్రద్ధగా విన్న రోహిత్.. మీ చేయి పట్టుకోవచ్చా? అని అడిగి మరీ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ తరువాత ‘నేను నిన్ను గౌరవిస్తాను. నేను నిన్ను చాలా ఇష్టపడతాను. ఎందుకంటే.. నువ్వు చాలా ఇన్నోసెంట్, చాలా పేంపర్డ్. మీ తల్లిదండ్రుల ప్రేమ తాలుకు ఎసెన్స్ నీలో కనిపిస్తోంది. నాలుగు రోజులుగా నేను నిన్ను చూస్తున్నా. నీకు ఫిల్టర్స్ లేవు. నువ్వు అతిగా ఆలోచించవు’ అనడంతో దేబ్జాని అదే తనకు మైనస్ అవుతోందని చెప్పింది. అప్పుడు రోహిత్.. ‘నీలో ఆ బ్యూటీని చూసినవాళ్లు నిన్ను ఎంతగానో ఇష్టపడతారు. నువ్వు ఎవరినీ హర్ట్ చేయవు. అది నాకు బాగా నచ్చుతుంది. నేనొచ్చి నీతో ఫ్రెండ్, సిస్టర్ ఏదైనా సరే బాండ్ క్రియేట్ చేసుకోవడానికి ప్లాట్‌ఫామ్ కోసం చూస్తున్నా. అదృష్టమో.. దురదృష్టమో కొందరు నన్నిక్కడ పోక్ చేస్తున్నారు. దానిని డిఫెండ్ చేసుకునే పరిస్థితుల్లో ఉండిపోయా.

నేను ఫైట్ మోడ్‌లో ఉండిపోవడం వలన ఏదైనా నీవంటి బ్యూటిఫుల్ థింగ్ ఏదైనా నా పక్క నుంచి వెళుతుంటే చూస్తూ ఉండిపోతున్నా. అందరూ కాన్‌స్టెంట్‌గా టార్గెట్ చేస్తున్నారని నాకనిపించింది. కాబట్టి నేను ఫైటర్ మోడ్‌లో ఉన్నా. రోహిత్ వెనుకాలే ఉంటావని అగ్నిపరీక్ష నుంచి వచ్చిన వారిని అంటుంటే వారి కోసం నేను నిలుచోవాలనుకుంటున్నా. ముందు మీరెవరూ నాకు తెలియదు. ఫస్ట్ టైం మీటింగ్‌లోనే అటాకింగ్ మోడ్‌లో వస్తున్నప్పుడు నేను ఎదుర్కోవాల్సి వస్తోంది. నేను ఆ బారియర్‌లోనే ఉండిపోతున్నా. చిన్న చిన్న విషయాలకు నన్ను టార్గెట్ చేయడం వలన నా మైండ్ వాటితో నిండిపోతోంది. నేను వాటన్నింటినీ తీసేసి రీ జెనరేట్ అయ్యేందుకు యత్నిస్తున్నా’’ అని చెప్పాడు. మొత్తానికి ఇద్దరూ సెట్ చేసుకుని కలిసిపోయినట్టుగానే కనిపిస్తున్నారు. ఇద్దరి మాటలు చూసిన వారంతా వీరి మధ్య లవ్ ట్రాక్ నడవబోతోందని అంటున్నారు. లవ్ సింబల్‌తో వీళ్ల కాన్వర్సేషన్‌కు సంబంధించిన వీడియోలను నెట్టింట షేర్ చేస్తున్నారు.

Telugu Cinema 360

Recent Posts

Biggboss10 Telugu: కామనర్స్‌కు పెద్ద దెబ్బ.. అంతా ముఖేషే చేశాడు..

తనకు డ్యాగర్ కావాలని సృష్టి.. రామ్ ప్రసాద్, దేబ్జాని, నరేష్‌లను అడుగుతుండగా షో ప్రారంభమైంది. నీ ఫ్రెండ్స్‌ను అడుక్కోమని దేబ్జాని…

1 day ago

సాయి ధరమ్ తేజ్ కష్టాన్ని దోచేస్తున్నారా.. సంబరాల ఏటిగట్టు మళ్ళీ వాయిదా..?

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న భారీ పీరియాడిక్ సినిమా సంబరాల ఏటిగట్టు వ్యవహారం ఇండస్ట్రీలో పెద్ద…

2 days ago

చిరంజీవి టాక్ షో.. గెటప్ మార్చేస్తున్న బాస్.. ఎలా ఉండబోతుందో తెలుసా..?

మెగా అభిమానులకు త్వరలోనే అదిరిపోయే న్యూస్ అందబోతోందా అంటే అవుననే సమాధానం బలంగా వినిపిస్తోంది. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర దశాబ్దాలుగా…

2 days ago

రాజమౌళి కోసమే.. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాపై మహేష్, తారక్ రివ్యూ..!

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే సినిమా పేరు మార్మోగిపోతోంది.. అదే డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. దర్శక ధీరుడు…

3 days ago

భయపెడుతున్న వారణాసి బిజినెస్.. రిలీజ్‌కు ముందే 1000 కోట్లు ఏంటి స్వామి..?

టాలీవుడ్ స్థాయిని పెంచడమే కాదు, ఏకంగా ఇండియన్ సినిమా ముఖచిత్రాన్ని, రూపురేఖలను పూర్తిగా మార్చేస్తున్న ఏకైక దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి…

3 days ago

ఆ అగ్ర నిర్మాత చేతికి జైలర్ 2 రైట్స్.. మధ్యలో మైత్రి మూవీ మేకర్స్ సడన్‌ ఎంట్రీ..!

టాలీవుడ్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వరుస సినిమాలు నిర్మిస్తూ స్టార్ ప్రొడ్యూసర్‌గా దూసుకుపోతున్న నాగవంశీ, కేవలం నిర్మాణానికే పరిమితం కాకుండా…

3 days ago