సినిమా వార్తలు

Biggboss 10 Telugu: చైత్ర వర్సెస్ షాలిని.. హౌస్‌మేట్స్‌గా రోహిత్, వంశీ

మహా పరీక్షలో భాగంగా ఎవరైనా ఎప్పుడైనా హౌస్‌మేట్ కాకుండానే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని.. ఇప్పటికే రామ్ ప్రసాద్ (Ram Prasad), చరణ్(Charan) హై రిస్క్ జోన్‌లో ఉన్నారు. కాబట్టి హై రిస్క్ జోన్ నుంచి హౌస్‌మేట్‌‌గా మారే అవకాశం ఉందని బిగ్‌బాస్ చెప్పారు. నెక్ట్స్ టాస్క్ కోసం రెండు గ్రూపులను ఇద్దరిని ఎన్నుకుని చెప్పమన్నారు. రోహిత్ టీంనుంచి రోహిత్, వంశీ.. దేబ్జాని టీం నుంచి త్రిగుణ్ (Trigun), ముఖేష్ (Mukesh) వస్తారని చెప్పారు. ఆ తరువాత రేషన్‌కి సంబంధించి ఎవరిది బాధ్యత అని వంశీ వెళ్లి త్రిగుణ్‌ని అడిగాడు. గుడ్లు తగ్గితే మాత్రం కుకింగ్ టీమ్‌నే అడుతానని త్రిగుణ్ చెప్పాడు. దాని గురించి కాసేపు డిస్కషన్ జరిగింది. ముఖేష్ నిద్ర పోతుంటే బిగ్‌బాస్ పిలిచి త్రిగుణ్‌తో కలిసి కన్ఫెషన్ రూమ్‌లోకి రమ్మని చెప్పారు. మీ ఇద్దరూ హౌస్‌మేట్స్ కావాలి దాని కోసం ఒక వ్యక్తిని హై రిస్క్‌ జోన్‌లో పెట్టాలి. దీనికోసం ఒక కంటెస్టెంట్‌ను వాళ్ల టీం నుంచి ఎంచుకోమని చెప్పాడు. ఇద్దరూ కలిసి కృష్ణుడిని హై రిస్క్ జోన్‌లో పెట్టారు.

ఆ తరువాత రోహిత్, వంశీని పిలిచి వారి సొంత టీంనుంచి ఒకరిని హై రిస్క్‌ జోన్‌లోకి పంపించాలని.. దాని కోసం ఓ వ్యక్తి పేరును బిగ్‌బాస్ చెప్పమన్నారు. రోహిత్ వాళ్లు తమ టీం నుంచి చైత్రను హై రిస్క్ జోన్‌లో పెడుతున్నట్టు చెప్పాడు. ఇక త్రిగుణ్, ముఖేష్.. రోహిత్ వంశీకి టాస్క్ ప్రారంభమైంది. వాల్‌పై ఎవరు ఎంచుకున్న పేరును వాళ్లు పెట్టాలి. దానికి బాక్సుల్లో లెటర్స్ ఇచ్చారు. ఈ టాస్క్‌ను ఇరు జట్లు అద్భుతంగా ఆడాయి. చాలా ఫాస్ట్‌గా ఎక్కడ ఏమాత్రం లేటు చేయకుండా ఆడారు. అయితే బ్లూ టీం ఒక బాక్సును విస్మరించింది. ముందుగా టాస్క్ కంప్లీట్ చేసి బెల్ కొట్టేసింది. బిగ్‌బాస్ త్రిగుణ్ టీంను విన్నర్‌గా ప్రకటించారు. రోహిత్ అది చూసి పేరు రాంగ్‌గా పెట్టారని గుర్తించి చెప్పాడు. అది చూసిన బిగ్‌బాస్ తిరిగి రోహిత్ టీంను విన్నర్స్‌గా ప్రకటించారు. అయితే చైత్ర హై రిస్క్ జోన్‌కి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలోనే సాంగ్ ప్లే చేయమని షాలిని అడగడంతో చైత్ర బాగా ఫీలైంది.

వాస్తవానికి షాలిని (Shalini) వాళ్లు చైత్ర హై రిస్క్ జోన్‌లోకి వెళ్లిన విషయాన్ని విస్మరించి కేవలం తమ టీం విన్నైందన్న దానిని దృష్టిలో పెట్టుకోవడం కారణంగానే ఇలా జరిగింది. షాలిని వచ్చి చైత్రకు సారీ చెప్పింది. వాళ్లిద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. అది కాస్తా గొడవగా మారింది. గ్రూపిజం చేస్తున్నారన్న విషయం క్లియర్‌గా తెలిసిందని చైత్ర అనడం గమనార్హం. వాస్తవానికి చైత్ర గట్టిగా ఏమీ మాట్లాడలేదు. కానీ షాలిని గట్టిగా మాట్లాడితే తాను కూడా మాట్లాడతా అనడంతో చైత్ర ఫైర్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య గట్టిగానే గొడవ జరిగింది. సింపతి కోసం ట్రై చేస్తోందని.. బిహేవియర్ గురించి అందరికీ తెలుసని చైత్ర అనడంతో షాలిని బాగా ట్రిగ్గర్ అయ్యింది. తన లైఫ్ చెబితే చాలు.. అంతకు మించినది ఏముంది? కానీ అగ్నిపరీక్షలో కానీ ఇక్కడ కానీ తన లైఫ్‌ని తీయలేదని చెప్పింది. వాస్తవానికి షాలిని నెలల వయసులోనే తల్లిదండ్రులను పోగొట్టుకుంది.

చైత్ర (Chaitra) దగ్గర కూర్చొని రహిత్ మాట్లాడాడు. తనను హై రిస్క్‌లో పెట్టడ గురించి రీజన్ అడిగింది. బిగ్‌బాస్ చెప్పినందునే తాను షేర్ చేయలేదని రోహిత్ (Rohith) చెప్పాడు. ఆ తరువాత గిన్నెలు సరిగా కడగలేదని రోహిత్‌ను త్రిగుణ్ పాయింట్ అవుట్ చేశాడు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య మాటల వార్ నడిచింది. త్రిగుణ్ ముందుగా ట్రిగ్గర్ చేయడంతో తిరిగి రోహిత్ కూడా ర్యాగింగ్ స్టార్ట్ చేశాడు. నవ్వుతూనే చక్కగా అంటించాడు. పిల్ల బచ్చా.. స్టెరాయిడ్స్ బాడీ అంటూ త్రిగుణ్ ఇష్టానుసారంగా మాట్లాడటంతో రోహిత్ కూడా రివర్స్‌లో ఇచ్చాడు. ఆ తరువాత త్రిగుణ్, వర్షిణితో డిస్కషన్ మొదలు పెట్టాడు. రోహిత్ తనను ఏమేం అన్నాడో అవన్నీ చెప్పడంతో.. వర్షిణి కూడా తానా అంటే తందానా అనేసింది. ఆ తరువాత ఆటలో సవాల్ కాదని.. ఆటే సవాల్ అని బిగ్‌బాస్ చెప్పారు. రోహిత్, వంశీ ఈవారం ఇంటి నుంచి ఎలిమినేట్ అవరని చెప్పారు. మిగిలిన వారంతా ఇంకా రిస్క్ జోన్‌లోనే ఉన్నారని చెప్పారు. హై రిస్క్ జోన్‌లో ఉన్న చైత్ర, రామ్ ప్రసాద్, చరణ్‌ని అందరికీ గుడ్ బై చెప్పి గార్డెన్ ఏరియాకు రమ్మని బిగ్‌బాస్ చెప్పారు.

చైత్ర, రామ్ ప్రసాద్, చరణ్ ముగ్గురూ చర్చించుకుని ఒకరిని సేవ చేయాలని చెప్పారు. అలా చరణ్.. చైత్రని.. రామ్ ప్రసాద్ సైతం చైత్రని.. చైత్ర.. రామ్ ప్రసాద్‌ని సేవ్ చేసింది. దీంతో చైత్ర సేవ్ అయ్యింది. అయినా కూడా చైత్ర హై రిస్క్‌లోనే ఉంటుందని బిగ్‌బాస్ చెప్పారు. ఇక రామ్ ప్రసాద్, చరణ్‌లలో ఒకరు ఎలిమినేట్ అవడం ఖాయమని బిగ్‌బాస్ చెప్పారు. రామ్ ప్రసాద్ అంతకు ముందు చరణ్.. కామెడీ ఓవర్ బోర్డ్ అవుతుందని చెప్పడంతో అతను పంచాయతీ పెట్టాడు. ఎలిమినేషన్ కోసం చరణ్, రామ్ ప్రసాద్‌లను బిగ్‌బాస్ నిలబెట్టారు. కంటెస్టెంట్స్‌ను ఇంటి నుంచి ఎవరిని బయటకు పంపాలనే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ క్రమంలోనే కంటెస్టెంట్స్ అంతా ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో వారి ఫేస్‌కు రంగు రాసి చెప్పాల్సి ఉంటుంది. త్రిగుణ్ వచ్చి చరణ్‌ బయటకు వెళ్లాలని రంగు రాశాడు. ఆ తరువాత సృష్టి వచ్చి రామ్ ప్రసాద్‌కి రంగు రాసింది. చరణ్‌కు కృష్ణుడు.. రామ్‌ప్రసాద్‌కు షాలిని… చరణ్‌కు సుధీర్… రామ్ ప్రసాద్‌కు అమన్.. చరణ్‌కు వర్షిణి, వంశీ.. రామ్ ప్రసాద్‌కు రోహిత్… చరణ్‌కు ముఖేష్, దేబ్జాని, నరేష్, ఝాన్సీ ఎలిమినేట్ కావాలని చెప్పింది. దీంతో చరణ్‌ని బిగ్‌బాస్ ఎలిమినేట్ చేశారు. ఈ తరుణంలో చరణ్ చెప్పిన మాటలు.. తోటి స్నేహితులతో కంటతడి పెట్టించాయి.

గురువారం బిగ్‌బాస్ (Bigg Bosss 10 Telugu) చాలా ఆసక్తికరంగా సాగింది. చరణ్ ఎలిమినేషన్‌లో ఎమోషన్ ఉంది. చైత్ర వర్సెస్ షాలిని మాటల యుద్ధం ఉంది. రోజూ తనను మాటలతో హింసిస్తున్న త్రిగుణ్‌పై రోహిత్ తిరుగుబాటు ఉంది. టాస్క్‌లో త్రిగుణ్‌ను రోహిత్ ఓడించడం.. అన్ని రకాలుగా ఇవాళ బిగ్‌బాస్ ఆసక్తికరంగా సాగింది.

Telugu Cinema 360

Recent Posts

Biggboss10 Telugu: కామనర్స్‌కు పెద్ద దెబ్బ.. అంతా ముఖేషే చేశాడు..

తనకు డ్యాగర్ కావాలని సృష్టి.. రామ్ ప్రసాద్, దేబ్జాని, నరేష్‌లను అడుగుతుండగా షో ప్రారంభమైంది. నీ ఫ్రెండ్స్‌ను అడుక్కోమని దేబ్జాని…

1 day ago

సాయి ధరమ్ తేజ్ కష్టాన్ని దోచేస్తున్నారా.. సంబరాల ఏటిగట్టు మళ్ళీ వాయిదా..?

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న భారీ పీరియాడిక్ సినిమా సంబరాల ఏటిగట్టు వ్యవహారం ఇండస్ట్రీలో పెద్ద…

2 days ago

చిరంజీవి టాక్ షో.. గెటప్ మార్చేస్తున్న బాస్.. ఎలా ఉండబోతుందో తెలుసా..?

మెగా అభిమానులకు త్వరలోనే అదిరిపోయే న్యూస్ అందబోతోందా అంటే అవుననే సమాధానం బలంగా వినిపిస్తోంది. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర దశాబ్దాలుగా…

3 days ago

రాజమౌళి కోసమే.. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాపై మహేష్, తారక్ రివ్యూ..!

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే సినిమా పేరు మార్మోగిపోతోంది.. అదే డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. దర్శక ధీరుడు…

3 days ago

భయపెడుతున్న వారణాసి బిజినెస్.. రిలీజ్‌కు ముందే 1000 కోట్లు ఏంటి స్వామి..?

టాలీవుడ్ స్థాయిని పెంచడమే కాదు, ఏకంగా ఇండియన్ సినిమా ముఖచిత్రాన్ని, రూపురేఖలను పూర్తిగా మార్చేస్తున్న ఏకైక దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి…

3 days ago

ఆ అగ్ర నిర్మాత చేతికి జైలర్ 2 రైట్స్.. మధ్యలో మైత్రి మూవీ మేకర్స్ సడన్‌ ఎంట్రీ..!

టాలీవుడ్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వరుస సినిమాలు నిర్మిస్తూ స్టార్ ప్రొడ్యూసర్‌గా దూసుకుపోతున్న నాగవంశీ, కేవలం నిర్మాణానికే పరిమితం కాకుండా…

3 days ago