సినిమా వార్తలు

Biggboss 10 Telugu: మిడ్‌వీక్ ఎలిమినేషన్ నిజమేనా? అసలా వ్యక్తే ఎందుకు?

బిగ్‌బాస్‌ తెలుగు చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగనుందని టాక్ నడుస్తోంది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ పేరు కూడా బయటకు వచ్చింది. అయితే అసలు ఆ కంటెస్టెంటే ఎందుకు? అనేది తెలుసుకుందాం. మిడ్‌వీక్ ఎలిమినేష్ నిజంగానే జరుగుతోందా? లేదంటే బిగ్‌బాస్ చెప్పిన ఈ వారం ఒకరికి మించి ఎలిమినేషన్ జరుగుతుందన్నట్టుగా చెప్పినందుకు అలా అనుకుంటున్నారా? కారణం ఏదైనా కూడా మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి బాగానే టాక్ నడుస్తోంది.

తొలి వారం ఎలిమినేషన్‌పై విపరీతమైన చర్చ నడుస్తోంది. బాటమ్ టూలో ఉన్న కామన్ మ్యాన్ కంటెస్టెంట్ చరణ్ మహాదేవ్, జబర్దస్త్ ఆటో రామ్ ప్రసాద్‌ హై రిస్క్ జోన్‌లో ఉన్నారు. వీరిలో ఒకరిని ఎలిమినేట్ చేసే బాధ్యతను బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌కే అప్పగించారని టాక్. ఇంరూమేంది.. సెలబ్రిటీలు మూకుమ్మడిగా రామ్ ప్రసాద్‌ను సపోర్ట్ చేశారని తెలుస్తోంది. కామనర్స్‌లో ఝాన్సీ కూడా రామ్ చరణ్‌కే మద్దతు పలికిందట. దీంతో చరణ్ హౌస్‌ నుంచి బయటకు పంపించేశారంటూ టాక్ నడుస్తోంది.

చరణ్ ఎలిమినేషన్ నిజమే అయితే మాత్రం దీనికి మరో కారణం కూడా ఉంది. వాస్తవానికి అగ్నిపరీక్షలో ఎందరినో ఫిల్టర్ చేసిన తర్వాత అదృష్టం ఆరుగురిని వరించింది. వాస్తవానికి అగ్నిపరీక్షకు వచ్చిన వారిలో చాలా మంది టాలెంటెడ్ ఉన్నారు. ఆర్థికంగా వీక్ పర్సన్స్ ఉన్నారు. అలాంటి వారందరినీ దాటుకుని హౌస్‌లోకి తీసుకొచ్చిన వారిలో చరణ్ మహాదేవ్ ఒకరు. అలాంటి చరణ్ హౌస్‌లోకి వచ్చాక మాత్రం ఎందుకోగానీ పూర్తిగా డల్ అయిపోయాడు. అద్భుతంగా డ్యాన్స్ చేసే చరణ్ కనీసం మార్నింగ్ సాంగ్‌కి స్టెప్పులేయడం లేదు. ఎక్కడున్నా పడుకునే కనిపిస్తున్నాడు. ఏమాత్రం యాక్టివ్‌నెస్ లేదు.

అసలు ఎందుకు బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లాడా? అన్నట్టుగా ఉంది అతని పెర్ఫార్మెన్స్. అతనికి ఇష్టం లేకుంటే ఆగిపోయినా వేరొకరికి లైఫ్ సెట్ అయ్యేది. బిగ్‌బాస్ నిర్వాహకులు సైతం చరణ్‌తో ఏమాత్రం ఉపయోగం లేదనుకున్నారో ఏమో కానీ అతడినే మిడ్ వీక్ ఎలిమినేషన్ చేయబోతున్నారని టాక్. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఇక తొలిరోజు నుంచే సెలబ్రిటీలుగా హౌస్‌లోకి అడుగు పెట్టిన వారిలో కొందరు బాగా మైనస్ అవుతున్నారు. రోహిత్‌ గురించి మాట్లాడటం.. రోహిత్‌ను టార్గెట్ చేయడం.. తప్ప మరో మాటే వారికి లేదు. వాళ్లు చేసే పనుల కన్నా ఇవే బాగా హైలైట్ అవుతున్నాయి.

Telugu Cinema 360

Recent Posts

Biggboss10 Telugu: కామనర్స్‌కు పెద్ద దెబ్బ.. అంతా ముఖేషే చేశాడు..

తనకు డ్యాగర్ కావాలని సృష్టి.. రామ్ ప్రసాద్, దేబ్జాని, నరేష్‌లను అడుగుతుండగా షో ప్రారంభమైంది. నీ ఫ్రెండ్స్‌ను అడుక్కోమని దేబ్జాని…

1 day ago

సాయి ధరమ్ తేజ్ కష్టాన్ని దోచేస్తున్నారా.. సంబరాల ఏటిగట్టు మళ్ళీ వాయిదా..?

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న భారీ పీరియాడిక్ సినిమా సంబరాల ఏటిగట్టు వ్యవహారం ఇండస్ట్రీలో పెద్ద…

2 days ago

చిరంజీవి టాక్ షో.. గెటప్ మార్చేస్తున్న బాస్.. ఎలా ఉండబోతుందో తెలుసా..?

మెగా అభిమానులకు త్వరలోనే అదిరిపోయే న్యూస్ అందబోతోందా అంటే అవుననే సమాధానం బలంగా వినిపిస్తోంది. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర దశాబ్దాలుగా…

2 days ago

రాజమౌళి కోసమే.. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాపై మహేష్, తారక్ రివ్యూ..!

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే సినిమా పేరు మార్మోగిపోతోంది.. అదే డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. దర్శక ధీరుడు…

3 days ago

భయపెడుతున్న వారణాసి బిజినెస్.. రిలీజ్‌కు ముందే 1000 కోట్లు ఏంటి స్వామి..?

టాలీవుడ్ స్థాయిని పెంచడమే కాదు, ఏకంగా ఇండియన్ సినిమా ముఖచిత్రాన్ని, రూపురేఖలను పూర్తిగా మార్చేస్తున్న ఏకైక దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి…

3 days ago

ఆ అగ్ర నిర్మాత చేతికి జైలర్ 2 రైట్స్.. మధ్యలో మైత్రి మూవీ మేకర్స్ సడన్‌ ఎంట్రీ..!

టాలీవుడ్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వరుస సినిమాలు నిర్మిస్తూ స్టార్ ప్రొడ్యూసర్‌గా దూసుకుపోతున్న నాగవంశీ, కేవలం నిర్మాణానికే పరిమితం కాకుండా…

3 days ago