సినిమా వార్తలు

Biggboss10 Telugu: సడెన్ ఎలిమినేషన్.. ఇవాళేనా? వెళ్లబోయేదెవరు?

బిగ్‌బాస్ 10 తెలుగు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకూ ఉన్న ఈక్వేషన్స్ అన్నీ తారుమారు అవుతున్నాయి. కంటెస్టెంట్స్ అంతా ఆట తీరును మార్చుకుంటున్నారు. రోహిత్, షాలిని కూడా ఇంతకు ముందులా కాకుండా కాస్త డిస్టెన్స్ మెయిన్‌టైన్ చేస్తున్నట్టుగానే కనిపిస్తోంది.

ఇక నిన్న అమన్ ఆడిన గోట్ టాస్క్‌తో అతనికి బీభత్సమైన హైప్ వచ్చింది. ఓటింగ్ అమాంతం పెరిగిపోయింది. మరోవైపు బిగ్‌బాస్ ఈ వారం సడెన్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రకటించారు. అది ఇవాళే ఉండబోతోందని టాక్ నడుస్తోంది. ఇవాళ ఒకరిని.. ఆదివారం ఒకరిని ఎలిమినేట్ చేస్తారని సమాచారం. అయితే ఇవాళ్టి ఎలిమినేషన్ రెడ్ టీం నుంచే ఉండనుంది.

రెడ్ టీంలో వంశీ, దక్షి, రోహిత్, షాలిని, సుధీర్, ఝాన్సీ ఉన్నారు. వీరిలో నుంచే ఒకరు ఎలిమినేట్ కానున్నారు. రోహిత్‌కు ఓటింగ్ తగ్గినా కూడా ఇప్పటికీ అతనే టాప్‌లో ఉన్నాడు. సుధీర్, ఝాన్సీకి కూడా ఈ వారం గడ్డుకాలమే. అయినా కూడా ముఖేష్ ఓటింగ్ కొంత మేర ఈ ఇద్దరికీ ట్రాన్స్‌ఫర్ అవుతోంది. షాలిని నామినేషన్స్‌లోనే లేదు. ఇక మిగిలిన వారిలో దక్షికి ఓటింగ్ ఏమాత్రం లేదు. కనీసం ఆమె వేసిన నామినేషన్‌లోనూ పస లేదు. ఏ రకంగా చూసినా కూడా ఆమెకు హైప్ క్రియేట్ అయ్యే ఒక్కటంటే ఒక్క ఎపిసోడ్ కూడా పడలేదు. అలాగే వంశీకి ఈవారం మంచి ఎపిసోడ్ పడిందే లేదు. పైగా త్రిగుణ్ కూడా నామినేషన్స్‌లో ఉన్నాడు. వంశీకి త్రిగుణ్ ఓటింగ్ ట్రాన్స్‌ఫర్ అవదు. మొత్తంగా చూస్తే దక్షి కానీ వంశీ కానీ సడెన్‌గా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Telugu Cinema 360

Recent Posts

RC17 సినిమాతో సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ విడిపోయినట్లే..!

ఇండస్ట్రీలో డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ మధ్య ఉండే బాండింగ్ గురించి మాట్లాడాల్సి వస్తే అందరికీ ఠక్కున గుర్తొచ్చే మొదటి పేరు…

2 days ago

నా బాడీ నా యిష్టం.. నా సైజ్‌ల గురించి మీకెందుకు.. ఆ హీరోయిన్ సీరియస్..!

సోషల్ మీడియా యాక్టివ్ అయ్యాక సెలబ్రిటీలకు ఎంత పాపులారిటీ దక్కుతుందో, అంతే స్థాయిలో ట్రోలింగ్ కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా…

2 days ago

Biggboss10 Telugu: హౌస్‌లోకి షాలిని ఎంట్రీ.. ఈ వారం ముప్పు ఆ ఇద్దరికే..

బిగ్‌బాస్ హౌస్‌లోకి షాలిని ఎంట్రీ ఇచ్చింది. ఆమెను డ్రమెటిక్‌గా హౌస్‌లోకి ప్రవేశ పెట్టారు. త్రిగుణ్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచారు. అక్కడ…

2 days ago

సో కాల్డ్ వారసులను అడిగే దమ్ముందా.. బ్యాగ్రౌండ్ లేని కుర్రాళ్లేనా టార్గెట్..?

టాలీవుడ్‌లో ఎవరైనా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కేవలం తమ స్వయంకృషితో, టాలెంట్ తో పైకి వస్తుంటే వారిని ఎంకరేజ్…

2 days ago

కుర్రాడు సక్సెస్ అవుతాడా.. దొంగ నా కొడుకుతో మౌళి ఫ్యూచర్ ఏంటి..?

టాలీవుడ్ లో ప్రస్తుతం యూత్ ఫుల్ కంటెంట్ తో వస్తున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలకు ఆడియన్స్ నుంచి మంచి…

2 days ago

దసరాకు పట్టించుకోరా.. విజయదశమి కనీసం కళ్లకు కనిపించలేదా మన హీరోలకు..?

సాధారణంగా దసరా లాంటి పెద్ద పండుగ వస్తుందంటే చాలు.. థియేటర్లలో సినిమాల పండగ ఎలా ఉంటుందో, సోషల్ మీడియాలో కూడా…

2 days ago