Menu
BREAKING
Biggboss10 Telugu: హౌస్‌లోకి షాలిని ఎంట్రీ.. ఈ వారం ముప్పు ఆ ఇద్దరికే..   |   సో కాల్డ్ వారసులను అడిగే దమ్ముందా.. బ్యాగ్రౌండ్ లేని కుర్రాళ్లేనా టార్గెట్..?   |   కుర్రాడు సక్సెస్ అవుతాడా.. దొంగ నా కొడుకుతో మౌళి ఫ్యూచర్ ఏంటి..?   |   దసరాకు పట్టించుకోరా.. విజయదశమి కనీసం కళ్లకు కనిపించలేదా మన హీరోలకు..?   |   Biggboss10 Telugu: సుధీర్, ఝాన్సీలను ఒకాట ఆడుకున్న ఆర్కే.. బయటకొచ్చిన ఎలుకలు..   |   అన్నీ చెప్పిన రాజమౌళి ఆ ఒక్కటి తప్ప.. వారణాసి కథేంటో తెలుసా..?   |   దీపిక పదుకొనే, రణ్‌వీర్ సింగ్ రెండో కూతురు పేరు తెలుసా..?   |   Vijay Deverakonda: కొండన్న ముందు భారీ లక్ష్యం.. ‘రణబాలి’ ఇప్పటి వరకు ఓకే.. ఇకపై ఏం చేస్తుందో..?   |   Jailer 2: ఆ రికార్డు సాధిస్తుందా..? కోలీవుడ్ పరువు ఇప్పుడు రజినీ చేతుల్లో..!   |   Kaaka: ‘కాకా’ మేకింగ్ వీడియో లీక్.. కావాలనే చేసారా లేదంటే అలా జరిగిపోయిందా..?   |   బాలీవుడ్ హీరోలను బతకనీయరా.. నడిరోడ్డు మీద కాల్పులేంటి సామి..?   |   BiggBoss10 Telugu: బిగ్ బాస్‌లో షాలిని ఎలిమినేషన్ ట్విస్ట్.. సీక్రెట్ రూమ్‌కు పంపించిన నాగార్జున!   |   Biggboss10 Telugu: బిగ్‌బాస్ హౌస్ నుంచి షాలిని ఎలిమినేట్.. ఇక వార్ వన్‌సైడేనా?   |   Biggboss10 Telugu: తప్పులన్నీ రోహిత్‌వే.. రోస్ట్ చేసిన నాగ్..   |   ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ‘తొలిప్రేమ’ సంగీత దర్శకుడు కన్నుమూత..!

Biggboss10 Telugu: హౌస్‌లోకి షాలిని ఎంట్రీ.. ఈ వారం ముప్పు ఆ ఇద్దరికే..

Biggboss10 Telugu: హౌస్‌లోకి షాలిని ఎంట్రీ.. ఈ వారం ముప్పు ఆ ఇద్దరికే..

బిగ్‌బాస్ హౌస్‌లోకి షాలిని ఎంట్రీ ఇచ్చింది. ఆమెను డ్రమెటిక్‌గా హౌస్‌లోకి ప్రవేశ పెట్టారు. త్రిగుణ్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచారు. అక్కడ షాలినిని చూడగానే త్రిగుణ్ షాక్ అయ్యాడు. షాలినిని హౌస్‌లోకి తీసుకెళ్లమని బిగ్‌బాస్ చెప్పారు. సాధారణంగా తీసుకెళితే థ్రిల్ ఏముంటుంది? అందుకే త్రిగుణ్ ముందుగా వెళ్లి రోహిత్‌ను పక్కకు పిలిచి ఏదో చెప్పినట్టుగా చెప్పి సర్‌ప్రైజ్ టు యూ అన్నాడు. అంతే షాలినిని చూసి రోహిత్ షాక్ అయ్యాడు. ఆమెను ఎత్తుకుని తిప్పి సంతోషం వ్యక్తం చేశాడు. ఇక ఈ వారం నామినేషన్స్ విషయానికి వస్తే ఏకంగా 12 మంది నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండనుంది. గత వారం ఎవరూ ఎలిమినేట్ అవలేదు కాబట్టి ఈ వారం డబుల్ ఎలిమినేషన్. మరి ఈవారం ఎలిమినేట్ అవబోయే ఇద్దరు ఎవరనేది చూద్దాం.

రోహిత్, త్రిగుణ్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలిమినేట్ కారు. మిగిలిన 10 మందిలోనే ఎలిమినేషన్ ఉంటుంది. ఈ వారం నామినేట్ అయిన వారిలో దక్షి, వర్షిణి, రోహిత్, సుధీర్, త్రిగుణ్, నీతూ, రామకృష్ణ, శివ, ఝాన్సీ, శ్వేత, వంశీ, అమన్ ఉన్నారు. రామకృష్ణకు ఈ నామినేషన్స్ బాగా హెల్ప్ అయ్యాయి. అతని అమాయకత్వం, డిఫెండ్ చేసుకునే విధానం ఫన్నీగానూ జనాలకు బాగా ఎక్కుతోంది. దీంతో రామకృష్ణ ఎలిమినేట్ అయ్యే ఛాన్సే లేదు. అమన్‌కు మంచి ఓటింగ్ ఉంది కాబట్టి అతనికి వచ్చిన ఇబ్బందేం లేదు. సుధీర్‌పై నెగిటివిటీ ఉంది కానీ అతని కంటే ఓటింగ్ బాగా తక్కువ ఉన్నవారు ఉన్నారు కాబట్టి ఈవారం అతనికి ఇబ్బంది లేదు. ముఖేష్ నామినేషన్స్‌లో లేకపోవడం ఝాన్సీకి కలిసొచ్చే అంశం. ముఖేష్‌ ఫ్యాన్స్.. వర్షిణికి కానీ.. సుధీర్‌కి కానీ సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. కేవలం ఝాన్సీకి మాత్రమే చేస్తారు. కాబట్టి ఆమెకు వచ్చిన ఇబ్బందేం లేదు. వంశీపై కూడా ఎలిమినేషన్ కత్తి వేలాడుతోంది కానీ మిగిలిన వారికి ఇంకా ఓటింగ్ తక్కువ ఉండటం ఇతనికి కలిసొచ్చే అంశం. నీతూ నామినేషన్స్‌లో ఉన్నా కూడా ఆమె రోహిత్‌తో ఉండటంతో కంటెంట్ బాగానే వస్తోంది.

ఆమెకు అయితే ఏమాత్రం ఇబ్బంది లేదు. శివ్ పరిస్థితి కూడా అదే. వైల్డ్ ఫైర్స్‌లో బాగా కంటెంట్ ఇస్తున్న వారిలో ఇతను కూడా ఒకడు. శ్వేత కూడా నామినేషన్స్‌లో మంచి పాయింట్స్ పెట్టి బాగానే ఆకట్టుకుంది. ఆమెకు కూడా పెద్దగా ఇబ్బంది లేదు. చివరిగా వర్షిణి, దక్షి ఉన్నారు. దాదాపుగా వీరిద్దరే ఎలిమినేట్ కావొచ్చని తెలుస్తోంది. వర్షిణి నామినేషన్స్‌లో చాలా వరస్ట్‌గా బిహేవ్ చేసింది. ఇష్టానుసారంగా మాటలు జారింది. గత వారం కూడా లీస్ట్ టులో ఉంది. ఇక దక్షి.. బిగ్‌బాస్ హౌస్‌కి ఏమాత్రం సెట్ కాదు. ఆమె ఉన్నా లేనట్టే. ముందుగా బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లినవారు టాప్‌లో ఉన్నవారితో ఉంటూ సెటిల్ అవ్వాలి. ఆ తరువాత టాపర్స్‌కు ఎదురెళ్లాలి. కానీ దక్షి మాత్రం ముందే రోహిత్‌కు ఎదురెళ్లింది. రోహిత్‌ని నామినేట్ చేసింది. చేస్తే చేసింది.. మంచి పాయింట్స్ పెడితే ఆమెకు హైప్ క్రియేట్ అయ్యేది. కానీ చెత్త పాయింట్స్ పెట్టి ఫెయిల్ అయిపోయింది. దీంతో దక్షి ఎలిమినేషన్ ఖాయంగా కనిపిస్తోంది. ఈ శుక్రవారం నాటికి పరిస్థితులు ఏమైనా మారితే వీరు కాకుండా మరొకరు ఎలిమినేషన్ జోన్‌లోకి వచ్చే అవకాశం ఉంది. లేదంటే ఈ ఇద్దరే బయటకు వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360