పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న ఫౌజీ సినిమా హాట్ టాపిక్‌గా మారిందిప్పుడు. ఈ సినిమా విషయంలో అసలు ఏం జరుగుతుందనే డైలమా అందరినీ వేధిస్తోంది. ప్రభాస్ లాంటి ఒక రేంజ్ ఉన్న స్టార్ హీరోను, అందులోనూ పాన్ ఇండియా క్రేజ్ ఉన్న హీరోను పెట్టుకుని సినిమా చేస్తున్నప్పుడు నిర్మాతలకు కనీస ప్లానింగ్ లేదా అన్న ప్రశ్నలు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తున్నాయి. సినిమా ఎప్పుడు మొదలైందో, అసలు ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వందల కోట్ల రూపాయల బడ్జెట్‌తో డీల్ చేస్తున్న ప్రాజెక్ట్‌కి ఒక ప్రాపర్ షెడ్యూల్ ప్లానింగ్ లేకపోవడం అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాలను సైతం కన్ఫ్యూజన్‌కు గురిచేస్తోంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేతిలో ఉన్నప్పుడు మేకర్స్‌కు ఒక స్పష్టమైన విజన్ ఉండాలి కానీ, ఫౌజీ విషయంలో మాత్రం అడుగడుగునా గందరగోళమే కనిపిస్తోంది. ఈ డైలమా ఇలాగే కంటిన్యూ అయితే సినిమా బిజినెస్‌పై కూడా నెగెటివ్ ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంది.
ఇక ఈ సినిమా దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) వర్కింగ్ స్టైల్‌పై కూడా ఇప్పుడు రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమాను విజువల్ వండర్‌గా తీయాలనే తపనలో ఆయన మరో రాజమౌళిలా మారిపోయి ప్రతి ఫ్రేమ్‌ను ఏళ్ల తరబడి చెక్కుతూనే ఉన్నారని టాక్ నడుస్తోంది. ఒక దర్శకుడిగా పర్ఫెక్షన్ కోసం ట్రై చేయడం మంచిదే అయినా, ఇలా గ్యాప్ లేకుండా సినిమాను చెక్కుతూ కూర్చుంటే బడ్జెట్ తడిసి మోపెడవుతుంది. వర్కింగ్ డేస్ పెరిగే కొద్దీ ప్రొడక్షన్ కాస్ట్ అమాంతం పెరిగిపోయి అది నేరుగా నిర్మాతల మెడకే చుట్టుకుంటుంది. రేపు సినిమా రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చినా కూడా, ఇష్టమొచ్చినట్లు పెరిగిన బడ్జెట్‌ను వెనక్కి తీసుకురాలేకపోతే అది కచ్చితంగా కాస్ట్ ఫెయిల్యూర్‌గా మిగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకే క్రియేటివిటీ పేరుతో హద్దులు దాటి బడ్జెట్ పెంచేయడం, ఫైనాన్షియల్‌గా ఏమాత్రం సేఫ్ కాదని ట్రేడ్ విశ్లేషకులు మేకర్స్‌కు గట్టిగా హెచ్చరిస్తున్నారు.
అసలు ఫౌజీ కథ (Fauzi story) విషయానికి వస్తే, ఇది మనకు స్వాతంత్ర్యం రాకముందు అంటే ఇండిపెండెన్స్‌కు ముందు జరిగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ పవర్ ఫుల్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. మహానాయకుడు సుభాష్ చంద్రబోస్ అనుచరుడిగా, ఆయన స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీలో ఒక వీరుడిగా ప్రభాస్ ఈ సినిమాలో కనిపించనున్నారు. ముఖ్యంగా ఈ కథ మొత్తం హింస మరియు అహింస అనే రెండు భిన్నమైన సిద్ధాంతాల మధ్య నడుస్తుందని సమాచారం. స్వాతంత్ర్య పోరాటంలో ఈ రెండు మార్గాల మధ్య ఉన్న సైద్ధాంతిక సంఘర్షణను దర్శకుడు చాలా గ్రిప్పింగ్‌గా సిల్వర్ స్క్రీన్ మీద చూపించబోతున్నారు. ప్రభాస్ లాంటి భారీ కటౌట్‌కు ఇలాంటి చారిత్రక పీరియాడిక్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ పడితే స్క్రీన్ మీద విజువల్స్ వేరే లెవెల్‌లో పేలుతాయని, గూస్ బంప్స్ రావడం ఖాయమని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
కేవలం యాక్షన్, దేశభక్తి మాత్రమే కాకుండా హను రాఘవపూడి మార్క్ ఎమోషనల్ లవ్ స్టోరీ కూడా ఫౌజీలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సీతా రామం లాంటి సినిమాతో మ్యాజిక్ చేసిన హను, యాక్షన్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో, ఈ సినిమాలో ప్రేమకథకు కూడా అంతే ఎమోషనల్ డెప్త్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వి ఇస్మాయిల్ (Imanvi Ismail) ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా, మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. యుద్ధం, రక్తపాతం, పోరాటాల నేపథ్యంలో సాగే ఒక స్వచ్ఛమైన ప్రేమకథను దర్శకుడు తనదైన శైలిలో కవిత్వంలా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇమాన్వి క్యారెక్టర్‌కు, ప్రభాస్ పాత్రకు మధ్య వచ్చే రొమాంటిక్ అండ్ ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్ మనసును బలంగా తాకుతాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఎంత భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నా కూడా, సినిమాను ఎండ్ వరకు నిలబెట్టేది ఆ ఎమోషనల్ డెప్త్ ఉన్న లవ్ స్టోరీనే అని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు. డిసెంబర్ 3 నుంచి కూడా ఫౌజీ వాయిదా పడిందని తెలుస్తుంది.. మరి కొత్త డేట్ ఎప్పుడో చూడాలిక.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర' అసలు థియేటర్లలోకి వస్తుందా రాదా అనే అనుమానాలు ఇప్పుడు…
టాలీవుడ్‌లో తనకంటూ ఒక స్పెషల్ కామెడీ టైమింగ్ క్రియేట్ చేసుకున్న హీరో శ్రీవిష్ణు, ఇప్పుడు 'కామ్రేడ్ కళ్యాణ్' సినిమాతో రాబోతున్నారు.…
బిగ్‌బాస్ 10 తెలుగు రోజురోజుకూ దారుణంగా మారుతోంది. సెలబ్రిటీలు మరింత రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా హోస్ట్ నాగార్జున వచ్చి వెళ్లిపోయాక ప్రేక్షకుల్లో…
టాలీవుడ్‌లో ఈ మధ్య వందల కోట్ల బడ్జెట్‌తో భారీ సినిమాలు తీస్తున్నారు కానీ, వాటికి తగ్గ కనీస ప్లానింగ్ అనేదే…
త్రిగుణ్, రామ్ ప్రసాద్, వంశీ కిచెన్ క్లీన్ చేస్తుండగా షో ప్రారంభమైంది. బాత్రూంలో నీళ్లు కారుతున్నాయని రోహిత్ కంప్లైంట్ చేశాడని…
సీనియర్ నటి ఊర్వశి శారద తాజా పరిస్థితి చూసి సోషల్ మీడియాలో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇటీవల అక్టోబర్…