నాని (Nani), శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దసరా (Dasara Movie) లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ప్యారడైజ్. ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచే టాలీవుడ్ సర్కిల్స్‌లో ఓ రేంజ్‌లో బజ్ క్రియేట్ అయింది. అయితే ఈ సినిమా గురించి బయటికి వస్తున్న వార్తలు చూస్తుంటే అభిమానులకు మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం అనిపిస్తుంది. ప్యారడైజ్ సినిమాలో ఊహించని రేంజ్‌లో సర్‌ప్రైజులు ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు బయటికి రాని విషయాలు, క్యారెక్టర్లు, స్టోరీ టర్న్స్ చాలానే ఉన్నాయి. శ్రీకాంత్ ఓదెల ఈసారి కేవలం ఒక కమర్షియల్ సినిమా మాత్రమే తీయట్లేదని, ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి ఒక భారీ ఎమోషనల్ అండ్ యాక్షన్ కథను సిద్ధం చేసాడని అర్థమవుతుంది. ఈ సర్‌ప్రైజులు అన్నీ థియేటర్ లోనే రివీల్ అయితే ఆ కిక్ వేరే లెవెల్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందుకే సినిమాలోని ఏ ఒక్క చిన్న పాయింట్ కూడా లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ సర్‌ప్రైజులతో పాటు కథ ఎక్కడ లీక్ అయిపోతుందో అన్న కంగారు దర్శక నిర్మాతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే, ప్యారడైజ్ సినిమాకు సంబంధించి అసలు ట్రైలర్‌నే రిలీజ్ చేయకూడదని డిసైడ్ అయ్యారు. కథ మీద ప్రేక్షకులకు ఎలాంటి క్లారిటీ రాకుండా ఉండాలంటే ట్రైలర్ ఆపడమే బెస్ట్ ఆప్షన్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ట్రైలర్ కట్ చేస్తే అందులో కచ్చితంగా కొన్ని సీన్స్, డైలాగ్స్ పెట్టాలి, అప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కథను ఇట్టే డీకోడ్ చేసే ప్రమాదం ఉంది. అందుకే ఆ రిస్క్ తీసుకోకుండా థియెట్రికల్ ఎక్స్‌పీరియన్స్ నేరుగా ప్రేక్షకులకు అందించాలనేది మేకర్స్ ప్లానింగ్. ఈ నిర్ణయానికి హీరో నాని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నిజానికి నేటి డిజిటల్ రోజుల్లో, యూట్యూబ్ ట్రెండింగ్ యుగంలో ట్రైలర్ లేకుండా ఒక పాన్ ఇండియా స్థాయి సినిమాను థియేటర్లలోకి తీసుకురావడం అంటే మామూలు రిస్క్ కాదు. ప్రమోషన్స్‌కు ట్రైలర్ అనేది చాలా ముఖ్యం. కానీ ఆ రిస్క్ తీసుకోవడానికే దర్శక నిర్మాతలు రెడీ అయ్యారు అంటే, కంటెంట్ మీద వాళ్ళకు ఎంత నమ్మకం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మార్కెటింగ్ పరంగా ఇది ఒక పెద్ద గ్యాంబిల్ అయినా, కంటెంట్ క్లిక్ అయితే మాత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ అవ్వడం గ్యారెంటీ.
ఇక ప్యారడైజ్ సినిమా కథా (The Paradise Story) నేపథ్యం విషయానికి వస్తే, ఈ మూవీ పూర్తిగా 1990స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని తెలుస్తోంది. 90వ దశకం అనగానే మనకు గుర్తొచ్చేది ఒక నాచురల్ వాతావరణం, అలాగే అప్పటి రాజకీయ పరిస్థితులు. ఈ సినిమాలో కేవలం ఎమోషన్స్, యాక్షన్ మాత్రమే కాకుండా అప్పటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రాజకీయాలు కూడా అత్యంత కీలకంగా ఉండబోతున్నాయని సమాచారం. శ్రీకాంత్ ఓదెల తన మొదటి సినిమా దసరాలో కూడా తెలంగాణ కల్చర్‌ని, అక్కడి పాలిటిక్స్‌ని చాలా అద్భుతంగా చూపించాడు. ఇప్పుడు ప్యారడైజ్‌లో ఆ పొలిటికల్ యాంగిల్‌ను మరింత డీప్‌గా టచ్ చేయబోతున్నాడని తెలుస్తోంది. అప్పటి రాజకీయాల్లో జరిగిన కొన్ని సంచలన సంఘటనలను, అలాగే నాయకుల మధ్య ఉన్న ఆధిపత్య పోరును ఈ సినిమాలో చాలా పవర్ ఫుల్ గా చూపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు నాని ఇంటెన్స్ యాక్టింగ్, మరోవైపు 90స్ నాటి రా పొలిటికల్ డ్రామా ఈ సినిమాకు ప్రధాన బలంగా మారనున్నాయి. ఈ కాంబినేషన్ వర్కౌట్ అయితే మాస్ ఆడియన్స్‌కు పండుగే అని చెప్పాలి.
ఈ పొలిటికల్ డ్రామాలో భాగంగా ప్యారడైజ్ సినిమాలో పలువురు రియల్ లైఫ్ పొలిటికల్ లీడర్స్ పాత్రలు కూడా ఉండబోతున్నాయనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నటసార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్ పాత్ర ఈ సినిమాలో ఉండబోతుందని తెలుస్తుంది. ఆయనతో పాటు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాత్రలు కూడా ప్యారడైజ్ సినిమాలో ఉంటాయనేది బలంగా వినిపిస్తున్న వార్తలు. 90వ దశకంలో ఎన్టీఆర్, కేసీఆర్ మధ్య ఉన్న రాజకీయ ప్రయాణం, అప్పటి పరిస్థితులను కథలో చాలా తెలివిగా బ్లెండ్ చేశారని టాక్ నడుస్తోంది. ఈ పాత్రల కోసం ఎవరిని తీసుకున్నారు, వాళ్ళ మేకప్ ఎలా ఉండబోతుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఒక కమర్షియల్ సినిమాలో ఇలా ఇద్దరు బడా నాయకుల పాత్రలను ప్రవేశపెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇది కచ్చితంగా సినిమా రేంజ్ ను అమాంతం పెంచేసే అంశం. ఈ పాత్రల చుట్టూ జరిగే డ్రామా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని అందరూ భావిస్తున్నారు.
పాలిటిక్స్, రియల్ లైఫ్ క్యారెక్టర్స్ మాత్రమే కాకుండా కాస్టింగ్ విషయంలో కూడా ప్యారడైజ్ టీమ్ అనేక జాగ్రత్తలు తీసుకుంటూనే ఫుల్ సర్ ప్రైజ్‌లు ప్లాన్ చేసింది. ఇందులో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, అలాగే బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కూడా నటిస్తున్నారు. ముఖ్యంగా మోహన్ బాబు పాత్ర ఒక పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్‌గా ఉండబోతుందని, ఆయన అగ్రెసివ్ డైలాగ్ డెలివరీ సినిమాకు హైలైట్ కానుందని అంటున్నారు. ఇక సంపూర్ణేష్ బాబు పోషిస్తున్న బిర్యాని పాత్ర గురించి అయితే చాలా డీప్ చర్చ జరుగుతుంది. సాధారణంగా కామెడీ పాత్రలు చేసే సంపూని, శ్రీకాంత్ ఓదెల ఒక సీరియస్ అండ్ సర్ ప్రైజింగ్ రోల్‌లో చూపించబోతున్నాడు.. బహుశా కథను మలుపు తిప్పే ఒక ఎమోషనల్ క్యారెక్టర్‌లో సంపూ కనిపిస్తాడేమో అన్న అంచనాలు ఉన్నాయి. ఇలా ప్రతి అడుగులోనూ, ప్రతి క్యారెక్టర్ లోనూ ఒక కొత్తదనం ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ చేయకపోవడం అనే రిస్క్ తీసుకున్నప్పటికీ, కేవలం లీక్ అవుతున్న ఈ క్యాస్టింగ్ అండ్ స్టోరీ డీటెయిల్స్‌తోనే ప్యారడైజ్ సినిమాపై హైప్ ఆకాశాన్ని తాకుతుంది. మొత్తానికి నాని, శ్రీకాంత్ ఓదెల ఈసారి టాలీవుడ్ బాక్సాఫీస్ మీద పెద్ద దండయాత్ర చేయబోతున్నారు.
ఆదివారం ఎపిసోడ్ పూర్తైన తర్వాత సుధీర్(Sudheer), సృష్టి(Shrishti)ల మధ్య జరిగిన కాన్వర్సేషన్‌తో షో ప్రారంభమైంది. ఆ తరువాత త్రిగుణ్ (Thrigun),…
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న ఫౌజీ సినిమా హాట్ టాపిక్‌గా మారిందిప్పుడు. ఈ సినిమా…
బిగ్‌బాస్ తెలుగు ఫస్ట్ వీక్ తర్వాత మరింత రసవత్తరంగా మారింది. అంతా స్ట్రాటజీలు మార్చేసినట్టుగా ఇవాళ (సోమవారం) వచ్చిన ఫస్ట్…
బిగ్‌బాస్ 10 తెలుగు ఆదివారం ఎపిసోడ్ (Bigg Boss 10 Telugu Sunday episode) ‘జై జై గణేశ’ సాంగ్‌తో…
బిగ్‌బాస్ 10 తెలుగు (Bigg Boss 10 Telugu) మొదటి రోజు నుంచే రసవత్తరంగా సాగుతోంది. వీకెండ్‌లో హోస్ట్ నాగార్జున…
బిగ్‌బాస్ 10 తెలుగు తొలి శనివారం ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆ తరుణం రానే…