ఆదివారం ఎపిసోడ్ పూర్తైన తర్వాత సుధీర్(Sudheer), సృష్టి(Shrishti)ల మధ్య జరిగిన కాన్వర్సేషన్‌తో షో ప్రారంభమైంది. ఆ తరువాత త్రిగుణ్ (Thrigun), రోహిత్ మధ్య కూడా కృష్ణుడి (Krishnudu) విషయంలో కాన్వర్సేషన్ జరిగింది. కృష్ణుడిని తనను వీక్ అనలేదని చెప్పాడు. వర్షిణి(Varshini)తో త్రిగుణ్ (Thrigun) గురించి సుధీర్ మాట్లాడాడు. మరోవైపు దేబ్జాని(Debjani), ముఖేష్ మధ్య ర్యాపో బాగా బిల్డ్ అవుతోంది. రోహిత్ (Rohith) వచ్చే వరకూ త్రిగుణ్ గిన్నెలు తోముతున్నాడు. పిలిచి మరీ తన సర్వీస్‌ను గుర్తు పెట్టుకోమని చెప్పాడు. ఆతరువాత వంశీతో త్రిగుణ్ కొత్త గ్రూప్ ఫామ్ అయ్యిందని చెప్పాడు. టాస్క్ చేస్తూ.. వర్క్ బాగా చేస్తేనే మనం ముందుకు వెళతామని త్రిగుణ్ చెబుతున్నాడు. ఝాన్సీ కిచెన్ టీంలోకి రావడం లేదని వంశీ చెప్పాడు. ఇంతకు ముందులా రావడం లేదన్నాడు. రోహిత్ (Rohith) గిన్నెలు కడగకపోవడంపై చర్చ జరిగింది. ఆ తరువాత రోహిత్ వవచ్చేసి గిన్నెలు తోమాడు. ముఖేష్(Mukehs) బెడ్‌రూంలో ట్రిమ్మింగ్ చేసుకోవడంపై చర్చ జరిగింది. త్రిగుణ్ చెప్పిన మాటలపై రోహిత్‌ని అడిగి క్లారిటీ తెచ్చుకున్నట్టు సుధీర్ (Sudheer).. వర్షిణి, ముఖేష్‌లకు చెప్పాడు. దీనిని వదలని తాను గట్టిగా అడుగుతానని సుధీర్ చెప్పాడు. ఆ ప్రకారమే తరువాత త్రిగుణ్‌ని సుధీర్ నామినేట్ చేశాడు. మ్యాజికల్ బాక్సుతో కన్ఫెషన్ రూంకి రమ్మని సుధీర్‌కి బిగ్‌బాస్ చెప్పారు. మేజికల్ బాక్స్‌ను ఓపెన్ చేసి పవర్ ఏంటో చెప్పమన్నారు. ఏ ప్లేయర్‌ని అయినా డైరెక్ట్‌గా నామినేట్ చేసే పవర్ అది.
ఇక నామినేషన్స్ ప్రారంభమయ్యాయి. తొలి వారం (Bigg Boss 10 Telugu First Week) హౌస్‌మేట్స్ కానందున నామినేషన్ చేసే అవకాశం కంటెస్టెంట్స్‌కి ఇవ్వలేదని.. ప్రస్తుతం హౌస్‌మేట్స్ కావడం వల్ల అవకాశం ఇస్తున్నానని బిగ్‌బాస్ చెప్పారు. అయితే నామినేషన్ చేసే అవకాశం పొందేందుకు ఒకరితో మరొకరు పోరాడాల్సి ఉంటుందన్నారు. పోల్స్‌కి చుట్టి ఉన్న రోప్స్‌ను వీలైనంత వేగంగా లాగి ముందుగా నామినేట్ చేసే అవకాశం ఉంది. అక్కడ రెండు యాక్స్‌లు ఉంటాయి. అవి గోల్డ్, సిల్వర్. గోల్డ్‌ను ఎంచుకుంటే ఇద్దరిని నామినేట్ చేయవచ్చు. సిల్వర్‌ను ఎంచుకుంటే ఒకరిని నామినేట్ చేయవచ్చు. ఓడిన వారికి నామినేషన్ చేసే అవకాశం ఉండదు. ముందుగా ఝాన్సీ, సుధీర్ వెళ్లారు. సుధీర్‌కు నామినేట్ చేసే అవకాశం లభించింది. సుధీర్ (Sudheer) వచ్చేసి త్రిగుణ్(Thrigun)ని నామినేట్ చేశాడు. మైండ్ గేమ్స్ ఆడుతున్నాడని.. చైత్ర (Chaitra) విషయంలో డబుల్ గేమ్స్ ఆడాడని తెలిపాడు. రోహిత్ (Rohith) డిష్ వాష్ చేయనప్పుడు తను చేసినప్పుడు త్రిగుణ్(Thrigun) వచ్చి తనకొకటి చెప్పాడని.. రోహిత్‌కి ఒకటి చెప్పాడని అన్నాడు. నెక్ట్స్ షాలినిని నామినేట్ చేశాడు. తన పవర్‌ని ఈజీగా మిస్ యూజ్ చేసిందని తెలిపాడు. పవర్ వచ్చిందని తనకని.. అది ఎప్పుడు యూజ్ చేసినా ప్రాబ్లమ్ లేదని షాలిని చెప్పింది. త్రిగుణ్ వచ్చేసి తాను రోహిత్(Rohith)కి, సుధీర్(Sudheer)కి ఇద్దరికీ సపోర్ట్ చేశానని తెలిపాడు.
ఆ తరువాత దేబ్జాని, కృష్ణుడు వెళ్లాడు. దేబ్జాని రోప్‌ని విప్పి నామినేషన్ చేసే అవకాశం గెలుచుకుంది. త్రిగుణ్‌ని దేబ్జాని నామినేట్ చేసింది. గ్రూప్ అనడం పట్ల ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. ముగ్గురుంటే దానిని గ్రూప్ అనడం కరెక్ట్ కాదని తెలిపింది. తరువాత సుధీర్‌ను నామినేట్ చేసింది. ఆ తరువాత రోహిత్, వర్షిణి వెళ్లారు. రోహిత్ రోప్ విప్పేసి.. తన ఫస్ట్ నామినేషన్ త్రిగుణ్‌ని చేశాడు. స్టెరాయిడ్స్ అనేది ఆయన నోటి వెంట తను ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నాడు. ముందొక మాట.. వెనుకొక మాట మాట్లాడుతున్నాడని.. మైక్రో మేనేజ్‌మెంట్ చేసి తనకు సపోర్ట్ చేయకపోగా ఇబ్బందిపెట్టేలా చేస్తున్నాడని చెప్పాడు. సృష్టిని సుధీర్ పైకి తోమేందుకు పంపిస్తున్నానని తనను అనడం తీసుకోలేకపోతున్నానని త్రిగుణ్ అన్నాడు. దీనికి త్రిగుణ్ ఒప్పుకున్నాడు. మీరు మేము చేస్తామని తీసుకున్నారు కాబట్టి మైక్రో మేనేజ్‌మెంట్ చేశామన్నారు. అది టాస్క్ కాబట్టి అలా చేసినట్టుగా త్రిగుణ్ చెప్పాడు. రోహిత్ అది టాస్క్ కాదని.. తామేమీ ప్రొఫెషనల్స్ కాదని చెప్పాడు. మధ్యలోకి చరణ్‌ని కూడా త్రిగుణ్ తీసుకొచ్చాడు. అసలు తన పాయింట్ చరణ్ కాదని.. తన స్టేట్‌మెంట్.. సృష్టిని సుధీర్‌పైకి పంపిస్తున్నానని అనడం అని త్రిగుణ్ చెప్పాడు. ఇలాంటి డెలిగేటరీ స్టేట్‌మెంట్స్ మీ నుంచి ఎందుకు వస్తున్నాయో తనకు అర్థం కావడం లేదని రోహిత్ అన్నాడు. మొత్తానికి అడ్డంగా దొరికిపోవడంతో త్రిగుణ్ మాట్లాడలేక ఓకే అని చెప్పేసి సైలెంట్ అయిపోయాడు.
ఇక రోహిత్ తన నెక్ట్స్ నామినేషన్.. ఝాన్సీకి అని చెప్పాడు. ఇప్పటి వరకూ ప్రతి ఒక్కరికీ గేమ్‌పై గ్రిప్ ఉందని… అలాగే స్టాండ్ తీసుకుంటున్నారని.. కానీ ఝాన్సీ అదేమీ చేయడం లేదని రోహిత్ చెప్పాడు. సేఫ్ గేమ్ ఆడుతున్నావు కాబట్టి నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు. ఝాన్సీ దానికి తాను మీ పక్కన ఉంటే తాను సేఫ్ ఆడనట్టా? అని అడిగింది. తన ఆటేందో తనకు తెలుసని.. తన స్ట్రాటజీలు ఏంటో తనకు తెలుసని చెప్పింది. ఈ విషయంలో ఝాన్సీ వాదన చాలా పేలవంగా ఉంది. ‘వాళ్ల ముచ్చట్లు నీకు చెప్పలేదని నామినేట్ చేస్తున్నావు’ అనేది ఝాన్సీ వాదన. మధ్యలో త్రిగుణ్ వస్తే.. మీరెందుకు మాట్లాడుతున్నారు? మీరు ఝాన్సీకి లాయరా? అంటూ రోహిత్ ప్రశ్నించాడు. ఈ సందర్భంలోనే త్రిగుణ్.. సృష్టి గురించి మాట్లాడాడు. తనను నేషనల్ టెలివిజన్‌లో తన క్యారెక్టర్‌పై నింద వేస్తున్నావంటూ సృష్టి మాట్లాడింది. అంతలోనే ఒప్పుకుని.. అంతలోనే త్రిగుణ్ తన మాటను ఫ్లిప్ చేశాడు. తనను టార్గెట్ చేస్తే ఎక్కువ పాపులర్ అవుతారని టార్గెట్ చేస్తున్నారని త్రిగుణ్ అన్నాడు.
తరువాత షాలిని, నరేష్ రోప్ తియడానికి వెళ్లారు. నరేష్ రోప్ తీసి నామినేషన్ స్టార్ట్ చేశాడు. తన ఫస్ట్ నామినేషన్ షాలినికి వేశాడు. గేమ్‌ని సీరియస్‌గా తీసుకోదని నామినేట్ చేస్తున్నట్టు తెలిపాడు. అందరం కూర్చొన్నప్పుడు లేటుగా వస్తుందని.. చైత్రతో గొడవ పడిందని.. ఫైనల్‌గా చైత్రనే సారీ చెప్పాల్సి వచ్చిందని షాలినిని నామినేట్ చేశాడు. అప్పుడు షాలిని తనను రూల్ బ్రేక్ చేస్తున్నానని చేసినప్పుడు.. రామ్ ప్రసాద్ కూడా చాలా సార్లు రూల్ బ్రేక్ చేశాడని చెప్పింది. రామ్ ప్రసాద్‌కి ఎందుకు చెప్పవని అడిగింది. చైత్ర తనకు సారీ చెప్పడమే తనకు తెలుసని.. తను తప్పు చేస్తే తనకు ఒప్పుకునే ధైర్యముందని షాలిని చెప్పింది. నరేష్ ఒక్కరిని నామినేట్ చేశాడు.
తరువాత త్రిగుణ్, సృష్టి వెళ్లారు. త్రిగుణ్ గెలిచి టాస్క్ ప్రారంభించాడు. తన ఫస్ట్ నామినేషన్ సుధీర్‌కి వేశాడు. తనకు సుధీర్ అంటే ఇష్టమని ఫస్ట్ నుంచి చెబుతున్నానని అన్నాడు. ‘అన్న నాకు సృష్టితో హైట్ సరిపోతుంది కాబట్టి నేను తనతో క్లోజ్ అవ్వొచ్చా?’ అని అడిగాడన్నాడు. ఆ తరువాత డిషెస్ వాష్ చేయొద్దు అన్నా కూడా కడిగాడని.. ఏదో ఒక టైంలో అది సెట్ అవుతుందని చెప్పాడని త్రిగుణ్ చెప్పాడు. అప్పుడు తనను గోడ మీద పిల్లి అని ఎందుకు అన్నావని త్రిగుణ్‌ని సృష్టి అడిగింది. మీరు ఇలాంటి మాటలు చెబితే మీకు బ్యాక్ ఫైర్ అవుతుందని సృష్టి చెప్పింది. తనకు ఆయన మాటలు తనను హర్ట్ చేస్తున్నాయని చెప్పింది. తరువాత సుధీర్ మాట్లాడుతూ.. అందరి ముందు ఒప్పుకుని ఇప్పుడు త్రిగుణ్ మాట్లాడుతున్నాడని సుధీర్ చెప్పాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గట్టిగానే వార్ నడిచింది. ‘నీతో గొడవ పెట్టుకుంటే నేను హీరో అవుతానో జీరో అవుతానో. నాకు అవసరమే లేదు’ అని అన్నాడు. గోడమీద పిల్లిలా త్రిగుణ్ కనిపిస్తున్నాడని సుధీర్ అన్నాడు.
ఆ తరువాత త్రిగుణ్.. రోహిత్‌ని నామినేట్ చేశాడు. ‘అగ్నిపరీక్ష టీం అంతా గ్రూప్‌లా ఫామ్ అవుతోందని అనిపించింది. రోహిత్ ముందుంటున్నాడు.. ఆ తరువాత మీరు వెళుతున్నారు. నీ వర్క్ నువ్వు సరిగా చేయలేదు. నా చదువు గురించి మాట్లాడావు. గ్లౌస్ తీసేసి డిష్ వాష్ చేసి ఉంటే నీకు సలాం చెప్పేవాడిని’ అని త్రిగుణ్ అన్నాడు. మీరు గ్రూప్ ఆడితే ఒకటి.. మేము గ్రూప్ అయితే ఒకటా? అని రోహిత్ అడిగాడు. ఐ అగ్రీ టు దట్ అని షాలిని అనగానే దానికి వర్షిణి ఫైర్ అయిపోయింది. ఎవరూ చప్పట్లు కొట్టొద్దని చెప్పినప్పుడు తనెందుకు ఇన్వాల్వ్ అవ్వాలన్నాడు కదా. వర్షిణి ఫైర్ అయిపోయి షాలిని మీదకు వెళ్లిపోయింది. వర్షిణి ఫిజికల్ అవడంతో రోహిత్ కూడా ఆమెపై ఫైర్ అయ్యాడు. తనపై త్రిగుణ్ ఒక ఫాల్స్ అలిగేషన్ వేస్తున్నాడని రోహిత్ తెలిపాడు. దీనికి హ్యుమానిటీ బేస్‌లో పని చేస్తున్నానని సరదాగా చెప్పానని చెప్పాడు. కానీ తను ఫేవర్ అడిగాడని రోహిత్ చెప్పాడు. త్రిగుణ్ డబుల్ గేమ్ ఆడుతున్నాడని రోహిత్ అన్నాడు. మొత్తానికి పెద్ద తుఫాన్ వచ్చి వెలిసినట్టుగా అయ్యింది.
నెక్ట్స్ అమన్ (Aman), ముఖేష్ (Mukesh) వెళ్లారు. అమన్ గెలిచి ఫస్ట్ రామ్ ప్రసాద్ (Ram Prasad)ని నామినేట్ చేశాడు. తనను నరేష్‌పై ఓడిపోయాడని అనడం తనకు బాధ అనిపించిందని అన్నాడు. రామ్ ప్రసాద్ బాగా ఆడినప్పుడు తను వెళ్లి అప్రిషియేట్ చేశానని అన్నాడు. తరువాత ఝాన్సీని నామినేట్ చేశాడు. తనను అంతకు ముందు బాగా ఆడావని అప్రిషియేట్ చేసి.. తను కన్ఫ్యూజ్ అయ్యాడని ఝాన్సీ అన్నదని అమన్ చెప్పాడు. బయట చూసే జనాలు తనను కన్ఫ్యూజ్ అనుకుంటారని నామినేట్ చేశాడు. ఆ తరువాత వంశీ, రామ్ ప్రసాద్ వెళ్లారు. వంవీ రోప్ విప్పి నామినేషన్ స్టార్ట్ చేశాడు. తన మనసుకి బాధ అనిపించింది చిన్న విషయమే అయినా కూడా దేబ్జాని కారణంగా తాను బాధ పడ్డానని.. అదేంటో కూడా తనకు తెలుసని దేబ్జానిని నామినేట్ చేశాడు. నెక్ట్స్ ముఖేష్‌ను నామినేట్ చేశాడు. హౌస్‌లో జుట్టు తీసినా రోజు చూసుకుని చేస్తానని.. కానీ ముఖేష్ ట్రిమ్ చేసుకోవడం తనకు నచ్చలేదని నామినేట్ చేశాడు.
ఈవారం నామినేషన్స్‌లో దాదాపుగా అందరూ ఉన్నారు. షాలిని(Shalini), త్రిగుణ్(Thrigun), ఝాన్సీ(Jhansi), ముఖేష్ (Mukesh), రామ్ ప్రసాద్ (Ram Prasad), దేబ్జాని(Debjani), రోహిత్(Rohith), కృష్ణుడు(Krishnudu), సుధీర్(Sudheer), సృష్టి(Shrishti), వర్షిణి (Varshini) ఉన్నారు. మొత్తానికి నామినేషన్స్ అయితే చాలా హాట్ హాట్‌గా నడిచాయి. ఇప్పటి వరకూ ఒకరి మాటలు మరొకరికి చెప్పి.. రోహిత్‌ని బాగా టార్గెట్ చేసిన త్రిగుణ్‌కి గట్టి దెబ్బ తగిలింది. మొత్తానికి కొందరు కంటెస్టెంట్స్ చేపట్టిన ఆపరేషన్ త్రిగుణ్ సక్సెస్ అయ్యింది.
నాని (Nani), శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన…
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న ఫౌజీ సినిమా హాట్ టాపిక్‌గా మారిందిప్పుడు. ఈ సినిమా…
బిగ్‌బాస్ తెలుగు ఫస్ట్ వీక్ తర్వాత మరింత రసవత్తరంగా మారింది. అంతా స్ట్రాటజీలు మార్చేసినట్టుగా ఇవాళ (సోమవారం) వచ్చిన ఫస్ట్…
బిగ్‌బాస్ 10 తెలుగు ఆదివారం ఎపిసోడ్ (Bigg Boss 10 Telugu Sunday episode) ‘జై జై గణేశ’ సాంగ్‌తో…
బిగ్‌బాస్ 10 తెలుగు (Bigg Boss 10 Telugu) మొదటి రోజు నుంచే రసవత్తరంగా సాగుతోంది. వీకెండ్‌లో హోస్ట్ నాగార్జున…
బిగ్‌బాస్ 10 తెలుగు తొలి శనివారం ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆ తరుణం రానే…