మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన “పెద్ది” చిత్రం భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కేవలం రామ్ చరణ్ కెరీర్‌కే కాకుండా, టాలీవుడ్‌కు కూడా ఎంతో అవసరమైన సెన్సేషనల్ సక్సెస్‌ను అందించిందని అభిమానులు భావిస్తున్నారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం నేడు హైదరాబాద్‌లో గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్‌ను నిర్వహించింది.
ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు సుకుమార్ ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు. కార్యక్రమంలో సుకుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ సుకుమార్ భావోద్వేగంగా స్పందించారు. “రామ్ చరణ్‌ను నేను ఒక్కడినే కాదు, మా అందరం ఒకే మాట అంటాం… ‘మా చరణ్ బంగారం’. చరణ్ లాంటి వినమ్రుడిని నేను ఇప్పటివరకు చూడలేదు” అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.
సుకుమార్ వ్యాఖ్యలకు అభిమానులు భారీగా స్పందించగా, సభ ప్రాంగణం కేరింతలతో మార్మోగింది. ఇదే సమయంలో అభిమానులు “RC17” అంటూ నినాదాలు చేస్తూ, రామ్ చరణ్‌తో ఆయన చేయబోయే తదుపరి సినిమా గురించి అప్డేట్ ఇవ్వాలని కోరారు.
అయితే అభిమానుల విజ్ఞప్తిపై స్పందించిన సుకుమార్, తనదైన శైలిలో ఎలాంటి వివరాలు వెల్లడించకుండా తప్పించుకున్నారు. ప్రస్తుతం తన పూర్తి దృష్టి పని మీదే ఉందని, ఈ దశలో ఎలాంటి అప్డేట్ ఇవ్వబోనని స్పష్టం చేశారు.
దీంతో సుకుమార్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్‌లో రానున్న RC17పై మరింత ఆసక్తి పెరిగింది. “రంగస్థలం” తర్వాత ఈ ఇద్దరి కలయికలో మరో భారీ సినిమా రాబోతుండటంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
బిగ్‌బాస్ ఆరు వారాలు గడిచిపోయాయి. ఇప్పటివరకూ తన రియాలిటీని పూర్తిగా బయటపెట్టని దేబ్జాని ఈవారం మాత్రం మాస్క్ తీసినట్టుగా అనిపిస్తోంది.…
ఇవాళ సండే ఫన్‌డే అని చెప్పి.. అది హ్యాపీ సండేనో కాదో తాను చెప్పలేనని హోస్ట్ నాగార్జున షో ప్రారంభంలోనే…
ఈ వారం బిగ్‌బాస్ హౌస్‌లో డబులు ఎలిమినేషన్ అన్న విషయం తెలిసిందే. డబుల్ ఎలిమినేషన్‌లో దక్షి వెళ్లిపోతుందంటూ ముందుగానే వార్తలొచ్చాయి.…
బిగ్‌బాస్ 10 తెలుగు వీకెండ్ ప్రారంభమైంది. శుక్రవారం ఏం జరిగిందో హోస్ట్ నాగార్జున చూశారు. ముందుగా శుక్రవారం షోలో బిగ్‌బాస్..…
ఫిట్‌నెస్ విషయంలో బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్ ఎప్పుడూ ముందుంటారు. కఠినమైన వ్యాయామాలు, మార్షల్ ఆర్ట్స్, యాక్షన్ స్టంట్స్‌తో తనకంటూ…
బిగ్‌బాస్ 10 తెలుగు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకూ ఉన్న ఈక్వేషన్స్ అన్నీ తారుమారు అవుతున్నాయి. కంటెస్టెంట్స్ అంతా ఆట…