Menu
BREAKING
RC17 సినిమాతో సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ విడిపోయినట్లే..!   |   నా బాడీ నా యిష్టం.. నా సైజ్‌ల గురించి మీకెందుకు.. ఆ హీరోయిన్ సీరియస్..!   |   Biggboss10 Telugu: హౌస్‌లోకి షాలిని ఎంట్రీ.. ఈ వారం ముప్పు ఆ ఇద్దరికే..   |   సో కాల్డ్ వారసులను అడిగే దమ్ముందా.. బ్యాగ్రౌండ్ లేని కుర్రాళ్లేనా టార్గెట్..?   |   కుర్రాడు సక్సెస్ అవుతాడా.. దొంగ నా కొడుకుతో మౌళి ఫ్యూచర్ ఏంటి..?   |   దసరాకు పట్టించుకోరా.. విజయదశమి కనీసం కళ్లకు కనిపించలేదా మన హీరోలకు..?   |   Biggboss10 Telugu: సుధీర్, ఝాన్సీలను ఒకాట ఆడుకున్న ఆర్కే.. బయటకొచ్చిన ఎలుకలు..   |   అన్నీ చెప్పిన రాజమౌళి ఆ ఒక్కటి తప్ప.. వారణాసి కథేంటో తెలుసా..?   |   దీపిక పదుకొనే, రణ్‌వీర్ సింగ్ రెండో కూతురు పేరు తెలుసా..?   |   Vijay Deverakonda: కొండన్న ముందు భారీ లక్ష్యం.. ‘రణబాలి’ ఇప్పటి వరకు ఓకే.. ఇకపై ఏం చేస్తుందో..?   |   Jailer 2: ఆ రికార్డు సాధిస్తుందా..? కోలీవుడ్ పరువు ఇప్పుడు రజినీ చేతుల్లో..!   |   Kaaka: ‘కాకా’ మేకింగ్ వీడియో లీక్.. కావాలనే చేసారా లేదంటే అలా జరిగిపోయిందా..?   |   బాలీవుడ్ హీరోలను బతకనీయరా.. నడిరోడ్డు మీద కాల్పులేంటి సామి..?   |   BiggBoss10 Telugu: బిగ్ బాస్‌లో షాలిని ఎలిమినేషన్ ట్విస్ట్.. సీక్రెట్ రూమ్‌కు పంపించిన నాగార్జున!   |   Biggboss10 Telugu: బిగ్‌బాస్ హౌస్ నుంచి షాలిని ఎలిమినేట్.. ఇక వార్ వన్‌సైడేనా?

RC17 సినిమాతో సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ విడిపోయినట్లే..!

RC17 సినిమాతో సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ విడిపోయినట్లే..!

ఇండస్ట్రీలో డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ మధ్య ఉండే బాండింగ్ గురించి మాట్లాడాల్సి వస్తే అందరికీ ఠక్కున గుర్తొచ్చే మొదటి పేరు సుకుమార్, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్. ఆర్య సినిమాతో మొదలైన వీరిద్దరి మ్యాజికల్ కాంబినేషన్ దాదాపు రెండు దశాబ్దాలుగా తిరుగులేని సంచలనాలు సృష్టిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు రామ్ చరణ్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ RC17 విషయంలో మాత్రం ఈ హిట్ జోడీ విడిపోతోందంటూ గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో ఒకటే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ భారీ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించడం లేదని, ఆయన ప్లేస్ లోకి వేరే మ్యూజిక్ డైరెక్టర్ వస్తున్నారంటూ వస్తున్న వార్తలపై ఎట్టకేలకు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ స్పందించారు. అయితే ఆయన ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు ఇండస్ట్రీలో మరింత ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది. దేవి ఉంటాడా లేదా అనే విషయాన్ని డైరెక్ట్ గా చెప్పకుండా ఆయన మాట్లాడిన మాటలు వింటుంటే, అసలు విషయం దాదాపు ఖరారైపోయినట్లేనని తేల్చేసాడు.

తాజాగా జరిగిన మౌళి దొంగ నా కొడుకు సినిమా టీజర్ లాంచ్ ప్రెస్ మీట్ లో RC17 మ్యూజిక్ డైరెక్టర్ వివాదంపై నిర్మాత రవిశంకర్ అనధికారికంగా స్పందిస్తూ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. సుకుమార్ ప్రస్తుతం లండన్ లో ఉన్నారని, ఆయన అక్కడి నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాతే దేవి శ్రీ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్ లో ఉంటాడా లేదా అనేది స్వయంగా క్లారిటీ ఇస్తారని చెప్పారు. అయితే అంతటితో ఆగకుండా, ఒకవేళ దేవి ఈ సినిమాలో లేకపోతే మాత్రం ఆయన క్రేజ్ గానీ, టాలెంట్ గానీ తక్కువేం కాదని చెప్పుకొచ్చారు. దేవి శ్రీ ప్రసాద్ తమకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాంటివాడని, సుకుమార్ కి అయితే సొంత తమ్ముడితో సమానమని గుర్తు చేశారు. తమ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఇప్పటివరకు దేవి శ్రీ ప్రసాద్ 7 ఆణిముత్యాల్లాంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చారని ప్రశంసించారు. కేవలం రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చే ఈ ఒక్క సినిమాలో లేనంత మాత్రాన దేవి రేంజ్ తగ్గిపోతుందని ఎవరూ అనుకోవద్దని, ఆయన ఎప్పటికీ స్టార్ కంపోజరేనంటూ రవిశంకర్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు.

పైకి చూడటానికి ఇదంతా దేవి శ్రీ ప్రసాద్ పై ఉన్న అభిమానంతో చెప్పినట్లు కనిపిస్తున్నా, నెటిజన్లు మాత్రం దీన్ని మరోలా విశ్లేషిస్తున్నారు. ఇండస్ట్రీలో ఏదైనా విషయాన్ని డైరెక్ట్ గా చెప్పడానికి మొహమాటపడినప్పుడు మేకర్స్ ఇలాంటి డిప్లొమాటిక్ పద్ధతినే ఫాలో అవుతుంటారు. నిజంగా దేవి శ్రీ ప్రసాద్ గనక ఈ సినిమాలో ఉంటే, ఆయన ఉన్నారనే విషయాన్ని సూటిగా ఒక్క ముక్కలో తేల్చేసేవారు. కానీ ఆయన లేకపోతే ఆయన క్రేజ్ ఏం తగ్గదు, మాకు సొంత తమ్ముడు లాంటివాడు అంటూ ముందే డిఫెన్స్ లోకి వెళ్లడం చూస్తుంటే, దేవి తప్పుకున్నాడనే నిజాన్ని సున్నితంగా రివీల్ చేయడానికే ఈ రూట్ ఎంచుకున్నారని స్పష్టమవుతోంది. చెప్పాల్సిన చేదు నిజాన్ని పరోక్షంగా చెప్పేసి, చివర్లో ఫ్యాన్స్ నుంచి విమర్శలు రాకుండా ఉండేందుకు రవిశంకర్ బాగానే బటర్ పూశారంటూ నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే సుకుమార్, దేవి కాంబో విడిపోతోందనే విషయాన్ని అధికారికంగా కాకుండా, అనధికారికంగా అందరికీ అర్థమయ్యేలా మైత్రీ నిర్మాతలు ఒక హింట్ ఇచ్చారనేది సుస్పష్టం.

ఈ పరిణామం టాలీవుడ్ ప్రేక్షకులను, ముఖ్యంగా మ్యూజిక్ లవర్స్ ను తీవ్ర ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎందుకంటే సుకుమార్ తీసిన ఆర్య, ఆర్య 2, జగడం, 100 పర్సెంట్ లవ్, నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, అలాగే పుష్ప పార్ట్ 1, పుష్ప పార్ట్ 2 వరకు ప్రతీ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ప్రాణం పెట్టి పాటలు ఇచ్చారు. సుకుమార్ విజన్ కు తగ్గట్లుగా తన మ్యూజిక్ తో సీన్స్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లిన ఘనత దేవిదే. అయితే పుష్ప 2 సమయంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్స్ విషయంలో తీవ్రమైన జాప్యం జరగడం, చివరి నిమిషంలో ఇతర సంగీత దర్శకులను కూడా రంగంలోకి దించాల్సి రావడం వల్ల ఇద్దరి మధ్య కొంత క్రియేటివ్ గ్యాప్ వచ్చి ఉండవచ్చని ఇండస్ట్రీ టాక్ నడుస్తోంది. దీనికి తోడు రామ్ చరణ్ సినిమాను గ్లోబల్ లెవెల్ లో మరింత కొత్త సౌండింగ్ తో సరికొత్తగా ప్రెజెంట్ చేయాలని సుకుమార్ భావిస్తున్నారని, అందుకే అనిరుధ్ రవిచందర్ లేదా ధురంధర్ ఫేమ్ శాశ్వత్ సచ్‌దేవ్ లాంటి క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ల వైపు మొగ్గు చూపుతున్నారని ప్రచారం సాగుతోంది. కారణాలు ఏవైనప్పటికీ రెండు దశాబ్దాల ఒక ఐకానిక్ కాంబినేషన్ ఇలా బ్రేక్ అవ్వడం టాలీవుడ్ లో ఒక పెద్ద సంచలనమే అని చెప్పాలి.

రామ్ చరణ్, సుకుమార్ గతంలో కలిసి చేసిన రంగస్థలం సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో దేవి శ్రీ ప్రసాద్ అందించిన జానపద బాణీలు, మాస్ బీట్స్ సినిమా సక్సెస్ లో సింహభాగం పోషించాయి. ఇప్పుడు మళ్ళీ అదే కాంబినేషన్ లో భారీ పాన్ ఇండియా లెవెల్ లో RC17 తెరకెక్కబోతున్న తరుణంలో, దేవి శ్రీ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్ లో లేకపోవడం ఒక పెద్ద లోటనే చెప్పాలి. సుకుమార్ లండన్ నుంచి తిరిగి రాగానే, అక్టోబర్ 26 లేదా 27 తేదీలలో మంచి ముహూర్తం చూసుకుని ఈ చిత్రాన్ని అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ రోజే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ పై పూర్తి స్థాయి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా దేవి స్థానంలో ఎవరు వచ్చినా సరే, సుకుమార్ మార్క్ టేకింగ్ కు, రామ్ చరణ్ మాస్ ఇమేజ్ కు తగ్గట్లుగా రంగస్థలం రేంజ్ మ్యూజిక్ మ్యాజిక్ ను రీక్రియేట్ చేయడం అంత తేలికైన విషయం కాదేమో..?

Pranav

Writer and contributor at Telugu Cinema 360