సినిమా వార్తలు

సో కాల్డ్ వారసులను అడిగే దమ్ముందా.. బ్యాగ్రౌండ్ లేని కుర్రాళ్లేనా టార్గెట్..?

టాలీవుడ్‌లో ఎవరైనా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కేవలం తమ స్వయంకృషితో, టాలెంట్ తో పైకి వస్తుంటే వారిని ఎంకరేజ్ చేయడం మానేసి, కావాలని కిందకు లాగే ప్రయత్నాలు ఈమధ్య మరీ ఎక్కువైపోతున్నాయి. యూట్యూబ్ లో మౌళి టాక్స్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని, షార్ట్ ఫిలిమ్స్ నుంచి సిల్వర్ స్క్రీన్ వరకు ఎదిగి ఇప్పుడు హీరోగా కూడా సత్తా చాటుతున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ టాలెంట్ మౌళికి తాజాగా ఇలాంటి తీవ్రమైన చేదు అనుభవమే ఎదురైంది. మౌళి హీరోగా నటించిన లేటెస్ట్ క్రైమ్ కామెడీ మూవీ దొంగ నా కొడుకు త్వరలోనే రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ మిథిలేష్ తో జరిగిన ఒక ఇంటర్వ్యూలో యాంకర్ రోషన్ కావాలనే మౌళిని టార్గెట్ చేస్తూ చాలా దారుణంగా, అహంకారంతో అవమానించాడు. అసలు మౌళి ఎవడు, ఒక సినిమా ఫ్లాప్ అయితే లేదా కొంచెం గ్యాప్ వస్తే జనాలకు పెద్ద పెద్ద స్టార్ హీరోలే గుర్తుండరు, అలాంటిది ఇక్కడ మౌళికి ఏం క్రేజ్ ఉంటుంది అంటూ చాలా చులకనగా రోషన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.

యాంకర్ రోషన్ పబ్లిక్ గా చేసిన ఈ వ్యాఖ్యలపై మౌళి చాలా ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యాడు. తన కొత్త సినిమా దొంగ నా కొడుకు టీజర్ లాంచ్ ఈవెంట్ లో స్టేజ్ పైనే ఈ విషయం గురించి మాట్లాడుతూ మౌళి ఎమోషనల్ అవ్వడం అక్కడున్న వారందరినీ తీవ్రంగా కలచివేసింది. తనకు ఇండస్ట్రీలో చెప్పుకోవడానికి ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోవడం వల్లే, ఒక పెద్ద ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం వల్లే ఆ యాంకర్ తనను అంత మాట అన్నారంటూ మౌళి తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకవేళ తనకు కూడా వెనుక ఏదైనా పెద్ద సపోర్ట్ ఉండి ఉంటే, తాను కూడా ఒక స్టార్ కిడ్ అయి ఉంటే ఇలా పబ్లిక్ గా ఒక ఇంటర్వ్యూలో తనను కించపరిచే ధైర్యం ఆ యాంకర్ కు ఉండేదా అని మౌళి అడిగిన ప్రశ్నకు ఇండస్ట్రీ వర్గాలు సైతం సైలెంట్ అయిపోయాయి. ఎవరి సపోర్ట్ లేకుండా ఎన్నో కష్టాలు పడి ఒక సినిమా చేసుకుంటే, కనీసం ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా ఆగి చూడకుండా ఇలా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి తక్కువ చేసి మాట్లాడటం ఏంటని మౌళి తన బాధను పంచుకున్న తీరు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసింది.

అయితే ఈ ఇష్యూ బయటకు వచ్చినప్పటి నుంచి నెటిజన్లు, అభిమానులు మౌళికి భారీ స్థాయిలో తమ సపోర్ట్ ను తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా అంతా ఇప్పుడు మౌళికి అండగా నిలబడుతూ యాంకర్ రోషన్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. సొంత కష్టంతో పైకి వస్తున్న ఒక యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు కానీ, ఇలా పబ్లిక్ గా ఒక ప్లాట్ ఫామ్ మీద అవమానించే హక్కు నీకు ఎవరిచ్చారంటూ నెటిజన్లు రోషన్ ను ఆడుకుంటున్నారు. అసలు నీకు అంత దమ్ముంటే, ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోని గానీ, లేదా స్టార్ కిడ్స్ ని గానీ ఇలాంటి ప్రశ్నలు అడిగే ధైర్యం ఉందా అంటూ యాంకర్లను, రిపోర్టర్లను సోషల్ మీడియా వేదికగా కడిగిపారేస్తున్నారు. నిజంగానే మన రిపోర్టర్లకు బ్యాక్ గ్రౌండ్ లేని చిన్న హీరోలను సతాయించడం, వారిని టార్గెట్ చేసి కాంట్రవర్సీలతో వ్యూస్ తెచ్చుకోవడం తప్పితే, పెద్ద హీరోలను ఒక్క మాట అనే దమ్ము లేదనే విషయం ఈ సంఘటనతో మరోసారి కళ్ళకు కట్టినట్లు ప్రూవ్ అయ్యిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

టాలీవుడ్‌లో ఇలాంటి వివక్ష అనేది ఈనాటిది కాదు, బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చే ప్రతి నటుడు ఏదో ఒక దశలో ఇలాంటి అవమానాలు ఎదుర్కోవాల్సిందే అనేది చేదు నిజం. కొంతమంది జర్నలిస్టులకు, యాంకర్లకు చిన్న హీరోలు అంటే ఎందుకంత లోకువ అనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఏమాత్రం బ్యాక్ గ్రౌండ్, గాడ్ ఫాదర్ లేని వారు కనబడితే చాలు, వారిని ఏమైనా అనొచ్చు, వాళ్ళు తిరిగి ఏమీ చేయలేరు అనే ఒక చులకన భావం చాలా మంది మీడియా వాళ్ళలో ఉండిపోయింది. అదే ఒక పెద్ద హీరో ఇంటర్వ్యూకి వస్తే, వంగి వంగి దండాలు పెడుతూ, వాళ్ళు ఏం చెప్పినా వింటూ భజన చేసే వీళ్లకు ఒక సామాన్య నటుడిని మాత్రం ప్రశ్నించేటప్పుడు ఎక్కడలేని అహంకారం, యాటిట్యూడ్ బయటకు వస్తుంది. మౌళి విషయంలో కూడా కచ్చితంగా ఇదే జరిగింది. అతను సెల్ఫ్ మేడ్ స్టార్ కాబట్టే, వెనక ఎవరూ లేరు కాబట్టే ఎలాంటి భయం లేకుండా యాంకర్ రోషన్ తన నోటికి వచ్చినట్లు మాట్లాడి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నాడు అని విశ్లేషకులు సైతం తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

సరిగ్గా ఇలాంటి ఇన్సిడెంట్ గతంలో మన సూపర్ హీరో తేజ సజ్జా విషయంలో కూడా జరిగింది. సంక్రాంతి బరిలో హనుమాన్ లాంటి పాన్ ఇండియా సినిమా రిలీజ్ అవుతున్న టైమ్ లో కొంతమంది రిపోర్టర్లు తేజను చాలా తక్కువ చేసి మాట్లాడారు. అసలు మీ రేంజ్ కు ఈ సినిమా అవసరమా, ఇంత బడ్జెట్ పెడితే వర్కౌట్ అవుతుందా అంటూ ప్రెస్ మీట్ లోనే హేళన చేశారు. కానీ ఆ సినిమా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కొట్టి వాళ్ళందరి నోళ్లు శాశ్వతంగా మూయించింది. సక్సెస్ అనేది బ్యాక్ గ్రౌండ్ ఉంటే రాదు, కంటెంట్ ఉంటే, టాలెంట్ ఉంటే వస్తుందని తేజ సజ్జా నిరూపించాడు. ఆ తర్వాత కిరణ్ అబ్బవరంను ఇలాగే అడిగారు.. తెలుగులోనే మార్కెట్ లేదు మీకు ప్యాన్ ఇండియా అవసరమా అని..? ఇప్పుడు మౌళి వంతు కూడా వచ్చింది. ఎవరైతే తనను తక్కువ చేసి మాట్లాడారో, ఎవరైతే తన ఉనికిని ప్రశ్నించారో వాళ్ళందరికీ తన దొంగ నా కొడుకు సినిమా సక్సెస్ తోనే మౌళి గట్టి కౌంటర్ ఇస్తాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. బ్యాక్ గ్రౌండ్ లేకపోవచ్చు, కానీ టాలెంట్ కు తోడు ఆడియన్స్ అండ ఉంటే ఎవరికైనా టాలీవుడ్ లో స్టార్ డమ్ దక్కుతుందని మౌళి త్వరలోనే నిరూపించడం ఖాయం.

Pranav

Recent Posts

Biggboss10 Telugu: హౌస్‌లోకి షాలిని ఎంట్రీ.. ఈ వారం ముప్పు ఆ ఇద్దరికే..

బిగ్‌బాస్ హౌస్‌లోకి షాలిని ఎంట్రీ ఇచ్చింది. ఆమెను డ్రమెటిక్‌గా హౌస్‌లోకి ప్రవేశ పెట్టారు. త్రిగుణ్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచారు. అక్కడ…

42 minutes ago

కుర్రాడు సక్సెస్ అవుతాడా.. దొంగ నా కొడుకుతో మౌళి ఫ్యూచర్ ఏంటి..?

టాలీవుడ్ లో ప్రస్తుతం యూత్ ఫుల్ కంటెంట్ తో వస్తున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలకు ఆడియన్స్ నుంచి మంచి…

1 hour ago

దసరాకు పట్టించుకోరా.. విజయదశమి కనీసం కళ్లకు కనిపించలేదా మన హీరోలకు..?

సాధారణంగా దసరా లాంటి పెద్ద పండుగ వస్తుందంటే చాలు.. థియేటర్లలో సినిమాల పండగ ఎలా ఉంటుందో, సోషల్ మీడియాలో కూడా…

1 hour ago

Biggboss10 Telugu: సుధీర్, ఝాన్సీలను ఒకాట ఆడుకున్న ఆర్కే.. బయటకొచ్చిన ఎలుకలు..

నిన్న ఆగిపోయిన చోటు నుంచే తిరిగి షో ప్రారంభమైంది. అమన్.. శివ్‌ను నామినేట్ చేశాడు. వైల్డ్ ఫైర్‌గా వచ్చి వైల్డ్…

1 hour ago

అన్నీ చెప్పిన రాజమౌళి ఆ ఒక్కటి తప్ప.. వారణాసి కథేంటో తెలుసా..?

దర్శక ధీరుడు రాజమౌళి పేరు చెబితేనే ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక బ్రాండ్ లా మారిపోయింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా…

24 hours ago

దీపిక పదుకొనే, రణ్‌వీర్ సింగ్ రెండో కూతురు పేరు తెలుసా..?

బాలీవుడ్ క్యూట్ కపుల్, అభిమానులందరూ ముద్దుగా పిలుచుకునే 'దీప్ వీర్' జోడీ తమ పర్సనల్ లైఫ్ లో హ్యాపీ మూవెంట్స్…

1 day ago