సినిమా వార్తలు

Biggboss10 Telugu: సుధీర్, ఝాన్సీలను ఒకాట ఆడుకున్న ఆర్కే.. బయటకొచ్చిన ఎలుకలు..

నిన్న ఆగిపోయిన చోటు నుంచే తిరిగి షో ప్రారంభమైంది. అమన్.. శివ్‌ను నామినేట్ చేశాడు. వైల్డ్ ఫైర్‌గా వచ్చి వైల్డ్ ఫూల్ అయిన శివ్ అని అమన్ చెప్పాడు. చిచ్చు పెట్టి సైడ్ అయిపోదామన్నట్టుగా మీ మాటలు ఉంటాయన్నట్టుగా అమన్ చెప్పాడు. రోహిత్ తనకు వంద ఉంటాయని.. తిట్టుకుంటాం.. కొట్టుకుంటాం ఏమైనా చేస్తామని చెప్పాడు. ఏదైనా మాట్లాడేటప్పుడు క్లారిటీ ఉంటేనే మాట్లాడాలని చెప్పాడు. 24 అవర్స్ లైవ్ ఎవరూ చూడరని.. కేవలం వన్ అవర్ షో చూసి మాత్రమే చెబుతారని శివ్ చెప్పాడు. ఇండివిడ్యువల్ ఆట ఆడమని అమన్ చెప్పాడు. బిగ్‌బాస్ గ్రూప్ గేమ్ ఆడమంటే ఇండివిడ్యువల్ గేమ్ ఎలా ఆడతారని శివ్ అడిగాడు. మరి గ్రూప్ గేమ్ కూడా సరిగా ఆడలేదు కదా అని అమన్ అన్నాడు. మధ్యలో త్రిగుణ్ వచ్చి వైల్డ్ ఫైర్స్‌లో శివ్ మాత్రమే జెన్యూన్‌గా ఉన్నాడన్నట్టుగా త్రిగుణ్ చెప్పాడు. దీంతో శివ్ వెళ్లి త్రిగుణ్‌ను హగ్ చేసుకున్నాడు. తన పాయింట్స్ ఇవేనని అమన్ చెప్పాడు.

నెక్ట్స్ శ్వేత వచ్చి త్రిగుణ్‌ను నామినేట్ చేసింది. తను ఇంతకు ముందు త్రిగుణ్‌తో ఫ్రంట్ ఫుట్‌లో ఆడతావని.. ఏం చేసినా ఒప్పుకుంటావని తనే చెప్పాడని.. కానీ మడ్ టాస్క్‌లో నమ్మక ద్రోహం చేయడం సరిగా అనిపించలేదని చెప్పింది. బ్లూ టీం, గ్రీన్ టీంలను విభజించిందే తామని.. కానీ మీరు చీటింగ్ చేసి తమనే గేమ్ నుంచి తప్పించారని శ్వేత చెప్పింది. ఇంటిని వదిలేసి వచ్చి బాత్రూంలు కడిగి.. అన్ని పనులు చేయడం కేవలం కప్పు కోసమేనని.. మంచివాడని అందరితో పొగిడించుకోసం కాదని చెప్పాడు. ఇక్కడికి తాను హీరో అవడం కోసమో.. విలన్ అవడం కోసమో కాదని చెప్పాడు. తను ఆడి దెబ్బలు కూడా తగిలించుకున్నానని.. అలాంటిది వైల్డ్ ఫైర్స్‌లో శివ్ ఒక్కడే ఆడాడని ఎలా చెబుతారని ప్రశ్నించింది. శ్వేత ఒకసైడ్ టిల్ట్ అవుతున్నట్టుగా తనకు అనిపించిందని త్రిగుణ్ చెప్పాడు. రోహిత్‌తో మీరు మాట్లాడుతున్నప్పుడు బిగ్‌బాస్ నుంచి ఎందుకు అనౌన్స్‌మెంట్ వచ్చిందని ప్రశ్నించాడు. మీకు దాని గురించి తెలియకుండా ఎలా చెబుతారని శ్వేత అడిగింది. మధ్యలో రోహిత్ వచ్చి త్రిగుణ్ చీటింగ్ చేశాడని చెప్పాడు. ఆ సమయంలో రోహిత్ ఏదో బూతు అనబోయి మింగేశాడు. మొత్తానికి త్రిగుణ్ నామినేట్ అయ్యాడు.

శ్వేత అనవసరంగా ఎలివేషన్ ఇస్తోందని రోహిత్ చెప్పాడు. శ్వేత దగ్గరకు త్రిగుణ్ వచ్చి తను మాట్లాడుతుంటే అరుస్తున్నాడని చెప్పింది. శ్వేత తనను పొగుడుతున్నారని అంటున్నారని.. తనకు అనిపించింది మాత్రమే చెప్పానని త్రిగుణ్‌కి చెప్పింది. ముఖేష్ కూడా రోహిత్ దగ్గరకు వచ్చి త్రిగుణ్‌ను అనవసరంగా లేపుతున్నారన్నట్టుగా అన్నాడు. ఇక వర్షిణి వచ్చేసి నీతూని నామినేట్ చేసింది. తనను నామినేట్ చేసిన పాయింట్స్‌తోనే నామినేట్ చేసింది. తను వచ్చి కేవలం వారమే అవుతోందని అందుకే తను మైక్ వేసుకోవడం మరిచిపోతున్నానని చెప్పింది. వర్షిణి ఒక పాయింట్ చెప్పి ఆగిపోయింది. వాళ్లు చెప్పినవి గుర్తు రావడం లేదా? అని అడిగింది. ‘నీ గేమ్ ఏమీ లేదని.. నువ్వు ఆడిన ఒక్క గేమ్ గురించి చెప్పు’ అంటే వర్షిణి రివర్స్‌లో నువ్వేం చేశావో చెప్పమని అడిగింది. త్రిగుణ్‌తో ఆడింది సోలో గేమ్ కాదా? అని నీతూ అడిగింది. ఎంట్రీతోనే ఇద్దరి మధ్యలో దూరి ఆ అమ్మాయిని లోయెస్ట్ చేసి బయటకు పంపించావని చెప్పింది. అందరినీ విడగొట్టడమే నీ పని అని నీతూని వర్షిణి విమర్శించింది. మధ్యలోకి రామ్ ప్రసాద్ వచ్చాడు. నీతూని మాట్లాడనివ్వకుండా నువ్వే నువ్వే మాట్లాడుతున్నావంటూ వర్షిణిని అనడంతో ఆమె రామ్ ప్రసాద్‌పై ఫైర్ అయ్యింది.

నెక్ట్స్ సుధీర్ వచ్చి రామకృష్ణను నామినేట్ చేశాడు. ఇప్పుడు నీ గేమ్ ఆడుతున్నావా? సేఫ్ గేమ్ ఆడుతున్నావా? అని అడిగాడు. తన గేమ్ తను మాత్రమే ఆడుతున్నానని చెప్పాడు. రాగానే రోహిత్‌కు స్టే ఇచ్చావని అందుకే సేఫ్ గేమ్ ఆడుతున్నావని చెప్పాడు. తనకు స్ట్రాటజీ ఏమీ ఉండదని.. గేమ్ అంటే గేమ్ ఆడుతా.. నామినేషన్ అంటే పాయింట్స్ పెడతానని రామకృష్ణ చెప్పాడు. నీకు సర్రున కోపం వస్తుందని సుధీర్ అంటే కోపం అనేది చెప్పి రాదని రామకృష్ణ చెప్పాడు. మొత్తానికి ఆర్కే పాయింట్ టు పాయింట్ కౌంటర్ ఇచ్చాడు. అతి మంచితనం పనికి రాదని చెప్పాడు. అతి మంచితనం ఉంటే ప్రాబ్లమ్ ఏంటని అడిగాడు. నెక్ట్స్ త్రిగుణ్ వచ్చి సుధీర్‌ను నామినేట్ చేశాడు. కెప్టెన్‌గా ఉన్నప్పుడు మంచివాడివి అనిపించుకోవాలని చేసిన కొన్ని పనులు తనకు నచ్చలేదని చెప్పాడు. రోహిత్ పప్పు తీసిన విషయం.. టాస్క్‌లో కుటుంబంపై ఒట్టు వేయడం తప్పని చెప్పాడు. డబుల్ స్టాండర్డ్స్ అని త్రిగుణ్ చెప్పాడు. ప్రతి దానికి ఫ్యామిలీని అడ్డుపెట్టుకుని గేమ్ ఆడుతున్నావని.. అది కరెక్ట్ కాదని చెప్పాడు. తను అన్‌ప్రిడిక్టబుల్, మ్యానిప్యులేటివ్ అని త్రిగుణ్ చెప్పుకుంటాడని తనకు అసలు ఎప్పుడూ నచ్చడని సుధీర్ చెప్పాడు. హౌస్‌లోకి ఎవరు వచ్చినా కూడా త్రిగుణ్‌ను నమ్మవద్దని చెబుతానని చెప్పాడు. ‘నువ్వు కెప్టెన్ అవడం వర్షిణికి నచ్చలేదు’ అని త్రిగుణ్ చెప్పాడని చెప్పాడు. తనను, ఝాన్సీని ముఖేష్, వర్షిణి కేవలం ఆమ్లెట్లు, ఇంకా ఇతర విషయాల కోసం వాడుకుంటున్నారని తమకు చెప్పాడని సుధీర్ చెప్పాడు. ఎప్పుడూ ఎవడికో ఒకడికి దెబ్బేయాలని చూస్తుంటాడని అన్నాడు.

ఆడియెన్స్‌కు కూడా త్రిగుణ్ ఈ హౌస్‌కి కరెక్ట్ కాదని ఇలాంటి వ్యక్తిని హౌస్‌లో ఉంచవద్దని సుధీర్ చెప్పాడు. ఈ సందర్భంగా త్రిగుణ్ చాలా ఓవర్ యాక్షన్ చేశఆడు. నీ గుట్టు బయటపడుతుందని భయపడుతున్నావా? అని అడిగాడు. నీకు ఇస్తా ఉండు ఇప్పుడు కౌంటర్ అని త్రిగుణ్ చెప్పాడు. దేబ్జాని, నరేష్, శాలిని ముగ్గురూ ఉన్నారని.. వాళ్లు ఆడదామనుకున్నారని చెప్పాడు. శాలిని వెళ్లాలని అనుకుందని.. కానీ శాలినిని ఇప్పుడు వెళ్లనిద్దామని కెప్టెన్సీ టాస్క్ తను ఆడతానని చెప్పిందట. మరి దీనిలో నరేష్ పాత్రేంటని రోహిత్ అడిగాడు. ఈ ప్రపోజల్ నరేష్ పెట్టాడని చెప్పింది. శాలిని వెళితే ఇప్పుడు డూ ఆర్ డై ఉంటుందని.. ఏమైనా ప్రాబ్లమ్ అవుతదని.. దేబ్జాని వెళతానంటే వద్దని.. శాలినిని గేమ్‌కు పంపిద్దామని చెప్పాడట. మొత్తానికి సుధీర్ స్నేక్ అని త్రిగుణ్ చెప్పాడు. మనిషి అంత ఉన్నాడు కానీ చేసేదంతా చిన్న చిన్న పనులు అని సుధీర్‌ని త్రిగుణ్ అన్నాడు. మొత్తానికి ఈ నామినేషన్‌తో మొన్నటి టాస్క్‌లో దేబ్జాని, నరేష్ పాత్రేమీ లేదని అంతా అనుకున్నారు కానీ వారి పాత్ర కూడా ఉందని అర్థమైంది. మొత్తానికి నిన్నటి రోహిత్ నామినేషన్‌తో సగం నిజం బయటకు వస్తే.. ఇవాళ త్రిగుణ్ నామినేషన్‌తో కలుగులోని ఎలుకలన్నీ బయటకు వచ్చాయి.

నెక్ట్స్ రామకృష్ణ వచ్చేసి ఝాన్సీని నామినేట్ చేశాడు. అగ్నిపరీక్షలో చాలా కష్టపడి ఆడి అవకాశం దక్కించుకున్నావని.. కానీ హౌస్‌లో ఫౌల్ గేమ్స్ ఆడావని చెప్పాడు. ఎవరితో కలవవని.. హౌస్‌లో నవ్వింది తక్కువని.. ఏడుస్తూ సింపతీ కోసం ట్రై చేస్తూ ఉంటావని చెప్పాడు. ‘నువ్వు దేనికి రియాక్ట్ అవ్వాలో దేనికి అవకూడదో నీకు తెలియదు’ అని ఝాన్సీ చెప్పింది. డీల్ పెట్టుకున్నావని రామకృష్ణ చెప్పాడు. ఎమోషనల్ అనేది ఎవరి పర్సనల్ వాళ్లదని ఝాన్సీ చెప్పింది. కెప్టెన్ రూంలోకి వెళ్లి ఏడ్చాననే రూల్ నీకు లేదని ఝాన్సీ చెప్పింది. మరి తన ఎమోషన్ తనదని చెప్పింది. మధ్యలో సుధీర్ వస్తే.. నువ్వాగన్నా ప్రామిస్ చేసి తప్పు చేస్తావని చెప్పాడు. మాట మీద నిలబడనోడివి నీతో నాకేంటని సుధీర్‌ని రామకృష్ణ అన్నాడు. త్రిగుణ్ ఎంతో మందితో గొడవ పడతాడని కానీ ఆయనెప్పుడూ ఎవరి కాళ్లూ మొక్కలేదని చెప్పింది. నువ్వక్కడున్న ఆర్కే ఇక్కడ లేవని చెప్పడంతో.. డూప్లికేట్ ఎవరైనా ఉన్నారా? అని ఆర్కే కౌంటర్ ఇచ్చాడు. సుధీర్, ఝాన్సీలను ఏకకాలంలో ఆర్కే ఒకాట ఆడుకున్నాడు. తరువాత దేబ్జాని నామనేషన్.. శ్వేతను నామినేట్ చేసింది. శ్వేత గురించి తాను చాలా విన్నానని కానీ మడ్ టాస్క్‌ను పక్కనబెడితే ఓవరాల్‌గా చూస్తే ఆమె ఒపీనియన్ కానీ గేమ్ కానీ కనిపించడం లేదని చెప్పింది. ఇంట్లో ఉండాలంటే ప్రతిదీ ఎక్స్‌పీరియన్స్ చేయాలని చెప్పి నామినేట్ చేసింది. తను ప్రతి చోటా తన పాయింట్ తాను పెట్టానని శ్వేత చెప్పింది. మీరే తమను మ్యానిప్యులేట్ చేస్తున్నారని చెప్పింది. నామినేషన్ వచ్చినప్పుడు తన పాయింట్స్ తాను స్ట్రెయిట్‌గా పెడుతున్నానని తను ఎక్కడ కనిపించలేదని శ్వేత అడిగింది. మీ గ్రూప్‌లోని వారంతా తనకు సేఫ్ ప్లేయర్ ఇచ్చారని.. శ్వేత సేఫ్ ప్లేయర్ అని చెప్పింది.

నరేష్.. దేబ్జాని గురించి సుధీర్, వర్షిణి, ఝాన్సీలకు తను చేసింది వేరని.. కానీ ప్లాన్ తెచ్చిందే తనని చెప్పడమేంటని అన్నాడు. దేబ్జానికి మంచి చేయాలనుకోవడం కూడా తప్పని నరేష్ చెప్పాడు. దేబ్జానితో చాలా సార్లు రామ్ ప్రసాద్ తర్వాత నువ్వేనని ఎన్నో సార్లు చెప్పానని కానీ దేబ్జానికి అది లేదని ఆ విషయం తనకు అర్థమైందని రామ్ ప్రసాద్‌తో నరేష్ చెప్పాడు. మొత్తానికి తను చేయదానికి దేబ్జాని తనను ఇరికించిందని బాగా నరేష్ ఫీలయ్యాడు. ముఖేష్ వచ్చేసి వంశీని నామినేట్ చేశాడు. ఫస్ట్ సేవ్ చేసే అవకాశం తనకు వచ్చిందని చెప్పాడు. తనను మాత్రమే కాదు.. వర్షిణి, తనను కలిపి సేవ్ చేశావని వంశీ చెప్పాడు. వంశీకి గ్రాటిట్యూడ్ అనేదే లేదని చెప్పాడు. తనకు సమయం వచ్చినప్పుడు మనసులో పెట్టుకుంటానని చెప్పావని వంశీని అన్నాడు. త్రిగుణ్ కూడా ఒక్క రాడ్ కూడా తీయలేదని.. కానీ మీకు ఆ సిట్యువేషన్ వచ్చినప్పుడు తన రాడ్ తీయడం తనకు సరిగా అనిపించలేదని ముఖేష్ చెప్పాడు. నీపై ఏదో ఉంచుకుని అలా చేయలేదని వంశీ చెప్పాడు. బెల్ కొట్టలేదని అంటున్నావు కదా.. ఫస్ట్ తను చేసిందే అదని చెప్పాడు. బెల్ కొట్టింది వంశీ కాదని త్రిగుణ్ అని చెప్పాడు. తను కాదు వంశీ బెల్ కొట్టాడని త్రిగుణ్ చెప్పాడు. ఆ టాస్క్‌లో బెల్‌తో పని లేదని శివ్ కూడా వచ్చి చెప్పాడు. అక్కడ బెల్ కొట్టడం కాదు ప్రక్రియ అని త్రిగుణ్ చెప్పాడు. మొత్తానికి ముఖేష్‌కు ఆ టాస్కే అర్థం కాలేదు.

నెక్ట్స్ రామ్ ప్రసాద్‌ను తన కెప్టెన్ పవర్ ఉపయోగించి నామినేట్ అవని వారిలో ఒకరిని సరైన పాయింట్స్ చెప్పి నామనేట్ చేయమని బిగ్‌బాస్ చెప్పారు. అప్పుడు శ్వేత ఫేర్ డెసిషన్ తీసుకుంటావని అనుకున్నానని చెప్పింది. నామినేషన్ పాయింట్ చెప్పాక ఫెయిరో కాదో చెప్పమని రామ్ ప్రసాద్ అన్నాడు. అమన్‌ను కేవలం నామినేషన్ పాయింట్స్ డిస్కస్ చేసి పెడుతున్నావని.. అలా చేయవద్దని ఇదే తన నామినేషన్ పాయింట్ అని రామ్ ప్రసాద్ చెప్పాడు. మొత్తానికి రామ్ ప్రసాద్ అమన్‌ను నామినేట్ చేశాడు. దక్షి, వర్షిణి, రోహిత్, సుధీర్, త్రిగుణ్, నీతూ, రామకృష్ణ, శివ, ఝాన్సీ, శ్వేత, వంశీ, అమన్ నామినేట్ అయ్యారు. రామ్ ప్రసాద్ అనగానే అమన్ రెడీ అవ్వురా అని అన్నానని రోహిత్ చెప్పాడు. దేబ్జాని, నరేష్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ నామినేట్ చేయనని చెప్పాడు. నీకేదైనా ఫేవర్ చెయ్యాల్సి వస్తే తప్పక చేస్తానని చెప్పాడు. షాలినికి సీక్రెట్ రూంలో సమయం పూర్తైందని హౌస్‌లోకి వెళ్లాలని చెప్పాడు. దీంతో షో ముగిసింది.

Telugu Cinema 360

Recent Posts

Biggboss10 Telugu: హౌస్‌లోకి షాలిని ఎంట్రీ.. ఈ వారం ముప్పు ఆ ఇద్దరికే..

బిగ్‌బాస్ హౌస్‌లోకి షాలిని ఎంట్రీ ఇచ్చింది. ఆమెను డ్రమెటిక్‌గా హౌస్‌లోకి ప్రవేశ పెట్టారు. త్రిగుణ్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచారు. అక్కడ…

2 minutes ago

సో కాల్డ్ వారసులను అడిగే దమ్ముందా.. బ్యాగ్రౌండ్ లేని కుర్రాళ్లేనా టార్గెట్..?

టాలీవుడ్‌లో ఎవరైనా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కేవలం తమ స్వయంకృషితో, టాలెంట్ తో పైకి వస్తుంటే వారిని ఎంకరేజ్…

24 minutes ago

కుర్రాడు సక్సెస్ అవుతాడా.. దొంగ నా కొడుకుతో మౌళి ఫ్యూచర్ ఏంటి..?

టాలీవుడ్ లో ప్రస్తుతం యూత్ ఫుల్ కంటెంట్ తో వస్తున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలకు ఆడియన్స్ నుంచి మంచి…

27 minutes ago

దసరాకు పట్టించుకోరా.. విజయదశమి కనీసం కళ్లకు కనిపించలేదా మన హీరోలకు..?

సాధారణంగా దసరా లాంటి పెద్ద పండుగ వస్తుందంటే చాలు.. థియేటర్లలో సినిమాల పండగ ఎలా ఉంటుందో, సోషల్ మీడియాలో కూడా…

31 minutes ago

అన్నీ చెప్పిన రాజమౌళి ఆ ఒక్కటి తప్ప.. వారణాసి కథేంటో తెలుసా..?

దర్శక ధీరుడు రాజమౌళి పేరు చెబితేనే ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక బ్రాండ్ లా మారిపోయింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా…

23 hours ago

దీపిక పదుకొనే, రణ్‌వీర్ సింగ్ రెండో కూతురు పేరు తెలుసా..?

బాలీవుడ్ క్యూట్ కపుల్, అభిమానులందరూ ముద్దుగా పిలుచుకునే 'దీప్ వీర్' జోడీ తమ పర్సనల్ లైఫ్ లో హ్యాపీ మూవెంట్స్…

24 hours ago