నాగ్ ఎంట్రీ సమయంలో చాలా కూల్‌గానే కనిపించారు. శుక్రవారం ఏం జరిగిందో చూశారు. రోహిత్, చరణ్ ఇద్దరూ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకున్నారు. వైల్డ్ కార్డ్స్ చేతిలో పెట్టారు కాబట్టి అది ఎలా పోతుందో తెలియదని చరణ్ అన్నాడు. రోహిత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. డామినేషన్ వీక్‌లో కంప్లీట్‌గా తన హార్ట్ షట్ డౌన్ అయిపోయిందని చరణ్‌కు షాలిని గురించి రోహిత్ చెప్పాడు. ఆమె గురించి రోహిత్ ఏడవడం ఏంటో.. తన గురించి ఏడ్చినా కాస్త బాగుండేది. రోహిత్ విన్నర్ రేసు నుంచి అవుట్ అయిపోయినట్టే. ఇక నాగ్ చాలా సీరియస్‌గా హౌస్‌మేట్స్ ముందుకు వెళ్లారు. షాలినిని కన్ఫెషన్ రూమ్‌కి పిలిచారు. సెలబ్రిటీలంతా అనుకుని మిమ్మల్ని నామినేట్ చేశారా? అంటే షాలిని అవునని చెప్పింది. అప్పుడు కామనర్స్ అంతా నామినేషన్స్ గురించి చర్చించుకుంటున్న వీడియోను నాగ్ ప్లే చేశారు. దీని సంగతేంటని షాలినిని నాగ్ అడిగారు. లాస్ట్ వీక్ చెప్పిన తర్వాత అంతా ఆపేశారని.. మీరందరూ ఎందుకు మారలేదన్నారు. ‘నువ్వు లూప్‌లోకి వెళితే పర్వాలేదని.. నువ్వే అందరినీ ఆ లూప్‌లోకి లాగుతున్నావు’ అని నాగ్ చెప్పారు. రామ్ ప్రసాద్ పదే పదే అలియెన్స్ అనే మాట అంటున్నాడని చెప్పింది. ‘నువ్వు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతావా? లేదా?’ అని నాగ్ అడిగారు. షాలిని సారీ చెప్పి వెళ్లిపోయింది.
నెక్ట్స్ అపూర్వను ‘అరుపూర్వ’ అని నాగ్ పిలిచారు. అరవడం తగ్గించుకోవచ్చుగా అని అడిగారు. తను సరదాగా చేసిన వాటిని సీరియస్ చేయడంతో తను అలా అరవాల్సి వచ్చిందని అపూర్వ చెప్పింది. ‘నువ్వు, చరణ్ కలిసి చాలా బాగా ఆడారు. కానీ టాప్ పొజిషన్ నుంచి ఎక్కడికి పడిపోయారు?’ అని నాగ్ అడిగారు. ఆ తరువాత ఓ వీడియో ప్లే చేశారు. తను గేమ్‌ను తప్పుగా అర్థం చేసుకున్నానని అపూర్వ చెప్పింది. మరో క్లిప్ కూడా నాగ్ చూపించారు. రామ్ ప్రసాద్ ఎఫ్‌ఐఆర్ అంటే ఎఫైర్ అని అర్థం చేసుకున్న వీడియోను చూపించారు. రామ్ ప్రసాద్ తనను పెళ్లి చేసుకోవడానికి వచ్చావా? అని అన్నారని అందుకే ఆయన మాటలు తనకు తప్పుగా అర్థమయ్యాయని అన్నారు. రోహిత్, షాలిని మధ్యలోకి రావొద్దని ఎన్నోసార్లు షాలిని చెప్పినా వినకుండా ఎందుకు వెళుతున్నావని అపూర్వను నాగ్ అడిగారు. గొంతుంది కదాని అరవొద్దని చెప్పారు. అపూర్వ అందరికీ అప్పాలజీ చెప్పింది. నెక్ట్స్ త్రిగుణ్‌ను లేపి.. అపూర్వపై పాట కంపోజ్ చేశావని దాని కారణంగా ఆమె ఎనర్జీ తగ్గిందన్నారు. ఎనర్జీ పెంచేలా పొగుడుతూ పాట కంపోజ్ చేయమని నాగ్ అడిగితే.. పొగడ్తలనేవి లేకుండా త్రిగుణ్ పాడారు. మళ్లీ పాడమన్నా కూడా త్రిగుణ్ అలాగే పాడారు. పొగడాలంటే చరణ్ మాత్రమే పొగుడుతానని చెప్పారు. చరణ్ కూడా అంతంత మాత్రంగానే చెప్పాడు. నరేష్‌ను లేపి.. దేబ్జానిని చరణ్ పొగిడినప్పుడు అక్కడే ఉన్నావని.. దానిలో సగమైనా చెప్పాడా? అని నాగ్ అడిగారు.
‘నిన్ను పొగడాలంటే రోహిత్ మాత్రమే పొగుడుతాడు. షాలిని పర్మిషన్ తీసుకుని పొగడు’ అని నాగ్ చెప్పారు. ఆ తరువాత అమన్‌ను లేపి ‘ఆట బాగా ఆడావని.. ఆటలో నువ్వుంటే ఆట కూడా నిన్నే చూస్తుంది. అంత బాగా ఆడావు’ అని నాగ్ బూస్ట్ ఇచ్చారు. అమన్ మాట్లాడిన ‘నీయమ్మ’ గురించి నాగ్ అడిగారు. తను ఆ మాట మాట్లాడలేదని అమన్ చెబితే నాగ్.. వీడియో చూపించారు. సుధీర్‌ను మధ్యలోకి ‘నువ్వెందుకు వచ్చావు’ అని నాగ్ అడిగాడు. అనడం తాను విన్నానని సుధీర్ చెప్పాడు. అప్పుడు వీడియో ప్లే చేశారు. అది మాటల్లో భాగంగా వచ్చిన వీడియోనే. అది తెలంగాణలో కామన్ వర్డ్. దానిని తీసుకొచ్చి నాగ్ ప్రశ్నించడం దారుణం. ఆట చాలా బాగుంది. మాట మారితే ఇంకా బాగుంటుందని నాగ్ చెప్పారు. అమన్ సారీ చెబితే అది తన అమ్మకు చెప్పాలని ముఖేష్ అన్నాడు. వర్షిణిని లేపి కెప్టెన్సీ గురించి అడిగారు. అపూర్వను ఆమె కెప్టెన్సీ గురించి అడగడంతో ఆమె కెప్టెన్సీలోని కొన్ని లోపాలను ఆమె చెప్పింది. కొన్ని డిపార్ట్‌మెంట్స్‌లో వర్క్ అవలేదని అపూర్వ చెప్పింది. రోహిత్, షాలిని వాష్‌రూమ్స్ సరిగా క్లీన్ చేయలేదని చెప్పింది. ‘నీ మంచితనం కారణంగా మిగిలిన వాళ్లంతా ఎందుకు సఫర్ అవ్వాలి’ అని నాగ్ వర్షిణిని అడిగారు. వర్షిణి మంచితనమట. ఓ అవార్డు ఇస్తే పోయేది. తను చెప్పిన తర్వాత వెళ్లి క్లీన్ చేశారని వర్షిణి చెప్పింది. అంతకు ముందుతో పోలిస్తే క్లీన్ లేదని దేబ్జాని చెప్పింది. రోహిత్ తనకు ఇంట్లో పనులు నేర్చించలేదని చెప్పాడని చెప్పింది. బాత్రూం క్లీనింగ్ కూడా నేర్పిస్తారా? అని నాగ్ అవాక్కయ్యారు.
రోహిత్‌ను లేపి కెప్టెన్సీ విషయంలో ఆమె రేంజ్ ఏంటని నాగ్ అడిగితే.. బాగుందని చెప్పాడు. చాలా బాగా ఆడుతున్నావని.. మంచిగా ఉంటున్నావని నాగ్ కితాబు ఇచ్చారు. ఇక ఝాన్సీని లేపి పల్లెటూరి వాళ్లు చాలా మంచి మనసుతో ఉంటారని.. మరి నువ్వెందుకు మోసం చేశావని అడిగారు. మీ అన్న ఏమైనా వీకా? అని నాగ్ అడిగారు. వీడియో చూసే వరకూ నీ గురించి మంచిగా అనుకున్నానని.. నువ్విలా చేస్తావని అనుకోలేదని నాగ్ అన్నారు. ఆట గెలవడం ఎంత ఇంపార్టెంటో.. ఫెయిర్‌గా ఆడటం కూడా అంతే మంచిదని చెప్పారు. ఇకపై తప్పు చేయనని.. న్యాయంగా ఉంటానని.. న్యాయంగా ఆడతానని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ‘నువ్వాడిన పద్ధతి కరెక్ట్ కాదు కాబట్టే మీరు గెలవలేదు’ అని నాగ్ చెప్పారు. నరేష్ బొమ్మల టాస్క్‌లో ఎలా గీశావో తెలుసా అని అడిగారు. నరేష్‌ను బాగా ఆడుతున్నాడని నాగ్ చెప్పారు. చరణ్‌ను ఎందుకు నామినేట్ చేశావని నాగ్ అడిగారు. ముందుగా అపూర్వను అనుకున్నానని తరువాత తన డెసిషన్ మార్చుకున్నట్టుగా చెప్పాడు. రోహిత్ అందరి కంటే ‘నీ బెస్ట్ ఫ్రెండ్’ అని నాగ్ చెప్పారు. అందుకే నిన్ను నామినేట్ చేశాడని చెప్పారు. తరువాత రామ్ ప్రసాద్‌ను లేపి పవిత్రమైన పెళ్లి గురించి మాట్లాడుకుందామా? ఏంటి గొడవ అని అడిగారు. గొడవేం లేదని తనతో ఎవరైనా అబ్బాయిని చూడు రామన్న అని చెప్పిందని చెప్పాడు. నామినేషన్స్‌లో సీరియస్‌గా తను అడిగింది పవిత్రమైన పెళ్లి కోసమని చెప్పిందని రామ్ ప్రసాద్ చెప్పాడు. అపూర్వ గొంతు పెద్దది కాబట్టి ప్రతిదీ మీకు సీరియస్‌గానే అనిపిస్తోందని నాగ్ చెప్పారు. సుధర్ పేరు వచ్చిందని.. దీంతో తామంతా సీరియస్ అనుకున్నట్టుగా రామ్ ప్రసాద్ చెప్పాడు. అపూర్వను లేపి అడిగితే తాను సరదాగానే అన్నానని చెప్పింది. తను లవ్ కంటెంట్ కోసం రాలేదని చెప్పింది. షాలిని లేచి రోహిత్‌తో తనది బాగోలేదని చెప్పిందని.. తను లవ్ కంటెంట్ కోసం రాలేదనడం కరెక్ట్ కాదని చెప్పింది. షాలిని, అపూర్వ మధ్య గొడవ కూడా కరెక్ట్‌గా లేదన్నారు.
షాలిని చీప్‌గా అనడం కరెక్ట్‌గా లేదన్నారు. రోహిత్, షాలిని, అపూర్వల గొడవను మా వరకూ తీసుకు రావొద్దని నాగ్ చెప్పారు. రామ్ ప్రసాద్‌కు పంచ్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండమని నాగ్ చెప్పారు. ఇక బాగా ఆడావని రామ్ ప్రసాద్‌పై నాగ్ ప్రశంసలు కురిపించారు. చరణ్‌ను లేపి తెలుగు బాగా మాట్లాడతావు కదాని అడిగారు. అంతా మెస్మరైజ్ అయ్యారని.. మరి ఆట కూడా అంతే బాగా ఆడొచ్చు కదాని నాగ్ అడిగారు. ఆటలో సపోర్టింగ్ రోల్ మాత్రమే చేస్తున్నావని నాగ్ చెప్పారు ఫ్లర్టింగ్ ఎంత బాగా చేస్తావో ఆట అలాగే ఆడమని నాగ్ చెప్పారు. ఫ్లర్టింగ్ నీకు వెన్నతో పెట్టిన విద్యా? అని నాగ్ అడిగారు. మన అనుకుంటే అంతే చెబుతానని చరణ్ చెప్పాడు. ఇక ఈవారం క్రాస్ ఉన్న ముద్ర వచ్చింది. ఐదు వారాల ఆటలో హౌస్‌లో ఉండేందుకు అన్‌వర్తీ అనుకుంటున్నారో నాగ్ చెప్పమన్నారు. ముందుగా దేబ్జాని రోహిత్‌కు ముద్ర వేసి అతని ఆట అందరికీ హామ్‌ఫుల్ అనిపించిందని చెప్పింది. అసలు ఈవారం రోహిత్ ఆట ఏం ఆడాడని నీకు ఆట కనిపించిందని దేబ్జానిని నాగ్ అడిగారు. ఈ వారం కాదు.. ఐదు వారాల ఆట చూసి చెప్పినట్టుగా దేబ్జాని చెప్పింది. నెక్ట్స్ త్రిగుణ్‌కు అన్‌వర్తీ అని ముద్ర వేసింది. ఆటలో గెలిచేందుకు ఎంత వరకైనా త్రిగుణ్ వెళతాడని చెప్పింది. హౌస్‌లో హార్మోని చెడగొడతాడని చెప్పింది. ముఖేష్ వచ్చేసి రోహిత్‌కు అన్‌వర్తీ అని ముద్ర వేశాడు. స్టార్టింగ్ నుంచి తప్పు చేస్తాడని.. అగ్రెషన్ చూపిస్తాడని ముఖేష్ చెప్పాడు. లాస్ట్ వీక్ మీరు చెప్పినట్టుగా బిగ్‌బాస్ గురించి అలా మాట్లాడటం కరెక్ట్ కాదనిపించిందని చెప్పాడు.
వంశీ వచ్చేసి రోహిత్‌కు ముద్ర వేశాడు. ఈ హౌస్‌లో ఉండాలంటే.. బిహేవియర్, ఆట బాగా ఆడాలి. ఇచ్చిన పనిని సరిగా చేయాలని చెప్పాడు. అవి రోహిత్ చేయడని అందుకే అతను హౌస్‌లో ఉండేందుకు అర్హుడు కాడని వంశీ చెప్పాడు. షాలిని వచ్చేసి దేబ్జానిని అన్‌వర్తీ అని చెప్పింది. ఆమెను మాటలు జారవద్దని ఎన్ని సార్లు చెప్పినా పదే పదే అదే చేస్తోందని చెప్పింది. అపూర్వను మీరెవరూ గేమ్‌లో పెట్టుకోలేదని.. అపూర్వ ఆడి టాప్‌లో నిలిచిందని అలా ఉండాలన్నట్టుగా నాగ్ చెప్పారు. తను దేబ్జానిని సెల్ఫిష్ అని ఎందుకు అనాల్సి వచ్చిందో చెప్పింది. సెల్ఫిష్ పెద్దదా? చీప్ పెద్దదా? అని నాగ్ అడిగారు. తను చీప్ అనలేదని చెప్పింది. షాలిని మాట్లాడిన మాటల వీడియోను నాగ్ చూపించారు. తన యాక్షన్స్ ఎలా ఉన్నాయో.. తను మాట్లాడే తీరు కూడా అలాగే ఉందని షాలిని చెప్పింది. తనను బ్యాక్ బిచ్చింగ్ స్టార్ అన్నదని.. తనకొక లేబుల్ ఇవ్వడానికి ట్రై చేసిందని షాలిని చెప్పింది. ఇన్ని కారణాలుంటే అపూర్వను కదా అన్‌వర్తీ అనాల్సింది. దేబ్జానిని ఎందుకు చేశావని షాలినిని అడిగారు. నెగిటివ్ థాట్స్‌ను పక్కనబెట్టేయమని నాగ్ చెప్పారు. చరణ్ వచ్చేసి ముఖేష్‌ను అన్‌వర్తీ అని చెప్పాడు. మాటలు జారుతుంటాడని అందుకే అతను అన్‌వర్తీ అని చెప్పాడు. చరణ్‌ను రామ్ ప్రసాద్ అన్‌వర్తీ చెప్పాడు. అమన్ వచ్చేసి వర్షిణికి అన్‌వర్తీ అని ముద్ర వేశాడు. తన ఆట తనకు కనిపించలేదని చెప్పాడు. ఏమైనా అంటే ఇది పర్సనాలిటీ షో అని చెబుతున్నాడని చెప్పింది. ఝాన్సీ చరణ్‌ను అన్‌వర్తీ అని చెప్పింది.
రోహిత్ వచ్చేసి వంశీకి అన్‌వర్తీ అని చెప్పాడు. పొటెన్షియల్ కంటెండర్స్ హౌస్‌లో ఉండాలని చెప్పాడు. వంశీని లేపి ‘ఈవారం నీ గేమ్‌కు నువ్వు ఎన్ని మార్కులు ఇచ్చుకుంటావు?’ అని అడిగితే 6 అని చెప్పాడు. ఫుడ్ వేస్టేజ్ గురించి మాట్లాడుతున్నావు కదా.. ‘నీకు సమస్య ఎవరితో ఉంటే వారికే చెప్పు’ అని నాగ్ చెప్పారు. సుధీర్ వచ్చేసి రోహిత్‌ను అన్‌వర్తీ చెప్పాడు. రోహిత్‌ను తాను బాగా ఊహించుకున్నానని ఇక్కడ అంతా రివర్స్ అవుతోందన్నట్టుగా చెప్పాడు. ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ థింకింగ్ ఎక్కువైందని సుధీర్ చెప్పాడు. ఈవారం నీ మాటల్లో పదును పెరిగిందని సుధీర్‌పై నాగ్ ప్రశంసలు కురిపించారు. రోహిత్‌ను లేపి సుధీర్ మాటలే చెబుతున్నానని.. మేలుకో రాజా మేలుకో అని నాగ్ చెప్పారు. నరేష్ వచ్చేసి చరణ్‌ను అన్‌వర్తీ అని చెప్పాడు. నెక్ట్స్ త్రిగుణ్ వంతు. అతనొచ్చేసి అపూర్వను అన్‌వర్తీ అని చెప్పి ముద్ర వేశాడు. ఒకరి ఫ్యామిలీ గురించి మాట్లాడకూడదన్న సెన్స్ లేవన్నట్టుగా చెప్పాడు. తన కూతురి వయసు 13 నెలలని తన గురించి మాట్లాడటం తనకు ఇష్టం లేదని త్రిగుణ్ చెప్పాడు. తను ఏ తప్పు చేసినా ఉరికి కూడా సిద్ధమేనని కానీ తన ఫ్యామిలీని లాగడం తనకు ఇష్టం లేదని చెప్పాడు.
ఎప్పుడు నామినేషన్ వచ్చినా సరే.. సింపతితో స్టార్ట్ చేసేది త్రిగుణేనని అపూర్వ చెప్పింది. తన లిప్స్ గురించి మాట్లాడటం వేరొకరి దగ్గర సరికాదని అపూర్వ అనడంతో ‘నీ ఫ్యామిలీ గురించి మాట్లాడాడా?’ అని నాగ్ రెట్టించి మరీ అడిగారు. ‘ఇంట్లో ఆడవాళ్లున్నారు సర్.. ఎవరితోనైనా తప్పుగా ప్రవర్తించి ఉంటే చెప్పమనండి’ అని త్రిగుణ్ అడిగాడు. ‘నీ నడుము గురించి నేరుగా నీతోనే అడిగాడా?’ అని నాగ్ అడిగారు. దానికి అపూర్వ తన ముందే అన్నాడని చెప్పింది. తన లిప్స్ గురించి చరణ్ దగ్గర మాట్లాడాడని అపూర్వ చెప్పింది. చరణ్ కూడా అది అన్నాడని త్రిగున్ అన్నాడు. మిక్కీ మౌస్ అపూర్వ అంటే నీకు డెరిగేటరీగా అనిపించిందా? అని నాగ్ అడిగారు. ‘నీకు మిక్కీ మౌస్ అని పేరు పెట్టానని ఎవరు చెప్పారు’ అని నాగ్ అడిగారు. నామినేషన్ సమయంలో ఇదంతా జరిగిందని తనకు రోహిత్ చెప్పాడని చివరకు చెప్పింది. తను ఈ టాపిక్‌ను డ్రాగ్ చేయడం తనకు ఇష్టం లేదని అపూర్వ కన్నీళ్లు పెట్టుకుంది. అందరి ముందు తన గురించి మాట్లాడవద్దని చెప్పినా కూడా వినకుండా తన నడుము గురించి మాట్లాడాడని అపూర్వ చెప్పింది. అవతలి మనిషి తన మాటల కారణంగా హర్ట్ అవుతున్నప్పుడు మాట్లాడవద్దని త్రిగున్‌కు నాగ్ చెప్పాడు. తను అప్పాలజీ చెప్పినా కూడా దానిని పదే పదే వాడుతోందని త్రిగుణ్ చెప్పాడు. అపూర్వ, త్రిగుణ్ ఒకరికొకరు సారీ చెప్పుకున్నారు. కన్నీళ్లను ఆయుధంగా వాడొద్దని త్రిగుణ్ అనడంతో.. నాగ్ అలా అనడం కరెక్ట్ కాదన్నారు. అపూర్వవి మొసలి కన్నీరనడంతో నాగ్ అలా అనవద్దని కన్నీళ్లను డిసైడ్ చేయడానికి నువ్వెవరని అడిగారు.
వర్షిణి.. రోహిత్‌ను అన్‌వర్తీ అని చెప్పి ఈ ఇంట్లో ఉండటానికి అతను అర్హుడు కాడని.. హ్యుమానిటీ అనేది లేదని వర్షిణి చెప్పింది. హ్యుమానిటి గురించి వర్షిణి మాట్లాడటం వింతగా అనిపించింది. రోహిత్ మాట్లాడుతూ… ‘అంతా తనను హ్యుమానిటీ అంటున్నారు. తను ఏ వ్యక్తి గురించి చెత్తగా మాట్లాడలేదని.. క్యారెక్టర్ అసాసినేషన్ చేయలేదు. నన్ను ఇష్టానుసారంగా అవమానించారు. అలాంటి వాళ్లను వదిలేసి నన్ను ఇంట్లో ఉండేందుకు అర్హుడు కాదనడం ఏంటి?’ అని రోహిత్ అడిగాడు. హౌస్‌లో ఉన్నవారి గురించి మనసు గెలుచుకోవడమే గేమ్ అని నాగ్ చెప్పారు. ‘నీ గేమ్‌కు ఎన్ని మార్కులు వేసుకుంటావు? నీ పనులకు ఎన్ని మార్కులు వేసుకుంటావు? బిగ్‌బాస్ ఎన్నిసార్లు వార్న్ చేశారు?’ దానికి వేసుకున్న మార్కులను చూసి అదెలాగని నాగ్ అడిగారు. ‘నీ గేమ్‌కు వంద కాదు.. 200 మార్కులు వేస్తానని నాగ్ చెప్పారు. రోహిత్‌కు ఆడియెన్స్‌లో ఒకావిడ మాట్లాడుతూ.. ‘రోహిత్ గేమ్ అంటే చాలా ఇష్టం. కానీ షాలిని కారణంగా నీ గేమ్ పోతోందని నాకు అనిపిస్తోంది’ అని నేరుగా చెప్పేసింది. ఆమె అంతలా చెప్పిన తర్వాత కూడా రోహిత్ వెళ్లి షాలిని పక్కన కూర్చొని ఓదార్పు యాత్ర చేపట్టడం దారుణం. ‘నేను ఇకపై అడ్డు రాను’ అని షాలిని చెప్పింది. నువ్వు అడ్డు వస్తున్నావని ఎవరు చెప్పారని రోహిత్ అడిగాడు. రోహిత్ అర్ధం చేసుకునేలా లేడు. ఇక రోహిత్‌ను బిగ్‌బాస్ కూడా కాపాడలేడు. షాలిని తనకు చార్జింగ్ పాయింట్ అని చెప్పాడు. మొత్తానికి రోహిత్ అయితే వినే పరిస్థితి లేదు. తనను మార్చుకునేలా లేడు. ఫోన్‌పే నుంచి గోల్డ్ కాయిన్స్ వస్తే.. సుధీర్.. ఒకటి వంశీకి.. రెండోది దేబ్జానికి ఇచ్చాడు.
రామ్ ప్రసాద్ ‘మీ ఇద్దరు ఎందుకు డిస్టెన్సన్ మెయిన్‌టైన్ చేస్తున్నారు?’ అని అడిగాడు. రామ్ ప్రసాద్ మోటివేట్ చేశాడు. ‘షాలిని కారణంగా నీ గేమ్ మారడం లేదని నిరూపించాలి’ అని చెప్పాడు. వీళ్లిద్దరూ విడిపోదామన్నా రామ్ ప్రసాద్ విడిపోనిచ్చేలా లేడు. ఆ తరువాత ప్రమోషనల్ టాస్క్ జరిగింది. రేపే వైల్డ్ ఫైర్ వచ్చేస్తున్నారని నాగ్ చెప్పారు. దీంతో షో ముగిసింది. మొత్తానికి ఈవారం కూడా నాగ్.. సెలబ్రిటీలు ఏ తప్పులూ చేయనట్టుగా వారిపై పూలు కురిపించి.. కామనర్స్ అందరిపై రాళ్లేసి వెళ్లారు. రోహిత్‌కు మాత్రం ఇన్‌డైరెక్ట్‌గా చాలా యూజ్‌ఫుల్ విషయాలు చెప్పారు. కానీ వాటిని రోహిత్ తీసుకునే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదు. ఇక రోహిత్ హౌస్‌లో ఉండటం కష్టమే. షాలిని బయటకు వెళితే తప్ప అతని ఆట తీరు మారే అవకాశమే కనిపించడం లేదు.
టాలీవుడ్‌లో నాని సినిమా ప్లానింగ్ గురించి, ఆయన వర్కింగ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏటా కనీసం…
ఇవాళ హోస్ట్ నాగార్జున వచ్చీరాగానే ఎలిమినేషన్ ప్రారంభించారు. ముందుగా అపూర్వను ఎలిమినేట్ చేశారు. ఝాన్సీ గురించి ఎక్కువ బాధపడతానని.. బాగా…
నాని చుట్టూ ఏదో ఒక వివాదం లేదా రూమర్ ఎప్పుడూ చక్కర్లు కొడుతూనే ఉంటుంది. రీసెంట్‌గా వచ్చిన ది ప్యారడైజ్…
బాలీవుడ్ సీనియర్ నటుడు, తనకంటూ ఒక ప్రత్యేకమైన యాక్టింగ్ స్టైల్ క్రియేట్ చేసుకున్న లెజెండ్ నానా పటేకర్ గుండెపోటుతో ఆకస్మికంగా…
సంక్రాంతి అంటేనే బాక్సాఫీస్ దగ్గర సినిమాల సమరం కనిపిస్తుంది.. 2027 సంక్రాంతి కూడా దీనికి మినహాయింపు కాదు.. బరిలో నిలవాలని…
బిగ్‌బాస్ 10 తెలుగు వారమంతా ఒక గోల అయితే వీకెండ్ ఆ గోలకు హోస్ట్ నాగార్జున వచ్చిన రేవు పెడతారు.…