సినిమా వార్తలు

Biggboss 10 Telugu: రీల్ ఫేసెస్ ఓకే.. రియల్ కలర్స్ ఇకపై..

తెలుగు బిగ్‌బాస్ సీజన్ 10 స్టార్ మాలో గ్రాండ్‌గా ప్రారంభమైంది. నిన్న (సెప్టెంబర్ 6, ఆదివారం) సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైంది. ‘దశావతారం’ అనే సరికొత్త కాన్సెప్ట్‌తో గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. ఈ సీజన్‌కు కూడా కింగ్ నాగార్జునే హోస్టింగ్. బిగ్‌బాస్‌కు ఆయన వరుసగా 8వ సారి హోస్టింగ్ చేస్తున్నారు. ఈ షోలో ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2’ ద్వారా ఎంపికైన కామనర్స్ ఆరుగురు, సెలబ్రిటీలు 10 మంది మొత్తంగా 16 మంది బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టారు.

‘లెనిన్’ సాంగ్‌తో బిగ్‌బాస్ సీజన్ 10 ప్రారంభమైంది. బిగ్‌బాస్ హౌస్‌ను నాగార్జున.. ఒక రోబోను తీసుకెళ్లి మరీ చూపించారు. వాస్తవానికి ఇప్పటి వరకూ వచ్చిన సీజన్స్ అన్నింటితో పోలిస్తే చాలా ఆకర్షణీయంగా బిగ్‌బాస్ హౌస్‌ను డిజైన్ చేశారు. దశావతారం కాన్సెప్ట్‌కు జస్టిఫికేషన్ ఇస్తూ.. ఈ సీజన్ 10లో 10 పవర్స్ ఉంటాయని నాగ్ చెప్పారు. మరి అవేంటనేది ఇప్పుడైతే చెప్పలేదు.

దేబ్జానీ

ఈ సీజన్‌లో మొట్టమొదటి కంటెస్టెంట్‌గా బెంగాలీ నటి దేబ్జానీ అడుగు పెట్టింది. ఆమెకు తెలుగు రాదు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ మూడింటినీ కిచిడి చేసి మరీ మాట్లాడుతోంది. ఆమెకు ఇదే మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఇక దేబ్జానీ విషయానికి వస్తే.. తెలుగు ప్రేక్షకులకు సీరియల్స్ ద్వారా బాగా తెలిసిన కంటెస్టెంటే. అందంగా ఉంటుంది. ఈ రెండు పాయింట్స్ ఆమెకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. తనొక ఫన్ లవింగ్, నిజాయతీ, డే డ్రీమర్‌‌నని చెప్పింది. ఎక్కువగా ఇంట్లో ఉండేందుకే ఇష్టపడుతుందట. తనను ఎవరైనా శత్రువుగా చూసినా కూడా.. ఆ తర్వాత వాళ్లే తనను అర్థం చేసుకుంటారని దేబ్జాని వెల్లడించింది.

త్రిగుణ్

సెకండ్ కంటెస్టెంట్‌గా త్రిగుణ్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టాడు. ఇతను గతంలో ‘పీఎస్‌వీ గరుడ వేగ’, ‘డియర్‌ మేఘ’ వంటి చిత్రాల్లో నటించిన త్రిగుణ్.. ఇటీవలే వచ్చిన ‘చెన్నై లవ్‌స్టోరీ’ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. ‘చెన్నై లవ్‌స్టోరీ’ సినిమా సక్సెస్. పైగా ఇది వచ్చి ఎన్నో రోజులు కావడం లేదు కాబట్టి త్రిగుణ్ ఇప్పటి వారందరికీ వెల్‌నోన్ పర్సన్. ఇది అతనికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. పైగా చాలా యాక్టివ్‌గా కనిపిస్తున్నాడు. అందరితోనూ బాగా కలిసిపోతున్నాడు. ప్రస్తుతం త్రిగుణ్ మాటతీరు, మింగిల్ అయ్యే విధానం చూసిన వారికి బిగ్‌బాస్ హౌస్‌లో చివరి వరకూ ఉండే కంటెస్టెంట్ అని తెలుస్తుంది. ఇక త్రిగుణ్‌కు నాగార్జున ఆయనకు వచ్చే శనివారం తాను వచ్చేలోపు ఇంట్లో దెయ్యం ఉందని నలుగురినైనా భయపెట్టాలన్నారు. మరి ఈ టాస్క్‌ను అతను ఎలా ఫినిష్ చేస్తాడో చూడాల్సి ఉంది. ఒకవేళ సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్ చేస్తే మాత్రం అతనికి తిరుగుండదు.

ఝాన్సీ

బిగ్‌బాస్‌ సీజన్‌-10లో మూడో కంటెస్టెంట్‌గా సింగర్‌ ఝాన్సీ అడుగు పెట్టింది. కామనర్స్‌ నుంచి బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టిన తొలి కంటెస్టెంట్ ఝాన్సీ. ‘అగ్ని పరీక్ష సీజన్‌2’లో ప్రేక్షకుల ఓట్లతో పాటు, జ్యూరీ నిర్ణయంతో సంబంధం లేకుండా గోల్డెన్‌ టికెట్‌ సాధించి బిగ్‌బాస్‌‌ హౌస్‌లోకి ఝాన్సీ అడుగు పెట్టింది. అగ్నిపరీక్షలో చాలా ఒబిడియంట్‌గా కనిపించింది కానీ ఎందుకో హౌస్‌లోకి అడుగు పెట్టే సమయంలో ఆమె మాటలు సింపతీ కోసం ట్రై చేస్తున్నట్టుగా అనిపించాయి. తన గురించి తాను చెబుతూ.. మూడో తరగతి నుంచే పాటలు పాడటం మొదలు పెట్టానని.. అయితే తనకు అవకాశాలు రాలేదన్నారు. తనను తాను ప్రమోట్ చేసుకునేందుకు సరైన ప్లాట్‌ఫామ్‌గా బిగ్‌బాస్‌ను ఎంచుకున్నట్టుగా ఆమె చెప్పింది. హౌస్‌లో ఎవరున్నా ధీటుగా ఎదుర్కొంటానని ఝాన్సీ తెలిపింది. ఎక్కడో కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కనిపించింది.

సుధీర్ రెడ్డి

నెక్ట్స్ హౌస్‌లోకి సుధీర్ రెడ్డి అడుగుపెట్టాడు. ఇతనొక యూట్యూబర్. ‘సుధీర్‌ టాక్స్‌’ ద్వారా యూట్యూబ్‌ ప్రేక్షకులకు సుపరిచిడే. యూట్యూబర్‌గా మారకముందు జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని… సింగపూర్‌లో తాను స్నేహితుడి చేతిలోనే మోసపోయానని చెప్పాడు. కేవలం 100 డాలర్లతో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో హౌస్‌ కీపింగ్‌, పార్ట్‌ టైమ్‌ జాబ్‌లు చేస్తూ గడిపానని తెలిపాడు. డబ్బుల్లేక గురుద్వారాకు వెళ్లి భోజనం చేసిన రోజులు కూడా ఉన్నాయని సుధీర్ వెల్లడించాడు. అలాంటి సమయంలో ఓ వ్యక్తి తనకు పరిచయమై తన డిజిటల్‌ మార్కెటింగ్‌ కంపెనీలో పనిచేయమని ఆఫర్‌ ఇచ్చాడని తెలిపాడు. మరి ఇతను బిగ్‌బాస్‌లో ఎలా పెర్ఫార్మ్ చేస్తాడో చూడాల్సి ఉంది.

చైత్ర రాయ్‌

‘బిగ్‌బాస్‌ సీజన్‌-10లోకి ఐదవ కంటెస్టెంట్‌గా బుల్లితెరతో ప్రేక్షకులకు సుపరిచితమైన నటి చైత్ర రాయ్‌ అడుగుపెట్టింది. ఈ తరుణంలోనే నటిగా తన ప్రయాణాన్ని పంచుకుంది. తన బరువు విషయంలో ఒకరు చేసిన కామెంట్‌ను సీరియస్‌గా తీసుకుని, మూడు నెలల్లో 80 కేజీల నుంచి 60కి తగ్గినట్లు చైత్రారాయ్ తెలిపింది. దీన్ని బట్టి ఆమె పట్టుదల చాలా ఎక్కువని అర్థమవుతోంది. తను ఇదొక పెద్ద ఫ్లాట్‌ ఫామ్‌ అని, ఇది తనకు సెకండ్‌ ఇన్నింగ్స్‌ అని చెప్పారు. అందరికీ త్వరగా కనెక్ట్‌ అవుతానని.. కానీ అది తన వీక్‌నెస్ కాదని కూడా తెలిపింది.

ఆటో రామ్‌ప్రసాద్‌

ఇక నెక్ట్స్ ఒక ఆసక్తికర కంటెస్టెంట్.. బిగ్‌బాస్ హౌస్‌లోకి ఆరవ కంటెస్టెంట్‌గా అడుగు పెట్టాడు. ‘జబర్దస్త్‌’ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు బాగా ఎంటర్‌టైన్ చేసి.. చాలా ఫేమస్ అయిపోయిన ఆటో రామ్‌ప్రసాద్‌ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టాడు. బిగ్‌బాస్ కోసం కాస్త స్లిమ్ అయ్యాడట. అతనికి ఇచ్చిన టాస్క్‌ను పర్ఫెక్ట్‌గా పూర్తి చేశాడు. రామ్ ప్రసాద్ చాలా ఫన్, యాక్టివ్‌గా కనిపించాడు.

షాలిని

అగ్నిపరీక్షలో ఫైనల్‌కు చేరిన వారిలో షాలిని ఒకరు. ఆమె ఏడవ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగు పెట్టింది. ఈ గేమ్‌లో స్ట్రాటజీతో ఆడతానని… తాను చాలా ఎక్కువ మాట్లాడతానని హౌస్‌లో అది మీరు చూస్తారని చెప్పింది. షాలిని కూడా కాస్త ఓవర్ కాన్ఫిడెంట్‌గానే కనిపించింది.

వంశీ

‘టెంపర్’ సినిమాతో విలన్‌గా ఫేమస్ అయిన వంశీ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగు పెట్టాడు. తను మైత్రీవనంలో కోర్సు చేస్తానని ఇంట్లో చెప్పి నరసరావుపేట నుంచి హైదరాబాద్‌కు వచ్చానని తెలిపాడు. సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ నెగెటివ్‌ రోల్స్‌ చేశానని తెలిపాడు. ‘టెంపర్‌’ నేను చేసిన పాత్రతో ఫేమస్ అయ్యానని… అప్పటి నుంచి తనను అంతా ‘టెంపర్‌’ వంశీగా పిలవడం మొదలు పెట్టారని తెలిపాడు. ఇప్పటివరకూ నన్ను విలన్‌గా, సీరియస్‌రోల్స్‌లో చూశారని.. కానీ తనకూ ఒక ఫ్యామిలీ ఉందని… చాలా ఎమోషన్స్‌ ఉన్నాయని తెలిపాడు. ప్రతి ఇంటికి చేరువ అవ్వాలనే బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగు పెట్టినట్టుగా వంశీ పేర్కొన్నాడు.

సృష్టి

అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టిన మరో కంటెస్టెంట్‌ సృష్టి. ఆమె అగ్నిపరీక్ష ద్వారా ఇప్పటికే ప్రేక్షకులకు బాగా తెలిసిన వ్యక్తే. కానీ చూస్తుంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువేనని తెలుస్తోంది. తనకు మనోబలం ఎక్కువని, అలాగే, ఇతరులతో సులభంగా కలిసిపోతానని ఈ సందర్భంగా సృష్టి చెప్పింది.

జబర్దస్త్ నరేశ్

‘జబర్దస్త్‌’ కామెడీ షో ద్వారా బాగా ఫేమస్ అయిన మరో కంటెస్టెంట్ నరేశ్ జబర్దస్త్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు. తాను కమెడియన్‌గా అందరికీ తెలుసని, ఇక మీదట గూగుల్‌లో నరేశ్‌ అని కొడితే, ‘బిగ్‌బాస్‌ సీజన్‌-10 నరేశ్‌’ అని రావాలని చెప్పాడు. కచ్చితంగా తన శక్తి మేరకు ఆడతానని, ‘అబ్బా గెలిచినంత పనిచేశాడు’ అనిపించుకుంటానని అన్నాడు. అంటే గెలవనని ముందే చెబుతున్నాడా? అనేది తెలియలేదు. ఇంతకుముందు సీజన్‌లో కూడా ‘జబర్దస్త్’ నుంచి చాలా మంది కమెడియన్లు వచ్చారని, వాళ్లందరినీ మిక్సీలో వేస్తే బయటకు వచ్చేవాడే నరేశ్‌ అంటూ సరదాగా తెలిపాడు. అయితే టాస్క్‌లో తనతో ఈజీగా గెలవొచ్చని తదుపరి కంటెస్టెంట్స్ ఇద్దరు వేసిన మాస్టర్ స్కెచ్‌ను నరేశ్ ఈజీగా తిప్పికొట్టాడు. టాస్క్‌లో విన్ అయ్యాడు.

చరణ్‌

అగ్నిపరీక్ష ద్వారా బిగ్‌బాస్‌లోకి అడుగు పెట్టిన మరో కంటెస్టెంట్‌ చరణ్‌. ఈ యంగ్‌స్టర్‌కి ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ. తన పర్సనాలిటీయే తన బలమని చరణ్‌ చెప్పాడు. తన చుట్టుపక్కల ఎవరున్నా వాళ్లను నవ్విస్తూ ఉంటానని అదే తన ప్లస్ పాయింట్ అని చెప్పకనే చెప్పాడు.

కృష్ణుడు

ఆ తరువాత నటుడు కృష్ణుడు ఎంట్రీ ఇచ్చాడు. సినిమాలే ప్రపంచంగా తిరిగే సమయంలో రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిపాడు. దీంతో తాను చాలా లావు అయిపోయానని.. ఆ తర్వాత ‘వినాయకుడు’ రూపంలో మంచి విజయం వచ్చిందని తెలిపారు. ఇప్పటివరకూ తనని అంతా వినాయకుడు, అమాయకుడు రోల్స్‌లో చూశారని ‘బిగ్‌బాస్‌’లో తనలోని మరో కోణం చూస్తారని చెప్పారు. అయితే ఆయన వీక్‌నెస్ స్వీట్స్ అని తెలియడంతో నాగార్జున దానిని ఎలా ఓవర్‌కమ్ చేస్తాడో తెలుసుకునేందుకు స్వీట్స్‌ ఆఫర్‌ చేశారు. హౌస్‌లో ఆడి గెలుచుకున్న తర్వాతే స్వీట్స్ తీసుకుంటానని కృష్ణుడు చెప్పాడు.

యాంకర్‌ వర్షిణి

నటి, యాంకర్‌ వర్షిణి తరువాతి కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టింది. తనకు ఇది చాలా పెద్ద ఫ్లాట్‌ఫాం అని, ఇక్కడ ఫిట్‌ అవుతానని అనుకోలేదని చెప్పింది. ఈ విషయమై రోజూ రాత్రి నిద్రపోయే ముందు తనని తాను ప్రశ్నించుకునేదట. ఆ తర్వాత కచ్చితంగా వెళ్లాలని డిసైడ్ అయ్యిందట.

రోహిత్

బిగ్‌బాస్‌ ‘అగ్నిపరీక్ష’ నుంచి చివరి కంటెస్టెంట్ రోహిత్ హౌస్‌లోకి అడుగు పెట్టాడు. ఇతను చాలా కామ్ అండ్ కంపోజ్‌డ్‌గా ఉంటాడు. నాగ్ ముందు కూడా అతను చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడాడు. తన జీవితంలో ఎంతో స్ఫూర్తినిచ్చిన చిత్రం ‘అన్నమయ్య’ అని చెప్పిన రోహిత్‌.. తనకు ఇబ్బంది అనిపించినప్పుడల్లా ఆ సినిమాలో వేంకటేశ్వర స్వామి వచ్చి అన్నమయ్య పల్లకి మోసే సీన్‌ను గుర్తు చేసుకుంటానని తెలిపాడు. హౌస్‌లోనూ తనదైన శైలిలో ఆడతానని చెప్పాడు.

ముకేశ్‌

బిగ్‌బాస్‌ సీజన్‌-10లో చివరి కంటెస్టెంట్‌గా నటుడు ముకేశ్‌ ఎంట్రీ ఇచ్చాడు. తను సింగిల్ అని చెప్పాడు. పదేళ్ల క్రితం.. తన జీవితంలో కొన్ని పరిస్థితుల వల్ల నటుడిని అవ్వాలని ఫిక్స్ అయిపోయి… అలా జూనియర్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ మొదలు పెట్టినట్టు వెల్లడించాడు. హీరోగా కూడా చేశానని.. తన ప్రతిభతో జనాల మనసు గెలుచుకోవాలనుకుంటున్నట్టు తెలిపాడు. టాస్క్‌లో 100శాతం శక్తితో పోరాడతానని చెప్పాడు. రిలేషన్ విషయంలో జీరో అని తెలిపాడు.

మొత్తానికి 16 మంది కంటెస్టెంట్స్ అయితే హౌస్‌లోకి అడుగు పెట్టారు. ఇందులో ఒక రైతు బిడ్డ, సింగర్.. జబర్దస్త్ కమెడియన్స్ ఇద్దరు.. మిగిలిన వారంతా కూడా అగ్నిపరీక్ష ద్వారా.. వెండితెర, బుల్లితెర ద్వారా ప్రేక్షకులకు బాగా తెలిసిన వారే కావడం విశేషం. అయితే రీల్ పరంగా అంతా తెలిసిన వారే.. కానీ రియల్ కలర్స్ ఎలా ఉంటాయనేది చూడాలి. మహా అయితే ఒక వారం లేదంటే రెండు వారాలు నటిస్తారేమో. ఆ తరువాత అయినా మాస్క్ తొలగిపోతుంది. ఎవరేంటనేది తెలుస్తుంది. కాబట్టి అంతా అర్థమవ్వాలంటే ఒక రెండు వారాలు వేచి చూడాల్సిందే.

Telugu Cinema 360

Recent Posts

Biggboss 10 Telugu: హౌస్‌లో కుంపటి పెట్టిన బిగ్‌బాస్.. అంతా రచ్చే..

బిగ్‌బాస్ 10 తెలుగు తొలిరోజే హౌస్‌లో పెద్ద గొడవ జరిగింది. వాస్తవానికి బిగ్‌బాస్ పెట్టిన కుంపటే అది. అసలు సోమవారం…

8 hours ago

Ram Prasad: Bigg Boss 10 హౌస్‌లొ ఎవరి రెమ్యూనరేషన్ ఎంత? రామ్‌ప్రసాద్‌కు ఎంతో తెలిస్తే…

16 మంది కంటెస్టెంట్లతో బిగ్‌బాస్ 10 (Bigg Boss 10 Telugu) ప్రారంభమైంది. ఆదివారం కంటెస్టెంట్స్ అంతా హౌస్‌లోకి అడుగు…

22 hours ago

Biggboss 10 Telugu Thrigun: హైలైట్ అవుతున్న త్రిగుణ్.. ప్లస్సా, మైనస్సా?

తొలిరోజు వరకూ కాదు.. బిగ్‌బాస్ 10 తెలుగు (Bigg Boss 10 Telugu) ప్రారంభమై షో ముగిసిన కొన్ని గంటలకే…

22 hours ago

ఘనంగా ప్రారంభమైన ‘వేట’.. సందీప్ సరోజ్, సాత్విక జంటగా కొత్త గ్రామీణ కమర్షియల్ ఎంటర్‌టైనర్

ఎస్ఆర్‌డీ ప్రొడక్షన్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మిస్తున్న కొత్త చిత్రం ‘వేట’ ఘనంగా ప్రారంభమైంది. సందీప్ సరోజ్, సాత్విక జంటగా…

1 week ago

‘ఆదర్శ కుటుంబం’లో చిట్టిబాబుగా విక్టరీ వెంకటేష్..

విక్టరీ వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47…

1 month ago

దుల్కర్ సల్మాన్ ‘శ్రీ శ్రీ’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘బొమ్మ బొమ్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్..

వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా, నూతన దర్శకుడు రవి నెలకుదిటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'శ్రీ శ్రీ'పై…

1 month ago