సినిమా వార్తలు

Biggboss10 Telugu: రెచ్చిపోతున్న సుధీర్.. పడిపోతున్న గ్రాఫ్..

బిగ్‌బాస్ 10 తెలుగు రోజురోజుకూ దారుణంగా మారుతోంది. సెలబ్రిటీలు మరింత రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా హోస్ట్ నాగార్జున వచ్చి వెళ్లిపోయాక ప్రేక్షకుల్లో రోహిత్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని.. జనాల్లో అతనికి ఏమాత్రం క్రేజ్ లేదని భావించినట్టుగా ఉన్నారు. ముఖ్యంగా కామనర్స్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందన్న భావనలో ఉన్నారు. సుధీర్, ముఖేష్, వర్షిణి, రామ్ ప్రసాద్, నరేష్, ఝాన్సీలను నాగ్ అసలు ఏమీ అనలేదు. పైగా కొందరిపై ప్రశంసల జల్లు కురిపించారు. దీంతో నాగ్ మాటలు.. ప్రేక్షకుల మాటల్లా తీసుకున్నట్టుగా ఉన్నారు. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నామినేషన్స్‌లో కామనర్స్‌ని అవమానించేందుకు కూడా ఏమాత్రం వెనుకాడ లేదు. ఇష్టానుసారంగా నోటికి పని చెబుతున్నారు.

అంతకు ముందు చాలా అమాయకుడిలా కనిపించిన సుధీర్ రెడ్డి.. ఇప్పుడు మరో త్రిగుణ్.. మరో ముఖేష్‌లా మారాడు. నామినేషన్స్‌లో అతను రెచ్చిపోయిన తీరును చూశాక నెట్టింట పెద్ద ఎత్తున నెగిటివిటీ వస్తోంది. నిలబడ్డా కుర్చున్నట్టే ఉందిలే అంటూ రోహిత్‌ను బాడీ షేమింగ్ చేస్తున్నాడు. అది చాలదన్నట్టుగా ‘నాగ్ సర్ నిన్నే గేట్లు తెరిచి బయటకు పొమ్మన్నారు. మమ్మల్ని ఎవర్నీ పొమ్మనలేదు’ అంటూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా సృష్టి హౌస్ నుంచి వెళ్లిపోయాక తనకు చాలా పాజిటివిటీ వచ్చిందనే భ్రమలో ఉన్నట్టున్నాడు. అందుకే యాటిట్యూడ్ బాగా పెరిగింది. చాలా వెటకారం, ప్రతి ఒక్కరి నామినేషన్‌లో దూరడం వంటివన్నీ చేస్తున్నాడు. ఇప్పటికే సుధీర్ గ్రాఫ్ బాగా పడిపోయింది. ఇంక ఇలాగే ఉంటే నామినేషన్స్‌లోకి వచ్చిన వెంటనే బయటకు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu Cinema 360

Recent Posts

కామ్రేడ్ కళ్యాణ్ ట్రైలర్ రివ్యూ.. వాళ్ల మనోభావాలు దెబ్బతింటే అంతే సంగతులు..!

టాలీవుడ్‌లో తనకంటూ ఒక స్పెషల్ కామెడీ టైమింగ్ క్రియేట్ చేసుకున్న హీరో శ్రీవిష్ణు, ఇప్పుడు 'కామ్రేడ్ కళ్యాణ్' సినిమాతో రాబోతున్నారు.…

10 hours ago

ఇదెక్కడి దిక్కుమాలిన ప్లానింగ్.. కనీసం ట్రైలర్స్ కట్ చేయడానికి టైమ్ దొరకట్లేదా..?

టాలీవుడ్‌లో ఈ మధ్య వందల కోట్ల బడ్జెట్‌తో భారీ సినిమాలు తీస్తున్నారు కానీ, వాటికి తగ్గ కనీస ప్లానింగ్ అనేదే…

10 hours ago

Biggboss10 Telugu: హాట్ హాట్‌గా నామినేషన్స్.. ఈవారం కూడా కామనర్స్ బలి..

త్రిగుణ్, రామ్ ప్రసాద్, వంశీ కిచెన్ క్లీన్ చేస్తుండగా షో ప్రారంభమైంది. బాత్రూంలో నీళ్లు కారుతున్నాయని రోహిత్ కంప్లైంట్ చేశాడని…

20 hours ago

లెజెండరీ నటి శారద పరిస్థితి చూస్తున్నారా.. 81 ఏళ్ళ వయసులో కూడా..!

సీనియర్ నటి ఊర్వశి శారద తాజా పరిస్థితి చూసి సోషల్ మీడియాలో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇటీవల అక్టోబర్…

1 day ago

Biggboss10 Telugu: నామినేషన్స్‌లో రెచ్చిపోయిన వర్షిణి, ముఖేష్..

బిగ్‌బాస్ 10 తెలుగు రసవత్తరంగా సాగుతోంది. వీకెండ్‌లో హోస్ట్ నాగార్జున వచ్చి అమన్, త్రిగుణ్, రోహిత్‌లకు ఎల్లో కార్డు ఇచ్చారు.…

1 day ago

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ED సోదాలు.. అసలు నిజమేంటో తెలుసా..?

ఈ మధ్య టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు మీడియాలో ఒక రేంజ్‌లో…

1 day ago