టాలీవుడ్‌లో తనకంటూ ఒక స్పెషల్ కామెడీ టైమింగ్ క్రియేట్ చేసుకున్న హీరో శ్రీవిష్ణు, ఇప్పుడు ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమాతో రాబోతున్నారు. నక్సలిజం లాంటి ఒక సీరియస్ అండ్ సెన్సిటివ్ బ్యాక్‌డ్రాప్‌ను తీసుకుని, దానికి ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ జోడించి దర్శకుడు జానకిరామ్ ఈ సినిమాను చాలా విభిన్నంగా తెరకెక్కించారు. ఒక పక్క తుపాకులు, విప్లవ భావజాలం, అడవులు లాంటి సీరియస్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నా, మరోపక్క హీరో చేసే సిట్యువేషనల్ కామెడీ ఈ సినిమాకు మెయిన్ హైలైట్ లా కనిపిస్తుంది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే ఇందులో శ్రీవిష్ణు మార్క్ సెటైర్లు, బాలయ్య రిఫరెన్సులు, అదిరిపోయే కామెడీ పంచులు బాగా పేలాయని అర్థం అవుతోంది. అలాగే టాలెంటెడ్ హీరోయిన్ మహిమ నంబియార్‌తో నడిచే లవ్ ట్రాక్ కూడా చాలా ఎంటర్‌టైనింగ్‌గా, స్క్రీన్ మీద చాలా ఫ్రెష్ గా వర్కవుట్ అయింది. అసలు నక్సలిజంకు, కామెడీకి ఎక్కడా సంబంధం ఉండదు, కానీ ఈ రెండు పూర్తి భిన్నమైన అంశాలను కలిపి ఒక కొత్త కాన్సెప్ట్ తో రావడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
వాస్తవానికి శ్రీవిష్ణుకు ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఒక సాలిడ్ కమర్షియల్ హిట్ చాలా అవసరం. ఎందుకంటే ఈ ఏడాది ఆయన ఎన్నో ఆశలు పెట్టుకుని నటించిన విష్ణు విన్యాసం, మృత్యుంజయ్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. ఆ రెండు సినిమాల రిజల్ట్ తో కొన్నాళ్లుగా సరైన సక్సెస్ కోసం ఆయన వెయిట్ చేస్తున్నారు. వరుస ఫ్లాపులతో ఆయన మార్కెట్ కూడా కాస్త డల్ అయింది. ఇలాంటి కష్టకాలంలో తనకు బాగా అచ్చొచ్చిన స్ట్రాంగ్ ఎంటర్‌టైన్మెంట్ జోనర్‌లోకి మళ్లీ ఎంట్రీ ఇస్తూ చేసిన కామ్రేడ్ కళ్యాణ్ ఆ హిట్ లోటును కచ్చితంగా తీర్చేలా కనిపిస్తోంది. ట్రైలర్ కు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్, అందులో ఉన్న హిలేరియస్ ఎలిమెంట్స్ చూస్తుంటే శ్రీవిష్ణు మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే సినిమా సక్సెస్ కోసం కామెడీని నమ్ముకోవడం మంచిదే కానీ, ఆ కామెడీ కోసం ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ వల్ల ఇక్కడే ఒక చిన్న రిస్క్ కూడా దాగి ఉంది.
సినిమాలో కామెడీ అంతా బాగానే వర్కవుట్ అయినట్లు కనిపిస్తున్నా, నక్సలిజాన్ని జోక్ చేయడం అంటే అది మామూలు రిస్క్ కాదు. నక్సలిజం అనేది మన దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు ఎంతో సీరియస్ ఇంపాక్ట్ చూపించిన సబ్జెక్ట్. దాన్ని ఎంటర్‌టైన్మెంట్ యాంగిల్‌లో చూపిస్తూ కామెడీ చేస్తే లేనిపోని తలనొప్పులు వచ్చే అవకాశం కచ్చితంగా ఉంటుంది. ఎక్కడో ఒక చోట, ఎవరో ఒకరి మనోభావాలు దెబ్బ తిన్నాయంటే మాత్రం సినిమాకు రిలీజ్ టైమ్ లో అసలుకే మోసం రాక మానదు. ఇలాంటి సెన్సిటివ్ ఐడియాలజీ మీద సినిమాలు తీసినప్పుడు పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేయకపోతే గతంలో కూడా చాలా వివాదాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ ఆశయాలను కించపరిచేలా ఉందంటూ ఆందోళనలు జరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దర్శకుడు జానకిరామ్ ఈ సున్నితమైన ఎమోషన్స్ ను స్క్రీన్ మీద ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేసారు అనేది ఇప్పుడు అందరిలోనూ టెన్షన్ రేపుతోంది.
అందరికీ తెలిసిందే, శ్రీ విష్ణు సినిమాలు అంటేనే నాచురల్ సెటైర్లకు కేరాఫ్ అడ్రస్. ఆయన డైలాగ్ డెలివరీలో ఒకరకమైన వెటకారం, అమాయకత్వం కలిసిపోయి ఉండి ఆడియన్స్ కు బాగా నవ్వు తెప్పిస్తాయి. అయితే ఈ సినిమాలో ఎక్కడో ఒక చోట ఆయన గానీ పొరపాటున నోరు జారాడంటే మాత్రం సినిమాపై ఆ నెగిటివ్ ఎఫెక్ట్ చాలా గట్టిగా పడుతుంది. ఎంత జాగ్రత్తగా సినిమాను తీసినా కూడా నక్సలిజం లాంటి సీరియస్ సబ్జెక్ట్ ను టచ్ చేసినప్పుడు కొన్ని డైలాగులు వివాదాస్పదం అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ టీజర్‌లోనే క్లియర్ గా కనిపించింది. అందులో ఒకరు లాల్ సలామ్ అని చాలా సీరియస్ గా అంటే, దానికి శ్రీవిష్ణు అమాయకంగా మోహన్ లాల్ సలామ్ అంటాడు. థియేటర్లో ఆ క్షణానికి ఈ డైలాగ్ కు మంచి నవ్వులు రావచ్చు కానీ, ఆ విప్లవ ఐడియాలజీని ప్రాణంగా నమ్మేవాళ్లకు మాత్రం మండిపోవడానికి ఇలాంటి ఒక చిన్న డైలాగ్ చాలు.
సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ మీడియం అయినప్పటికీ, సమాజంలో లోతుగా పాతుకుపోయిన సున్నితమైన అంశాలను టచ్ చేసేటప్పుడు మేకర్స్ కత్తిమీద సాము చేసినట్లే వ్యవహరించాలి. లాల్ సలామ్ లాంటి పవర్ ఫుల్ స్లోగన్స్‌ను ఇలా కామెడీకి వాడటం చూస్తుంటే, సినిమాలో ఇలాంటి సెటైర్లు ఇంకా చాలానే పేలతాయని అర్థం అవుతోంది. మరి వీటన్నింటినీ ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా దర్శకుడు జానకిరామ్ ఎలా బ్యాలెన్స్ చేస్తాడో అనేది స్క్రీన్ మీద చూడాల్సిందే. నక్సలిజం అనే సీరియస్ థీమ్ కు, శ్రీవిష్ణు మార్క్ వినోదానికి మధ్య మేకర్స్ కరెక్ట్ గా బ్యాలెన్స్ మెయింటైన్ చేసి ఉంటే మాత్రం కామ్రేడ్ కళ్యాణ్ కచ్చితంగా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చి బ్లాక్ బస్టర్ అవుతుంది. అలా కాకుండా ఎంటర్టైన్మెంట్ పేరుతో ఏమాత్రం శృతి మించి విప్లవ భావాలను కించపరిచినా అనవసరమైన వివాదాల్లో చిక్కుకోవడం ఖాయం. ఈ రిస్క్ ను వాళ్లు ఎలా దాటుతారో చూడాలి.
బిగ్‌బాస్ 10 తెలుగు రోజురోజుకూ దారుణంగా మారుతోంది. సెలబ్రిటీలు మరింత రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా హోస్ట్ నాగార్జున వచ్చి వెళ్లిపోయాక ప్రేక్షకుల్లో…
టాలీవుడ్‌లో ఈ మధ్య వందల కోట్ల బడ్జెట్‌తో భారీ సినిమాలు తీస్తున్నారు కానీ, వాటికి తగ్గ కనీస ప్లానింగ్ అనేదే…
త్రిగుణ్, రామ్ ప్రసాద్, వంశీ కిచెన్ క్లీన్ చేస్తుండగా షో ప్రారంభమైంది. బాత్రూంలో నీళ్లు కారుతున్నాయని రోహిత్ కంప్లైంట్ చేశాడని…
సీనియర్ నటి ఊర్వశి శారద తాజా పరిస్థితి చూసి సోషల్ మీడియాలో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇటీవల అక్టోబర్…
బిగ్‌బాస్ 10 తెలుగు రసవత్తరంగా సాగుతోంది. వీకెండ్‌లో హోస్ట్ నాగార్జున వచ్చి అమన్, త్రిగుణ్, రోహిత్‌లకు ఎల్లో కార్డు ఇచ్చారు.…
ఈ మధ్య టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు మీడియాలో ఒక రేంజ్‌లో…