సినిమా వార్తలు

Biggbogss10 Telugu: రోహిత్‌కు గుదిబండలా తయారైన షాలిని.. లవ్ ట్రాక్ ఇబ్బందే..

బిగ్‌బాస్ 10 తెలుగు రసవత్తరం అనే కన్నా.. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉందనడం ఉత్తమమేమో. ఎవరూ తక్కువోళ్లు కాదు. కానీ సెలబ్రిటీలంతా అతి తెలివి ప్రదర్శించడంలో ఒక అడుగు ముందున్నారు. ఇక ఝాన్సీ కామనర్స్‌తో ఉంటూ సెలబ్రిటీలకు పావులా మారింది. ఆమె గేమ్ ప్లే ఆమెది. ఎవరిని తప్పుబట్టాలో.. ఎవరిని ఒప్పు అనాలో తెలియని పరిస్థితి. ఇక రోహిత్‌కి అంతా బాగుందనుకుంటున్న తరుణంలో అతని ఓటు బ్యాంకుకు షాలిని బ్రేకర్‌లా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే అతని పాలిట గుదిబండలా షాలిని తయారైంది. ఆమె బిహేవియర్ కారణంగా రోహిత్ చిక్కుల్లో పడుతున్నాడు. అది మాత్రమే కాకుండా అదో లవ్ ట్రాక్‌లా అనిపిస్తోంది. ఎప్పుడైనా లవ్ ట్రాక్‌లు కంటెస్టెంట్స్ మెడకు గుదిబండలే అవుతాయనడంలో సందేహం లేదు.

గతంలో కూడా ఎన్నో లవ్ స్టోరీలు చూశాం. కానీ హౌస్‌ను వీడి బయటకు వచ్చాక ఒక్కటంటే ఒక్కటి కూడా నిలవలేదు. రోహిత్, షాలిని లవ్ స్టోరీ బయటకు వచ్చాక ఎలా ఉన్నా పర్వాలేదు కానీ హౌస్‌లో మాత్రం అతనికి ఇబ్బందే కానుంది. ముఖ్యంగా షాలిని కామ్‌గా ఉండే రకం కాదు.. ప్రతి దానికి గొడవ చేస్తూ ఉంటుంది. ఆమె వాయిస్ ఆమెకే కాకుండా రోహిత్‌కు కూడా ఇబ్బందే కానుంది. ఇవాళ షాలిని, అపూర్వకు గొడవ జరిగింది. రోహిత్ అరవొద్దని ఎంత మొత్తుకున్నా షాలిని వినే పరిస్థితి లేదు. పైగా త్రిగుణ్, రామ్ ప్రసాద్ దగ్గర పంచాయతీ పెట్టింది. రోహిత్ ఎంత వారిస్తున్నా ఆమె ఆవేశం మాత్రం తగ్గడం లేదు. చూసేందుకు షార్ట్ టెంపర్‌లా కనిపిస్తోంది. రోహిత్ ఆమెను వదిలించుకుని తన గేమ్ తను ఆడకుంటే మాత్రం షాలిని అతనికి ఇబ్బందికరంగా మారుతుందనడంలో సందేహమే లేదని తెలుస్తోంది.

Telugu Cinema 360

Recent Posts

ఏంది మచ్చా అంత పని చేసినావ్.. మీమ్స్‌తో నవ్వించిన అగ్గిపెట్టి మచ్చ హఠాన్మరణం..!

సోషల్ మీడియాలో తనదైన స్టైల్ డైలాగులతో నెటిజన్లను కడుపుబ్బా నవ్వించిన పాపులర్ యూట్యూబర్, కమెడియన్ కిరణ్ కుమార్ అలియాస్ 'అగ్గిపెట్టి…

34 minutes ago

Biggboss10 Telugu: వామ్మో.. షాలిని వర్సెస్ అపూర్వ.. చూసేవారికి టార్చర్

నిన్న నామినేషన్స్ పూర్తైన సీన్ నుంచి ఇవాళ షో ప్రారంభమైంది. తనను కొన్ని కారణాల వల్ల తనను నామినేట్ చేశారని..…

37 minutes ago

స్పిరిట్ ముందుకు.. ఫౌజీ వెనక్కి.. ప్రభాస్ సినిమాల విషయంలో అసలు ఏం జరుగుతోంది?

ప్రభాస్ (Prabhas) అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఫౌజీ సినిమా విషయంలో మరోసారి కొత్త చర్చ మొదలైంది. ఒకప్పుడు ప్రభాస్…

4 hours ago

తమిళ హీరోలకు రాజకీయ పిచ్చి ముదిరిందా.. అందరూ విజయ్ అయిపోలేరు కదా..?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇప్పుడు పాలిటిక్స్ వైపు అడుగులు వేస్తున్నారనే వార్త తమిళనాట హాట్ టాపిక్ గా మారింది.…

15 hours ago

జబర్దస్త్ కామెడీ షో.. పోయిన వాళ్లే మళ్లీ.. అదిరిపోయిన మల్లెమాల స్ట్రాటజీ..!

ఒకప్పుడు తెలుగు బుల్లితెరపై కామెడీ అంటే జబర్దస్త్, జబర్దస్త్ అంటే కామెడీ అనే రేంజ్‌లో ఈ షో ఒక సెన్సేషన్…

16 hours ago

Biggboss10 Telugu: ఈసారి హౌస్‌లోని వారికి కాదు.. రివ్యూవర్స్‌కి పెద్ద టాస్క్

నిన్నటి నామినేషన్స్‌ను కంటిన్యూ చేస్తూ నామినేషన్స్ ప్రారంభమయ్యాయి. పండు.. సుధీర్‌కు దొరికింది. రోహిత్‌ను సుధీర్‌ నామినేట్ చేశాడు. వయసుకి కూడా…

16 hours ago