బిగ్‌బాస్ హౌస్‌లోకి షాలిని ఎంట్రీ ఇచ్చింది. ఆమెను డ్రమెటిక్‌గా హౌస్‌లోకి ప్రవేశ పెట్టారు. త్రిగుణ్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచారు. అక్కడ షాలినిని చూడగానే త్రిగుణ్ షాక్ అయ్యాడు. షాలినిని హౌస్‌లోకి తీసుకెళ్లమని బిగ్‌బాస్ చెప్పారు. సాధారణంగా తీసుకెళితే థ్రిల్ ఏముంటుంది? అందుకే త్రిగుణ్ ముందుగా వెళ్లి రోహిత్‌ను పక్కకు పిలిచి ఏదో చెప్పినట్టుగా చెప్పి సర్ప్రైజ్ టు యూ అన్నాడు. అంతే షాలినిని చూసి రోహిత్ షాక్ అయ్యాడు. ఆమెను ఎత్తుకుని తిప్పి సంతోషం వ్యక్తం చేశాడు. ఇక ఈ వారం నామినేషన్స్ విషయానికి వస్తే ఏకంగా 12 మంది నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండనుంది. గత వారం ఎవరూ ఎలిమినేట్ అవలేదు కాబట్టి ఈ వారం డబుల్ ఎలిమినేషన్. మరి ఈవారం ఎలిమినేట్ అవబోయే ఇద్దరు ఎవరనేది చూద్దాం.
రోహిత్, త్రిగుణ్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలిమినేట్ కారు. మిగిలిన 10 మందిలోనే ఎలిమినేషన్ ఉంటుంది. ఈ వారం నామినేట్ అయిన వారిలో దక్షి, వర్షిణి, రోహిత్, సుధీర్, త్రిగుణ్, నీతూ, రామకృష్ణ, శివ, ఝాన్సీ, శ్వేత, వంశీ, అమన్ ఉన్నారు. రామకృష్ణకు ఈ నామినేషన్స్ బాగా హెల్ప్ అయ్యాయి. అతని అమాయకత్వం, డిఫెండ్ చేసుకునే విధానం ఫన్నీగానూ జనాలకు బాగా ఎక్కుతోంది. దీంతో రామకృష్ణ ఎలిమినేట్ అయ్యే ఛాన్సే లేదు. అమన్‌కు మంచి ఓటింగ్ ఉంది కాబట్టి అతనికి వచ్చిన ఇబ్బందేం లేదు. సుధీర్‌పై నెగిటివిటీ ఉంది కానీ అతని కంటే ఓటింగ్ బాగా తక్కువ ఉన్నవారు ఉన్నారు కాబట్టి ఈవారం అతనికి ఇబ్బంది లేదు. ముఖేష్ నామినేషన్స్‌లో లేకపోవడం ఝాన్సీకి కలిసొచ్చే అంశం. ముఖేష్ ఫ్యాన్స్.. వర్షిణికి కానీ.. సుధీర్‌కి కానీ సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. కేవలం ఝాన్సీకి మాత్రమే చేస్తారు. కాబట్టి ఆమెకు వచ్చిన ఇబ్బందేం లేదు. వంశీపై కూడా ఎలిమినేషన్ కత్తి వేలాడుతోంది కానీ మిగిలిన వారికి ఇంకా ఓటింగ్ తక్కువ ఉండటం ఇతనికి కలిసొచ్చే అంశం. నీతూ నామినేషన్స్‌లో ఉన్నా కూడా ఆమె రోహిత్‌తో ఉండటంతో కంటెంట్ బాగానే వస్తోంది.
ఆమెకు అయితే ఏమాత్రం ఇబ్బంది లేదు. శివ్ పరిస్థితి కూడా అదే. వైల్డ్ ఫైర్స్లో బాగా కంటెంట్ ఇస్తున్న వారిలో ఇతను కూడా ఒకడు. శ్వేత కూడా నామినేషన్స్‌లో మంచి పాయింట్స్ పెట్టి బాగానే ఆకట్టుకుంది. ఆమెకు కూడా పెద్దగా ఇబ్బంది లేదు. చివరిగా వర్షిణి, దక్షి ఉన్నారు. దాదాపుగా వీరిద్దరే ఎలిమినేట్ కావొచ్చని తెలుస్తోంది. వర్షిణి నామినేషన్స్‌లో చాలా వరస్ట్‌గా బిహేవ్ చేసింది. ఇష్టానుసారంగా మాటలు జారింది. గత వారం కూడా లీస్ట్ టులో ఉంది. ఇక దక్షి.. బిగ్‌బాస్ హౌస్‌కి ఏమాత్రం సెట్ కాదు. ఆమె ఉన్నా లేనట్టే. ముందుగా బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లినవారు టాప్‌లో ఉన్నవారితో ఉంటూ సెటిల్ అవ్వాలి. ఆ తరువాత టాపర్స్‌కు ఎదురెళ్లాలి. కానీ దక్షి మాత్రం ముందే రోహిత్‌కు ఎదురెళ్లింది. రోహిత్‌ని నామినేట్ చేసింది. చేస్తే చేసింది.. మంచి పాయింట్స్ పెడితే ఆమెకు హైప్ క్రియేట్ అయ్యేది. కానీ చెత్త పాయింట్స్ పెట్టి ఫెయిల్ అయిపోయింది. దీంతో దక్షి ఎలిమినేషన్ ఖాయంగా కనిపిస్తోంది. ఈ శుక్రవారం నాటికి పరిస్థితులు ఏమైనా మారితే వీరు కాకుండా మరొకరు ఎలిమినేషన్ జోన్లోకి వచ్చే అవకాశం ఉంది. లేదంటే ఈ ఇద్దరే బయటకు వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
టాలీవుడ్లో ఎవరైనా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కేవలం తమ స్వయంకృషితో, టాలెంట్ తో పైకి వస్తుంటే వారిని ఎంకరేజ్…
టాలీవుడ్ లో ప్రస్తుతం యూత్ ఫుల్ కంటెంట్ తో వస్తున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలకు ఆడియన్స్ నుంచి మంచి…
సాధారణంగా దసరా లాంటి పెద్ద పండుగ వస్తుందంటే చాలు.. థియేటర్లలో సినిమాల పండగ ఎలా ఉంటుందో, సోషల్ మీడియాలో కూడా…
నిన్న ఆగిపోయిన చోటు నుంచే తిరిగి షో ప్రారంభమైంది. అమన్.. శివ్‌ను నామినేట్ చేశాడు. వైల్డ్ ఫైర్‌గా వచ్చి వైల్డ్…
దర్శక ధీరుడు రాజమౌళి పేరు చెబితేనే ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక బ్రాండ్ లా మారిపోయింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా…
బాలీవుడ్ క్యూట్ కపుల్, అభిమానులందరూ ముద్దుగా పిలుచుకునే 'దీప్ వీర్' జోడీ తమ పర్సనల్ లైఫ్ లో హ్యాపీ మూవెంట్స్…