నిన్న (శనివారం) షో జరిగిన తర్వాత ఏం జరిగిందో హోస్ట్ నాగార్జున చూపించారు. జనాల మనసు గెలుచుకుని వెళితే బాగుంటుందని మిథిలేష్‌ను కన్విన్స్ చేయడానికి ఝాన్సీ ట్రై చేసింది. విన్నర్ మనీ నుంచి తీసుకుని పోవడం చాలా దారుణమని ముఖేష్ చెప్పాడు. అంతా వెళ్లేటప్పుడు మాత్రమే బాగానే సెండాఫ్ ఇచ్చారు. ఆ తరువాత డబ్బులతో బయటకు పంపడమేంటని త్రిగుణ్, ముఖేష్ నానా రచ్చ చేశారు. రామ్ ప్రసాద్ చెప్పిన మాటలు చాలా కన్విన్సింగ్‌గా ఉన్నాయి. గేమ్ కోసం.. జనాల మనసుల గెలుచుకునేందుకు వచ్చామని చెబుతూ డబ్బులు కోసం కొట్లాడటం కరెక్ట్ కాదని రామ్ ప్రసాద్ చెప్పాడు. ఒక్కరోజు ఒకడొచ్చి డబ్బులు తీసుకుని పోతుంటే చేతులెత్తడానికి సిగ్గుండాలంటూ త్రిగుణ్ ఫైర్ అయ్యాడు. ‘వాడికి సిగ్గు లేదు.. ఓట్లు వేసిన వాడికి తెలియదా?’ అని త్రిగుణ్ ఫైర్ అయ్యాడు. ముఖేష్ కూడా చాలా ఫైర్ అయిపోయాడు. ఓటేసిన ప్రతి ఒక్కడికీ స్పైన్ లేదని త్రిగుణ్.. గేమ్‌కే సూట్ అవడని ముఖేష్ ఫైర్ అయ్యాడు. డబ్బు కోసం వీళ్లిద్దరూ అంతలా ఫైర్ అవడం ఏంటో అర్ధం కాలేదు. ఈ నేపథ్యంలో ముఖేష్, త్రిగుణ్ మాటలు బాగా జారారు. తను ఆలోచించే ఇచ్చానని అమన్ చెప్పాడు. ఒక్కొక్కడి సిట్యువేషన్ అడిగావా? అని ముఖేష్.. అమన్‌పై ఫైర్ అయ్యాడు. ‘గేమ్ ఆడుదాం.. వదిలెయ్ ముఖేష్’ అంటూ త్రిగుణ్ అన్నాడు. మొత్తానికి డబ్బు రూ.15 లక్షలు కోల్పోవడం ఏమాత్రం త్రిగుణ్, ముఖేష్ జీర్ణించుకోలేకపోయారని తెలుస్తోంది.
అమన్, త్రిగుణ్ మధ్య పెద్ద గొడవ జరిగింది. అమన్‌ను రా అనడంతో అతను ఫైర్ అయ్యాడు. ఆ తరువాత నాగ్.. మిథిలేష్‌ను స్టేజ్‌పైకి పిలిచారు. తను ఎందుకు ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింతో మిథిలేష్ చెప్పాడు. ఎవరికి.. ఎవరి గురించి జాగ్రత్తగా ఉండాలో చెప్పమని నాగ్.. మిథిలేష్‌కు సూచించారు. అమన్‌కు రోహిత్‌తో జాగ్రత్తగా ఉండమని మిథిలేష్ చెప్పాడు. ఓన్ గేమ్ ఆడమని.. అప్పుడే రోహిత్‌కు మంచి కాంపిటేటర్ అవుతాడని చెప్పాడు. ముఖేష్‌తో జాగ్రత్తగా ఉండాలని వర్షిణికి చెప్పాడు. ముఖేష్‌తో క్లోజ్‌నెస్ మాత్రమే స్క్రీన్‌పై కనిపిస్తోందని.. ఓన్ డెసిషన్ తీసుకోమని చెప్పాడు. త్రిగుణ్‌తో జాగ్రత్తగా ఉండాలని వంశీకి చెప్పాడు. అతను ట్రిగర్ చేయడం వల్లనే వంశీ ట్రిగర్ అవుతున్నాడని చెప్పాడు. రామ్ ప్రసాద్‌తో జాగ్రత్తగా ఉండాలని నరేష్‌కి చెప్పాడు. షాలినితో జాగ్రత్తగా ఉండాలని చరణ్‌కు చెప్పాడు. ఒంటరిగా వచ్చి ఆడితే బాగుంటుందని మిథిలేష్ చెప్పాడు. ఆ తరువాత రూ.15 లక్షలతో ఏం చేయబోతున్నావని మిథిలేష్‌ను అడిగితే ఏదైనా మూవీలో అవకాశం కోసం ప్రయత్నిస్తానని చెప్పి వెళ్లిపోయాడు.
నామినేషన్స్ నుంచి ఝాన్సీని సేవ్ చేశారు. బీబీ జంగిల్ గేమ్ ఆడించారు. ఒక బోర్డుపై చాలా యానిమల్స్ ఉన్నాయి. కింద ఉన్న మెడల్ పిక్ చేసి దాని క్వాలిటీ చెప్పి అది ఎవరికి ఎందుకు ఇస్తావో చెప్పమని నాగ్ అన్నారు. బ్లైండ్ ఫాలోవర్ అనే మెడల్‌ను ముఖేష్.. అమన్‌కు ఇచ్చాడు. రోహిత్‌ను బ్లైండ్‌గా ఫాలో అవుతాడని ముఖేష్ చెప్పాడు. షాలినికి రామ్ ప్రసాద్ షో ఆఫ్ అని ఇచ్చాడు. అందరి అటెన్షన్ కోరకుంటుందని చెప్పాడు. షాలిని వచ్చి పాయిజన్ స్నేక్ అనేది అపూర్వకు ఇచ్చింది. మనిషి పర్సనాలిటీని బ్యాడ్ చేయడానికి అపూర్వ ప్రయత్నిస్తుందని షాలిని చెప్పింది. దేబ్జానికి నరేష్ లేజీ ఇచ్చాడు. అపూర్వ వచ్చేసి త్రిగుణ్‌కు పాయిజనస్ ఇచ్చింది. అపూర్వ మెడలో ఒక పాము ఉందని.. ఒక పాముకు మరో పాముకు మెడల్ ఇచ్చిందని నాగ్ సరదాగా అన్నారు. త్రిగుణ్‌కి రోహిత్ కన్నింగ్ ఇచ్చాడు. సుధీర్‌ను పో బే అన్నావని.. మాటలు జాగ్రత్తగా ఉండాలని రోహిత్‌కు నాగ్ చెప్పారు. త్రిగుణ్‌కు వంశీ ఎన్నోయింగ్ ఇచ్చాడు. రోహిత్‌కు ఝాన్సీ లేజీ ఇచ్చింది. ముఖేష్‌కు వర్షిణి ఫియర్‌లెస్ ఇచ్చింది. బ్లైండ్ ఫాలోవర్‌ను వర్షిణికి చరణ్ ఇచ్చాడు. సృష్టి వచ్చేసి అపూర్వకు ఎన్నోయింగ్ ఇచ్చింది.
షాలినికి అన్నోయింగ్‌ను దేబ్జాని ఇచ్చింది. త్రిగుణ్ వచ్చేసి వంశీకి షో ఆఫ్ ఇచ్చాడు. అమన్ వచ్చేసి కన్నింగ్‌ను ముఖేష్‌కు ఇచ్చాడు. అమెజాన్ అందరికీ గిఫ్ట్స్ పంపించిందని అందరూ వాటిని తీసుకోమని నాగ్ చెప్పారు. ఆ తరువాత ఫహాద్ ఫాజిల్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన నటించిన ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ చిత్రం ప్రమోషన్స్ కోసం వచ్చారు. టీమ్ సూరి, టీమ్ దివ్యలుగా టీమ్స్‌ను ఏర్పాటు చేసి గేమ్ ఆడించారు. ఆ తరువాత నామినేషన్స్ నుంచి త్రిగుణ్‌ను సేవ్ చేశారు. రోహిత్‌ను లేపి అసలు గేమ్‌కు ఎందుకు వచ్చావని నాగ్ అడిగారు. దీంతో రోహిత్ కాస్త కంగారు పడ్డాడు. గెలవడానికని చెప్పడంతో.. గెలిస్తే ఏం చేస్తావని అడిగారు. తన గెలుపును తన తల్లి, చెల్లి కోసం వచ్చానని.. వాళ్లే తన ప్రపంచమని రోహిత్ చెప్పాడు. రోహిత్ చెల్లికి బాబు పుట్టాడని.. ఆ బాబు ఫోటోను చూపించారు. రోహిత్ చాలా హ్యాపీ ఫీలయ్యాడు. ఈ వారం రోహిత్‌కు క్లాస్ తీసుకోవడమే కాకుండా.. హ్యాపీ న్యూస్ కూడా నాగ్ అందించారు. ఆ తరువాత నామినేషన్స్ నుంచి చరణ్‌ను సేవ్ చేశారు. ఆ తరువాత నామినేషన్స్ నుంచి అమన్‌ను సేవ్ చేశారు.
ఇక మిగిలిన వంశీ, వర్షిణిని యాక్టివిటీ రూమ్‌కి నాగ్ పిలిచారు. వంశీని.. వర్షిణి ఫోటో దగ్గర.. వర్షిణిని వంశీ ఫోటో దగ్గర నిలబెట్టారు. లివింగ్ రూమ్‌లోని కంటెస్టెంట్స్‌కు లాస్ట్ టెమ్టేషన్ నాగ్ ఇచ్చారు. ఎవరితో టెమ్టేషన్ మొదలైందో.. ఫైనల్ టెమ్టేషన్ వారికే ఇస్తున్నట్టు చెప్పారు. ముఖేష్‌ను నాగ్ లేపి యాక్టివిటీ రూమ్‌లో ఉన్నవారిలో ఎవరినైనా సేవ్ చేయవచ్చని చెప్పారు. దీనికి కెప్టెన్సీ పోతుందని.. నేరుగా నామినేట్ అవుతావని చెప్పారు. దీంతో ముఖేష్.. ఇద్దరినీ సేవ్ చేశాడు. దీనికి వర్షిణి.. ఆడియెన్స్ ఏం డిసైడ్ చేస్తే దానిని అంగీకరిస్తానని చెప్పడంతో నాగ్ అసలు నిన్నెవరు అడగలేదని చెప్పారు. ఇక్కడి నుంచి కూడా ముఖేష్ ఆటను ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తావా? అని అడిగారు. వంశీ గురించి ఆలోచించవా? అని అడిగారు. ఆ తరువాత ముఖేష్ డెసిషన్ ఏంటని అడగటంతో వాళ్లను సేవ్ చేస్తానని చెప్పాడు. కెప్టెన్సీ బ్యాండ్‌ను ముఖేష్ చేతి నుంచి తీయించి అపూర్వ చేతికి బ్యాండ్ పెట్టించారు. మొత్తానికి వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన ఇద్దరూ నక్క తోకను తొక్కి వచ్చినట్టున్నారు. ఒకరు రూ.15 లక్షలు తీసుకుని వెళ్లిపోతే.. మరొకరు వచ్చీరాగానే కెప్టెన్ అయ్యారు. దశావతారంలో భాగంగా వచ్చే వారం టోటల్ డామినేషన్ అని నాగ్ చెప్పారు. సుధీర్ పుట్టినరోజు రేపు కావడంతో నాగ్ విషెస్ చెప్పి.. సృష్టితో కూడా చెప్పించారు.
కోలీవుడ్ సూపర్ స్టార్, తమిళనాడు సీఎం దళపతి విజయ్ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న జేసన్ సంజయ్.. తన మొదటి…
ఒక సామాన్యమైన తెలుగు దర్శకుడిగా తన కెరీర్ మొదలుపెట్టి, ఇప్పుడు ఏకంగా ప్రపంచ స్థాయి దర్శకుడిగా ఎదిగిన ఎస్ఎస్ రాజమౌళి…
మెగాస్టార్ చిరంజీవి అంటే కేవలం ఒక హీరో మాత్రమే కాదు, ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు. ఆయన గురించి సోషల్…
‘ది ప్యారడైజ్’ సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో కంటే రాజకీయాల్లోనే ఎక్కువ హీట్ పెంచుతోంది. ఈ సినిమాలో పాలిటిక్స్ భగ్గుమంటున్నాయి అని…
ఇటీవలి కాలంలో త్రిగుణ్ కాస్త తగ్గాడు. దీనికి కారణం.. ఆయన స్ట్రాటజీ ఏంటనేది అందరికీ తెలిసిపోవడమే. దీంతో అంతా ఆయనకు…
హోస్ట్ నాగార్జున వచ్చి శుక్రవారం ఎపిసోడ్ చూశారు. వైట్ గోల్డ్ సంస్థ నుంచి కెప్టెన్ అయిన ముఖేష్‌కి గోల్డ్ మెడల్…