వీకెండ్ వచ్చేసింది. హోస్ట్ నాగార్జున వచ్చిన వెంటనే శుక్రవారం ఏం జరిగిందో చూశారు. ముఖేష్‌ను నిన్న గేమ్ నుంచి తీసేయడంపై వర్షిణి అతనికి క్లారిటీ ఇచ్చింది. ఇక ఎవరిని కెప్టెన్‌ని చేయాలన్న విషయమై ఎవరికి వారు.. స్కెచ్‌లు గీసుకున్నారు. కెప్టెన్ అన్న పదానికి సంబంధించిన ఆల్ఫా బెట్స్‌ను తాము ఎవరినైతే కెప్టెన్‌ని చేయాలనుకుంటున్నారో వారికి పెట్టాలి. ఎవరికి ఎక్కువగా వస్తే వారు విన్. ముందుగా ముఖేష్ వచ్చి నరేష్‌కు సపోర్ట్ చేశాడు. శివ వచ్చి అమన్‌ను కెప్టెన్ చేశాడు. రామ్ ప్రసాద్ నరేష్‌కు సపోర్ట్ చేశాడు. అమన్‌కు వర్షిణి, నీతూ, శ్వేత, సపోర్ట్ చేశారు. నరేష్‌కు దేబ్జాని, సుధీర్, త్రిగుణ్ ఎక్కువ వర్డ్స్ నరేష్‌కు రావడంతో అతను కెప్టెన్ అయ్యాడు.
వైట్ గోల్డ్ మెడల్‌ను నరేష్‌కు అందజేశారు. తరువాత రామ్ ప్రసాద్, నరేష్‌లు శివ్‌తో మాట్లాడారు. అసలెందుకు అమన్‌ను సపోర్ట్ చేశావని రామ్ ప్రసాద్ అడిగాడు. ప్రతిసారీ త్రిగుణ్ కెమెరాలతో మాట్లాడతాడు. అన్నీ చెప్పి చేస్తాడు కదా.. ఈ క్రమంలోనే నరేష్‌ను కెప్టెన్‌ను చేస్తానని ఉంటాడని.. దానిని తాను మార్చగలనేమో ప్రయత్నించినట్టుగా శివ్ చెప్పాడు.
త్రిగుణ్ ప్రతి శనివారం నాగ్ వచ్చినప్పుడు అతడిని ప్రశ్నిస్తే ‘సర్ తప్పు చేశా సర్.. మరోసారి ఎప్పుడూ చేయను.. సారీ సర్’ అని చెబుతాడని రామ్ ప్రసాద్ చెప్పడంతో దేబ్జాని, వర్షిణి బాగా నవ్వారు. ఫోన్‌పే నుంచి వచ్చిన వాటిలో ఐదు గోల్డ్ కాయిన్స్ రామ్ ప్రసాద్‌కు మిగిలినవి వంశీకి నరేష్ ఇచ్చాడు. నరేష్‌కు నాగ్ కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. హ్యాపీగా ఉన్నావా? అంటే హ్యాపీ అని చెప్పాడు. ఎందుకంటే తన తమ్ముడు హౌస్‌లోకి వచ్చి సెల్ఫిష్‌గా ఉండమని చెప్పాడని.. అలా ఆడే కెప్టెన్ అయినట్టుగా చెప్పాడు. ఇంగ్లీష్‌లో స్పీచ్ ఇవ్వమని నాగ్ చెబితే ఏదో ట్రై చేశాడు. ‘ యామ్ నాట్ సారీ, ఐయామ్ సారీ’ అని ఒక టేబుల్‌కి అంటించి బజర్ పెట్టారు. పది వారాలు అయిపోయాయని.. ఈ పది వారాల మీ జర్నీలో మీరు బాగా హర్ట్ అయిన సంఘటన, మిమ్మల్ని హర్ట్ చేసిన పర్సన్ గురించి చెప్పమన్నారు. ముందుగా వర్షిణి వచ్చి త్రిగుణ్‌ను నిలబెట్టింది. గత వారం నామినేషన్ సమయంలో తన క్యారెక్టర్ గురించి మాట్లాడాడని తనకు అతను ముందు నుంచే తెలుసని.. అలా త్రిగుణ్ చెప్పినప్పుడు ఎవరితోనూ షేర్ చేసుకోలేదని ఆ పెయిన్‌ను మనసులో పెట్టుకున్నానని తన తల్లి వస్తే ఆమెతో పంచుకుందామనుకున్నానని కానీ అది కూడా అవలేదని చెప్పింది.
దీనికి త్రిగుణ్ సారీ చెప్పాడు. తామిద్దరం బయట నుంచి మంచి ఫ్రెండ్స్ అని కానీ ఒక గేమ్‌లో తనను చూజ్ చేసుకోకపోవడం తనకు నచ్చలేదని.. కేవలం ఫ్రెండ్షిప్ విషయంలోనే అలా అన్నానని మళ్లీ త్రిగుణ్.. వర్షిణికి సారీ చెప్పాడు. ఎక్కడో ఎవరో ఏదో అనుకుంటారని బాధ పడొద్దని నాగ్ చెప్పారు. శ్వేత వచ్చి రామ్ ప్రసాద్ పేరు చెప్పింది. నిన్నటి గేమ్‌లోనే తనను సరిగా చూడకుండా గేమ్ నుంచి తీసేశాడని.. దాని కారణంగా తను కెప్టెన్సీ కోల్పోయానని శ్వేత చెప్పింది. దీనికి సంబంధించిన వీడియోను నాగ్ చూపించారు. వీడియోలో ముఖేష్, శ్వేత ఇద్దరి లెగ్స్ బయటే ఉన్నాయి. దీంతో రామ్ ప్రసాద్ డెసిషన్ కరెక్టేనని నాగ్ చెప్పారు. తను సారీ చెప్పడం లేదని రామ్ ప్రసాద్ అన్నాడు. నీతూ వచ్చేసి వంశీ పేరు చెప్పారు. మొన్న తన అసిస్టెంట్ గొడుగు కూడా పట్టుకునేందుకు పనికి రావని చెప్పాడని అది తనను బాధించిందని చెప్పింది. దీనికి వంశీ సారీ చెప్పాడు. మనల్ని మనం ఫిజికల్‌గా కొట్టుకున్నా కూడా బయటకు పంపించాలని నాగ్ చెప్పారు. ఏడవొద్దని తనను తాను కొట్టుకున్నానని నీతూ చెప్పింది. నీతూ తనను తాను కొట్టుకున్న వీడియోను నాగ్ చూపించారు. నిన్నలా చూడటం తనకు చాలా బాధ అనిపించిందని నాగ్ చెప్పారు. తనింకెప్పుడూ చేయనని నీతూ చెప్పింది.
ముఖేష్‌ను లేపితే తానేది మనసులో పెట్టుకోలేదని తనకు ఎవరూ లేరని చెప్పాడు. శివ్ వచ్చేసి ముఖేష్ పేరు చెప్పాడు. తనను చాలా మాటలు అన్నాడని.. తను ఏడ్చానని శివ్ చెప్పాడు. ఆరోజు నీ పర్సనల్ గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో.. అని ఆ లైన్ తీశానని ముఖేష్ చెప్పాడు. దీనికి ముఖేష్ సారీ చెప్పాడు. నరేష్ వచ్చేసి త్రిగుణ్ పేరు చెప్పాడు. ఒక గేమ్‌లో తాము గెలిచి ఉంటే కెప్టెన్సీ రేసులో తాను ఉండేవాడినని.. త్రిగుణ్ గేమ్ టర్న్ తిప్పడం వలన తాను లాస్ అయ్యానని నరేష్ చెప్పాడు. దీనికి తాను హర్ట్ అయ్యానని చెప్పాడు. త్రిగుణ్ సారీ చెప్పాడు. అమన్ వచ్చేసి త్రిగుణ్ హర్ట్ చేశాడని చెప్పాడు. ఒక వర్డ్ అనబోయి ఆపిన విషయం గురించి హర్ట్ అయ్యానని చెప్పాడు. దానికి త్రిగుణ్ సారీ చెప్పాడు. అమన్‌కు ఇంకా మనసులో ఉందని అనుకోలేదని త్రిగుణ్ చెప్పాడు. తాను ఆ పదం వాడకుండా మింగేసినా కూడా అది తప్పేనని చెప్పాడు.
సుధీర్ వచ్చేసి ముఖేష్ తనను హర్ట్ చేశాడని చెప్పాడు. గత వారం తనకు కాలుకు దెబ్బ తగిలిందని చెప్పిన తర్వాత నమ్మకుండా యాక్షన్ చేస్తున్నానని అనడం తనను బాధించిందని చెప్పాడు. తాను సారీ చెప్పడం లేదని ముఖేష్ చెప్పాడు. కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కోసం తన కాలికి దెబ్బ ఉంది కదా అంటే వెంటనే సెటిల్ అవదు కదా.. మరి ఎలా ఆడతావంటే వెంటనే తగ్గిపోయిందని చెప్పాడన్నారు. అప్పుడు అందరం అలాగే అనుకున్నామని ముఖేష్ చెప్పాడు. వర్షిణి కూడా కెప్టెన్సీ కంటెండర్‌షిప్ ఉదయం నుంచే తనకు కాలు పూర్తిగా తగ్గిపోయిందనడంతో అలా అనుకున్నట్టుగా చెప్పింది. నీతూ తన పర్సనల్ విషయం చెప్పడం బాధ అనిపించిందని వంశీ చెప్పడంతో ఆమె సారీ చెప్పింది. రామ్ ప్రసాద్ వచ్చేసి తనను కన్నింగ్ అనడం చాలా బాధ అనిపించిందని వర్షిణి తనను హర్ట్ చేసిందని చెప్పాడు. ఆ కార్డును చింపేయమని నాగ్ చెప్పడంతో నరేష్ చింపేశాడు. తనను వెధవ అన్నా ఇబ్బంది లేదు కానీ తన ఫ్రెండ్ అయి ఉండి కన్నింగ్ అనడం బాధించిందని చెప్పాడు. తను సారీ చెప్పనని కానీ తను ఫీల్ అయ్యాడు కాబట్టి సారీ చెబుతున్నానని వర్షిణి చెప్పింది. ఎవరేమన్నా నువ్వు చాణిక్యుడివేనని నాగ్ అన్నారు.
దేబ్జాని వచ్చేసి రామ్ ప్రసాద్ తనను హర్ట్ చేశాడని చెప్పింది. అన్నింటిల చాలా హెల్ప్ చేస్తాడని కానీ తనకు ఓటు వేస్తాడనుకున్నానని కానీ వేయలేదని చెప్పింది. కెప్టెన్ అవ్వాలంటే వంశీ లేదంటే దేబ్జాని అవ్వాలని.. తను వంశీకి ఓటేయకుంటే డ్రా అవుతుందని.. అందుకే వంశీకి ఓటేసినట్టు చెప్పి దేబ్జానికి సారీ చెప్పాడు. త్రిగుణ్ వచ్చేసి వర్షిణి తనను హర్ట్ చేసిందని చెప్పాడు. తనను లేవకుండా ఉండాలని తొక్కుతాననడం తనకు ఈరోజు వరకూ డైజెస్ట్ అవలేదని చెప్పడం చాలా బాధించిందని చెప్పాడు. దీంతో వర్షిణి సారీ చెప్పింది. చాలా సార్లు తన కోసం త్రిగుణ్ నిలబడ్డాడని చెప్పింది. తను కూడా నిలబడ్డానని కానీ తను ఎక్కువ సార్లు నిలబడ్డాడని చెప్పింది. రామకృష్ణ వచ్చేసి నరేష్ తనను హర్ట్ చేశాడని చెప్పింది. ఫ్యామిలీ కోసం జరిగిన టాస్క్‌లో తను ఎంత మొత్తుకున్నా తనను తీసేసి ముఖేష్ పేరు చెప్పడం బాధించిందన్నాడు. దీనికి నరేష్ సారీ చెప్పాడు. ఆరోజు నరేష్ రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. దీంతో రామకృష్ణకు అన్యాయం జరిగింది. అదే విషయాన్ని ఇవాళ రామకృష్ణ చెప్పాడు.
జీరో అని రాసి ఉన్న మెడల్స్‌ను తెప్పించారు. ఈ హౌస్‌లో మీ ఉద్దేశంలో జీరో గేమర్ ఎవరని అడిగారు. రామ్ ప్రసాద్ ముందుగా జీర్ మెడల్‌ను వర్షిణికి వేశాడు. తన గేమ్ లేదని చెప్పాడు. వంశీ, శ్వేత వర్షిణికి వేశారు. సుధీర్‌కు అమన్, ముఖేష్, దేబ్జాని… శ్వేతకు రామకృష్ణ.. త్రిగుణ్‌కు శివ్, నీతూ… జీరో గేమ్ ఆడుతున్నాడని జీరో మెడల్ వేశారు. వెధవ, చవట అనడం తనకు నచ్చలేదని నాగ్ చెప్పారు. అంటే తను ఓడాలని ఆడుతున్నారంటే అది వాళ్ల గేమ్ అని నాగ్ చెప్పారు. నామినేషన్స్‌లో నీతూ కూడా మాటలు జారుతోందని త్రిగుణ్ చెప్పాడు. నీతూకి నరేష్.. శివకు వర్షిణి, త్రిగుణ్.. రామకృష్ణకు సుధీర్.. గేమ్ జీరో అని బ్యాడ్జ్ వేశారు. సుధీర్‌కి 3, వర్షిణికి 3 ఓట్లు రావడంతో టై అయ్యింది. దీంతో వాళ్లిద్దరిలో ఎవరికి ఎంత మంది ఓటేస్తారనడంతో మళ్లీ వర్షిణికి ఎక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో వర్షిణిని గార్డెన్ ఏరియాకు పిలిచి ఇక మీదట కెప్టెన్ అయ్యే అవకాశం లేదని పనిష్మెంట్ ఇచ్చారు. అలాగే రామకృష్ణను కూడా గార్డెన్ ఏరియాకు రమ్మన్నారు.
స్టార్ మాలో ప్రసారమవుతున్న ‘పుష్పకవిమానం’ వెబ్ సిరీస్ టీమ్ ప్రమోషన్ కోసం వచ్చారు. నాగ్ ఆ వెబ్ సిరీస్ ట్రైలర్ చూసి టీమ్‌ను అభినందించారు. దానిలో ఫాంటసీ, మిస్టరీ ఎలిమెంట్ అన్నీ ఉన్నాయని భరణి చెప్పాడు. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పి పంపించేశారు. రామకృష్ణ, వర్షిణి ఫ్యామిలీస్ తప్ప అందరి ఫ్యామిలీస్ వచ్చాయని. మీ ఇద్దరి ఫ్యామిలీస్ యాక్టివిటీ రూమ్‌లో వెయిట్ చేస్తున్నారని నాగ్ చెప్పారు. ఆర్కే, వర్షిణి ఇద్దరి తల్లులూ వచ్చారు. వారిలో ఒకరు మాత్రమే హౌస్‌లోకి వస్తారని ఎవరు రావాలో హౌస్మేట్స్ తేల్చాలన్నారు. చెట్టుకు ఆర్కే, వర్షిణిలలో ఎవరో ఒకరి ఫోటోను తగిలించాలని నాగ్ చెప్పారు. వర్షిణి ఫోటోను దేబ్జాని, నీతూ, వంశీ, సుధీర్, త్రిగుణ్, నరేష్, ముఖేష్ తగిలించారు. ఆర్కే ఫోటోను అమన్, శ్వేత, శివ్, రామ్ ప్రసాద్ మాత్రమే చెట్టుకు తగిలించారు. దీంతో వర్షిణి ఫ్యామిలీ హౌస్‌లోకి వస్తారని నాగ్ చెప్పారు. మీ అమ్మగారు రాలేరని అక్కడి నుంచే ఆమెతో మాట్లాడాలని చెప్పడంతో ఒకవైపు రామకృష్ణ… మరోవైపు అతని తల్లి బాగా ఎమోషనల్ అయ్యారు.
నాయనా బాగునవ్వా అని చాలా అమాయకంగా రామకృష్ణను అతని తల్లి పలకరించింది. మిమ్మల్ని గర్వంగా ఉంచాలని అనుకున్నానని ఇంతకు మించి తానేం చేయలేనని చెప్పాడు. తాను నవ్వుతూ ఉన్నానని నువ్వు కూడా నవ్వాలని తన తల్లిని రామకృష్ణ అడిగాడు. ఆమె నవ్వుతున్నానని చెప్పారు. రామకృష్ణ కూడా తాను స్ట్రాంగ్‌గా ఉన్నానని మీరు పది వారాలు ఉండగలిగినప్పుడు తాను ఐదు వారాలు ఉండలేనా? అన్నాడు. ఇక వర్షిణి వాళ్ల అమ్మ హౌస్‌లోకి వచ్చారు. రామకృష్ణ సారీ చెప్పారు. నరేష్‌ను నాటీ బాయ్ అని చెప్పారు. చాలా మెచ్యూర్డ్ అని అన్నారు. సూపర్ ఆడుతున్నావని చెబితే ఏంటి నేనా? అని వర్షిణి షాక్ అయ్యింది. నామినేషన్ పాయింట్స్ బాగా పెడుతున్నావని కూతురికి శ్రీలత చెప్పారు. ముఖేష్‌ను రిషి సార్ అని పిలిచారు. ముఖేష్ మదర్‌కి తాను ఫేవరెట్ అయిపోయానని వర్షిణి వాళ్ల అమ్మ చెప్పాడు. చిన్న చిన్న గొడవలవుతుంటాయని అవి పట్టించుకోవద్దని త్రిగుణ్ చెప్పడంతో బాగా కొట్టుకోండి.. తర్వాత మంచిగా ఉండండని చెప్పారు. మీలో మీరు కొట్టుకోండి.. మమ్మల్ని ఎంటర్టైన్ చేయండని శ్రీలత చెప్పారు. అబ్బాయిల్లోనే తనకు ఎక్కువ ఫేవరెట్స్ ఉన్నారని చెప్పారు. త్రిగుణ్ అయితే బ్లాస్ట్ అయిపోతుందని చెప్పారు. ఏం చేసినా తన కాళ్లు మొక్కడం బాగా అలవాటని.. అందుకే ముఖేష్ కాళ్లు మొక్కిందని చెప్పబోగా వర్షిణి ఆపేసింది. అంతా బయట చూశారని శ్రీలత సరదాగా చెప్పారు.
వీకెండ్ వచ్చేసింది. హోస్ట్ నాగార్జున వచ్చి ఏం ఇన్పుట్స్ ఇస్తారో.. ఎవరికి అక్షింతలు వేస్తారోనన్న ఆందోళన అయితే ఈవారం లేదు.…
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 5 దశాబ్దాలకు పైగా తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల…
బిగ్‌బాస్ షో నేడు త్రిగుణ్ ఫ్యామిలీ రాకతో ప్రారంభమైంది. త్రిగుణ్ కూతురు యూకీ ‘పాప’ అని పిలవడం విని హౌస్…
వైల్డ్ కార్డ్‌గా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శివ్‌కు ఎవరు సలహాలిచ్చారో ఏమో కానీ ఒక చెత్త గేమ్‌కు తెరదీశాడు.…
ఇది ఫ్యామిలీ వీక్ కాబట్టి హౌస్ అంతా సందడిగా మారింది. అందరినీ ఫ్రీజ్ చేసి ముఖేష్ వాళ్ల అమ్మను లోపలికి…
ఇవాళ కొందరు టీచర్స్గానూ.. మరికొందరు స్టూడెంట్స్గానూ యాక్ట్ చేయాలి. ముందుగా శ్వేత ఆర్ట్ అండ్ పీఈటీ టీచర్, శ్వేత డ్యాన్స్…