సినిమా వార్తలు

Biggboss10 Telugu: వామ్మో ఈ గొడవలేంటి? ఒకటా.. రెండా.. ప్రతిదీ రచ్చే..

షో ప్రారంభంలో మిథిలేష్ గురించి బిగ్‌బాస్ హౌస్‌లో అగ్నిపరీక్ష టీం అంతా సరదాగా మాట్లాడుకున్నారు. సరదాగా ప్రారంభమైన ఎపిసోడ్.. రణరంగంలా మారిపోయింది. ఒకటో రెండో గొడవలు కాదు.. ప్రతి దానికీ రచ్చే. ఇవాళేం (సోమవారం) జరిగిందో తెలుసుకుందాం. ఒక్కరోజులో బిగ్‌బాస్ హౌస్‌లో ఏం చేయాలో అన్నీ చేసి వెళ్లిపోయాడని రోహిత్ సరదాగా చెప్పాడు. అపూర్వ తను చేసిన పనిని ముఖేష్‌కు చెప్పింది. మీటింగ్ పెట్టకుంటే తాను చేసేది లేదని అతను చెప్పాడు. చాలా యారోగెంట్‌గా ముఖేష్ చెప్పాడు. ఆ తరువాత తనను సేవ్ చేసినందుకు ముఖేష్‌కు వంశీ థాంక్స్ చెప్పాడు. ముఖేష్ దగ్గరకు వెళ్లి అపూర్వ మీ థింగ్స్ అన్నీ తీస్తే తనవి పెట్టుకుంటానని అపూర్వ చెప్పింది. మీటింగ్ పెడితేనే అన్నీ చెబుతానని ముఖేష్ చెప్పాడు. దీంతో అందరినీ మీటింగ్‌కి పిలిచింది. ఇక్కడ కూడా అపూర్వతో ముఖేష్ గొడవపడ్డాడు. బయట నుంచి చూసి వచ్చావుగా.. ‘నేను చెప్పాలా? నీకు’ అని ముఖేష్ అనడంతో ఆమె అంత వెటకారం వద్దని చెప్పింది. మీకు మనుషులంటే చులకన అని ముఖేష్‌కు చెప్పింది. డిష్ వాషింగ్ షాలిని, ముఖేష్ చేస్తారని అపూర్వ చెప్పింది. కెప్టెన్‌కు రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పిన ముఖేషే ఏమాత్రం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడాడు. తనకు రూల్స్ పెట్టవద్దని అపూర్వపై ముఖేష్ పిల్లో విసిరేసి మరీ ఫైరయ్యాడు. దీంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది.

తనను అగౌరవపరిచినట్టుగా ప్రవర్తించారని ముఖేష్, త్రిగుణ్‌లను కెప్టెన్ అపూర్వ అని పిలవాలని చెప్పింది. ఇది కాస్త ఓవర్ అనిపించింది. త్రిగుణ్ దీనికి తను పిలవనని చెప్పాడు. ‘అపూర్వ గారు అని పిలుస్తా కానీ కెప్టెన్ అపూర్వ అని మాత్రం పిలవను’ అని త్రిగుణ్ వాదించాడు. ఫ్రీడం వచ్చింది.. ఫ్రీడం వచ్చిందని ముఖేష్ వెలకారంగా అరిచి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దేబ్జాని, త్రిగుణ్, రామ్ ప్రసాద్ ముగ్గురూ అగ్నిపరీక్ష టీం యూనిటీ గురించి మాట్లాడుకున్నారు. బిగ్‌బాస్ నాలుగవ అవతారం ‘టోటల్ డామినేషన్’లో భాగంగా బలం, నైపుణ్యంతో పాటు ఎప్పుడు ఎక్కడ దాడి చేయాలో తెలుసుకోవాలంటూ హౌస్‌మేట్స్‌ను రెండు జట్లుగా విడగొట్టాడు. షాలిని, సృష్టి, చరణ్, ముఖేష్, త్రిగుణ్, దేబ్జానిలతో ఒక టీం, మిగిలిన వారందరినీ మరో టీంగా చేశాడు. ఓ టాస్క్ ఇచ్చాడు. ఆ టాస్క్ ముందు ఎవరైతే ఆధిపత్యం చెలాయిస్తారో.. ఆ టీంకు భవిష్యత్తులో గెలిచేందుకు అవకాశాలు.. కీలక సమయాలల్లో తన సహకారం ఉంటుందని బిగ్‌బాస్ చెప్పారు. డ్యాగర్స్ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఒక డ్యాగర్‌ను తీసుకుని భద్రపరుచుకోవాలని బిగ్‌బాస్ చెప్పారు. నరేష్‌ నుంచి డ్యాగర్‌ను రోహిత్ టీం కొట్టేసింది. తన కత్తి తనకు ఇవ్వాలని నరేష్ గొడవ చేశాడు. రామ్ ప్రసాద్ దగ్గర దాచిన నరేష్ డ్యాగర్‌ను తీసుకునేందుకు త్రిగుణ్ యత్నించాడు. ఈ సమయంలోనూ ఫిజికల్ అయ్యారంటూ వాగ్వాదం జరిగింది.

కెప్టెన్ రూంలో ఫోటోస్ వెనుక డ్యాగర్స్‌ను ఝాన్సీ, వర్షిణి వాళ్లు దాచారు. వర్షిణిని వెనుక నుంచి ముఖేష్ పట్టుకున్నాడు. ఇప్పుడు ఆమెకు ఆడదాన్ననే విషయం గుర్తొచ్చినట్టు లేదు. అది కూడా టాస్క్‌లో భాగమే అయినా కూడా ముఖేష్ ఆమెను సరదాగా పట్టుకున్నాడు. ఇక నుంచి ఫిజికల్ అవ్వొద్దంటూ రోహిత్ మాస్టర్ ప్లాన్ వేశాడు. ఫిజికల్ అవ్వొద్దని త్రిగుణ్ టీం చెప్పింది. టీం భైరవ, టీం సప్తశక్తి రెండు టీంలకు ‘రణరంగంలో రథ నిర్మాణం’ టాస్క్‌ను బిగ్‌బాస్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో రథాన్ని నిర్మించాలి. దీనికోసం బార్స్ పంపిస్తుంటాడు బిగ్‌బాస్. వాటిని రెండు టీంలు సేకరించి ప్రత్యర్థులకు దక్కకుండా జాగ్రత్త చేసుకోవాలి. ఆ తరువాత ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వారు రధ విడి భాగాలను అమర్చాలి. ఎవరైతే ఎక్కువ విడి భాగాలను అమర్చుతారో వారు రథంపై జెండా ఎగురవేయాలి. ఈ టాస్క్‌కి రోహిత్, షాలిని సంచాలక్‌గా ఉంటూనే ఆడతారు. రోహిత్, షాలిని టాస్క్ గురించి మాట్లాడుకుంటుంటే మధ్యలో అపూర్వ వెళ్లి ‘మనం మాట్లాడుకుందామా?’ అని అడిగింది. దీంతో షాలిని గొడవకు దిగింది. టాస్క్ గురించి మాట్లాడుతుంటే మధ్యలో వస్తావేంటని షాలిని గొడవ చేసింది.

టాస్క్ ప్రారంభమైంది. టాస్క్‌లోని వారంతా కొందరు బార్స్ సంపాదించడం కోసం.. మరికొందరు వాటిని కాపాడటం కోసం సిద్ధమయ్యారు. ఈ టాస్క్‌లో ప్రతి ఒక్కరూ చాలా బాగా ఆడారు. అపూర్వ చూడకుండా షాలిని డ్యాగర్ తీసిందని చెప్పడంతో అంతా పరిగెత్తుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. త్రిగుణ్, దేబ్జాని పెద్ద గొడవ చేస్తుంటే రోహిత్ తన టీంను అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోయాడు. సిగ్గులేకుండా ఒకమ్మాయి ఉన్నప్పుడు అటాక్ చేస్తావా? అని షాలిని గొడవకు దిగింది. ఆడపిల్ల ఉన్నప్పుడు ఒక్కడివి వెళ్లావని.. అడ్వాంటేజ్ తీసుకున్నావని రోహిత్‌పైకి త్రిగుణ్ గొడవకు వెళ్లాడు. షాలిని వాస్తవానికి అక్కడ హైడ్రామా చేసింది. తను డ్యాగర్ నిజంగానే తీసుకున్నట్టుగా పరిగెత్తేందుకు యత్నించి డ్రామా చేయడంతో అది చూసిన రోహిత్ టీం నిజమే అనుకుంది. దీంతో గొడవ జరిగింది. షాలిని, అపూర్వ ఇద్దరూ తగ్గలేదు. షాలిని టేబుల్‌పైకి ఎక్కి పడిపోతుంటే.. ఇంత గొడవలోనూ రోహిత్ ఆమెను పట్టుకున్నాడు. షాలిని పెద్దగా ఏడ్చి నానా రచ్చ చేసింది.

షాలినిని తను ఆ డ్యాగర్ నీదా అని అడిగితే.. చెప్పకుండా త్రిగుణ్ అని పిలిచిందని.. దీంతో అది తమ డ్యాగరే అనుకున్నట్టుగా రోహిత్ చెప్పాడు. ఈ నేపథ్యంలో త్రిగుణ్ వచ్చి రోహిత్‌ను బాగా రెచ్చగొట్టాడు. ఆ సమయంలో సంయమనం పాటించిన రోహిత్‌ని మెచ్చుకోవాలి. ఆడంగిలా పట్టుకున్నావని రోహిత్‌ని త్రిగుణ్ అన్నాడు. అప్పుడు ఝాన్సీ కూడా ‘త్రిగుణ్ అన్న తప్పు మాట్లాడుతున్నావు’ అని చెప్పింది. ఆ తరువాత మళ్లీ టాస్క్ ప్రారంభమైంది. ఫౌల్ ఆడిన ముఖేష్‌ను రోహిత్ పట్టుకున్నాడు. తనను తోశాడంటూ రోహిత్‌పై ముఖేష్ గొడవకు దిగాడు. షాలిని వర్సెస్ అమన్ మధ్య పెద్ద గొడవ జరిగింది. తొండాట ఆడారని షాలిని అనడంతో అమన్ గొడవకు దిగాడు. గొడవంతా రచ్చ రచ్చ అయ్యింది. ఆ తరువాత షాలిని.. రోహిత్‌ని హగ్ చేసుకుంది. దీంతో అంతా కూల్. రౌండ్ 1లో టీం భైరవ దగ్గర 32.. టీం సప్త శక్తి దగ్గర 19 బ్రిక్స్ ఉన్నాయని రోహిత్ చెప్పాడు. దీంతో టైం భైరవ ముందంజలో ఉంది. మొత్తానికి బిగ్‌బాస్ టాస్క్ ఏమో కానీ హౌస్ మొత్తం నిజంగానే రణరంగంలా మారింది.

Telugu Cinema 360

Recent Posts

బాలయ్య కోసం రేసులో ఇద్దరు దర్శకులు.. కొరటాల సినిమా ఆగిపోయిందా..?

కొరటాల శివ నెక్స్ట్ సినిమా గురించే టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్. జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన దేవర…

23 hours ago

ఇదెక్కడి దిక్కు మాలిన కథ.. ఇదెక్కడి సినిమా.. కీర్తి సురేష్‌కు ఏమైంది..?

అసలు కీర్తి సురేష్‌కు ఏమైంది..? మహానటి లాంటి అద్భుతమైన సినిమాతో ఇండస్ట్రీలో ఒక రేంజ్ ఇమేజ్, గౌరవం తెచ్చుకున్న కీర్తి,…

2 days ago

అప్పుడు నవనీతమ్మా.. ఇప్పుడు నారాయణమ్మ.. మళ్లీ దొరికిపోయావా తమన్..!

జులాయి సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ గురించి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన ఒక ఫేమస్ డైలాగ్ ప్రతి ఒక్కరికీ గుర్తుండే…

2 days ago

అంతా ఫేక్.. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు.. అంతా కనికట్టు..!

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఫేక్ కలెక్షన్స్ గోల. ఒకప్పుడు సినిమా 100 రోజులు ఆడితే హిట్ అని…

2 days ago

Biggboss10 Telugu: రోహిత్‌కు క్లాసే కాదు.. హ్యాపీ న్యూస్ అందించిన నాగ్..

నిన్న (శనివారం) షో జరిగిన తర్వాత ఏం జరిగిందో హోస్ట్ నాగార్జున చూపించారు. జనాల మనసు గెలుచుకుని వెళితే బాగుంటుందని…

2 days ago

సిగ్మాతో ఏం చేయబోతున్నారు.. సందీప్ కిషన్ జాతకం ఇప్పటికైనా మారుతుందా..?

కోలీవుడ్ సూపర్ స్టార్, తమిళనాడు సీఎం దళపతి విజయ్ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న జేసన్ సంజయ్.. తన మొదటి…

3 days ago