‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అఖిల్ రాజ్ వివాదంలో చిక్కుకున్నారు. ఓ ఫుడ్ డెలివరీ బాయ్‌తో ఆయన వాగ్వాదానికి దిగినట్లు, అనంతరం అతడిపై దాడికి ప్రయత్నించినట్లు కనిపిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, తప్పుగా ఆర్డర్ డెలివరీ అయిన నేపథ్యంలో ఫుడ్ డెలివరీ బాయ్ క్షమాపణలు చెప్పినప్పటికీ అఖిల్ రాజ్ ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. వీడియోలో అఖిల్ రాజ్ అతడి వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా, కుటుంబ సభ్యులు అడ్డుకునే దృశ్యాలు కనిపిస్తున్నాయి.
అంతేకాకుండా, వీడియో చిత్రీకరిస్తున్న వ్యక్తిని రికార్డింగ్ ఆపాలని, వీడియో డిలీట్ చేయాలని హెచ్చరిస్తున్నట్లుగా కూడా వినిపిస్తోంది. మరోవైపు, ఫుడ్ డెలివరీ బాయ్ తనకు తప్పిదం జరిగినందుకు క్షమాపణ చెప్పానని చెబుతున్నాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఫుడ్ డెలివరీ సిబ్బందితో మర్యాదగా వ్యవహరించాలని, చిన్న తప్పిదానికి ఇలాంటి ప్రవర్తన సమంజసం కాదంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు పూర్తి వివరాలు బయటకు రావాలని అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం అఖిల్ రాజ్ ‘అర్జునుడి గీతోపదేశం’ చిత్రంలో నటిస్తున్నారు. సతీష్ గోగాడ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దివిజ ప్రభాకర్, ఆదిత్య శశికుమార్, సదన్, వసంతిక మచ్చ, రాజీవ్ సాలూర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు.
అయితే వైరల్ అవుతున్న వీడియోపై అఖిల్ రాజ్ లేదా ఆయన బృందం నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన వెలువడలేదు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర' అసలు థియేటర్లలోకి వస్తుందా రాదా అనే అనుమానాలు ఇప్పుడు…
టాలీవుడ్‌లో తనకంటూ ఒక స్పెషల్ కామెడీ టైమింగ్ క్రియేట్ చేసుకున్న హీరో శ్రీవిష్ణు, ఇప్పుడు 'కామ్రేడ్ కళ్యాణ్' సినిమాతో రాబోతున్నారు.…
బిగ్‌బాస్ 10 తెలుగు రోజురోజుకూ దారుణంగా మారుతోంది. సెలబ్రిటీలు మరింత రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా హోస్ట్ నాగార్జున వచ్చి వెళ్లిపోయాక ప్రేక్షకుల్లో…
టాలీవుడ్‌లో ఈ మధ్య వందల కోట్ల బడ్జెట్‌తో భారీ సినిమాలు తీస్తున్నారు కానీ, వాటికి తగ్గ కనీస ప్లానింగ్ అనేదే…
త్రిగుణ్, రామ్ ప్రసాద్, వంశీ కిచెన్ క్లీన్ చేస్తుండగా షో ప్రారంభమైంది. బాత్రూంలో నీళ్లు కారుతున్నాయని రోహిత్ కంప్లైంట్ చేశాడని…
సీనియర్ నటి ఊర్వశి శారద తాజా పరిస్థితి చూసి సోషల్ మీడియాలో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇటీవల అక్టోబర్…