సినిమా వార్తలు

‘ఓ.! సుకుమారి’ సెన్సార్ పూర్తి.. జూలై 17న పాన్ ఇండియా రిలీజ్

యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ నటి ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న గ్రామీణ కుటుంబ వినోదభరిత చిత్రం ‘ఓ.! సుకుమారి’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు.

విమర్శకుల ప్రశంసలు అందుకున్న శివం భజే తర్వాత అదే బ్యానర్ నుంచి వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఏ (U/A) సర్టిఫికేట్ పొందింది. వినోదం, ప్రేమ, భావోద్వేగాలు, నవ్వులతో కూడిన పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోనుందని చిత్రబృందం తెలిపింది.

ఈ చిత్రానికి ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. రజాకార్, పోలిమేర చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన సి.హెచ్. కుషేందర్ కెమెరా బాధ్యతలు నిర్వహించగా, ఎం.ఎం. కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు సంగీతం సమకూర్చారు. బలగం ఫేమ్ తిరుమల ఎం. తిరుపతి ఆర్ట్ డైరెక్టర్‌గా, శ్రీ వరప్రసాద్ ఎడిటర్‌గా పనిచేశారు. స్వయంభు చిత్రానికి కూడా కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న అను రెడ్డి అక్కటి ఈ చిత్రానికి వస్త్రాల రూపకల్పన చేశారు. ప్రముఖ గేయరచయిత పూర్ణచారి పాటలకు సాహిత్యం అందించారు.

‘ఓ.! సుకుమారి’ చిత్రం జూలై 17న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Telugu Cinema 360

Recent Posts

విశ్వంభరను మరిచిపోదామా.. బాస్ సినిమా బాక్సుల్లోంచి బయటికి రానట్లేనా..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర' అసలు థియేటర్లలోకి వస్తుందా రాదా అనే అనుమానాలు ఇప్పుడు…

5 hours ago

కామ్రేడ్ కళ్యాణ్ ట్రైలర్ రివ్యూ.. వాళ్ల మనోభావాలు దెబ్బతింటే అంతే సంగతులు..!

టాలీవుడ్‌లో తనకంటూ ఒక స్పెషల్ కామెడీ టైమింగ్ క్రియేట్ చేసుకున్న హీరో శ్రీవిష్ణు, ఇప్పుడు 'కామ్రేడ్ కళ్యాణ్' సినిమాతో రాబోతున్నారు.…

16 hours ago

Biggboss10 Telugu: రెచ్చిపోతున్న సుధీర్.. పడిపోతున్న గ్రాఫ్..

బిగ్‌బాస్ 10 తెలుగు రోజురోజుకూ దారుణంగా మారుతోంది. సెలబ్రిటీలు మరింత రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా హోస్ట్ నాగార్జున వచ్చి వెళ్లిపోయాక ప్రేక్షకుల్లో…

17 hours ago

ఇదెక్కడి దిక్కుమాలిన ప్లానింగ్.. కనీసం ట్రైలర్స్ కట్ చేయడానికి టైమ్ దొరకట్లేదా..?

టాలీవుడ్‌లో ఈ మధ్య వందల కోట్ల బడ్జెట్‌తో భారీ సినిమాలు తీస్తున్నారు కానీ, వాటికి తగ్గ కనీస ప్లానింగ్ అనేదే…

17 hours ago

Biggboss10 Telugu: హాట్ హాట్‌గా నామినేషన్స్.. ఈవారం కూడా కామనర్స్ బలి..

త్రిగుణ్, రామ్ ప్రసాద్, వంశీ కిచెన్ క్లీన్ చేస్తుండగా షో ప్రారంభమైంది. బాత్రూంలో నీళ్లు కారుతున్నాయని రోహిత్ కంప్లైంట్ చేశాడని…

1 day ago

లెజెండరీ నటి శారద పరిస్థితి చూస్తున్నారా.. 81 ఏళ్ళ వయసులో కూడా..!

సీనియర్ నటి ఊర్వశి శారద తాజా పరిస్థితి చూసి సోషల్ మీడియాలో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇటీవల అక్టోబర్…

2 days ago