Menu
BREAKING
Bigg Boss10 Telugu: అన్ని భాషల్లోనూ విజయ్‌కు ఐలవ్యూ చెప్పానన్న రష్మిక… నీతూ ఎలిమినేట్   |   Bigg Boss10 Telugu: వంశీకి క్లాస్.. త్రిగుణ్‌కు మాస్ ఎలివేషన్   |   Bigg Boss10 Telugu: ఈవారం బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరు?   |   Bigg Boss10 Telugu: కెప్టెన్ అయిన అమన్.. నరేష్‌ కోసం కన్నీళ్లు పెట్టుకున్న రామ్ ప్రసాద్   |   Bigg Boss10 Telugu: నాగ్ సహా ఒక్కొక్కరినీ ఉతికి ఆరేసిన చరణ్   |   మారిపోయిన జేమ్స్ బాండ్.. నయా బాంబ్ బాబు ఎవరో తెలుసా..?   |   2000 కోట్ల దిశగా రామాయణ.. ఆ రికార్డు రాముడి సొంతం అవుతుందా..?   |   నేను రాను.. వచ్చే సమస్యే లేదు.. కుండ బద్ధలు కొట్టిన రోహిత్ నాయుడు..!   |   ట్రెండింగ్‌లో జటాయు ఎర్త్స్ సెంటర్.. ఆ వైరల్ ప్లేస్ ఎక్కడుందో తెలుసా..?   |   ‘వారణాసి’ వాయిదా దాదాపు ఖాయమేనా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా..?   |   ఫేక్ గాళ్ల తాట తీయండి.. కేంద్రమంత్రికి ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి విన్నపం..!   |   అనిల్ రావిపూడితో జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు అవసరమా.. అవసరమే..!   |   బాహుబలి 2 ఔట్.. నెక్ట్స్ టార్గెట్ ధురంధర్ 2.. అక్కడ రామాయణ ఊచకోత..!   |   రియల్ స్టార్ శ్రీహరి ఇంట శుభకార్యం.. పెళ్ళి కొడుకు అవుతున్న పెద్ద కొడుకు..!   |   Bigg Boss10 Telugu: మీరు మీరు కొట్టుకోండి.. మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయండి..

ఓటీటీలోకి విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్లు’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీలోకి విజయ్ ఆంటోనీ 'వంద దేవుళ్లు'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘వంద దేవుళ్లు’ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. విజయ్ ఆంటోనీ పుట్టినరోజు సందర్భంగా తెలుగు ZEE5 ఈ చిత్రం డిజిటల్ రిలీజ్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా ఈ ఆగస్టులో తెలుగు ZEE5లో స్ట్రీమింగ్ కానుండగా, ఖచ్చితమైన విడుదల తేదీని త్వరలో వెల్లడించనున్నట్లు ప్లాట్‌ఫామ్ తెలిపింది.

నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘వంద దేవుళ్లు’ థియేటర్లలో మంచి స్పందనను అందుకుంది. హృదయాన్ని హత్తుకునే కథ, బలమైన భావోద్వేగాలు, కుటుంబ బంధాలను అద్భుతంగా చూపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ సినిమాలో తన కుటుంబం కోసం జీవితాన్ని అంకితం చేసిన ఓ వితంతువు తల్లి కథను చూపించారు. నలభై ఏళ్ల వయసు దాటిన తర్వాత ఆమె మరోసారి పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంటుంది. అయితే సమాజం, బంధువులు, గ్రామస్థుల నుంచి ఆమెకు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. అలాంటి సమయంలో తన తల్లి ఆనందమే ముఖ్యమని భావించి ఆమె నిర్ణయానికి అండగా నిలిచే కుమారుడి పాత్ర సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుంది.

ఓటీటీలోకి విజయ్ ఆంటోనీ 'వంద దేవుళ్లు'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మాతృత్వం, త్యాగం, కుటుంబ బంధాలు, మహిళల వ్యక్తిగత జీవితంపై సమాజం విధించే పరిమితులు వంటి అంశాలను హృద్యంగా ఆవిష్కరించిన ఈ చిత్రం థియేటర్లలో పాజిటివ్ టాక్‌తో మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు అదే భావోద్వేగ అనుభూతిని ఓటీటీ ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమవుతోంది.

ఇటీవల ‘పరిమళ & కో’తో కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకున్న తెలుగు ZEE5, ఇప్పుడు ‘వంద దేవుళ్లు’తో మరో హృదయాన్ని తాకే కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఈ చిత్రం ఆగస్టులో తెలుగు ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. విడుదల తేదీపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Pranav

Writer and contributor at Telugu Cinema 360