Menu
BREAKING
అయ్యా మోహన్ బాబు గారు.. మీ రేంజ్ ఏంటి.. ఈ క్యారెక్టర్స్ ఏంటి సర్..?   |   ఆ ప్యాన్ ఇండియన్ దర్శకుడిపై ప్రెజర్.. అంతా వారసుడి మహిమ..!   |   Biggboss10 Telugu: రోహిత్‌ వర్సెస్ అపూర్వ.. ఎంజాయ్ చేసిన ఇతర హౌస్‌మేట్స్..   |   Biggboss10 Telugu: వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో మళ్లీ టార్గెట్ రోహిత్..   |   ఇప్పుడేం చేస్తాడు మన చిరంజీవి..? శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేస్తాడా..?   |   నానిని ఏ‘మారుస్తున్నదెవరు..?’.. ఎందుకింత మాస్ పిచ్చి.. నీ రూట్స్ మరిచావా నాని..?   |   Biggboss10 Telugu: ఝాన్సీ హైడ్రామా.. రామ్ ప్రసాద్ కన్నింగ్.. నక్కల ముసుగులో ముఖేష్..   |   అర్థం పర్థం లేని సినిమాలు.. ఆరిపోతున్న నిర్మాతలు.. ప్రేక్షకులకు తలనొప్పులు..!   |   రాధ Vs అంబిక.. అక్కాచెల్లెళ్ల గొడవలో అసలు తప్పు ఎవరిది..? ఎవరు ఎవర్ని మోసం చేసారు..?   |   ఓరి దేవుడో.. వాళ్ళ సినిమాలు వాళ్లు చూడ్డానికి హీరోలకు ఇన్ని ఇబ్బందులా..?   |   నేషనల్ వైడ్ గా సత్తా చాటిన కమిటీ కుర్రోళ్ళు.. అవార్డ్స్ తీసుకున్న నిహారిక అండ్ టీం..   |   ‘ఆదర్శ కుటుంబం’ వాయిదా వెనక ‘ప్యారడైజ్’ హస్తం.. నాని కోసం త్యాగమా..?   |   Biggboss 10 Telugu: వర్షిణి కోసం దేబ్జానిని బలి చేసిన ముఖేష్..   |   Biggboss 10 Telugu: అతి చేస్తున్న శ్రష్టి.. మొత్తం కంటెంట్ కోసమేనా?   |   నానిని తొక్కేయాలని చూస్తున్నారా.. అతడి చుట్టూ కుట్ర జరుగుతుందా..?

ఆ ప్యాన్ ఇండియన్ దర్శకుడిపై ప్రెజర్.. అంతా వారసుడి మహిమ..!

ఆ ప్యాన్ ఇండియన్ దర్శకుడిపై ప్రెజర్.. అంతా వారసుడి మహిమ..!

టాలీవుడ్‌లో ఒక యంగ్ డైరెక్టర్ గురించి చాలా ఆసక్తికరమైన చర్చ నడుస్తోందిప్పుడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఒకే ఒక్క సినిమాతో ప్యాన్ ఇండియా స్థాయిలో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు ఆ యువ దర్శకుడు. బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి లాంటి పెద్ద సీజన్లో ఎదురుగా సూపర్ స్టార్ లాంటి అగ్ర హీరో సినిమా ఉన్నా సరే ఎక్కడా తగ్గకుండా నిలిచి గెలిచాడు. ఆ ఒక్క భారీ విజయంతో టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ అండ్ క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. సినిమా మేకింగ్ లో అతని విజన్ చూసి ఇండస్ట్రీ పెద్దలు సైతం ఆశ్చర్యపోయారు. ఈ క్రేజ్ తోనే ఆ ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత ఈ దర్శకుడి నుంచి వెంటవెంటనే ఏకంగా ఐదారు సినిమాలు అనౌన్స్ అయ్యాయి. ఇక అతనికి ఇండస్ట్రీలో తిరుగులేదు, వరుస విజయాలతో దూసుకుపోతాడు అని అందరూ అనుకున్నారు.

కానీ ఇక్కడే సీన్ మొత్తం రివర్స్ అయింది. చేతిలో ఆరు సినిమాలు ఉన్నా అందులో ఆల్మోస్ట్ షూటింగ్ స్టార్ట్ అయ్యే స్టేజ్ కు వచ్చిన మూడు ప్రాజెక్టులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. అందులో ఒక ప్రముఖ నిర్మాత తనయుడిని హీరోగా పెట్టి చేయాల్సిన సినిమాతో పాటు, టాలీవుడ్ కు చెందిన ఒక పెద్ద స్టార్ హీరో కుమారుడి సినిమా కూడా ఉండటం గమనార్హం. ప్రాజెక్టులు అనౌన్స్ అయిన తర్వాత ఇలా మధ్యలో ఆగిపోవడం ఇండస్ట్రీలో సహజమే అయినా, వరుసగా మూడు సినిమాలు క్యాన్సిల్ అవ్వడం మాత్రం ఆ యువ దర్శకుడికి పెద్ద షాక్ అనే చెప్పాలి. అయితే సదరు దర్శకుడితో సినిమా క్యాన్సిల్ చేసుకున్న ఆ పెద్ద హీరో, ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన వారసుడిని తీసుకెళ్లి మరో యంగ్ ఫాంటసీ దర్శకుడి చేతుల్లో పెట్టాడు. రీసెంట్ గా ఆ కాంబినేషన్ లో సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేసేశారు.

ఇలా తనతో ఆగిపోయిన వారసుడి ప్రాజెక్ట్, మరో దర్శకుడి చేతికి వెళ్లిపోవడంతో ముందు ఆపేసిన యువ దర్శకుడికి కంగారు మొదలైందని టాక్ వినిపిస్తోంది. ఇండస్ట్రీలో ఎప్పుడైనా ఒక హీరో మనతో సినిమా క్యాన్సిల్ చేసుకుని వేరే డైరెక్టర్ తో హిట్ కొడితే ఆ ప్రెజర్ కచ్చితంగా మన మీదే పడుతుంది. ఇప్పుడు ఆ ప్యాన్ ఇండియా డైరెక్టర్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నాడంటున్నారు. అందుకే తన వర్కింగ్ స్టైల్ ను పూర్తిగా మార్చేశాడు. ప్రస్తుతం తను దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న సినిమాల నుంచి, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ప్రతి ప్రాజెక్ట్ టీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ భారీ విజయం సాధించి తీరాలని గట్టిగా చెబుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. తన టీమ్ మెంబర్స్ కు కూడా ఎక్కడా కాంప్రమైజ్ కావొద్దని, కంటెంట్ విషయంలో ప్రతీ చిన్న డీటైలింగ్ పర్ఫెక్ట్ గా ఉండాలని దిశానిర్దేశం చేస్తున్నాడని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే మరోవైపు ఆ స్టార్ హీరో వారసుడిని లాంచ్ చేయబోతున్న కొత్త డైరెక్టర్ ట్రాక్ రికార్డ్ చూస్తే అది కూడా కాస్త గమ్మత్తుగానే ఉంది. ఆ ఫాంటసీ డైరెక్టర్ మొదటి సినిమాతో సూపర్ హిట్ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. కానీ ఆయన రెండో సినిమా మాత్రం గత రెండేళ్లుగా రకరకాల కారణాల వల్ల విడుదలకు నోచుకోవడం లేదు. ఆ సినిమా రిలీజ్ కాకముందే ఇప్పుడు ఏకంగా మూడో సినిమాగా పెద్ద హీరో వారసుడి చిత్రాన్ని ఒప్పుకున్నాడు. మొత్తానికి ఈక్వేషన్స్ అన్నీ గమనిస్తే ఆ స్టార్ కిడ్ సినిమా చుట్టూ ఇద్దరు యంగ్ డైరెక్టర్ల భవిష్యత్తు ముడిపడి ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఆ వారసుడి సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, ప్రస్తుతం ప్యాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న ఆ మొదటి యువ దర్శకుడికి మాత్రం తన నెక్స్ట్ సినిమాలతో కచ్చితంగా ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఈ ప్రెజర్ ను దాటి అతను మళ్లీ తన మ్యాజిక్ రిపీట్ చేస్తాడా లేదా అనేది వేచి చూడాలి.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360