Menu
BREAKING
కామ్రేడ్ కళ్యాణ్ ట్రైలర్ రివ్యూ.. వాళ్ల మనోభావాలు దెబ్బతింటే అంతే సంగతులు..!   |   Biggboss10 Telugu: రెచ్చిపోతున్న సుధీర్.. పడిపోతున్న గ్రాఫ్..   |   ఇదెక్కడి దిక్కుమాలిన ప్లానింగ్.. కనీసం ట్రైలర్స్ కట్ చేయడానికి టైమ్ దొరకట్లేదా..?   |   Biggboss10 Telugu: హాట్ హాట్‌గా నామినేషన్స్.. ఈవారం కూడా కామనర్స్ బలి..   |   లెజెండరీ నటి శారద పరిస్థితి చూస్తున్నారా.. 81 ఏళ్ళ వయసులో కూడా..!   |   Biggboss10 Telugu: నామినేషన్స్‌లో రెచ్చిపోయిన వర్షిణి, ముఖేష్..   |   Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ED సోదాలు.. అసలు నిజమేంటో తెలుసా..?   |   AK47: ఆదర్శ కుటుంబం మళ్లీ వాయిదా.. అసలు కారణం అదన్నమాట..!   |   Biggboss10 Telugu: రోహిత్ పని ఓవర్ అని సెలబ్రిటీలు అనుకుంటున్నారా?   |   Biggboss10 Telugu: నెరవేరిన సెలబ్రిటీల కోరిక.. బిగ్‌బాస్ నుంచి కామనర్ సృష్టి అవుట్   |   Anil Ravipudi: అనిల్ రావిపూడి యామినేషన్ సినిమా వెనక అంత పెద్ద కథ ఉందా..?   |   ఫ్లాప్ వాళ్లను ఆపలేదు.. రూట్ మార్చేలా చేసింది.. కుర్రాళ్ళూ జాగ్రత్త..!   |   లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఇక లేరు.. ది ట్రెండ్ సెట్టర్..!   |   Biggboss10 Telugu: రోహిత్‌కే ఫుల్ డోసు.. మిగిలిన వాళ్లంతా లైట్..   |   Biggboss10 Telugu: కామనర్స్‌కు పెద్ద దెబ్బ.. అంతా ముఖేషే చేశాడు..
The Paradise
MOVIE REVIEW

The Paradise

★ 2 / 5
Release Date: September 24, 2026
Cast
Nani, Raghav Juyal, Kayadu Lohar, Sonali Kulkarni, Mohan Babu
Director
Srikanth Odela
Music Director
Anirudh Ravichander
Producer
Sudhakar Cherukuri
Banner
SLV Cinemas

The Paradise Review

బ్లాక్ బస్టర్ ‘దసరా’ అనంతరం నేచురల్ స్టార్, శ్రీకాంత్ ఓదెల కలయికలో రూపొందిన ప్రాజెక్ట్‌పై తారాస్థాయిలో అంచనాలున్నాయి. ఆ బజ్‌ను ఈ చిత్రం ఏ మేరకు అందుకుందో పరిశీలిద్దాం.

'ది ప్యారడైజ్' మూవీ రివ్యూ.. దసరా మ్యాజిక్ మళ్లీ రిపీట్ అయిందా..?

కథ:

దేశానికి విముక్తి లభించినా, సవారి తెగకు మాత్రం ఆ అదృష్టం దక్కదు. సికింద్రాబాద్ శివార్లలో షికింజా మాలిక్ (మోహన్ బాబు) గుప్పిట్లో ఆ వర్గం నలిగిపోతుంటుంది. వారికి ఉనికి లేకుండా చేసే క్రమంలో, ఆ ప్రజల మనుగడకై సమ్మక్క (సోనాలి కులకర్ణి) అలుపెరగని పోరు చేస్తుంటుంది. ఆమె కుమారుడు జడల్ (నాని) ఓ హత్య కేసులో పద్నాలుగేళ్ల కారాగార శిక్ష అనుభవించి బయటకు వస్తాడు. కన్నతల్లిదే లోపమని భావించి ఆమెను ద్వేషిస్తాడు. అనంతరం తన ప్రజల కోసమే ఆమె తన జీవితాన్ని ధారపోసిందని గ్రహిస్తాడు. అదే తరుణంలో షికింజా మాలిక్ వారసుడు విక్రమ్ (రాఘవ్ జుయల్)తో జడల్‌కు వైరం మొదలవుతుంది. ఆ వివాదం చినికి చినికి గాలివానలా మారి పెద్ద మాలిక్ వద్దకు చేరుతుంది. అటుపై ఏం జరిగింది? సవారీల సమర గమ్యం ఏమైంది? వారికి అస్థిత్వం దక్కిందా? అన్నదే మిగిలిన కథ.

స్క్రీన్ ప్లే:

కొన్నిసార్లు సినిమా తీయడానికి కేవలం పిచ్చి ప్యాషన్‌ మాత్రం సరిపోదు దానికి సరిపోయే కథ కూడా ఉండాలి. మెంటలోడు, మొండోడు అనే పేర్లు పడాలి అంటే దానికోసం చాలా కష్టపడాలి. కథలేని సినిమాలు రెండు సంవత్సరాలు కథ పోతే ఫలితం ఎలా ఉంటుందో ఈమధ్య టాక్సిక్ చూపించింది. తాజాగా ప్యారడైజ్ సినిమాతో శ్రీకాంత్ కూడా అదే చేశాడు. ఈయన టేకింగ్ ఫస్టాఫ్‌లో అద్భుతంగా పండింది. ఇంటర్వెల్ కు ముందు వచ్చే సీన్స్ చూస్తే నాని ఖాతాలో మరో హిట్ పక్కా అనిపిస్తుంది. అయితే ద్వితీయార్థంలో మేకర్ గాడి తప్పాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చిన కిక్‌ను తర్వాత కొనసాగించలేకపోయారు.

ముఖ్యంగా తొలి 15 నిమిషాల గ్రిప్పింగ్ నేరేషన్, హీరో ఎంట్రీ అదిరిపోయాయి. హీరోయిన్ కయాదు లోహర్ ట్రాక్ తీవ్ర నిరాశపరుస్తుంది; ఆ ఇబ్బందికరమైన ఘట్టాలను కాస్త మార్చుకుంటే బాగుండేది. సెకండాఫ్‌లో మోహన్ బాబు ఎంట్రీ అదరగొడుతుంది. కానీ అసలైన ఎపిసోడ్ల దగ్గర స్క్రీన్ ప్లే తేలిపోయింది. ఫస్టాఫ్ లో పండిన ఎమోషన్స్ తర్వాత కనెక్ట్ అవ్వవు. దీనికి తోడు పొలిటికల్ యాంగిల్ చొప్పించడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ముగింపు కూడా పూర్తిగా పాలిటిక్స్ చుట్టూ తిరగడంతో అసంతృప్తి మిగులుతుంది. ఉనికి కోసం సాగే పోరులో ఎమోషన్ లోపించి, కేవలం రక్తపాతం మాత్రమే హైలైట్ అయింది. మాస్ ప్రేక్షకులకు నచ్చే అంశాలు పుష్కలంగా ఉన్నా, వాటిని మరింత బలంగా ప్రెజెంట్ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది.

'ది ప్యారడైజ్' మూవీ రివ్యూ.. దసరా మ్యాజిక్ మళ్లీ రిపీట్ అయిందా..?

నటీనటులు:

జడల్ పాత్రలో నాని జీవించేశాడు. డైరెక్టర్ విజన్‌కు తగ్గట్లుగా నూటికి నూరు శాతం అవుట్‌పుట్ ఇచ్చాడు. చిత్రానికి మోహన్ బాబు ప్రెజెన్స్ అతి పెద్ద బలం. ఆయన్ను ఇంకా సమర్థవంతంగా వాడుకునే స్కోప్ ఉంది. రాఘవ్ జుయల్ తన పరిధిలో మెప్పించగా, సోనాలి కులకర్ణి కీలక పాత్రలో ఒదిగిపోయింది. సంపూర్ణేష్ నటన పర్వాలేదు. కయాదు లోహర్ కనిపించినంత సేపు ఓకే అనిపిస్తుంది. ఇతర తారాగణం తమ పాత్రల మేరకు న్యాయం చేశారు.

టెక్నికల్ టీం:

ఈ ప్రాజెక్ట్‌కు వెన్నెముక అనిరుధ్ రవిచందర్. తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ప్రాణం పోశాడు. చాలా సీన్లను తన BGM తో నిలబెట్టాడు. సెకండ్ హాఫ్ మీద ఎడిటర్ నవీన్ నూలి మరింత కత్తెర వేయాల్సింది. విజువల్స్ గ్రాండ్‌గా ఉన్నాయి. దర్శకుడు శ్రీకాంత్ తనకు దక్కిన బంపర్ ఆఫర్‌ను ఇంకా బాగా సద్వినియోగం చేసుకుని ఉండాల్సింది. సెకండాఫ్ ట్రాక్ తప్పకపోయుంటే ఇదో మాస్ బొమ్మ అయ్యేది. అయినప్పటికీ, అదిరిపోయే ఫస్టాఫ్ పుణ్యమా అని బి, సి సెంటర్లలో ఆదరణ దక్కే ఛాన్స్ ఉంది.

ఓవరాల్:

‘ది ప్యారడైజ్’.. అస్థిత్వం కొరకు సాగే అర్థం లేని నెత్తుటి సమరం..!

The Paradise Cast

Nani Raghav Juyal Kayadu Lohar Sonali Kulkarni Mohan Babu