సినిమా వార్తలు

Vijay Deverakonda: కొండన్న ముందు భారీ లక్ష్యం.. ‘రణబాలి’ ఇప్పటి వరకు ఓకే.. ఇకపై ఏం చేస్తుందో..?

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) బాక్సాఫీస్ దగ్గర ఒక సాలిడ్ కమ్ బ్యాక్ హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఆయన లేటెస్ట్ మూవీ రణబాలి (Ranabaali) బాక్సాఫీస్ రిజల్ట్ మాత్రం ఇప్పుడు కాస్త టెన్షన్ పెడుతోంది. ఎలాగోలా ఫస్ట్ వీకెండ్ వరకు సినిమాను బలంగా లాక్కొచ్చిన విజయ్ దేవరకొండకు, వీకెండ్ తర్వాతే అసలు సినిమా కనిపిస్తోంది. సాధారణంగా ఏ సినిమాకైనా మండే టెస్ట్ చాలా కీలకం, ఇక్కడే రణబాలి తడబడుతోంది. సోమవారం రాగానే చాలా సెంటర్స్ లో కలెక్షన్స్ లో మేజర్ డ్రాప్ కనిపించడం ట్రేడ్ వర్గాలను కలవరపెడుతోంది. రిలీజ్ రోజు మోస్తరు నంబర్స్ తో మొదలైన ఈ మూవీ, శని ఆదివారాల్లో కాస్త పర్వాలేదు అనిపించినా వర్కింగ్ డేస్ లో మాత్రం ఆ జోరును కంటిన్యూ చేయలేకపోతుంది అనడానికి సోమవారం కలెక్షన్స్ ఒక నిదర్శనం.

రణబాలి బాక్సాఫీస్ లెక్కలు ఒకసారి డీప్ గా ఎనలైజ్ చేస్తే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుంది. రాహుల్ సంకృత్యాన్ (Rahul Sankrityan) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా, ఫస్ట్ వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా 37 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇందులో మన ఇండియన్ మార్కెట్ నుంచి 28 కోట్లు వచ్చాయి. పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న ఈ రోజుల్లో కేవలం తెలుగులోనే రిలీజ్ అయిన ఈ సినిమా నాలుగు రోజుల్లో 50 పర్సెంట్ రికవరీ మాత్రమే రాబట్టింది. సినిమా క్లీన్ హిట్ అనిపించుకోవాలి అంటే బయ్యర్లకు ఇంకా 30 కోట్లు వెనక్కి రావాలి. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే, నార్త్ అమెరికా మార్కెట్ ఎప్పుడూ విజయ్ కి చాలా స్ట్రాంగ్ జోన్. కానీ అక్కడ కూడా ఫస్ట్ వీకెండ్ లో రణబాలి 1 మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేయలేకపోయింది. దీనిని బట్టి డొమెస్టిక్ అండ్ ఓవర్సీస్ మార్కెట్లలో విజయ్ కి క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ కాస్త తగ్గుతుందనే కామెంట్స్ గట్టిగా వినిపిస్తున్నాయి.

ఒకవైపు రణబాలి బ్రేక్ ఈవెన్ కోసం కష్టపడుతుంటే, మరోవైపు బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2 కుమ్ముడు మామూలుగా లేదు. ఆ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుండటం రణబాలికి అతి పెద్ద మైనస్ గా మారింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ ముందున్న అతిపెద్ద కొండ ఈ జైలర్ 2 సినిమానే అని చెప్పాలి. అయితే రణబాలితో పాటు గత వీకెండ్ లో రిలీజ్ అయిన క్రేజీ కళ్యాణం, గరివిడి లక్ష్మి సినిమాలకు టాక్ బాగానే వచ్చినా కలెక్షన్లు రావట్లేదు. ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. లోకల్ గా ఆ సినిమాల నుంచి కాంపిటీషన్ లేకపోయినా కూడా ఆ అడ్వాంటేజ్ ను రణబాలి వాడుకోలేకపోయింది. రజనీకాంత్ థౌసండ్ వాలా మేనియా ముందు నిలబడటం ఈ పీరియాడిక్ డ్రామాకు చాలా కష్టంగా మారిపోయింది.

ఇన్ని నెగిటివ్స్ మధ్య రణబాలి టీమ్ కు ఉన్న ఒకే ఒక్క పాజిటివ్ పాయింట్ ఏంటంటే, సినిమాకు డివైడ్ టాక్, రేటింగ్స్ మీడియంగానే వచ్చినా కూడా వీకెండ్ లో పూర్తిగా క్రాష్ అయిపోలేదు. స్వాతంత్య్రానికి ముందు రాయలసీమ కరువు నేపథ్యంలో వచ్చిన ఈ సీరియస్ కథకు ఆడియన్స్ కనెక్ట్ అవ్వడంతో వీకెండ్ లో డీసెంట్ కలెక్షన్స్ రాబట్టగలిగింది. ముఖ్యంగా శనివారంతో పోలిస్తే ఆదివారం రోజు ఆక్యుపెన్సీలో కాస్త ఇంప్రూవ్మెంట్ కనిపించింది. దీన్ని బట్టి మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా ఆడియన్స్ లో సినిమా మీద ఇంట్రెస్ట్ పూర్తిగా పోలేదని అర్థం అవుతోంది. ఈ ఒక్క పాయింట్ మాత్రమే మేకర్స్ కు కాస్త రిలీఫ్ ఇస్తూ మిగిలిన రికవరీపై ఆశలు పెంచుతోంది.

ఫైనల్ గా చూసుకుంటే రణబాలి ప్రయాణం రాబోయే రోజుల్లో అంత ఈజీగా అయితే ఉండదు. కేవలం తెలుగు ఆడియన్స్ మీద మాత్రమే డిపెండ్ అయిన ఈ సినిమా, టార్గెట్ రీచ్ అవ్వాలంటే వర్కింగ్ డేస్ లో అద్భుతాలు జరగాలి. ఇప్పటికే 50 శాతం రికవరీ అయినప్పటికీ, మిగిలిన ఆ 30 కోట్ల టార్గెట్ అనేది వస్తున్న డ్రాప్స్ చూస్తుంటే చాలా పెద్ద టాస్క్ లాగే కనిపిస్తోంది. జైలర్ 2 లాంటి పాన్ ఇండియా సినిమాను తట్టుకుని బాక్సాఫీస్ దగ్గర నిలబడటం అంటే మామూలు విషయం కాదు. ఈ కష్టాలను దాటి రణబాలి ఏ మేరకు కలెక్షన్స్ రాబడుతుంది, విజయ్ దేవరకొండ డిస్ట్రిబ్యూటర్లను ఏ మేరకు సేవ్ చేస్తాడు అనేది రాబోయే రోజుల్లోనే తేలనుంది.

Pranav

Recent Posts

Jailer 2: ఆ రికార్డు సాధిస్తుందా..? కోలీవుడ్ పరువు ఇప్పుడు రజినీ చేతుల్లో..!

సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు బాక్సాఫీస్ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. టాలీవుడ్, బాలీవుడ్, కన్నడ ఇండస్ట్రీలు ఇప్పటికే 1000 కోట్ల క్లబ్…

15 hours ago

Kaaka: ‘కాకా’ మేకింగ్ వీడియో లీక్.. కావాలనే చేసారా లేదంటే అలా జరిగిపోయిందా..?

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటిస్తున్న లేటెస్ట్ మూవీ Kaaka నుంచి ఒక అదిరిపోయే అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో…

15 hours ago

బాలీవుడ్ హీరోలను బతకనీయరా.. నడిరోడ్డు మీద కాల్పులేంటి సామి..?

బాలీవుడ్‌ ఇప్పుడు ఒక పేరు తీవ్రంగా వణికిస్తోంది. అదే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్. అండర్ వరల్డ్ డాన్ లంటే ఒకప్పుడు…

15 hours ago

BiggBoss10 Telugu: బిగ్ బాస్‌లో షాలిని ఎలిమినేషన్ ట్విస్ట్.. సీక్రెట్ రూమ్‌కు పంపించిన నాగార్జున!

ఇవాళ (ఆదివారం) హోస్ట్ నాగార్జున చాలా హుషారుగా షోను ప్రారంభించారు. ఇవాళ్టి షోకు షాలిని ఆలస్యంగా వచ్చింది. దీనిలో కొత్తేముంది?…

16 hours ago

Biggboss10 Telugu: బిగ్‌బాస్ హౌస్ నుంచి షాలిని ఎలిమినేట్.. ఇక వార్ వన్‌సైడేనా?

బిగ్‌బాస్ హౌస్ నుంచి షాలిని ఎలిమినేట్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆమె తన పుట్టిన రోజుకు ఒక రోజు ముందే…

2 days ago

Biggboss10 Telugu: తప్పులన్నీ రోహిత్‌వే.. రోస్ట్ చేసిన నాగ్..

షో ప్రారంభం కాగానే శుక్రవారం ఏం జరిగిందో హోస్ట్ నాగార్జున చూశారు. ఝాన్సీ గురించి ముఖేష్, వర్షిణి మాట్లాడుకుంటున్నారు. తను…

2 days ago