సినిమా వార్తలు

రామాయణపై రామ్ గోపాల్ వర్మ రివ్యూ.. వాళ్లంతా వీధి కుక్కలు..!

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన ఏ సినిమా గురించి మాట్లాడినా అందులో ఒక డిఫరెంట్ యాంగిల్ వెతుకుతారు. అయితే తాజాగా ఆయన చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. రీసెంట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆర్జీవీ అఫీషియల్ ట్వీట్ రామాయణ సినిమా మీద ఆయనకున్న ఒపీనియన్ ను బయటపెట్టింది. రణ్‌బీర్ కపూర్, యష్ లాంటి స్టార్స్ నటించిన ఈ రామాయణ సినిమా కేవలం ఒక భక్తి చిత్రం కాదు అని, అదొక డివోషనల్ ఫోర్స్ అని వర్మ తనదైన స్టైల్ లో పొగడ్తల వర్షం కురిపించారు. సాధారణంగా ప్రతీ సినిమాను విమర్శించే వర్మ, ఈ సినిమాకి ఫిదా అయిపోయి రాసిన ఈ రివ్యూ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

వర్మ తన ట్వీట్ లో రామాయణ సినిమాను ఒక కొత్త కోణంలో అనలైజ్ చేశారు. ఇందులో హీరో ఆకాశంలో తేలియాడే ఒక దేవుడిలా కాకుండా, ప్రపంచం అంతమైపోతున్నా కూడా ధైర్యంగా ముందుకు నడిచే ఒక అద్భుతమైన మనిషిలా కనిపించాడని చెప్పారు. ఈ సినిమా కేవలం ఒక రాజ్యం ఎలా ఏర్పడింది అనే దాని గురించి కాదని, మనిషిలోని బలహీనతలను ఎదిరించే ఒక గొప్ప మైండ్ సెట్ గురించి అని ఆయన వివరించారు. ఈ సినిమాలో ఉన్న యాక్షన్ లేదా వయోలెన్స్ కేవలం కళ్ళను అట్రాక్ట్ చేయడానికి పెట్టింది కాదని, మనం చేసే పనుల వల్ల వచ్చే పర్యవసానాలకు అది అద్దం పడుతుందని RGV చాలా డీప్ గా చెప్పారు. ఈ సినిమా కథను వివరించడానికి ఎక్కడా టైమ్ వేస్ట్ చేయలేదని, థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు ప్రేక్షకుడు కేవలం ఒక కథను చూసి రాడని, ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ ను తనతో పాటు తీసుకెళ్తాడని వర్మ చాలా ఎమోషనల్ గా రాసుకొచ్చారు.

ఇక నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి వర్మ చేసిన డీటైలింగ్ రివ్యూ అసలైన హైలైట్ అని చెప్పాలి. సీతను అపహరించిన తర్వాత ఖాళీగా ఉన్న ఆశ్రమంలో రణ్‌బీర్ కపూర్ నిలబడి చూసే సీన్ గురించి వర్మ ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ ఒక్క సీన్ లో కెమెరా రణ్‌బీర్ ముఖం మీద చాలా సేపు ఫోకస్ చేస్తుందని, ఆ టైమ్ లో అతనిలోని బాధ అంతా ఒక లెక్కలాగా ఎలా మారిపోయిందో తనకు అర్థం కాలేదని.. అంత అద్భుతంగా చూపించారని వర్మ మెచ్చుకున్నారు. అలాగే రావణుడిగా నటించిన యష్ గురించి చెబుతూ, యష్ ఈ సినిమాలో కేవలం ఒక విలన్ లా కాకుండా, తను నాశనం చేయాలనుకున్న దాన్ని ముందే యాక్సెప్ట్ చేసిన ఒక పవర్ ఫుల్ మైండ్ లా కనిపించాడని చెప్పారు. రాత్రి పూట వచ్చే ఒక సన్నివేశంలో రాముడి గురించి మాట్లాడే సీన్ లో యష్ అస్సలు అరవకుండా, కేవలం తన స్థాయి ఏంటో చెప్తాడని, ఆ టైమ్ లో అతని ఫేస్ లో ఎలాంటి భయం కానీ బెదురు కానీ కనిపించదని RGV తన రివ్యూలో రాసుకొచ్చారు.

జటాయువు ఎపిసోడ్ లో అనుపమ్ ఖేర్ చేసిన యాక్టింగ్ గురించి వర్మ ఇచ్చిన అనాలసిస్ చదివితే ఎవరికైనా గూస్ బంప్స్ రావాల్సిందే. పుష్పక విమానాన్ని జటాయువు అడ్డుకునే సీన్ కేవలం విశ్వాసానికి సంబంధించింది కాదని, ఒక మనిషిలోని తెగింపుకు నిదర్శనమని వర్మ చెప్పారు. రెక్కలు సగం విరిగిపోయి, రక్తం కారుతున్నా కూడా జటాయువు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా రావణుడి మీదకు వెళ్తాడని, దేహం సహకరించకపోయినా మైండ్ మాత్రం ఇంకా ఓటమిని ఒప్పుకోలేదని RGV చాలా గొప్పగా చెప్పారు. కింద పడిపోయినప్పుడు అతని ముఖం మీద కెమెరా ఆగిపోతుందని, అక్కడ ఎలాంటి ఏడుపు ఉండదని, రెక్కలు ఆగిపోయినా అతని కళ్ళలో మాత్రం ఒక బలమైన వాదన కనిపిస్తుందని అన్నారు. అది కేవలం త్యాగం కాదని, శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు పోరాడాలి అని నమ్మిన ఒక వీరుడి కథ అని వర్మ చాలా ఎమోషనల్ గా ఎక్స్ ప్లెయిన్ చేశారు.

సినిమాలోని ప్రతి చిన్న డీటైలింగ్ ను గమనించిన వర్మ, చివరగా సినిమాను విమర్శించే వాళ్ళకి తనదైన స్టైల్ లో ఒక సాలిడ్ కౌంటర్ ఇచ్చారు. ఇంత అద్భుతమైన సినిమాను తీసిన డైరెక్టర్స్ అండ్ టీమ్ మొత్తానికి కంగ్రాట్స్ చెబుతూ, నెగిటివ్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళను ఏమాత్రం పట్టించుకోవద్దని సలహా ఇచ్చారు. ఏనుగు లాంటి ఈ భారీ ప్రయత్నాన్ని చూసి మొరిగే వీధి కుక్కల్లాంటి విమర్శకులను లైట్ తీసుకోవాలని ఆర్జీవీ చాలా ఘాటుగా కామెంట్ చేశారు. ఈ రామాయణ సినిమా ఒక మాగ్నిఫిక్ పీస్ ఆఫ్ వండర్ అని, ఇంత అద్భుతాన్ని క్రియేట్ చేసినందుకు టీమ్ అందరికీ హ్యాట్సాఫ్ అని తన ట్వీట్ ను ముగించారు. మొత్తానికి ఎప్పుడూ కాంట్రవర్సీలతో కాలం గడిపే రామ్ గోపాల్ వర్మ, ఒక సినిమాకు ఇంత పాజిటివ్ గా, ఇంత డీప్ గా అనలైజ్ చేస్తూ రివ్యూ ఇవ్వడం ఇండస్ట్రీలో అందరికీ ఒక పెద్ద సర్ప్రైజ్ గా మారిపోయింది.

Telugu Cinema 360

Recent Posts

షాకింగ్.. పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో, అటు ఇండస్ట్రీలో సెన్సేషనల్ న్యూస్ హాట్ టాపిక్ గా మారిపోయిందిప్పుడు. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన…

12 hours ago

బడ్జెట్ కంట్రోలింగ్.. మలయాళం వాళ్లను చూసి మనం నేర్చుకుందామా..?

సౌత్ ఇండియాలో మలయాళ ఇండస్ట్రీ గురించి ఒక రేంజ్‌లో చర్చ జరుగుతోందిప్పుడు. దానికి కారణం వాళ్ళు తీస్తున్న అద్భుతమైన కంటెంట్…

1 day ago

Bigg Boss10 Telugu: నామినేషన్స్ పాయింట్స్ మాట్లాడుకున్న త్రిగుణ్ టీం.. నాగ్ ప్రశ్నిస్తారా?

బిగ్‌బాస్ 10 తెలుగు చప్పగా సాగుతోంది. హౌస్‌లో రెండు గ్రూపులున్నాయి. ఒక గ్రూప్‌లో వర్షిణి, ముఖేష్ మాత్రమే ఉన్నారు. దీంతో…

1 day ago

జాన్వీ కపూర్‌కు తత్వం బోధపడిందా.. తిట్టిన నోటితోనే పొగడ్తల వర్షం కురిపిస్తుందిగా..!

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఎంతలా ట్రోలింగ్ ఫేస్ చేసిందో మనందరికీ తెలిసిందే. రీసెంట్‌గా…

1 day ago

Bigg Boss10 Telugu: బ్లాక్ కోతి పంచాయతీకి చెక్ పెట్టిన నాగ్.. ఇక టైం లేదు..

ఇవాళ హౌస్‌లో దీపావళి సందడి నెలకొంది. హోస్ట్ నాగార్జున హౌస్‌లోకి వెళ్లగానే ముందుగా నీతూ, శ్వేత పెర్ఫార్మెన్స్.. ఆ తరువాత…

2 days ago

Bigg Boss10 Telugu: ఈ వారం ఎలిమినేట్ కాబోయేది ఎవరంటే…

బిగ్‌బాస్ 10 తెలుగు ఆసక్తికరంగా నడుస్తోంది. దాదాపుగా వీకెండ్‌కు చేరుకోవడంతో మరికొన్ని గంటల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.…

3 days ago