నిన్నటి నామినేషన్స్‌ను కంటిన్యూ చేస్తూ నామినేషన్స్ ప్రారంభమయ్యాయి. పండు.. సుధీర్‌కు దొరికింది. రోహిత్‌ను సుధీర్ నామినేట్ చేశాడు. వయసుకి కూడా రెస్పెక్ట్ ఇవ్వడని.. కామ్ గోయింగ్ అనుకున్నానని చెప్పాడు. ఆ మాటలు ఎప్పుడు అన్నానో కూడా గుర్తు లేదని రోహిత్ చెప్పడంతో.. అన్నావని చెప్పాడు. మనం కొట్లాడుకున్నప్పుడు హీరో అవుదామని వస్తున్నావా? అనే మాటలు ఎందుకు నీనుంచి వస్తున్నాయని అడిగాడు. సుధీర్ మాట్లాడుతుంటే సెలబ్రిటీలంతా పగులబడి నవ్వుతున్నారు. దీనిపై సుధీర్ స్టాండప్ కామెడీ చేస్తున్నాడా? అని అడిగాడు. ‘బిగ్‌బాస్ గేట్లు తెరిచి బయటకు పొమ్మన్నాడు. మిథిలేష్ పోతుంటే డబ్బులన్నా ఇచ్చాడు. నీకది కూడా అవ్వలేదే’ అన్నాడు. సుధీర్ తన గురించి తాను ఏమనుకుంటున్నాడో కానీ వరస్ట్ బిహేవియర్. స్థితప్రజ్ఞతతో ఉంటే బాగుపడతావని సుధీర్ చెప్పాడు. ప్రొవోకింగ్ స్టార్ట్ అయింది.. అపరిచితుడు వచ్చాడంటూ సుధీర్ మాటలు.. బాడీ షేమింగ్ దారుణం. దద్దమ్మ మాదిరిగా కూర్చొని చూస్తున్నాడంటూ సుధీర్ దారుణంగా మాట్లాడాడు. రోహిత్‌ను కనీసం మాట్లాడనివ్వలేదు. అతను మాట్లాడే మాటలు కూడా అర్థమవ్వనివ్వలేదు. చివరకు రోహిత్ ఏదో మాట్లాడబోతుంటే కూడా నువ్వు చుక్కలెంచుకోమని పాట్ పగులగొట్టి వెళ్లిపోయాడు.
సెలబ్రిటీలంతా ఇలాగే ఉన్నారు. కనీసం ఎదుటి వ్యక్తిని మాట్లాడనివ్వడం లేదు. ఒకరు మాట్లాడుతుంటే మిగిలిన వాళ్లంతా క్లాప్స్ కొడుతూ పగులబడి నవ్వుతూ చాలా వెకిలి చేష్టలు చేస్తున్నారు. వీళ్లందరి బిహేవియర్ కారణంగా బిగ్‌బాస్ చూడాలంటేనే విసుగొస్తుంది. సుధీర్ నెక్ట్స్ షాలినిని నామినేట్ చేశాడు. షాలిని ఏడ్చి ఆటను వదిలేసిందని.. చిరుతలా ముందుకు రావాలని సుధీర్ చెప్పాడు. షాలిని విషయంలో కూడా పర్సనల్‌గా కూడా వెళ్లిపోయాడు. వీళ్ల నామినేషన్‌లోకి వంశీ వచ్చి గొడవకు దిగాడు. పవర్ ఆఫ్ పీపుల్‌లో కనిపించకపోయే సరికి అల్లం బెల్లం అయిపోయాడని వంశీ చెప్పాడు. అప్పుడు వంశీ.. పవర్ స్టార్‌తో చేశానని అనడంతో.. మీరు ఎవరితోనైనా చేయండి అనడంతో త్రిగుణ్ చేరిపోయి పవర్ స్టార్ గురించి అలా అనడం తప్పని చెప్పాడు. అసలు పవర్ స్టార్‌కు ఏం సంబంధమో.. త్రిగుణ్ ఏం పోట్రే చేయాలనుకున్నాడో అర్థం కాలేదు.
ఇక చరణ్.. ముఖేష్‌ను నామినేట్ చేశాడు. ‘‘మీకు మీ స్టార్‌డమ్ పైన అంత నమ్మకం ఉంటే ఆచి తూచి మాట్లాడాలి. మీ మాటలు నాలుక అంచున ఉంటాయి. ‘దాన్ని మెయిన్‌టైన్ చేస్తున్నావా? అనేది ఉదాహరణ. అగ్నిపరీక్ష టీం అంటే మీకు చులకన. మాకు అవకాశం వస్తే మేము వినియోగించుకోవద్దా? మీరు మీ మాటలతో గౌరవాన్ని కోల్పోతున్నారు. మేము మీలాగా సెలబ్రిటీలం కాదు. మాకు ఈ సీజన్ కాకపోతే మరో సీజన్‌లో అవకాశం రావడానికి. మాకు అగ్నిపరీక్ష నుంచి ఈ సీజన్‌కే అవకాశం. జనాల ఓట్లకు రెస్పెక్ట్ ఇచ్చేలా అయితే ఎందుకు కెప్టెన్సీ దానం చేసి ఎందుకు సేవ్ చేశారు? జనాల ఓట్లకు విలువ లేదా? అదేమీ హౌస్ కోసం తీసుకున్న నిర్ణయం కాదు. మీ ఫ్రెండ్స్ కోసమో.. అలియెన్స్ కోసమో తీసుకున్న నిర్ణయం. దానికి దాన వీర శూర కర్ణలా బిల్డప్ ఇవ్వొద్దు ఇది నా నామినేషన్ పాయింట్. ఎనీ డౌట్’’ అని చరణ్ తన నామినేషన్స్ పాయింట్స్ పెట్టాడు. అప్పుడు ముఖేష్ ఒక డౌట్.. ‘కుండ నువ్వు తీసుకొస్తావా? నన్ను తెచ్చుకోమంటావా?’ అని అడిగాడు. చరణ్ పాయింట్స్‌కి క్లాప్స్ కొట్టి మరీ అప్రిషియేట్ చేశాడు.
అపూర్వ, నరేష్‌లలో అపూర్వకు పండు దొరికింది. అపూర్వ ముందుగా ముఖేష్‌ను నామినేట్ చేసింది. ‘‘నేను ఫస్ట్ వచ్చిన రోజే ‘పులి చొక్కా వేసుకున్న గుంట నక్క’ అని చెప్పానని.. ఇప్పుడు అది స్ట్రాంగ్ అయ్యిందని అన్నారు. ‘చిన్నదోవైపు పెద్దదోవైపు.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ’ అన్నారు ఎందుకు? నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేందుకు మీరెవరు? అని అడిగింది. బ్లూ టీంలో ఆడతావు.. రెడ్ టీంలో పావులు కదుపుతావు. నీకు ఒంట్లో.. తలలో పొగరు. నాకన్నా తోపు ఎవడూ లేడని.. నువ్వు తోపు అయితే నేను నీకు బాప్’’ అని చెప్పింది. ముఖేష్.. బాప్ అనే పదం పట్టుకుని ‘నాకు బాప్ అవుతావా?’ అంటూ సాగదీశాడు. ‘నీకు గ్రాటిట్యూడ్ లేదు. ముఖానికి ఉన్న మాస్క్ తీయి’ అని అపూర్వ చెప్పింది. ముఖేష్ డిజాస్టర్ కెప్టెన్ అంటూ సాగదీశాడు. అపూర్వ నెక్ట్స్ నామినేషన్.. ఝాన్సీని చేసింది. డ్యాగర్స్ కెప్టెన్ రూంలో ఉన్నాయి. అవి నీకు చాలా ఇంపార్టెంట్. అలాంటిది రెండు డ్యాగర్స్ వంశీ అన్నకు ఇచ్చావు. ఇమ్యూనిటీ అనగానే రెండు డ్యాగర్లు తీసుకున్నావు. ఇమ్యూనిటీ దక్కాలంటే నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ అని వెన్నుపోటు పొడిచావు’ అని నామినేషన్ పాయింట్స్ చెప్పింది. తన ఆట చెడిపోయి ఉంటే మూడు సార్లు కెప్టెన్సీ కంటెండర్‌లో రన్నరప్‌గా నిలిచానని చెప్పింది. ఇండివిడ్యువల్‌గా ఆడతానని గ్రూప్ గేమ్ ఆడుతున్నావని ఝాన్సీకి అపూర్వ చెప్పింది.
ఇక నరేష్ వచ్చేసి చరణ్‌ను నామినేట్ చేశాడు.మిథిలేష్ వచ్చి రెండు రోజులు ఆడి రూ.15 లక్షలు తీసుకెళ్లి చరిత్ర క్రియేట్ చేశాడని చెప్పాడు. నాలుగు వారాలుండి నువ్వేం సాధించావు. అగ్నిపరీక్ష నుంచి మీకంటే మంచి ప్లేయర్స్ వచ్చి ఉంటే ఇంకా బాగా ఆడేవారు. నువ్వేదో పొడిచేస్తావ్ అంటే ఏం చేయడం లేదు. నామినేషన్ మారట్లేదు అంటావు. ఇంకా 11 వారాలున్నా ఇలాగే చేస్తా. జనాలు కూడా ఇదే అంటున్నావు’’ అని చెప్పాడు. ఒక సంచాలక్‌గా నువ్వు రామ్ ప్రసాద్‌కి ఫేవర్‌గా చేశావని చరణ్ చెప్పాడు. వైల్డ్ కార్డుగా వచ్చి నువ్వేం ఆడలేదని మధ్యలో రామ్ ప్రసాద్ వచ్చి అనడంతో.. నా ఇష్టమని.. నన్ ఆఫ్ యువర్ బిజినెస్’’ అని చరణ్ చెప్పాడు. మధ్యలో షాలిని కూడా రావడంతో రచ్చ రచ్చ అయ్యింది. ‘నేను ఇదే యాటిట్యూడ్‌తో.. ఇలాగే ఉంటా.. మీరేం చూసి ఇలా అనుకుంటున్నావో.. మీరేం ఆడుతున్నారో మీరు కూడా ఆలోచించుకోండి’ అని చరణ్ చెప్పాడు. నామినేషన్స్ ఒకరికి.. మరొకరికి అయితే మధ్యలోకి వేరే వాళ్లు దూరిపోయి రచ్చ రచ్చ చేసి చూడాలంటేనే చిరాకు పుట్టించేలా చేస్తున్నారు.
దేబ్జాని, ఝాన్సీలలో పండు ఝాన్సీకి దొరికింది. ఆమె ముందుగా రోహిత్‌ని నామినేట్ చేసింది. ‘నిన్నెవరైనా ట్రిగర్ చేస్తే మాటలు జారుతున్నావు. ఎవరైనా మాట్లాడుతుంటే పప్పెట్ అంటూ కొన్ని సైగలు చేసి చూపిస్తున్నావు. అది మార్చుకుంటావని నామినేట్ చేస్తున్నా’’ అని ఝాన్సీ చెప్పింది. రోహిత్ తనకు తప్పైతే నిలదీస్తానని.. ఆ సైగలు అవతలి వారు ఏం చేస్తున్నారో దాన్ని బట్టి ఉంటుంది’’ అని చెప్పాడు. తరువాత అమన్‌ను నామినేట్ చేసింది. ‘అమన్ అన్న ఆటను ఆటలా ఆడు.. పోటుగాడిలా ఆడకు’ అని చెప్పాడు. అప్పుడు అమన్.. ‘ఈ నామినేషన్ నీదా? మీ అన్నదా చెప్పు’ అని ఝాన్సీని అడిగాడు. బచ్చాగాడు అంటే నీకెలాగైతే తప్పైతే.. సుధీర్ అన్నను ‘పిల్ల బచ్చా’ అన్నావు. అది తప్పు కాదా?’ అని అడిగింది. ఆట ఆటలా తన అపోజిట్ మనిషి ఆడితే.. తను కూడా ఆటగాడిలానే ఆడతానని.. పోటు గాడిలా ఆడితే అలాగే చేస్తానని అమన్ చెప్పాడు.
దేబ్జాని వచ్చేసి రోహిత్‌ను నామినేట్ చేసింది. మాటల్లో త్రిగుణ్‌కు నువ్వు సమానం. కొన్ని విషయాల్లో మీరు ఓవర్ షాడో చేస్తున్నారు. 14 మంది వచ్చి మిమ్మల్ని టార్గెట్ చేస్తే మీరు డిఫెండ్ చేసుకోవచ్చు. ఇది ప్రతి సారి అవసరం లేదు. అగ్నిపరీక్షలో బిందు మాధవి మీ మొహంపై నీళ్లు పోస్తే కంట్రోల్‌గానే ఉన్నావు. ఇక్కడ టూ మచ్ అగ్రెషన్‌తో ఉంటున్నావు. మా అమ్మా నాన్న లెటర్ వచ్చినప్పుడు చిన్న పిల్లల రైటింగ్‌లా ఉంది. మీ చెల్లి ఉంది కదా.. అని చెప్పావు. అవన్నీ కూడా స్క్రీన్ స్పేస్ కోసమే చేశావు’ అని చెప్పింది. ఇక్కడున్న వారంతా తనకు పది ఫీడ్ బ్యాక్ ఇస్తారు. అవన్నీ తీసుకుంటే నా ఇండివిడ్యువాలిటీ దెబ్బతింది. త్రిగుణ్ కాఫీ తీసుకుంటే నీకు బాధ కలిగింది. అది ఓకే మీకు. ఫైన్ లైన్ అని నాకు చెప్పినప్పుడు అదే పనిని వేరొక ఉమన్ విషయంలో అలాగే ఎందుకు చేశావు? సుధీర్‌తో మాట్లాడేటప్పుడు ప్రతిసారీ ‘పో బే’ అంటున్నావు?’ అంటూ దేబ్జాని కూడా చాలా దారుణంగా మాట్లాడింది. ‘నీలాగా నాకు ఎల్లో కార్డు రాలేదు. నీ లాగా నాకు డోర్లు తీయలేదు. నీకు స్క్రీన్ స్పేస్ కావాలి’ అని చెప్పి చాలా యాటిట్యూడ్ చూపిస్తూ పాట్ పగులగొట్టి వెళ్లిపోయింది. నా నుంచి నీకు స్క్రీన్ స్పేస్ రాదు’ అని చాలా యారోగెన్సీ చూపించింది. నీకు కంటెంట్ ఉంటే కదా.. స్క్రీన్ స్పేస్ నువ్వు ఇవ్వడానికి అని చెప్పింది.
రోహిత్ వచ్చేసి నరేష్‌ను నామినేట్ చేశాడు. ‘‘ొకసారి సంచాలక్‌లో త్రిగుణ్ ఒక పొరపాటు చేసి మళ్లీ సరిచేసుకున్నాడు. దీంతో మీరు చాలా హర్ట్ అయ్యాడు. ఆ ఫెయిర్ అడ్వాంటేజ్ ఇచ్చిన వ్యక్తి.. మీకు ఎందుకు అన్యాయం చేస్తాడు అన్న ఆలోచన కూడా లేకుండా మాట్లాడారు’ అని రోహిత్ నామినేషన్ పాయింట్ పెట్టాడు. మధ్యలోకి దేబ్జాని కూడా వచ్చి న్యాయం గురించి మాట్లాడుతున్నాడంటూ నానా రచ్చ చేసింది. వంశీ వచ్చేసి రోహిత్‌ని నామినేట్ చేశాడు. ఎప్పుడో టాస్క్‌ని తీసుకొచ్చి వంశీ నామినేట్ చేశాడు. ‘ఈ షోకి వచ్చి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నావు. ఈ షో నుంచి లక్షల మంది బతుకుతున్నారు’ అని వంశీ చెప్పాడు. టాస్క్‌ల్లో రూల్స్ సరిగా వినాలి అని వంశీ చెప్పాడు. ఈ వారం దేబ్జాని, వంశీ, సుధీర్, వర్షిణి మినహా అంతా నామినేట్ అయ్యారు. వామ్మో.. బిగ్‌బాస్ ఈసారి హౌస్‌లోని వారికి కాదు టాస్క్.. రివ్యూవర్స్‌కి పెద్ద టాస్క్. కంటెంట్ బీభత్సంగా ఇస్తున్నారు. కంటెంట్ మాటేమో కానీ నామినేషన్స్‌లో సెలబ్రిటీల నామినేషన్ అయితే అంతా దూరిపోయి.. విజిల్స్ వేస్తూ.. క్లాప్స్ కొడుతూ నానా రచ్చ చేస్తున్నారు. కామనర్స్ కూడా దాదాపుగా ఇలాగే ప్రవర్తిస్తున్నారు. ఇదంతా చూసేవారికి టార్చర్.
సోషల్ మీడియాలో తనదైన స్టైల్ డైలాగులతో నెటిజన్లను కడుపుబ్బా నవ్వించిన పాపులర్ యూట్యూబర్, కమెడియన్ కిరణ్ కుమార్ అలియాస్ 'అగ్గిపెట్టి…
నిన్న నామినేషన్స్ పూర్తైన సీన్ నుంచి ఇవాళ షో ప్రారంభమైంది. తనను కొన్ని కారణాల వల్ల తనను నామినేట్ చేశారని..…
ప్రభాస్ (Prabhas) అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఫౌజీ సినిమా విషయంలో మరోసారి కొత్త చర్చ మొదలైంది. ఒకప్పుడు ప్రభాస్…
బిగ్‌బాస్ 10 తెలుగు రసవత్తరం అనే కన్నా.. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉందనడం ఉత్తమమేమో. ఎవరూ తక్కువోళ్లు కాదు.…
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇప్పుడు పాలిటిక్స్ వైపు అడుగులు వేస్తున్నారనే వార్త తమిళనాట హాట్ టాపిక్ గా మారింది.…
ఒకప్పుడు తెలుగు బుల్లితెరపై కామెడీ అంటే జబర్దస్త్, జబర్దస్త్ అంటే కామెడీ అనే రేంజ్‌లో ఈ షో ఒక సెన్సేషన్…