సినిమా వార్తలు

Biggboss 10 Telugu: సోషల్ మీడియాలో మారుమోగుతున్న రోహిత్..

బిగ్‌బాస్ 10 తెలుగు (Bigg Boss 10 Telugu) మొదటి రోజు నుంచే రసవత్తరంగా సాగుతోంది. వీకెండ్‌లో హోస్ట్ నాగార్జున (Nagarjuna) వస్తారు.. ఒక్కొక్కరికీ బ్యాండ్ బాజా బారాత్ అనుకుంటే.. బ్యాండ్ లేదు.. బాజాల్లేవు. ఇంకేం బారాత్.. అంతా నిల్ డెస్పరాండం. ఆయన కూడా రోహిత్ నామ జపం చేసి వెళ్లిపోయారు. ఒక చిన్న మాటను పట్టుకుని చిలవలు పలవలు చేసి ఇష్టానుసారంగా రోహిత్‌ (Rohith)ను ఆడుకుని వెళ్లిపోయారు. ఇక ఆ క్షణం నుంచి సోషల్ మీడియా మొత్తం రోహిత్ చుట్టూ గిరికీలు కొడుతోంది. అందరితో పాటు రోహిత్‌ను కూడా అని ఉంటే బాగుండేది. పెద్ద పెద్ద మాటలు అన్న వారినేమో ఆకాశానికి ఎత్తి.. రోహిత్‌ను తొక్కే ప్రయత్నం చేశారు నాగ్. దీంతో రోహిత్‌కు బీభత్సమైన హైప్ బయట క్రియేట్ అయ్యింది.

నిన్న షో చూస్తే ఒకవైపు నాగ్ మాటలతో ఏకిపారేస్తుంటే.. మరోవైపు చైత్ర (Chaithra) తన ఎలిమినేషన్‌కు కారణం రోహితేనంటూ ఆమె కూడా మాటలు వదిలేసింది. మరోవైపు ముఖేష్ తనను అటెన్టివ్‌గా లేడంటావా? అంటూ గొడవకు దిగాడు. మరోవైపు అగ్నిపరీక్ష నుంచి వచ్చిన ఝాన్సీ సైతం రోహిత్‌పై తిరుగుబాటు చేసింది. ఒక్కసారిగా తనపై అష్ట దిక్కుల నుంచి ఒత్తిడి పెరుగుతున్నా చలించకుండా ఉండిపోయాడు. అతని వ్యక్తిత్వమే అతనికి బీభత్సమైన హైప్ తీసుకొచ్చి పెట్టింది. ఈ నేపథ్యంలో రివ్యూవర్స్ అంతా పూర్తిగా రోహిత్‌కు సపోర్ట్‌గా నిలిచారు. సోషల్ మీడియాలో ఎంతో మంది రోహిత్‌కు సపోర్ట్‌గా వీడియోలు పెడుతున్నారు. దీంతో అతని గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

గతంలో అగ్నిపరీక్ష సమయంలో నవదీప్ (Navdeep), బిందు మాధవి (Bindu Madhavi) ఇద్దరూ కూడా రోహిత్ (Rohith) పనికి రాడంటూ రెడ్ ఇస్తే.. అతనిలో ఏదో ఫైర్ ఉందంటూ అభిజిత్ (Abhijeet) గ్రీన్ ఇచ్చాడు. ఆ తరువాత కూడా రోహిత్‌ను అభిజిత్ హనుమంతుడితో పోలుస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. ఇప్పుడది నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బీభత్సమైన ఎలివేషన్స్.. నానా హంగామా నడుస్తోంది. సండే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో కూడా బయటకు వచ్చింది. దానిలో కూడా రోహిత్‌ను ముఖేష్ దారుణంగా టార్గెట్ చేశాడని అనిపిస్తోంది. మొత్తానికి అందరూ కలిసి రోహిత్‌ చేతిలో కప్పు పెట్టి పంపేలా ఉన్నారు.

Telugu Cinema 360

Recent Posts

విశ్వంభరను మరిచిపోదామా.. బాస్ సినిమా బాక్సుల్లోంచి బయటికి రానట్లేనా..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర' అసలు థియేటర్లలోకి వస్తుందా రాదా అనే అనుమానాలు ఇప్పుడు…

2 hours ago

కామ్రేడ్ కళ్యాణ్ ట్రైలర్ రివ్యూ.. వాళ్ల మనోభావాలు దెబ్బతింటే అంతే సంగతులు..!

టాలీవుడ్‌లో తనకంటూ ఒక స్పెషల్ కామెడీ టైమింగ్ క్రియేట్ చేసుకున్న హీరో శ్రీవిష్ణు, ఇప్పుడు 'కామ్రేడ్ కళ్యాణ్' సినిమాతో రాబోతున్నారు.…

13 hours ago

Biggboss10 Telugu: రెచ్చిపోతున్న సుధీర్.. పడిపోతున్న గ్రాఫ్..

బిగ్‌బాస్ 10 తెలుగు రోజురోజుకూ దారుణంగా మారుతోంది. సెలబ్రిటీలు మరింత రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా హోస్ట్ నాగార్జున వచ్చి వెళ్లిపోయాక ప్రేక్షకుల్లో…

13 hours ago

ఇదెక్కడి దిక్కుమాలిన ప్లానింగ్.. కనీసం ట్రైలర్స్ కట్ చేయడానికి టైమ్ దొరకట్లేదా..?

టాలీవుడ్‌లో ఈ మధ్య వందల కోట్ల బడ్జెట్‌తో భారీ సినిమాలు తీస్తున్నారు కానీ, వాటికి తగ్గ కనీస ప్లానింగ్ అనేదే…

13 hours ago

Biggboss10 Telugu: హాట్ హాట్‌గా నామినేషన్స్.. ఈవారం కూడా కామనర్స్ బలి..

త్రిగుణ్, రామ్ ప్రసాద్, వంశీ కిచెన్ క్లీన్ చేస్తుండగా షో ప్రారంభమైంది. బాత్రూంలో నీళ్లు కారుతున్నాయని రోహిత్ కంప్లైంట్ చేశాడని…

24 hours ago

లెజెండరీ నటి శారద పరిస్థితి చూస్తున్నారా.. 81 ఏళ్ళ వయసులో కూడా..!

సీనియర్ నటి ఊర్వశి శారద తాజా పరిస్థితి చూసి సోషల్ మీడియాలో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇటీవల అక్టోబర్…

2 days ago