బిగ్‌బాస్ 10 తెలుగు రసవత్తరంగా సాగుతోంది. గత సీజన్లలో అయితే గొడవలు ఎప్పుడు అవుతాయా? అని చూడాల్సి వచ్చేది. ఇప్పుడు గొడవలు ఎప్పుడు ఆగుతాయా? అని చూడాల్సి వస్తోంది. ప్రతిరోజూ గొడవే. అదేం విచిత్రమో కానీ వీకెండ్లో నాగార్జున వచ్చి అసలు గొడవలే జరగనట్టుగా సింపుల్‌గా ఒకరిద్దరిని లేపి అక్షింతలు వేసి వెళ్లిపోతున్నారు. దీంతో నాగ్‌పై కూడా ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక గత వారం నామినేషన్స్ విషయానికి వస్తే లీస్ట్ 3లో ఝాన్సీ, వర్షిణి, వంశీ ఉన్నారు. అయితే ఎందుకోగానీ ఝాన్సీని త్రిగుణ్ కంటే ముందుగా సేవ్ చేశారు. మరి ఈ ధీమానో.. తనకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారన్న ధీమానో కానీ ఝాన్సీ మాత్రం సెలబ్రిటీలను వీడటం లేదు.
ఝాన్సీకి రోహిత్ కూర్చోబెట్టి మరీ సెలబ్రిటీలంతా ఏకమయ్యారు మనం ఏకమవకుంటే కష్టమని చెప్పినా కూడా విన్నట్టే విని.. అవతలికి వెళ్లి తన వ్యవహారం తాను సాగిస్తోంది. ఏమాత్రం కామనర్స్‌తో కలవడం లేదు. ఇక గతవారం నాగార్జున నామినేషన్స్ గురించి మాట్లాడొద్దంటూ రామ్ ప్రసాద్‌కి వార్నింగ్ ఇచ్చారు. అది అందరికీ వర్తిస్తుంది. కానీ అదేమీ పట్టించుకోకుండా సెలబ్రిటీలంతా కలిసి అగ్నిపరీక్ష టీం మొత్తాన్ని నామినేషన్స్‌లోకి తీసుకురావాలని స్కెచ్ గీశారు. ఆ స్కెచ్‌లో ఝాన్సీ కూడా పార్టిసిపేట్ చేయడమే కాకుండా తెలియకుండా దెబ్బ కొట్టాలంటూ సలహాలు కూడా ఇచ్చింది.
తను కూడా అగ్నిపరీక్ష నుంచే వచ్చింది. ఈ విషయాన్నే ఆమె మరిచి.. తనతోటి కంటెస్టెంట్స్‌ను నామినేషన్స్‌లోకి తీసుకు రావాలన్న స్కెచ్‌కు సలహాలిచ్చింది. అంతేకాకుండా తను కూడా అగ్ని పరీక్ష టీంనే టార్గెట్ చేసింది. ఝాన్సీ వచ్చేసి సృష్టిని నామినేట్ చేసి తన వంతు సహకారం సెలబ్రిటీలకు అందించింది. ఈ స్కెచ్ షోలో రాకున్నా కూడా లైవ్ చూసిన వారంతా ఈ వీడియో క్లిప్‌ను నెట్టింట వైరల్ చేస్తున్నారు. దీంతో నెటిజన్లు అంతా ఫైర్ అవుతున్నారు. ఝాన్సీ ప్రవర్తన మొదటి నుంచి నెటిజన్లకు నచ్చడం లేదు. ఆమె ఇలా సెలబ్రిటీల స్కెచ్‌లో తను కూడా ఓ సెలబ్రిటీ అన్నట్టుగా భాగమవడంతో ఇక మీదట ఇలా ఉంటే కష్టమేనన్న అభిప్రాయం నెట్టింట వ్యక్తమవుతోంది.
ఇవాళ కొందరు టీచర్స్గానూ.. మరికొందరు స్టూడెంట్స్గానూ యాక్ట్ చేయాలి. ముందుగా శ్వేత ఆర్ట్ అండ్ పీఈటీ టీచర్, శ్వేత డ్యాన్స్…
సౌత్ ఇండస్ట్రీలో సూర్య పేరు ఒక సెన్సేషన్ గా మారిపోయిందిప్పుడు. ఏడాది కింది వరకు సరైన హిట్ కోసం చాలా…
తనకు నామినేషన్ టెన్షన్ లేదు కానీ తను ఒక మాట కోసం హర్ట్ అయ్యానని నీతూ దేబ్జాని, సుధీర్‌కు చెప్పింది.…
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన ఏ సినిమా గురించి మాట్లాడినా అందులో…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో, అటు ఇండస్ట్రీలో సెన్సేషనల్ న్యూస్ హాట్ టాపిక్ గా మారిపోయిందిప్పుడు. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన…
సౌత్ ఇండియాలో మలయాళ ఇండస్ట్రీ గురించి ఒక రేంజ్లో చర్చ జరుగుతోందిప్పుడు. దానికి కారణం వాళ్ళు తీస్తున్న అద్భుతమైన కంటెంట్…