సినిమా వార్తలు

Biggboss10 Telugu: నెరవేరిన సెలబ్రిటీల కోరిక.. బిగ్‌బాస్ నుంచి కామనర్ సృష్టి అవుట్

బిగ్‌బాస్ హౌస్‌లో సెలబ్రిటీల హవా నడుస్తోంది. వీకెండ్‌లో హోస్ట్ నాగార్జున వచ్చినా కూడా వాళ్లకే న్యాయం చేసి.. కామనర్స్‌ని బాగా డౌన్ చేసి వెళుతున్నారని నెట్టింట ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనికి కారణం.. శనివారం నాగ్.. వర్షిణిని ‘చెప్పుతో కొట్టురా’ అన్న మాటకు ప్రశ్నించలేదు. ముఖేష్‌ ఆడిన చెత్త గేమ్‌పై ప్రశంసలు కురిపించారు. తన టీంను పక్కనబెట్టి వేరొక టీంను నడిపిస్తే దానికి ప్రశంసలేంటని ప్రేక్షకులు మండిపడుతున్నారు. రామ్ ప్రసాద్ చాలా విషయాల్లో ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. అగ్నిపరీక్షను చాలా చులకనగా త్రిగుణ్, ముఖేష్ మాట్లాడారు. దాని గురించే నాగ్ ఏనాడూ ప్రశ్నించలేదు.. రోహిత్‌ను కొన్ని గంటల పాటు నిలబెట్టి నానా రచ్చ చేశారు. వాస్తవానికి బిగ్‌బాస్‌నే రోహిత్ అన్నాడు అనడానికి స్పష్టమైన ఆధారం కూడా లేదు.

ఒక వీడియోను ప్లే చేసి అది బిగ్‌బాస్‌నే అన్నాడంటూ నాగ్ నానా రచ్చ చేయడంతో నెట్టింట అతనికి మద్దతు బాగా పెరిగింది. ఇక సెలబ్రిటీలంతా కలిసి స్కెచ్ గీసి మరీ కామనర్స్‌ని నామినేషన్స్‌లోకి లాగారు. ఈ క్రమంలోనే ఈసారి కామనర్స్ ఎలిమినేషన్ అనివార్యమైంది. అందరూ సేవ్ అయిపోయి.. లాస్ట్ ఇద్దరిలో సృష్టి, షాలిని నిలిచారు. వారిలో సృష్టిని నాగ్ ఎలిమినేట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో సృష్టి ఎలిమినేట్ అయిపోయింది. ఇదిలా ఉండగా.. వచ్చే వారం నుంచి నాగ్ ఇచ్చిన డోస్‌కు ఎలిమినేషన్స్ గురించి అయితే చర్చించరేమో కానీ ఉన్న కామనర్స్ అందరినీ నామినేషన్స్‌లోకి లాగడమైతే పక్కా అని తెలుస్తోంది. ఇప్పటి నుంచి కామనర్స్‌పై ప్రెజర్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరి దీనిని వారు ఎలా డీల్ చేస్తారు? ప్రెజర్‌ను తట్టుకుని నిలబడతారా? చూడాలి.

Telugu Cinema 360

Recent Posts

Biggboss10 Telugu: రోహిత్ పని ఓవర్ అని సెలబ్రిటీలు అనుకుంటున్నారా?

‘నారాయణమ్మ’ సాంగ్‌తో హోస్ట్ నాగార్జున సండే షోకి ఎంట్రీ ఇచ్చారు. నామినేషన్స్‌లో ఉన్న 9 మందిని లేపి వారి నుంచి…

5 hours ago

Anil Ravipudi: అనిల్ రావిపూడి యామినేషన్ సినిమా వెనక అంత పెద్ద కథ ఉందా..?

టాలీవుడ్‌లో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి అంటే ముందుగా గుర్తొచ్చేది నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. ఫుల్…

23 hours ago

ఫ్లాప్ వాళ్లను ఆపలేదు.. రూట్ మార్చేలా చేసింది.. కుర్రాళ్ళూ జాగ్రత్త..!

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఆడియన్స్ టేస్ట్ ఎంత వేగంగా మారుతుందో చూసి యంగ్ హీరోలందరికీ గట్టి షాక్ తగిలింది. వరుస…

1 day ago

లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఇక లేరు.. ది ట్రెండ్ సెట్టర్..!

సినిమాకు ఒక గ్రామర్ ఉంటుంది అంటారు కదా.. కానీ ఆ గ్రామర్‌ను బ్రేక్ చేసి అసలు హద్దులు ఎందుకు ఉండాలి…

1 day ago

Biggboss10 Telugu: రోహిత్‌కే ఫుల్ డోసు.. మిగిలిన వాళ్లంతా లైట్..

ఇవాళ (శనివారం) నాగార్జున కంటెస్టెంట్స్‌ను చెడుగుడు ఆడుకున్నారు. కంట్రోల్ చేయకుంటే ఇబ్బంది అవుతుందని గ్రహించినట్టున్నారు. అందరినీ కంట్రోల్ చేశారు. శుక్రవారం…

1 day ago

Biggboss10 Telugu: కామనర్స్‌కు పెద్ద దెబ్బ.. అంతా ముఖేషే చేశాడు..

తనకు డ్యాగర్ కావాలని సృష్టి.. రామ్ ప్రసాద్, దేబ్జాని, నరేష్‌లను అడుగుతుండగా షో ప్రారంభమైంది. నీ ఫ్రెండ్స్‌ను అడుక్కోమని దేబ్జాని…

2 days ago