ప్రముఖ నటి కలర్స్ స్వాతి (స్వాతి రెడ్డి) దర్శకుడు శ్రీకాంత్ నాగోతిని వివాహం చేసుకున్నారు. ఈ శుభవార్తను స్వాతి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తమ వివాహ వేడుకకు సంబంధించిన అందమైన ఫొటోలను షేర్ చేస్తూ, “Hitched. 08-07-2026” అనే చిన్న క్యాప్షన్‌తో తమ కొత్త జీవితాన్ని అధికారికంగా ప్రకటించారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోల్లో స్వాతి, శ్రీకాంత్ నాగోతి సంప్రదాయ హిందూ వివాహ పద్ధతుల్లో పవిత్ర అగ్ని సాక్షిగా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ వివాహ వేడుక అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో నిరాడంబరంగా జరిగినట్లు తెలుస్తోంది.
ఇది స్వాతి జీవితంలో రెండో వివాహం. గతంలో ఓ పైలట్‌ను వివాహం చేసుకున్న ఆమె, కొన్నేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. అనంతరం ఇండోనేషియా నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన స్వాతి సినిమాలు, వెబ్ సిరీస్‌లతో తన నటనా ప్రయాణాన్ని మళ్లీ ప్రారంభించారు.
ఈ సమయంలో దర్శకుడు శ్రీకాంత్ నాగోతితో ‘మంత్ ఆఫ్ మధు’ చిత్రంలో కలిసి పనిచేశారు. నవీన్ చంద్ర హీరోగా నటించిన ఆ చిత్రంతో ప్రారంభమైన వారి పరిచయం క్రమంగా ప్రేమగా మారి, ఇప్పుడు వివాహ బంధంతో కొత్త జీవితానికి శ్రీకారం చుట్టింది.
స్వాతి వివాహ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, సినీ ప్రముఖులు, అభిమానులు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర' అసలు థియేటర్లలోకి వస్తుందా రాదా అనే అనుమానాలు ఇప్పుడు…
టాలీవుడ్‌లో తనకంటూ ఒక స్పెషల్ కామెడీ టైమింగ్ క్రియేట్ చేసుకున్న హీరో శ్రీవిష్ణు, ఇప్పుడు 'కామ్రేడ్ కళ్యాణ్' సినిమాతో రాబోతున్నారు.…
బిగ్‌బాస్ 10 తెలుగు రోజురోజుకూ దారుణంగా మారుతోంది. సెలబ్రిటీలు మరింత రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా హోస్ట్ నాగార్జున వచ్చి వెళ్లిపోయాక ప్రేక్షకుల్లో…
టాలీవుడ్‌లో ఈ మధ్య వందల కోట్ల బడ్జెట్‌తో భారీ సినిమాలు తీస్తున్నారు కానీ, వాటికి తగ్గ కనీస ప్లానింగ్ అనేదే…
త్రిగుణ్, రామ్ ప్రసాద్, వంశీ కిచెన్ క్లీన్ చేస్తుండగా షో ప్రారంభమైంది. బాత్రూంలో నీళ్లు కారుతున్నాయని రోహిత్ కంప్లైంట్ చేశాడని…
సీనియర్ నటి ఊర్వశి శారద తాజా పరిస్థితి చూసి సోషల్ మీడియాలో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇటీవల అక్టోబర్…