Menu
BREAKING
కామ్రేడ్ కళ్యాణ్ ట్రైలర్ రివ్యూ.. వాళ్ల మనోభావాలు దెబ్బతింటే అంతే సంగతులు..!   |   Biggboss10 Telugu: రెచ్చిపోతున్న సుధీర్.. పడిపోతున్న గ్రాఫ్..   |   ఇదెక్కడి దిక్కుమాలిన ప్లానింగ్.. కనీసం ట్రైలర్స్ కట్ చేయడానికి టైమ్ దొరకట్లేదా..?   |   Biggboss10 Telugu: హాట్ హాట్‌గా నామినేషన్స్.. ఈవారం కూడా కామనర్స్ బలి..   |   లెజెండరీ నటి శారద పరిస్థితి చూస్తున్నారా.. 81 ఏళ్ళ వయసులో కూడా..!   |   Biggboss10 Telugu: నామినేషన్స్‌లో రెచ్చిపోయిన వర్షిణి, ముఖేష్..   |   Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ED సోదాలు.. అసలు నిజమేంటో తెలుసా..?   |   AK47: ఆదర్శ కుటుంబం మళ్లీ వాయిదా.. అసలు కారణం అదన్నమాట..!   |   Biggboss10 Telugu: రోహిత్ పని ఓవర్ అని సెలబ్రిటీలు అనుకుంటున్నారా?   |   Biggboss10 Telugu: నెరవేరిన సెలబ్రిటీల కోరిక.. బిగ్‌బాస్ నుంచి కామనర్ సృష్టి అవుట్   |   Anil Ravipudi: అనిల్ రావిపూడి యామినేషన్ సినిమా వెనక అంత పెద్ద కథ ఉందా..?   |   ఫ్లాప్ వాళ్లను ఆపలేదు.. రూట్ మార్చేలా చేసింది.. కుర్రాళ్ళూ జాగ్రత్త..!   |   లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఇక లేరు.. ది ట్రెండ్ సెట్టర్..!   |   Biggboss10 Telugu: రోహిత్‌కే ఫుల్ డోసు.. మిగిలిన వాళ్లంతా లైట్..   |   Biggboss10 Telugu: కామనర్స్‌కు పెద్ద దెబ్బ.. అంతా ముఖేషే చేశాడు..
Sardar 2
MOVIE REVIEW

Sardar 2

★ 2 / 5
Release Date: September 10, 2026
Cast
Karthi, SJ Suryah, Malavika Mohanan, Ashika Ranganath, Yogi Babu, Rajisha Vijayan
Director
P.S Mithran
Music Director
Sam CS
Producer
S. Lakshman Kumar and Ishan Saksena
Banner
Prince Pictures, Annaurna Studios

Sardar 2 Review

మూడేళ్ళ కింద వచ్చిన ‘సర్దార్’ సినిమాకు కొనసాగింపుగా తాజాగా ‘సర్దార్ 2’ వచ్చింది.. ఈ లేటెస్ట్ యాక్షన్ డ్రామాలో కార్తి తండ్రీ కొడుకులుగా నటించారు.. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది చూద్దాం..

Sardar 2 Movie Review

కథ:

కన్నతండ్రి సర్దార్ (కార్తి) దూరమయ్యాడనే బాధలో ఉన్న గూఢచారి విజయ్ (కార్తి), తన డ్యూటీలో నిమగ్నమవుతాడు. అయితే డిపార్ట్‌మెంట్ పెద్దలు అతడికి ఒక మారుమూల ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. అక్కడే తన టాలెంట్ చూపించి మళ్లీ పాత పొజిషన్ దక్కించుకోవాలని అతడు ఆరాటపడుతుంటాడు. ఈ క్రమంలో ఒక మిస్సింగ్ స్పై గురించిన ఎంక్వైరీలో అతనికి మైండ్ బ్లాక్ అయ్యే రహస్యాలు తెలుస్తాయి. బ్లాక్ డాగర్ (ఎస్‌జే సూర్య) అనే క్రిమినల్ గ్యాంగ్ చేస్తున్న బ్రూటల్ ప్లాన్స్ అర్థమవుతాయి. ఆ జర్నీలోనే తండ్రికి ముడిపడి ఉన్న పలు షాకింగ్ విషయాలు తెలుసుకుంటాడు. ఆ బ్లాగ్ డాగర్ బ్యాగ్రౌండ్ ఏంటి..? స్పైలను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? ఈ డేంజరస్ జర్నీలో హీరో ఎలా విజయం సాధించాడు.. ఇండియాను ఎలా కాపాడాడు అనేది మిగిలిన కథ..

స్క్రీన్ ప్లే:

ఫస్ట్ పార్ట్ సృష్టించిన సంచలనం దృష్ట్యా సర్దార్ 2పై ముందు నుంచి విపరీతమైన బజ్ నెలకొంది. అందుకు తగ్గట్లుగానే డైరెక్టర్ ముందే అసలు పాయింట్‌లోకి ప్రేక్షకులను తీసుకెళ్లడం సానుకూల పరిణామం. గల్లంతైన స్పైను వెతికే క్రమంలో మొదలయ్యే ఈ ఆపరేషన్ ఫస్టాఫ్ ఆసక్తిని రేపుతుంది. జపాన్ గడ్డపై గాలిలో ఫైటర్లు చేసే స్టంట్స్ లాజిక్‌కు అతీతంగా అనిపించినప్పటికీ, ప్రొడక్షన్ కాస్ట్ కళ్ళకు కడుతుంది. ఫస్టాఫ్ అంతా ఒకరకమైన ఆసక్తిని రేపుతూ, ఇంటర్వెల్ సమయానికి మంచి టెంపోను సెట్ చేశారు. అయితే ఓ గూఢచారి చిత్రానికి కావాల్సిన హంగులు ఉన్నప్పటికీ వాటిని తెరపై పకడ్బందీగా మలచడంలో డైరెక్టర్ పూర్తిగా తడబడ్డాడు. తొలి భాగంలో సినిమాలో ప్లాస్టిక్ బాటిల్ వ్యాపారం వెనకున్న చీకటి కోణాన్ని చూపించినట్లే, ఈసారి కల్తీ మాంసం, అడ్డగోలు మెడిసిన్ వాడకం వల్ల జరిగే అనర్థాలను కళ్లకు కట్టారు. అయితే ఆ చిత్రాన్ని చూసి చాలాకాలం అవ్వడంతో దానికి ముడిపెట్టిన కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుడికి వెంటనే కనెక్ట్ కాకపోవచ్చు.
ఇంటర్వెల్ వరకు ఓ మోస్తరుగా సాగిన ఈ థ్రిల్లర్.. సెకండాఫ్‌లో మాత్రం పూర్తిగా గాడి తప్పింది. స్క్రీన్ ప్లే అంతా నత్తనడకన సాగుతుంది. విలన్ హీరోకు రకరకాల ఫ్లోర్లలో ఒక్కో పజిల్ విసురుతూ ఇచ్చే టాస్కులు వినడానికి బాగున్నా, చూసేటప్పుడు మాత్రం నీరసం తెప్పిస్తాయి. ఈ భాగం అంతా బాగా ల్యాగ్ ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్సులు మాత్రం పర్లేదు. రన్ టైం కాస్త కుదించి, ఎమోషనల్ బాండింగ్‌ను ఇంకాస్త గట్టిగా రాసుకుని ఉంటే ఈ కాన్సెప్ట్ స్థాయి వేరేలా ఉండేది. పాత సినిమా ఇచ్చిన కిక్ అయితే ఇందులో పూర్తిగా లోపించిందని చెప్పక తప్పదు. ఇలాంటి కథను పెట్టుకుని మూడు గంటల సినిమా అంటే సాహసమనే చెప్పాలి.

నటీనటులు:

రెండు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రల్లో హీరో కార్తి ప్రాణం పెట్టి నటించాడు. తనదైన మార్క్ పెర్ఫార్మన్స్‌తో ఎక్కడా బోర్ కొట్టకుండా ఈ స్పై డ్రామాను సింగిల్ హ్యాండ్‌తో లాక్కొచ్చాడు. నెగెటివ్ రోల్‌లో ఎస్.జె.సూర్య తన ట్రేడ్ మార్క్ బాడీ లాంగ్వేజ్‌తో స్క్రీన్ ను డామినేట్ చేశాడు. ఫైట్ సీన్స్‌లో మాళవిక మోహనన్ తన బెస్ట్ ఇవ్వగా, మిగిలిన క్యారెక్టర్లలో ఆషికా రంగనాథ్, రజిషా, యోగి బాబు తమ పరిమితుల మేరకు నటించి మెప్పించారు. మిగిలిన వాళ్ళంతా తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.

టెక్నికల్ టీం:

సామ్ సి.ఎస్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్లను ఎలివేట్ చేసింది.. సాంగ్స్ లేకపోవడం ఈ తరహా సినిమాలకు కలిసొచ్చే అంశమే. జార్జ్ సి విలియమ్స్ అందించిన విజువల్స్ బాగున్నాయి, ముఖ్యంగా ఫారిన్ లొకేషన్లను అద్భుతంగా బంధించారు. ఎడిటింగ్ మరింత షార్ప్‌గా ఉండాల్సింది, ముఖ్యంగా సెకండాఫ్‌లో అనవసరమైన సీన్లను ట్రిమ్ చేసుంటే బాగుండేది. సంస్థ పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రేమ్ లోనూ రిచ్‌గా కనిపించింది. VFX క్వాలిటీ మీద ఇంకొంచెం దృష్టి సారించి ఉంటే బాగుండేది. దర్శకుడు కూడా రాసుకున్న కథ బాగానే ఉన్నా.. కథనం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సింది. పైగా రన్ టైమ్ కోసేసుంటే బాగుండేది. రెండూ చేయలేదు.. అందుకే సర్దార్ 2 నాసీరకం సీక్వెల్‌గా మారింది.

ఓవరాల్‌గా:

చివరగా చెప్పాలంటే సర్దార్ 2.. పూర్తిగా గురితప్పిన స్పై థ్రిల్లర్..!

Sardar 2 Cast

Karthi SJ Suryah Malavika Mohanan Ashika Ranganath Yogi Babu Rajisha Vijayan