సినిమా వార్తలు

వారెవ్వా కమ్ బ్యాక్ అంటే ఇలా ఉండాలి.. సూర్య ఆల్ టైమ్ రికార్డులు..!

సౌత్ ఇండస్ట్రీలో సూర్య పేరు ఒక సెన్సేషన్ గా మారిపోయిందిప్పుడు. ఏడాది కింది వరకు సరైన హిట్ కోసం చాలా ఏళ్లు వెయిట్ చేసిన ఈ హీరో.. కేలండర్ మారేసరికి ఏకంగా బాక్సాఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ చేస్తూ అందరికీ పెద్ద షాక్ ఇస్తున్నాడు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు ఏడాదికి కనీసం ఒక్క సినిమా రిలీజ్ చేయడానికే అపసోపాలు పడుతున్నారు. అసలు రెండు మూడేళ్లకు గానీ బడా హీరోల సినిమాలు థియేటర్లలోకి రావడం లేదు. పాన్ ఇండియా ఇమేజ్ పేరుతో ఏళ్ల తరబడి ఒకే ప్రాజెక్ట్ మీద టైమ్ తీసుకుంటున్నారు. ఇలాంటి టైమ్ లో ఒక స్టార్ హీరో ఒకే ఏడాది ఏకంగా మూడు సినిమాలు రిలీజ్ చేయడం, పైగా ఆ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్స్ గా నిలవడం అంటే మామూలు విషయం కాదు. కమ్ బ్యాక్ ఇస్తే ఈ రేంజ్ లో ఇవ్వాలిరా అనిపించేలా సూర్య ఒక రేర్ రికార్డ్ ను తన అకౌంట్ లో వేసుకుని ఫ్యాన్స్ కు డబుల్ కిక్ ఇచ్చాడు.

ఒకే ఏడాది ఏకంగా మూడు సినిమాలు థియేటర్లలోకి తీసుకురావడం, ఆ మూడింటితోనూ సూపర్ హిట్స్ కొట్టడం అనేది గత పదేళ్ల సౌత్ సినిమా హిస్టరీలో చూసుకుంటే కేవలం మన టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నానికి మాత్రమే సాధ్యమైంది. నాని 2016, 2017 సంవత్సరాల్లో వరుసగా ఈ మ్యాజిక్ రిపీట్ చేశాడు. 2016వ సంవత్సరంలో కృష్ణగాడి వీర ప్రేమగాధ, జెంటిల్‌మెన్, మజ్ను లాంటి మూడు భిన్నమైన సినిమాలతో హ్యాట్రిక్ కొట్టి ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచాడు. ఆ వెంటనే 2017లో కూడా నేను లోకల్, నిన్ను కోరి, ఎంసిఏ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టి టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. ఆ తర్వాత మరే ఇతర హీరో కూడా ఒకే క్యాలెండర్ ఇయర్ లో ఇలా మూడు హిట్లు కొట్టిన రికార్డు నమోదు కాలేదు. కానీ ఇప్పుడు సూర్య ఆ రేర్ ఫీట్ ను సాధించడమే కాకుండా, తన రేంజ్ కు తగ్గట్టుగా ఆ రికార్డ్ ను ఎవరికీ అందనంత వేరే లెవల్ కు తీసుకెళ్లిపోయాడు.

సూర్య క్రియేట్ చేసిన ఈ సరికొత్త రికార్డ్ వెనక ఉన్న కలెక్షన్స్ లెక్కలు చూస్తే ట్రేడ్‌ను సైతం పిచ్చెక్కిస్తుంది. ఈ 2026లో సూర్య నటించిన సినిమాలు ఏ రేంజ్ లో వసూళ్ల సునామీ సృష్టించాయో మనందరికీ తెలిసిందే. మొదటగా వచ్చిన కరుప్పు సినిమా యాక్షన్ అండ్ ఎమోషన్స్ తో ఆడియన్స్ కు విపరీతంగా నచ్చేసింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 300 కోట్లు కలెక్ట్ చేసి సూర్య స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. ఆ వెంటనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ కూడా జనాలకు బాగా కనెక్ట్ అయిపోయి ఏకంగా 280 కోట్లకు పైగా భారీ కలెక్షన్స్ రాబట్టింది. బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ హిట్స్ పడటంతో సూర్య బాక్సాఫీస్ మార్కెట్ మళ్ళీ పీక్స్ కు చేరుకుంది. ఈ రెండు సినిమాల భారీ సక్సెస్ సూర్య కెరీర్ కు ఒక బిగ్గెస్ట్ బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి.

ఇక ముచ్చటగా ఈ ఏడాది రిలీజ్ అయిన మూడో సినిమాతో కూడా సూర్య అదే రేంజ్ మ్యాజిక్ రిపీట్ చేశాడు. లేటెస్ట్ గా థియేటర్లలోకి వచ్చిన సీన్ సినిమా కూడా ఆడియన్స్ అంచనాలను అందుకోవడంలో 100 శాతం సక్సెస్ అయింది. ఓపెనింగ్స్ నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ మూవీ బాక్సాఫీస్ రన్ చూస్తుంటే ఈజీగా 250 కోట్ల కలెక్షన్స్ మార్క్ ను దాటేసేలా కనిపిస్తుంది. ఒకే ఏడాది మూడు సినిమాలతో ఆడియన్స్ ముందుకు రావడం ఒక ఎత్తు అయితే, ఆ మూడు చిత్రాలతోనూ సూపర్ హిట్స్ కొట్టడం ఇక్కడ హైలైట్ పాయింట్. అంతే కాకుండా ఆ హిట్ అయిన ప్రతీ సినిమా కూడా 200 కోట్లకు పైగా భారీ వసూళ్లు సాధించడం అనేది సౌత్ సినీ హిస్టరీలో కేవలం సూర్యకు మాత్రమే సాధ్యమైంది అని ట్రేడ్ వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. ఇదొక ఎవరూ ఊహించని బాక్సాఫీస్ మిరాకిల్ లాంటిదే.

ఇప్పుడున్న ట్రెండ్ లో ఒక సినిమా 100 కోట్లు రాబట్టడమే గగనం అయిపోతున్న టైమ్ లో, ఒకే హీరో నటించిన మూడు సినిమాలు ఒకే ఏడాదిలో 200 కోట్ల పైచిలుకు క్లబ్ లో చేరడం అంటే అదొక నెవర్ బిఫోర్ అండ్ నెవర్ ఆఫ్టర్ రికార్డ్. కథల ఎంపికలో సూర్య తీసుకున్న జాగ్రత్తలు, బడ్జెట్ విషయంలో కంట్రోల్, డైరెక్టర్స్ కు ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ ఈ భారీ సక్సెస్ కు మెయిన్ రీజన్ అని ఇండస్ట్రీ వర్గాలు అనలైజ్ చేస్తున్నాయి. ఈ భారీ రికార్డ్ ఇప్పట్లో మరే ఇతర హీరోకు కూడా సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న స్టార్ హీరోలు ఎవరూ కూడా ఏడాదికి మూడు సినిమాలు తీసేంత స్పీడ్ లో, ఆ డెడికేషన్ లో లేరు. మొత్తానికి సూర్య తన పర్ఫెక్ట్ లైనప్ తో, మైండ్ బ్లోయింగ్ ప్లానింగ్ తో బాక్సాఫీస్ కు అసలైన కింగ్ అనిపించుకోవడమే కాకుండా కమ్ బ్యాక్ అంటే ఇలాగే ఉండాలి అని అందరికీ ప్రూవ్ చేశాడు.

Pranav

Recent Posts

Bigg Boss10 Telugu: నీతూపై రెచ్చిపోయిన త్రిగుణ్, వంశీ.. ఇంట్లో ఉండేందుకు అర్హత లేదంటూ..

తనకు నామినేషన్ టెన్షన్ లేదు కానీ తను ఒక మాట కోసం హర్ట్ అయ్యానని నీతూ దేబ్జాని, సుధీర్‌కు చెప్పింది.…

11 hours ago

రామాయణపై రామ్ గోపాల్ వర్మ రివ్యూ.. వాళ్లంతా వీధి కుక్కలు..!

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన ఏ సినిమా గురించి మాట్లాడినా అందులో…

23 hours ago

షాకింగ్.. పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో, అటు ఇండస్ట్రీలో సెన్సేషనల్ న్యూస్ హాట్ టాపిక్ గా మారిపోయిందిప్పుడు. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన…

24 hours ago

బడ్జెట్ కంట్రోలింగ్.. మలయాళం వాళ్లను చూసి మనం నేర్చుకుందామా..?

సౌత్ ఇండియాలో మలయాళ ఇండస్ట్రీ గురించి ఒక రేంజ్‌లో చర్చ జరుగుతోందిప్పుడు. దానికి కారణం వాళ్ళు తీస్తున్న అద్భుతమైన కంటెంట్…

2 days ago

Bigg Boss10 Telugu: నామినేషన్స్ పాయింట్స్ మాట్లాడుకున్న త్రిగుణ్ టీం.. నాగ్ ప్రశ్నిస్తారా?

బిగ్‌బాస్ 10 తెలుగు చప్పగా సాగుతోంది. హౌస్‌లో రెండు గ్రూపులున్నాయి. ఒక గ్రూప్‌లో వర్షిణి, ముఖేష్ మాత్రమే ఉన్నారు. దీంతో…

2 days ago

జాన్వీ కపూర్‌కు తత్వం బోధపడిందా.. తిట్టిన నోటితోనే పొగడ్తల వర్షం కురిపిస్తుందిగా..!

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఎంతలా ట్రోలింగ్ ఫేస్ చేసిందో మనందరికీ తెలిసిందే. రీసెంట్‌గా…

2 days ago