సినిమా వార్తలు

బిగ్ బాస్ లో ట్విస్ట్‌లు ఉంటాయంటే ఏమో అనుకున్నాం కానీ భారీ ట్విస్ట్‌లు…

చరణ్ ఎలిమినేషన్‌ గురించి డిస్కషన్‌తో షో ప్రారంభమైంది. రామ్ ప్రసాద్ హై రిస్క్ జోన్ నుంచి అయితే బయటపడ్డాడు కానీ ఇంకా హౌస్‌మేట్ కాదని బిగ్‌బాస్ చెప్పారు. ఆ తరువాత దేబ్జాని, రోహిత్ మధ్య కాన్వర్సేషన్. మన మధ్య ఉన్న విభేదాలన్నీ పక్కనబెట్టి కలిసి ఉందాం అని రోహిత్‌కు దేబ్జాని చెప్పింది. దీనికి రోహిత్ ‘‘ఈ నాలుగు రోజుల పాటు నిన్ను చూసిన తర్వాత నీకు ఫిల్టర్స్ అనేవి లేవనిపించింది. చరణ్ వెళ్లిపోయాడు. నేను దానిలో ఉండిపోయా. ఇప్పుడు ఓకే ఇద్దరం కలిసి ఉందాం’’ అని చెప్పాడు. ఝాన్సీ గురించి రోహిత్, అమన్, షాలిని మధ్య చర్చ జరుగుతోంది. ఆమె స్మార్ట్ గేమ్ ఆడుతోందని రోహిత్.. కన్నింగ్ అని అమన్ అన్నాడు. సృష్టితో రోహిత్‌ని ఎందుకు లీడర్‌గా ఎంచుకున్నారని అడిగారట. ఝాన్సీని ఎందుకు ఎంచుకోలే.. ఆమె బిగ్‌బాస్‌లోకి ఫస్ట్ ఎంట్రీ ఇచ్చింది ఆమె కదా అని అన్నారని రోహిత్‌కి చెప్పాడు.

అమన్‌ని త్రిగుణ్ డిస్కషన్ మొదలు పెట్టాడు. అది కూడా రోహిత్ గురించే చర్చ. అమన్ స్ట్రాంగ్ ప్లేయర్ అని.. నీకు ఎవరూ లీడర్ కాదు అని త్రిగుణ్ బ్రెయిన్ వాష్ చేశాడు. నిన్న జరిగిన ఎలిమినేషన్‌తో మీ ఊహకందని మలుపులు ఉంటాయని.. ఇప్పటికైనా మీరు తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా ఉండాలని బిగ్‌బాస్ సూచించారు. ఇకపై గ్రూప్ గేమ్స్ ఉండవని.. ఇండివిడ్యువల్‌గా ఆడాలని చెప్పారు. అలాగే ఈరోజు ఇద్దరిని హౌస్‌మేట్స్‌గా చేస్తానని.. దాని కోసం టాస్క్ ఉంటుందని దానికి సన్నద్దమవ్వాలని చెప్పారు. గెలిచిన వారిలో ఇద్దరు హౌస్‌మేట్స్ అవుతారని.. లీస్ట్ ఇద్దరు హై రిస్క్ జోన్‌కి వెళతారని చెప్పారు. దీనికోసం ఎవరెవరు ఆడాలనే దానిపై ఓటింగ్ పెట్టారు. ఇక్కడ కూడా త్రిగుణ్ చాలా ఓవర్ యాక్షన్ చేశాడు. తాను ఓటింగ్‌లో పాల్గొనని చెప్పాడు. అలాగే కృష్ణుడు, ముఖేష్ సైతం తాము కూడా ఆడబోమని చెప్పారు.

హార్డ్ టాస్క్ వర్షిణి, సుధీర్.. మిగిలిన హౌస్‌మేట్స్ ఈజీ టాస్క్ ఆడాలని డిసైడ్ అయ్యారు. దేబ్జాని కన్నీళ్లు పెట్టుకుంటుంటే.. రోహిత్, షాలిని వెళ్లి ఆమెతో మాట్లాడి కూల్ చేశారు. త్రిగుణ్ గురించి సుధీర్, ఝాన్సీ, ముఖేష్ చర్చించుకున్నారు. వాళ్ల మాటలను బట్టి త్రిగుణ్ గురించి ఎంతో కొంత క్లారిటి ముఖేష్, సుధీర్‌కు వచ్చినట్టే కనిపిస్తోంది. ఇక టాస్క్ ప్రారంభమైంది. టాస్క్ పేరు రన్ రాజా రన్. ఒక సర్కిల్‌లో ఈజీ టాస్క్ ఆడే ఏడుగురు కూర్చొంటారు. చాలా మంది ఈ ఆట ఆడే ఉంటారు. ఒక కర్చీఫ్ తీసుకెళ్లి సైలెంట్‌గా ఒకరి వెనుక పడేయాలి. వారు పరిగెత్తుకెళ్లి కర్చీఫ్ పడేసిన వారిని పట్టుకోవాలి. ఇది టాస్క్. మొదట సృష్టి కర్చీఫ్ వేయడానికి రెడీ అయ్యింది. ఫస్ట్ ఝాన్సీ ఎలిమినేట్ అయిపోయింది. నెక్ట్స్ సృష్టి ఎలిమినేట్ అయ్యిందని త్రిగుణ్ చెప్పాడు. తాను ఎలిమినేట్ కాలేదని సృష్టి వాదించింది. ఈ రౌండ్‌ను మళ్లీ నిర్వహించాలని బిగ్‌బాస్ చెప్పడంతో మళ్లీ నిర్వహించారు. సెకండ్ రౌండ్‌లో షాలిని ఎలిమినేట్ అయ్యింది. ఆ తరువాత వరుసగా సృష్టి, అమన్ ఎలిమినేట్ అయ్యారు. చివరిగా నరేష్, రామ్ ప్రసాద్ మిగిలారు. రామ్ ప్రసాద్ కర్చీఫ్ అందుకున్నాడు. దీంతో రామ్ ప్రసాద్ హౌస్‌మేట్‌గా మారాడు.

ఈ టాస్క్ ఆడిన వారిలో ఎవరిని హై రిస్క్‌లోకి పంపిస్తన్నాడో చెప్పమనడంతో అమన్‌ని రామ్ ప్రసాద్ ఎంచుకున్నాడు. దీంతో అమన్ హై రిస్క్ జోన్‌లోకి వెళ్లిపోయాడు. వర్షిణి, చైత్ర ఇద్దరూ కలిసి అమన్‌కు హై రిస్క్ జోన్ అనగానే రోహిత్ పర్ఫెక్ట్ అన్నాడని చెప్పారు. మరోవైపు రోహిత్ వెళ్లి అమన్‌ను ఎందుకు హై రిస్క్ జోన్‌లో పెట్టారని రామ్ ప్రసాద్‌ని అడిగాడు. ఆతరువాత రామ్ ప్రసాద్‌తో జరిగిన డిస్కషన్ గురించి చెబుతుంటే ‘నువ్వెందుకు పర్ఫెక్ట్ అన్నావు?’ అని రోహిత్‌ని అమన్ అడిగాడు. ఎవరన్నారని రోహిత్ అడిగాడు. తెలిసిందని చెప్పకు ఎవరు చెప్పారో చెప్పమని రోహిత్ అడిగాడు. అమన్ పేర్లు చెప్పడంతో తాను ఆ సందర్భంలో అనలేదని రోహిత్ చెప్పాడు. ఆ తరువాత వర్షిణి, సుధీర్‌కి టాస్క్ ప్రారంభమైంది. ఈ వారం హై రిస్క్ నుంచి నో రిస్క్ జోన్‌లోకి వెళ్లి ఇద్దరు కంటెస్టెంట్స్ మీరేనని బిగ్‌బాస్ చెప్పారు. వారి ముందు కేక్ పెట్టి ఎన్ని నిమిషాల్లో మొత్తాన్ని తింటారని బిగ్‌బాస్ అడిగాడు. అప్పుడు ఒకరు 40 నిమిషాలంటే.. మరొకరు 30 నిమిషాలని చెప్పారు. ఇది కేక్ తినే పోటీ కాదని బిగ్‌బాస్ చెప్పారు. అసలైన టాస్క్ ఊ అంటారా? ఊహూ అంటారా? అని చెప్పారు.

ఆ కేక్‌ని స్మాష్ చేసి దానిని ఇంట్లోకి తీసుకెళ్లి దాన్ని ఎదుటి వ్యక్తి స్మాష్ చేశారని హౌస్‌లోని వారిని పర్ఫెక్ట్‌గా నమ్మించాలి. అలా ఎవరు నమ్మించగలుగుతారో వారే విన్నర్ అని బిగ్‌బాస్ చెప్పారు. మొత్తానికి ఇద్దరూ హౌస్‌మేట్స్ అయినట్టుగా మిగిలిన హౌస్‌మేట్స్‌కి చెప్పారు. ప్రతి ఒక్కరికీ ఆ ఇద్దరూ హౌస్‌మేట్స్ అవడంపై డౌట్స్ ఉన్నాయి. ఆ తరువాత బిగ్‌బాస్.. వర్షిణి, సుధీర్ టాస్క్ ఏమై ఉంటుందో చెప్పమంటేముఖేష్ మాత్రం తన ఎనాలసిస్ చెప్పాడు. వర్షిణి, సుధీర్ కన్ఫెషన్ రూమ్లో జరిగిన విషయాన్ని బయట చెప్పొద్దన్నా కూడా చెప్పారని.. మీరు హై రిస్క్‌లోకి వెళతారని బిగ్‌బాస్ చెప్పారు. హై రిస్క్‌లో ఉన్న నలుగురిని బిగ్‌బాస్ పిలిచారు. ఇవాళ ఆ నలుగురిలో ఒకరి ఎలిమినేషన్ ఉంటుందని బిగ్‌బాస్ చెప్పారు. వారిలో ఒకరు బిగ్‌బాస్ హౌస్‌లో ఎందుకు ఉండకూడదో చెప్పమన్నారు. అలా చైత్ర పేరు వర్షిణి చెప్పింది. మిగిలిన అమన్, సుధీర్ కూడా చైత్ర పేరునే చెప్పారు. చైత్ర వచ్చేసి సుధీర్ పేరు చెప్పింది. చైత్ర ఎలిమినేట్ అయినట్టు బిగ్‌బాస్ చెప్పారు. దీంతో చైత్ర అందరికీ గుడ్ బై చెప్పేసి వెళ్లిపోయింది.

బిగ్‌బాస్‌లో ఏవో ఈసారి ట్విస్టులు ఉంటాయని చెప్పారు కానీ ఎప్పుడూ చెబుతున్నట్టే చెప్పారులే అనుకున్నాం కానీ నిజంగానే భారీ ట్విస్టులు పెడుతున్నారు. బిగ్‌బాస్ చరిత్రలోనే మొదటి నాలుగు రోజుల్లోనే ఒకరి ఎలిమినేషనే జరిగింది లేదు. కానీ ఇద్దరు ఎలిమినేట్ అవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మొత్తానికి బిగ్‌బాస్ సీజన్ 10 తొలిరో్జు నుంచే చాలా ఆసక్తికరంగా కొనసాగుతోంది. చైత్ర నిజంగానే ఎలిమినేట్ అయ్యిందా? లేదంటే ఇంకేమైనా ట్విస్టులు ఉన్నాయా? అనేది చూడాలి.

Telugu Cinema 360

Recent Posts

విశ్వంభరను మరిచిపోదామా.. బాస్ సినిమా బాక్సుల్లోంచి బయటికి రానట్లేనా..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర' అసలు థియేటర్లలోకి వస్తుందా రాదా అనే అనుమానాలు ఇప్పుడు…

5 hours ago

కామ్రేడ్ కళ్యాణ్ ట్రైలర్ రివ్యూ.. వాళ్ల మనోభావాలు దెబ్బతింటే అంతే సంగతులు..!

టాలీవుడ్‌లో తనకంటూ ఒక స్పెషల్ కామెడీ టైమింగ్ క్రియేట్ చేసుకున్న హీరో శ్రీవిష్ణు, ఇప్పుడు 'కామ్రేడ్ కళ్యాణ్' సినిమాతో రాబోతున్నారు.…

17 hours ago

Biggboss10 Telugu: రెచ్చిపోతున్న సుధీర్.. పడిపోతున్న గ్రాఫ్..

బిగ్‌బాస్ 10 తెలుగు రోజురోజుకూ దారుణంగా మారుతోంది. సెలబ్రిటీలు మరింత రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా హోస్ట్ నాగార్జున వచ్చి వెళ్లిపోయాక ప్రేక్షకుల్లో…

17 hours ago

ఇదెక్కడి దిక్కుమాలిన ప్లానింగ్.. కనీసం ట్రైలర్స్ కట్ చేయడానికి టైమ్ దొరకట్లేదా..?

టాలీవుడ్‌లో ఈ మధ్య వందల కోట్ల బడ్జెట్‌తో భారీ సినిమాలు తీస్తున్నారు కానీ, వాటికి తగ్గ కనీస ప్లానింగ్ అనేదే…

17 hours ago

Biggboss10 Telugu: హాట్ హాట్‌గా నామినేషన్స్.. ఈవారం కూడా కామనర్స్ బలి..

త్రిగుణ్, రామ్ ప్రసాద్, వంశీ కిచెన్ క్లీన్ చేస్తుండగా షో ప్రారంభమైంది. బాత్రూంలో నీళ్లు కారుతున్నాయని రోహిత్ కంప్లైంట్ చేశాడని…

1 day ago

లెజెండరీ నటి శారద పరిస్థితి చూస్తున్నారా.. 81 ఏళ్ళ వయసులో కూడా..!

సీనియర్ నటి ఊర్వశి శారద తాజా పరిస్థితి చూసి సోషల్ మీడియాలో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇటీవల అక్టోబర్…

2 days ago