సినిమా వార్తలు

Vijay Deverakonda: కొండన్న ముందు భారీ లక్ష్యం.. ‘రణబాలి’ ఇప్పటి వరకు ఓకే.. ఇకపై ఏం చేస్తుందో..?

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) బాక్సాఫీస్ దగ్గర ఒక సాలిడ్ కమ్ బ్యాక్ హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఆయన లేటెస్ట్ మూవీ రణబాలి (Ranabaali) బాక్సాఫీస్ రిజల్ట్ మాత్రం ఇప్పుడు కాస్త టెన్షన్ పెడుతోంది. ఎలాగోలా ఫస్ట్ వీకెండ్ వరకు సినిమాను బలంగా లాక్కొచ్చిన విజయ్ దేవరకొండకు, వీకెండ్ తర్వాతే అసలు సినిమా కనిపిస్తోంది. సాధారణంగా ఏ సినిమాకైనా మండే టెస్ట్ చాలా కీలకం, ఇక్కడే రణబాలి తడబడుతోంది. సోమవారం రాగానే చాలా సెంటర్స్ లో కలెక్షన్స్ లో మేజర్ డ్రాప్ కనిపించడం ట్రేడ్ వర్గాలను కలవరపెడుతోంది. రిలీజ్ రోజు మోస్తరు నంబర్స్ తో మొదలైన ఈ మూవీ, శని ఆదివారాల్లో కాస్త పర్వాలేదు అనిపించినా వర్కింగ్ డేస్ లో మాత్రం ఆ జోరును కంటిన్యూ చేయలేకపోతుంది అనడానికి సోమవారం కలెక్షన్స్ ఒక నిదర్శనం.

రణబాలి బాక్సాఫీస్ లెక్కలు ఒకసారి డీప్ గా ఎనలైజ్ చేస్తే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుంది. రాహుల్ సంకృత్యాన్ (Rahul Sankrityan) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా, ఫస్ట్ వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా 37 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇందులో మన ఇండియన్ మార్కెట్ నుంచి 28 కోట్లు వచ్చాయి. పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న ఈ రోజుల్లో కేవలం తెలుగులోనే రిలీజ్ అయిన ఈ సినిమా నాలుగు రోజుల్లో 50 పర్సెంట్ రికవరీ మాత్రమే రాబట్టింది. సినిమా క్లీన్ హిట్ అనిపించుకోవాలి అంటే బయ్యర్లకు ఇంకా 30 కోట్లు వెనక్కి రావాలి. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే, నార్త్ అమెరికా మార్కెట్ ఎప్పుడూ విజయ్ కి చాలా స్ట్రాంగ్ జోన్. కానీ అక్కడ కూడా ఫస్ట్ వీకెండ్ లో రణబాలి 1 మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేయలేకపోయింది. దీనిని బట్టి డొమెస్టిక్ అండ్ ఓవర్సీస్ మార్కెట్లలో విజయ్ కి క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ కాస్త తగ్గుతుందనే కామెంట్స్ గట్టిగా వినిపిస్తున్నాయి.

ఒకవైపు రణబాలి బ్రేక్ ఈవెన్ కోసం కష్టపడుతుంటే, మరోవైపు బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2 కుమ్ముడు మామూలుగా లేదు. ఆ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుండటం రణబాలికి అతి పెద్ద మైనస్ గా మారింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ ముందున్న అతిపెద్ద కొండ ఈ జైలర్ 2 సినిమానే అని చెప్పాలి. అయితే రణబాలితో పాటు గత వీకెండ్ లో రిలీజ్ అయిన క్రేజీ కళ్యాణం, గరివిడి లక్ష్మి సినిమాలకు టాక్ బాగానే వచ్చినా కలెక్షన్లు రావట్లేదు. ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. లోకల్ గా ఆ సినిమాల నుంచి కాంపిటీషన్ లేకపోయినా కూడా ఆ అడ్వాంటేజ్ ను రణబాలి వాడుకోలేకపోయింది. రజనీకాంత్ థౌసండ్ వాలా మేనియా ముందు నిలబడటం ఈ పీరియాడిక్ డ్రామాకు చాలా కష్టంగా మారిపోయింది.

ఇన్ని నెగిటివ్స్ మధ్య రణబాలి టీమ్ కు ఉన్న ఒకే ఒక్క పాజిటివ్ పాయింట్ ఏంటంటే, సినిమాకు డివైడ్ టాక్, రేటింగ్స్ మీడియంగానే వచ్చినా కూడా వీకెండ్ లో పూర్తిగా క్రాష్ అయిపోలేదు. స్వాతంత్య్రానికి ముందు రాయలసీమ కరువు నేపథ్యంలో వచ్చిన ఈ సీరియస్ కథకు ఆడియన్స్ కనెక్ట్ అవ్వడంతో వీకెండ్ లో డీసెంట్ కలెక్షన్స్ రాబట్టగలిగింది. ముఖ్యంగా శనివారంతో పోలిస్తే ఆదివారం రోజు ఆక్యుపెన్సీలో కాస్త ఇంప్రూవ్మెంట్ కనిపించింది. దీన్ని బట్టి మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా ఆడియన్స్ లో సినిమా మీద ఇంట్రెస్ట్ పూర్తిగా పోలేదని అర్థం అవుతోంది. ఈ ఒక్క పాయింట్ మాత్రమే మేకర్స్ కు కాస్త రిలీఫ్ ఇస్తూ మిగిలిన రికవరీపై ఆశలు పెంచుతోంది.

ఫైనల్ గా చూసుకుంటే రణబాలి ప్రయాణం రాబోయే రోజుల్లో అంత ఈజీగా అయితే ఉండదు. కేవలం తెలుగు ఆడియన్స్ మీద మాత్రమే డిపెండ్ అయిన ఈ సినిమా, టార్గెట్ రీచ్ అవ్వాలంటే వర్కింగ్ డేస్ లో అద్భుతాలు జరగాలి. ఇప్పటికే 50 శాతం రికవరీ అయినప్పటికీ, మిగిలిన ఆ 30 కోట్ల టార్గెట్ అనేది వస్తున్న డ్రాప్స్ చూస్తుంటే చాలా పెద్ద టాస్క్ లాగే కనిపిస్తోంది. జైలర్ 2 లాంటి పాన్ ఇండియా సినిమాను తట్టుకుని బాక్సాఫీస్ దగ్గర నిలబడటం అంటే మామూలు విషయం కాదు. ఈ కష్టాలను దాటి రణబాలి ఏ మేరకు కలెక్షన్స్ రాబడుతుంది, విజయ్ దేవరకొండ డిస్ట్రిబ్యూటర్లను ఏ మేరకు సేవ్ చేస్తాడు అనేది రాబోయే రోజుల్లోనే తేలనుంది.

Pranav

Recent Posts

Bigg Boss10 Telugu: నీతూపై రెచ్చిపోయిన త్రిగుణ్, వంశీ.. ఇంట్లో ఉండేందుకు అర్హత లేదంటూ..

తనకు నామినేషన్ టెన్షన్ లేదు కానీ తను ఒక మాట కోసం హర్ట్ అయ్యానని నీతూ దేబ్జాని, సుధీర్‌కు చెప్పింది.…

2 hours ago

రామాయణపై రామ్ గోపాల్ వర్మ రివ్యూ.. వాళ్లంతా వీధి కుక్కలు..!

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన ఏ సినిమా గురించి మాట్లాడినా అందులో…

14 hours ago

షాకింగ్.. పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో, అటు ఇండస్ట్రీలో సెన్సేషనల్ న్యూస్ హాట్ టాపిక్ గా మారిపోయిందిప్పుడు. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన…

15 hours ago

బడ్జెట్ కంట్రోలింగ్.. మలయాళం వాళ్లను చూసి మనం నేర్చుకుందామా..?

సౌత్ ఇండియాలో మలయాళ ఇండస్ట్రీ గురించి ఒక రేంజ్‌లో చర్చ జరుగుతోందిప్పుడు. దానికి కారణం వాళ్ళు తీస్తున్న అద్భుతమైన కంటెంట్…

1 day ago

Bigg Boss10 Telugu: నామినేషన్స్ పాయింట్స్ మాట్లాడుకున్న త్రిగుణ్ టీం.. నాగ్ ప్రశ్నిస్తారా?

బిగ్‌బాస్ 10 తెలుగు చప్పగా సాగుతోంది. హౌస్‌లో రెండు గ్రూపులున్నాయి. ఒక గ్రూప్‌లో వర్షిణి, ముఖేష్ మాత్రమే ఉన్నారు. దీంతో…

1 day ago

జాన్వీ కపూర్‌కు తత్వం బోధపడిందా.. తిట్టిన నోటితోనే పొగడ్తల వర్షం కురిపిస్తుందిగా..!

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఎంతలా ట్రోలింగ్ ఫేస్ చేసిందో మనందరికీ తెలిసిందే. రీసెంట్‌గా…

1 day ago