సినిమా వార్తలు

Nara Rohith: ఆదర్శ కుటుంబానికి నారా రోహిత్ దూరం దూరం.. అదేనా అసలు కారణం..?

వెంకటేష్ (Venkatesh) హీరోగా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఆదర్శ కుటుంబం’ (Adarsha Kutumbam) థియేటర్లలోకి వచ్చేందుకు కౌంట్ డౌన్ మొదలైపోయింది. మరికొన్ని గంటల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమాలో కేవలం వెంకీ మామ మాత్రమే కాకుండా, మరో పవర్ ఫుల్ హీరో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో ఉన్నాడన్న విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆయనే నారా రోహిత్ (Nara Rohith). మేకర్స్ రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ లో రోహిత్ ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ గా చాలా పవర్ ఫుల్ లుక్ లో కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. స్క్రీన్ మీద ఆయన రోల్ చాలా బలంగా ఉండబోతోందని ఆ కొన్ని యాక్షన్ షాట్స్ చూస్తేనే క్లారిటీ వచ్చేసింది. కానీ సినిమా రేంజ్ కు తగ్గట్టుగా ఆయన మూవీ ప్రమోషన్స్ లో ఎక్కడా యాక్టివ్ గా కనిపించకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

సాధారణంగా ఒక సినిమా విడుదలకు ముందు ప్రొడక్షన్ హౌస్ లు చేసే పబ్లిసిటీ హడావిడి అంతా ఇంతా కాదు. కానీ ఈ ఆదర్శ కుటుంబం మేకర్స్ మాత్రం ప్రమోషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా, మొదటి నుంచి ఆచితూచి అడుగులు వేశారు. అయితే వాళ్ళు చేసిన ఆ కొద్దిపాటి పబ్లిసిటీ ఈవెంట్లలో కూడా నారా రోహిత్ జాడ ఎక్కడా కనిపించకపోవడం ఆడియన్స్ ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో ప్రధానంగా హీరో వెంకటేష్, ఆయనతో పాటు ఫీమేల్ లీడ్స్ గా నటించిన శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్ మాత్రమే అన్నీ తానై చురుగ్గా పాల్గొన్నారు. సినిమాకు సంబంధించిన అత్యంత కీలకమైన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో పాటు, ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేసిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా నారా వారబ్బాయి అటెండ్ కాలేదు. ఆయన ఎందుకు రాలేదు, అసలు ఏం జరిగింది అనే ప్రశ్నలు ఇండస్ట్రీ వర్గాలతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ మొదలయ్యాయి.

పబ్లిసిటీ కార్యక్రమాలు మొత్తం ముగిసిపోతున్నాయి, ఇక ఆయన ఈ సినిమా తరపున మీడియా ముందుకు రారేమో అనుకుంటున్న టైమ్ లో సడన్ గా ఒకట్రెండు డిజిటల్ ఇంటర్వ్యూలలో తళుక్కున మెరిశాడు నారా రోహిత్. సినిమా ప్రమోషన్స్ కు ఎండ్ కార్డ్ పడుతున్న చివరి నిమిషంలో కనీసం ముఖం చూపించకపోతే బాగుండదు అనుకున్నాడో ఏమో కానీ, ఒక మొక్కుబడి వ్యవహారంలాగా ఆ ఇంటర్వ్యూలు డిజైన్ చేసినట్లు అనిపించింది. అందులో ఒకటి పాపులర్ యాంకర్ సుమతో చేసిన ఫన్ చిట్ చాట్ కాగా, మరొకటి మూవీ టీమ్ అంతా కలిసి చేసిన ఒక పార్టీ ఇంటర్వ్యూ. కేవలం ఈ రెండు చోట్ల మాత్రమే ఆయన కనిపించాడు తప్ప, సినిమాను జనాల్లోకి బలంగా తీసుకెళ్లే మెయిన్ ప్రమోషన్స్ కు మాత్రం పూర్తిగా దూరంగా ఉండిపోయాడు. సినిమా కోసం సెట్స్ లో ఇంత కష్టపడి, తీరా రిలీజ్ ముందు ఇలాంటి సైలెంట్ అప్రోచ్ ఫాలో అవ్వడం చాలా మందికి వింతగా అనిపించింది.

ఒక స్టార్ హీరో సినిమాలో సెకండ్ లీడ్ గా పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాడు అంటే కచ్చితంగా ఆ పాత్రకు కథలో ఎంతో కొంత ప్రాధాన్యత ఉండే ఉంటుంది. అంత మంచి కీ రోల్ చేసినప్పుడు ప్రమోషన్స్ కు వస్తే సినిమాకు కూడా అదనపు మైలేజ్ దొరుకుతుంది. కానీ ఇక్కడ రోహిత్ కావాలనే తన వ్యక్తిగత కారణాల వల్ల ఈ పబ్లిసిటీ హంగామాకు దూరంగా ఉన్నాడా, లేక ప్రొడక్షన్ పీఆర్ టీమ్ వాళ్లే ఆయనను సరిగ్గా కోఆర్డినేట్ చేసుకుని ఆహ్వానించలేదా అనేది మాత్రం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. కారణం ఏదైనా సరే, తమ ఫేవరెట్ హీరో ఇంత పెద్ద సినిమా ప్రమోషన్స్ లో మిస్ అవ్వడం నారా రోహిత్ అభిమానులను బాగా హర్ట్ అయ్యేలా చేసింది. ఏదేమైనా ఇంకొన్ని గంటల్లో సినిమా థియేటర్లలోకి వచ్చేస్తుంది కాబట్టి, ఆయన పోలీస్ ఆఫీసర్ గా స్క్రీన్ మీద ఏ స్థాయి మ్యాజిక్ చేశాడో వెండితెర మీదే చూడాలి.

Pranav

Recent Posts

పునీత్ రాజ్‌కుమార్ 5వ వర్ధంతి.. అప్పు దూరమై అప్పుడే ఐదేళ్ళు..!

సరిగ్గా ఐదేళ్ల కిందట అంటే 2021 అక్టోబర్ 29న కర్ణాటక రాష్ట్రం మొత్తం కన్నీళ్లతో నిండిపోయింది. వాళ్ల పాలిట దేవుడు…

3 hours ago

Bigg Boss10 Telugu: బీబీ హోటల్ టాస్క్ ప్రారంభం.. రోహిత్ ఈజ్ బ్యాక్..

చాలా రోజుల తర్వాత మార్నింగ్ సాంగ్‌తో షో ప్రారంభమైంది. వర్షిణి, ముఖేష్, సుధీర్ ముగ్గురూ కలిసి త్రిగుణ్ గురించి మాట్లాడుకున్నారు.…

3 hours ago

Janhvi Kapoor: పెద్దిపై జాన్వీ కపూర్ రియాక్షన్.. ఏరు దాటాక తెప్ప తార్చడమంటే ఇదేనా..?

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన 'పెద్ది' సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన…

4 hours ago

మూర్తన్న ఆన్ డ్యూటీ.. కోట్లు ఇస్తా అన్నా నటించని పీపుల్ స్టార్.. హుషారు 2లో ఎలా..?

టాలీవుడ్ లో ఆర్ నారాయణ మూర్తి స్టైల్ అండ్ సిద్ధాంతాలు అందరికీ తెలిసిందే. తన సినిమాల ద్వారా ఎప్పుడూ ప్రజల…

4 hours ago

Bigg Boss10 Telugu: బిగ్‌బాస్‌కి ముందే వర్షిణి, త్రిగుణ్ మధ్య బిగ్ డీల్.. ఒప్పేసుకున్న త్రిగుణ్

నిన్న నామినేషన్స్ ముగిసిన తర్వాత నుంచి ఇవాళ్టి (మంగళవారం) షో ప్రారంభమైంది. వర్షిణి, త్రిగుణ్‌కి ఒక డీల్ ఉందట.. కాబట్టి…

2 days ago

Bigg Boss 10 Telugu: నామినేషన్లలో త్రిగుణ్ వర్సెస్ రోహిత్.. దేబ్జాని, వర్షిణితోనూ వాగ్వాదాలు

నిన్న డాన్యూబ్ చైర్మన్ హౌస్‌లోకి వచ్చి స్వీట్స్ ఇచ్చి వెళ్లారు. వాటిని ముఖేష్ అందరికీ పంచుతున్నాడు. మధ్యలో దేబ్జాని వచ్చి…

2 days ago