సినిమా వార్తలు

Biggboss 10 Telugu: బిగ్‌బాస్‌లో మిడ్ వీక్ ఎలిమినేషన్?

బిగ్‌బాస్‌ 10 తెలుగు (Bigg Boss 10 Telugu)లో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందన్న టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియడం లేదు కానీ.. ముందుగానే బిగ్‌బాస్ హై రిస్క్, నో రిస్క్ జోన్‌ అని చెప్పాడు. ఈ క్రమంలోనే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండనుందని టాక్. ఈ రోజు (బుధవారం) అర్ధరాత్రికే మిడ్ వీక్ ఎలిమినేషన్ (Mid Week Elimination) జరగనుందని టాక్. ఇప్పటి వరకూ బిగ్‌బాస్ చరిత్రలో ఇలా ఫస్ట్ వీకే మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగింది లేదు. ఇవాళ అది జరిగితే మాత్రం తొలిసారి కానుంది. ప్రస్తుతం హై రిస్క్‌లో రామ్ ప్రసాద్ (Ram Prasad), చరణ్ (Charan) హై రిస్క్ జోన్‌లో ఉన్నారు. రామ్ ప్రసాద్ వచ్చేసి తనను తాను హై రిస్క్‌ జోన్‌లో పెట్టుకున్నాడు. ఇది అతనికే మైనస్. అయితే వీళ్లిద్దరిలో చూస్తే మాత్రం వాస్తవానికి రామ్ ప్రసాద్‌కే డేంజర్ పొంచి ఉంది.

ఎందుకంటే.. చరణ్‌(Charan)ని హై రిస్క్ జోన్‌లో పెట్టడంతో అతనికి సింపతి బాగా వర్కవుట్ అయ్యింది. పైగా అతడిని హై రిస్క్ జోన్‌లో పెట్టినప్పుడు రోహిత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ సమయంలో వారిద్దరి బాండ్ ఏంటనేది బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే రోహిత్ ఫ్యాన్స్.. చరణ్‌కి ఓటు వేసే అవకాశం ఉంది. అలాంటప్పుడు డేంజర్ అనేది రామ్ ప్రసాద్‌(Ram Prasad)కే ఎక్కువ. ఇక రామ్ ప్రసాద్‌ని ఎలిమినేట్ చేస్తే కష్టం అవుతుంది. అతని కారణంగానే షోలో కామెడీ జెనరేట్ అవుతోంది. కాబట్టి అతడిని సీక్రెట్ రూమ్‌లోకి పంపించే అవకాశం కూడా లేకపోలేదు. మరోవైపు వైల్డ్ కార్డు ఎంట్రీలు కూడా ఉండనున్నాయి. ఇప్పటికే నందూస్ వరల్డ్ నందన (Nandana).. ఇండియాకు వచ్చింది కూడా అందుకేనని టాక్ నడుస్తోంది.

ఈ క్రమంలోనే నందన కావాలనే అరెస్ట్ అయ్యారనే టాక్ కూడా ఉంది. తద్వారా బెయిల్ తీసుకుని ఆమె బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం ఉందంటున్నారు. ఇక ఆమె మాత్రమే కాకుండా అగ్నిపరీక్షలో ఫైనల్ వరకూ వచ్చిన వారిలో ఒకరిద్దరిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపించనున్నట్టు టాక్. మొత్తానికి బిగ్‌బాస్ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా ఉంది.

Telugu Cinema 360

Recent Posts

Biggboss10 Telugu: కామనర్స్‌కు పెద్ద దెబ్బ.. అంతా ముఖేషే చేశాడు..

తనకు డ్యాగర్ కావాలని సృష్టి.. రామ్ ప్రసాద్, దేబ్జాని, నరేష్‌లను అడుగుతుండగా షో ప్రారంభమైంది. నీ ఫ్రెండ్స్‌ను అడుక్కోమని దేబ్జాని…

23 hours ago

సాయి ధరమ్ తేజ్ కష్టాన్ని దోచేస్తున్నారా.. సంబరాల ఏటిగట్టు మళ్ళీ వాయిదా..?

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న భారీ పీరియాడిక్ సినిమా సంబరాల ఏటిగట్టు వ్యవహారం ఇండస్ట్రీలో పెద్ద…

2 days ago

చిరంజీవి టాక్ షో.. గెటప్ మార్చేస్తున్న బాస్.. ఎలా ఉండబోతుందో తెలుసా..?

మెగా అభిమానులకు త్వరలోనే అదిరిపోయే న్యూస్ అందబోతోందా అంటే అవుననే సమాధానం బలంగా వినిపిస్తోంది. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర దశాబ్దాలుగా…

2 days ago

రాజమౌళి కోసమే.. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాపై మహేష్, తారక్ రివ్యూ..!

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే సినిమా పేరు మార్మోగిపోతోంది.. అదే డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. దర్శక ధీరుడు…

2 days ago

భయపెడుతున్న వారణాసి బిజినెస్.. రిలీజ్‌కు ముందే 1000 కోట్లు ఏంటి స్వామి..?

టాలీవుడ్ స్థాయిని పెంచడమే కాదు, ఏకంగా ఇండియన్ సినిమా ముఖచిత్రాన్ని, రూపురేఖలను పూర్తిగా మార్చేస్తున్న ఏకైక దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి…

3 days ago

ఆ అగ్ర నిర్మాత చేతికి జైలర్ 2 రైట్స్.. మధ్యలో మైత్రి మూవీ మేకర్స్ సడన్‌ ఎంట్రీ..!

టాలీవుడ్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వరుస సినిమాలు నిర్మిస్తూ స్టార్ ప్రొడ్యూసర్‌గా దూసుకుపోతున్న నాగవంశీ, కేవలం నిర్మాణానికే పరిమితం కాకుండా…

3 days ago