సినిమా వార్తలు

Biggboss 10 Telugu: రోహిత్, షాలిని లవ్.. కన్ఫర్మ్ చేసిన రామ్ ప్రసాద్

బిగ్‌బాస్ 10 తెలుగు చాలా ఆసక్తికరంగా సాగుతోంది. నిన్న నామినేషన్స్ రచ్చ లేపాయి. వాస్తవానికి శనివారం హోస్ట్ నాగార్జున అందరినీ వదిలేసి రోహిత్‌కు మాత్రమే క్లాస్ తీసుకున్నారు. షో అంతా కూడా రోహిత్‌ను ఏదో ఒకరకంగా టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఆట తీరు మార్చుకోమని కూడా సలహా ఇచ్చారు. ఇంత జరిగిన తర్వాత ఇక అంతా రోహిత్‌కు ఎగెనెస్ట్ అవుతారని భావించారు. కానీ అనూహ్యంగా త్రిగుణ్‌కు ఎగెనెస్ట్ అవడం చూసే ఆడియెన్స్‌నే కాకుండా అతడిని సైతం షాక్‌కు గురి చేసింది. ఇక ఆసమయంలో రోహిత్‌కు అడుగడుగునా సపోర్ట్ ఇస్తూ వెళ్లింది షాలిని. వాస్తవానికి రోహిత్ దగ్గర డిఫెండింగ్ స్కిల్ ఉంది. అలాగే పాయింట్స్ గట్టిగా పెట్టగలడు. అతనికి సపోర్ట్ చేయడమంటే.. అతడిని ఇరుకున పెట్టడమే. కానీ అదేమీ గ్రహించకుండా షాలిని ప్రతి దానిలోనూ ఇన్వాల్వ్ అయిపోయింది.

ఇక అన్‌సీన్ వీడియోలో అమన్, దేబ్జానీ, రామ్ ప్రసాద్, నరేష్ సరదాగా కూర్చొని మాట్లాడుకున్నారు. ఆ సమయంలో అమన్‌ను దేబ్జాని.. ‘మీరంతా అగ్నిపరీక్ష నుంచి వచ్చారు కదా.. నువ్వెందుకు షాలినిని కానీ సృష్టిని కానీ ట్రైచేయడం లేదు?’ అని అడిగింది. దానికి అమన్.. తనకు, షాలిని అసలు సెట్ కాదని చెప్పాడు. అప్పుడు రామ్ ప్రసాద్ ‘షాలినికి రోహిత్ అంటే ఇష్టం కదా.. బాగా ఇష్టం’ అని అనడంతో అమన్ అది ఫ్రెండ్సా ఏంటనేది తెలియదన్నాడు. బాండింగ్ అయితే ఉందని రామ్ ప్రసాద్ అన్నాడు. వాళ్లిద్దరి మధ్య జెన్యూన్‌గా లవ్ స్టార్ట్ అయ్యిందని అన్నాడు. అవునా? అని అమన్ అన్నాడు. ఈ వీడియో ఎక్కడ ప్లే చేస్తారోనని జాగ్రత్తగా అమన్ మాట్లాడుతున్నాడని దేబ్జాని సెటైర్ వేసింది. మొత్తానికి రోహిత్, షాలిని మధ్య కంటెంట్ కోసం కాకుండా జెన్యూన్‌గా లవ్ ప్రారంభమైందని రామ్ ప్రసాద్ చెప్పాడు.

Telugu Cinema 360

Recent Posts

విశ్వంభరను మరిచిపోదామా.. బాస్ సినిమా బాక్సుల్లోంచి బయటికి రానట్లేనా..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర' అసలు థియేటర్లలోకి వస్తుందా రాదా అనే అనుమానాలు ఇప్పుడు…

11 minutes ago

కామ్రేడ్ కళ్యాణ్ ట్రైలర్ రివ్యూ.. వాళ్ల మనోభావాలు దెబ్బతింటే అంతే సంగతులు..!

టాలీవుడ్‌లో తనకంటూ ఒక స్పెషల్ కామెడీ టైమింగ్ క్రియేట్ చేసుకున్న హీరో శ్రీవిష్ణు, ఇప్పుడు 'కామ్రేడ్ కళ్యాణ్' సినిమాతో రాబోతున్నారు.…

12 hours ago

Biggboss10 Telugu: రెచ్చిపోతున్న సుధీర్.. పడిపోతున్న గ్రాఫ్..

బిగ్‌బాస్ 10 తెలుగు రోజురోజుకూ దారుణంగా మారుతోంది. సెలబ్రిటీలు మరింత రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా హోస్ట్ నాగార్జున వచ్చి వెళ్లిపోయాక ప్రేక్షకుల్లో…

12 hours ago

ఇదెక్కడి దిక్కుమాలిన ప్లానింగ్.. కనీసం ట్రైలర్స్ కట్ చేయడానికి టైమ్ దొరకట్లేదా..?

టాలీవుడ్‌లో ఈ మధ్య వందల కోట్ల బడ్జెట్‌తో భారీ సినిమాలు తీస్తున్నారు కానీ, వాటికి తగ్గ కనీస ప్లానింగ్ అనేదే…

12 hours ago

Biggboss10 Telugu: హాట్ హాట్‌గా నామినేషన్స్.. ఈవారం కూడా కామనర్స్ బలి..

త్రిగుణ్, రామ్ ప్రసాద్, వంశీ కిచెన్ క్లీన్ చేస్తుండగా షో ప్రారంభమైంది. బాత్రూంలో నీళ్లు కారుతున్నాయని రోహిత్ కంప్లైంట్ చేశాడని…

23 hours ago

లెజెండరీ నటి శారద పరిస్థితి చూస్తున్నారా.. 81 ఏళ్ళ వయసులో కూడా..!

సీనియర్ నటి ఊర్వశి శారద తాజా పరిస్థితి చూసి సోషల్ మీడియాలో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇటీవల అక్టోబర్…

1 day ago