సినిమా వార్తలు

Biggboss10 Telugu: హాట్ హాట్‌గా నామినేషన్స్.. ఈవారం కూడా కామనర్స్ బలి..

త్రిగుణ్, రామ్ ప్రసాద్, వంశీ కిచెన్ క్లీన్ చేస్తుండగా షో ప్రారంభమైంది. బాత్రూంలో నీళ్లు కారుతున్నాయని రోహిత్ కంప్లైంట్ చేశాడని త్రిగుణ్ చెప్పాడు. అమన్‌ను రామ్ ప్రసాద్.. చికెన్ కర్రీ ఇష్టమా? మటన్ కర్రీ ఇష్టమా? అని అడగడంతో మటన్ ఇష్టమని చెప్పాడు. అంతేకానీ కప్ మాత్రం ఇష్టం లేదన్న మాట అని కౌంటర్ వేశాడు. అలాగే ముఖేష్‌ను కూడా అడిగి ఫన్ చేశారు. కెప్టెన్ రూంలో ముఖేష్, వర్షిణి మీటింగ్. ముఖేష్‌ను ‘నువ్విక్కడ పడుకో.. నేను బయట పడుకుంటా’ అని వర్షిణి చెప్పింది. వెళుతూ వెళుతూ ఓ హగ్ ఇచ్చేసి మరీ వెళ్లింది. తరువాత నామినేషన్స్ ప్రారంభమయ్యాయి. రోడ్ టు రీలోడ్‌లో భాగంగా ఒక వేటలా నామినేషన్స్ ఉంటాయని బిగ్‌బాస్ చెప్పారు. ఒక కంటెస్టెంట్ వచ్చి బయట ఏర్పాటు చేసిన బాక్సుల్లో ఒక దాని కింద బాల్ పెడతారు. దానిని ఇద్దరు కంటెస్టెంట్స్ వచ్చి సెర్చ్ చేసి దానని తీసి ఎవరినో ఒకరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. కంటెస్టెంట్స్ ముందర కుండలను ఏర్పాటు చేశారు. ముఖేష్, రామ్ ప్రసాద్‌లను హౌస్ లోపలికి పంపించి.. వర్షిణిని బాల్ బాక్సు కింద పెట్టమన్నారు. బాల్ రామ్ ప్రసాద్‌కు దొరికింది.

రామ్ ప్రసాద్ వచ్చేసి అమన్‌తో నామినేషన్ ప్రారంభించాడు. మొన్న వీడియో చూసినప్పుడు చెయ్యిని ట్విస్ట్ చేశావని.. ఇబ్బంది ఉన్నా కూడా వదల్లేదని.. నెక్ కూడా మెలితిప్పావని చెప్పి నామినేషన్ చేశాడు. అమన్ తను కావాలని చేయాలని ఆ పరిస్థితి గురించి వివరించాడు. దీనికి త్రిగుణ్ తనను కావాలనే ఇబ్బంది పెట్టారని చెప్పాడు. తనను టార్గెట్ చేశారని చెప్పాడు. మధ్యలో అపూర్వ పేరు తేవడంతో ఆమె క్లారిటీ ఇచ్చింది. సంచాలక్స్ ఉన్నారు కదా.. అనగానే వర్షిణి, నరేష్ మధ్యలోకి వచ్చారు. వంశీకి సంబంధం లేకున్నా అతను కూడా మధ్యలోకి వచ్చాడు. మొత్తానికి అమన్‌పై నామినేషన్‌లోకి ముఖేష్, సుధీర్ తప్ప అందరూ కలుగజేసుకున్నారు. ఆ తరువాత త్రిగుణ్‌ను రామ్ ప్రసాద్ నామినేట్ చేశాడు. త్రిగుణ్‌ను గొడవల్లోకి అలాగే వెళతావు.. మాటలు కూడా అలాగే అంటావని చెప్పాడు. ‘నీ హీరోయిజం తగ్గించుకోకు’ అని రామ్ ప్రసాద్ చెప్పాడు. తనను గుచ్చి గుచ్చి ఇబ్బంది పెట్టడంతో తనను అలా అనాల్సి వచ్చిందని త్రిగుణ్ సారీ చెప్పాడు. ఈ క్రమంలోనే రోహిత్ కల్పించుకుని పదే పదే అంటుంటే దానిని పొరబాటు అనరని.. కావాలని చేయడమేనని రోహిత్ చెప్పాడు.

మధ్యలో సుధీర్ కల్పించుకున్నాడు. కావాలనుకుంటే సపోర్ట్ చేసుకోండని రోహిత్ అన్నాడు. ఒక్కొక్కరినీ ప్రొవోక్ చేసి డాక్యుమెంట్ చేసేది మేము కాదని త్రిగుణ్ చెప్పాడు. ఆ తరువాత ముఖేష్.. అపూర్వను నామినేట్ చేశాడు. కెప్టెన్ రూల్స్ పెట్టి.. పనులు అలాట్‌మెంట్ అయితేనే చేస్తారు తప్ప ముందు చేయరని చెప్పాడు. అహంకారం, అధికారం వల్ల అపూర్వ తనకు పని చెప్పడం తనకు నచ్చలేదని చెప్పాడు. పని మనిషికి చెప్పినట్టుగా చెప్పావని.. రెడ్, బ్లూ టీంలకు ఒక్కొక్కరికీ ఒక్కో న్యాయం చేసిందని.. బయాస్డ్ కెప్టెన్‌గా ఉన్నావని ముఖేష్ చెప్పాడు. తను ఎప్పుడూ అమ్మాయిలను ముట్టి మాట్లాడలేదని ముఖేష్ చెప్పాడు. కానీ వర్షిణితో హగ్గులు గురించి ఎవరికీ తెలియదనుకున్నాడో ఏమో పెద్ద పెద్ద మాటలే వాడేశాడు. తనకొక అమ్మ, చెల్లి ఉందని తనకు అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో తెలుసన్నాడు. ఈ హౌస్‌లో ఉండే అర్హత లేదని చెప్పాడు. రోహిత్‌ను చిన్నదో వైపు.. పెద్దదో వైపు అనడం కరెక్టా? అని చెప్పింది. ఆ తరువాత ముఖేష్ మాట్లాడిన ప్రతి మాటను తీసి అపూర్వ ఏకి పారేసింది. బ్యాచ్ మాత్రమే వర్షిణి దగ్గర ఉందని.. కెప్టెన్సీ మొత్తం ముఖేష్ దగ్గరే ఉందని చెప్పింది. మీడియేటర్ పని ఇక్కడ చేస్తున్నావని అపూర్వను ముఖేష్‌ను అపూర్వ అన్నది. ‘నువ్వొక మోస్ట్ డిజాస్టర్ కెప్టెన్’ై అని అరుస్తూ ఒకవైపు వర్షిణి.. ముఖేష్ డ్యాన్స్ చేస్తూ మరోవైపు అపూర్వను బాగా ట్రిగర్ చేశారు. కానీ అపూర్వ ఏమాత్రం తగ్గకుండా వాదించింది. ప్రతి పాయింట్‌ను పట్టుకుంది. ‘నీకు యారోగెన్స్.. యాటిట్యూడ్’ ఉన్నాయని ముఖేష్‌కి చెప్పింది. మనుషులంటే నీకు చులకన అని చెప్పింది. తన నడుము గురించి తన ముందే మాట్లాడావని త్రిగుణ్‌ను అపూర్వ అన్నది.

ఆ తరువాత నామినేష్స్ అమన్, త్రిగున్ వంతు.. పండు త్రిగుణ్‌కు దొరికింది. త్రిగుణ్ వచ్చేసి అపూర్వను నామినేట్ చేశాడు. ‘మీరు స్క్రీన్ మీద బాగోలేరు.. నేరుగా బాగున్నారని చెప్పింది. దాని వలన తనకు ఆమె గురించి మాట్లాడే అవకాశం ఇచ్చింది. బయటి విషయాల గురించి చెప్పొద్దని రూల్. కానీ అది బ్రేక్ చేసింది. బటర్ ఫ్లై అని వచ్చింది. కానీ జోరీగలా చెవుల్లో రచ్చ చేస్తుంటుంది. రోహిత్‌పై నేను మాట జారడానికి కారణం అపూర్వ’ అని చెప్పాడు. బూతులు మాట్లాడటం.. పక్కనోళ్లపై ఊయడం త్రిగుణ్‌తో చేసే పని అని అపూర్వ చెప్పింది. అపూర్వ కుండ పగులగొట్టేటప్పుడు కూడా చాలా డ్రామా చేశాడు. నెక్ట్స్ అమన్‌ను నామినేట్ చేశాడు. తన రిస్ట్ ఇబ్బంది పెట్టడం తనకు బాధ అనిపించిందని త్రిగుణ్ చెప్పాడు. తను బయటకు వెళ్లాక షూటింగ్స్ చేయాలని ఉందని చెప్పాడు. ‘నీ మెడ మెలిపెట్టడం తప్పు. సారీ’ అని త్రిగుణ్ చెప్పాడు. ఇంకోసారి ఫిజికల్ అయినప్పుడు చూసి ఆడుదామని త్రిగుణ్ చెప్పాడు. ఇద్దరూ ఒకరికొకరు సారీ చెప్పుకున్నారు. అమన్ వచ్చేసి ముఖేష్‌ను నామినేట్ చేశాడు. ‘ఒకరికి బూస్ట్ ఇవ్వడానికి మరొకరిని కించ పరచడం.. అమన్ గాడు బచ్చాగాడు అనడం చాలా బాధించింది. నన్ను నేరుగా బచ్చాగాడివి అన్నావు. అది నన్ను చాలా బాధించింది. సంచాలక్ అనేవాడు వర్షిణికి సపోర్ట్ ఇవ్వడం కరెక్ట్ కాదు’’ అని చెప్పాడు.

మిథిలేష్ ఉన్నప్పుడు.. ఓటేసిన జనాలు వెధవలా అని ముఖేష్ అన్నాడని.. జనాలు వెధవలా అని అమన్ అడిగాడు. బచ్చాగాడు అంటే చిన్నోడివి అని అన్నానని.. తను పెద్దోడిని కదా.. డార్లింగ్ అని పిలవడమేంటని అడిగాడు. మధ్యలో సుధీర్ వచ్చేసి మాటల్లో అమన్.. ‘నీయమ్మ’ అన్నాడని అది తప్పు కాదా? అని ప్రశ్నించాడు. వాళ్ల మాటలు.. వీళ్ల మాటలకు ఇన్‌ఫ్లూయెన్స్ అయి మాట్లాడకు అని చెప్పాడు. తెలంగాణలో నీయమ్మ అనేది కామన్ వర్డ్. దానికి మా అమ్మను అన్నావంటూ ముఖేష్ వాదించడం చాలా సిల్లీగా అనిపించింది. ఈసారి పండు వర్షిణికి దొరికింది. అపూర్వను వర్షిణి నామినేట్ చేసింది. వైల్డ్ కార్డులా వచ్చి పోస్టు గార్డులా పని చేస్తున్నావని చెప్పింది.తాము మాట్లాడిందంతా విని వెళ్లి రోహిత్‌కు చెబుతున్నావని వర్షిణి చెప్పింది. వర్షిణి కౌంటర్స్ ఇవ్వలేకపోయింది. త్రిగుణ్.. అపూర్వను పదే పదే టార్గెట్ చేయడం.. బాడీ షేమింగ్‌లా అనిపించింది. ఆమె మాట తీరుపై పదే పదే కామెంట్స్ చేశాడు. అపూర్వ చిల్లర పనులు చేస్తుంటుందని వర్షిణి చెప్పింది. ‘నానా డే 1 నుంచి నువ్వు చెబుతున్నావు.. నేను నలేదు నన్ను చెప్పు తీసుకుని కొట్టు’ అని ముఖేష్‌కు వర్షిణి చెప్పింది. చాలా రూడ్‌గా అపూర్వ కుండను వర్షిణి పగులకొట్టింది.

ఆ తరువాత రోహిత్‌ను నామినేట్ చేసింది. ‘తో మాట్లాడాలని లేదు. నీ కారణంగా నేను చాలా డల్ అయ్యాను’ అని చెప్పింది. అది తనను సపోర్ట్ చేయకపోవడం వల్ల తనను ఓడిపోయానని వర్షిణి చెప్పింది. రోహిత్ చాలా బాగా వాదించాడు. ఒక కెప్టెన్‌ను కించ పరుస్తూ మాట్లాడుతున్నావని.. పక్కోడి కష్టాన్ని లాక్కుందని నువ్వని రోహిత్ చెప్పాడు. వర్షిణికి త్రిగుణ్, రామ్ ప్రసాద్, దేబ్జాని సపోర్ట్ వచ్చారు. రోహిత్ మాట్లాడుతుండగానే వచ్చేసి కుండ పగులగొట్టి ‘వెళ్లు వెళ్లు.. కూర్చో.. కూర్చో’ అంటూ వర్షిణి వెళ్లిపోయింది. వాస్తవానికి వర్షిణికి డిఫెండింగ్ స్కిల్స్ చాలా తక్కువ. కేవలం ఎదుటి వ్యక్తిని డీగ్రేడ్ చేస్తూ మాత్రమే మట్లాడగలదు. ఆ తరువాత షాలిని.. త్రిగుణ్‌ని నామినేట్ చేసింది. ఒక పర్సన్‌ను పురుగు కంటే దారుణంగా ట్రీట్ చేస్తారని చెప్పింది. ప్రతిసారి నోటి దూలను చూస్తూనే ఉన్నానని షాలిని చెప్పింది. మీకు లీడర్ షిప్ క్వాలిటీస్ బాగున్నాయని చెప్పింది. కానీ వాటిని మంచికి వాడటం లేదన్నట్టుగా చెప్పింది. మీకు ఎగెనెస్ట్‌గా ఎవరైనా మాట్లాడితే వాళ్లు మీకు మనుషుల్లా కనిపించరని త్రిగుణ్‌ను షాలిని అన్నది. రేపు కూడా ఈ నామినేషన్స్ కొనసాగనున్నాయి. మొత్తానికి నామినేషన్స్ హాట్ హాట్‌గా జరిగాయి. ఈవారం కూడా నామినేషన్స్‌లో బలైంది కామనర్సే. దాదాపుగా మొత్తాన్ని నామినేషన్స్‌లోకి లాగినట్టుగా తెలుస్తోంది. హెస్ట్ నాగార్జున సెలబ్రిటీలను లైట్ తీసుకోవడంతో దారుణంగా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో బయట వాళ్లంతా దారుణంగా ట్రోల్ అవుతున్నారు.

Telugu Cinema 360

Recent Posts

కామ్రేడ్ కళ్యాణ్ ట్రైలర్ రివ్యూ.. వాళ్ల మనోభావాలు దెబ్బతింటే అంతే సంగతులు..!

టాలీవుడ్‌లో తనకంటూ ఒక స్పెషల్ కామెడీ టైమింగ్ క్రియేట్ చేసుకున్న హీరో శ్రీవిష్ణు, ఇప్పుడు 'కామ్రేడ్ కళ్యాణ్' సినిమాతో రాబోతున్నారు.…

9 hours ago

Biggboss10 Telugu: రెచ్చిపోతున్న సుధీర్.. పడిపోతున్న గ్రాఫ్..

బిగ్‌బాస్ 10 తెలుగు రోజురోజుకూ దారుణంగా మారుతోంది. సెలబ్రిటీలు మరింత రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా హోస్ట్ నాగార్జున వచ్చి వెళ్లిపోయాక ప్రేక్షకుల్లో…

9 hours ago

ఇదెక్కడి దిక్కుమాలిన ప్లానింగ్.. కనీసం ట్రైలర్స్ కట్ చేయడానికి టైమ్ దొరకట్లేదా..?

టాలీవుడ్‌లో ఈ మధ్య వందల కోట్ల బడ్జెట్‌తో భారీ సినిమాలు తీస్తున్నారు కానీ, వాటికి తగ్గ కనీస ప్లానింగ్ అనేదే…

9 hours ago

లెజెండరీ నటి శారద పరిస్థితి చూస్తున్నారా.. 81 ఏళ్ళ వయసులో కూడా..!

సీనియర్ నటి ఊర్వశి శారద తాజా పరిస్థితి చూసి సోషల్ మీడియాలో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇటీవల అక్టోబర్…

1 day ago

Biggboss10 Telugu: నామినేషన్స్‌లో రెచ్చిపోయిన వర్షిణి, ముఖేష్..

బిగ్‌బాస్ 10 తెలుగు రసవత్తరంగా సాగుతోంది. వీకెండ్‌లో హోస్ట్ నాగార్జున వచ్చి అమన్, త్రిగుణ్, రోహిత్‌లకు ఎల్లో కార్డు ఇచ్చారు.…

1 day ago

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ED సోదాలు.. అసలు నిజమేంటో తెలుసా..?

ఈ మధ్య టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు మీడియాలో ఒక రేంజ్‌లో…

1 day ago