తనకు డ్యాగర్ కావాలని సృష్టి.. రామ్ ప్రసాద్, దేబ్జాని, నరేష్‌లను అడుగుతుండగా షో ప్రారంభమైంది. నీ ఫ్రెండ్స్‌ను అడుక్కోమని దేబ్జాని ామెకు చెప్పింది. అమన్ అయితే తనకు ఇమ్యూనిటీ కావాలని కెప్టెన్సీ అక్కర్లేదని అమన్ అడిగితే చెప్పాడు. భైరవ టీంలోని ఐదుగురికి మాత్రమే కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యే అవకాశం ఉందని బిగ్‌బాస్ చెప్పారు. ఆ ఐదుగురు ఎవరో తేల్చుకోమన్నారు. మూడు కత్తులుంటే ఇమ్యూనిటీ అని.. రెండు కత్తులుంటే కంటెండర్ అని ఎవరికి ఏది కావాలో తేల్చుకోమని రామ్ ప్రసాద్ చెప్పాడు. ఇక్కడ కూడా అమన్ తనకు ఇమ్యూనిటీ అవసరమని కావాలని చెప్పాడు. ఇక రెడ్ టీంలోనూ గ్రూపులుగా విడిపోయి డ్యాగర్స్ కోసం స్కెచ్‌లు గీస్తున్నారు. అమన్‌ను పిలిచి ముఖేష్, సుధీర్ క్లాస్ తీసుకుంటున్నారు. ఫిట్‌గా ఉండి కూడా ఇమ్యూనిటీ కోసం చూడటమేంటని అతనికి ఎక్కించారు. దీంతో తను కెప్టెన్సీ కోసం ఆడుతానని రోహిత్ దగ్గరకు వచ్చి చెప్పాడు. రోహిత్ వద్దని చెప్పాడు. ఇలా ఎవరి స్వార్థం కోసం వాళ్లు స్కెచ్‌లు గీస్తున్నారు. సృష్టికి ఒక డ్యాగర్ ఇవ్వమని అమన్‌కు రోహిత్ చెప్పాడు. వర్షిణి, త్రిగుణ్ మధ్య అపూర్వ గురించి చర్చ జరుగుతోంది. అపూర్వను వెనుక నుంచి రోహిత్ నడిపిస్తున్నాడని.. ఆమె ఒక పప్పెట్‌లా ఆడుతోందని త్రిగుణ్ చెప్పాడు.
అమన్ తనకు ఆడాలని ఉందని చెప్పాడు. తన దగ్గర రెండు ఉన్నాయని.. ఇంకొక దాని కోసం చూస్తున్నట్టు చెప్పాడు. రామ్ ప్రసాద్.. అమన్‌ను సైడ్‌కు తీసుకెళ్లి ఇమ్యూనిటీ ఐదుగురికీ ఇవ్వరని ఆలోచించుకోమని చెప్పాడు. ప్రతి ఒక్కరూ అమన్‌ను తమకు అనుకూలంగా మలచుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. టీం భైరవ ఐదుగురి పేర్లు చెప్పమంటే.. అమన్, వర్షిణి, రామ్ ప్రసాద్, రోహిత్, ఝాన్సీ పేర్లు చెప్పారు. అపూర్వ కూడా చేయి ఎత్తడంతో.. అమన్‌తో మాట్లాడమని.. ఏది వదలవద్దని అపూర్వకు రోహిత్ చెప్పాడు. అప్పటి వరకూ తనకు ఇమ్యూనిటీ ముఖ్యమన్న అమన్ మాట మార్చడాన్ని అపూర్వ ప్రశ్నించింది. తను కంటెండర్‌షిప్‌ని గివ్ అప్ చేయాలని అనుకోవడం లేదని అపూర్వ చెప్పింది. ఎంతకూ తేలకపోవడంతో ఓటింగ్ పెట్టుకున్నారు. ఝాన్సీకి ముఖేష్.. కంటెండర్‌షిప్‌కి రోహిత్ అసలు రాకూడదని.. అలా చూడమని చెప్పి ఓంటింగ్‌కు పంపించాడు. రెడ్ టీంలోని ఝాన్సీ సహా సెలబ్రిటీలను తీసుకెళ్లి ముఖేష్ ఏం చేయాలో చెప్పాడు. రోహిత్ మాటలు వినకుండా సెలబ్రిటీల మాట విన్న అమన్‌కు చివకు కంటెండర్‌షిప్ దక్కలేదు సరికదా.. ఇమ్యూనిటీ కూడా దక్కలేదు.
భైరవ టీం అంతా సప్తశక్తి టీంలోని ముఖేష్ చెప్పినట్టుగా ఆడటం ఆశ్చర్యం. అమన్‌ను కూడా లాగి అతన్ని కామనర్స్ నుంచి లాగేశారు. మొత్తానికి ఒక్కక్కరినీ కామనర్స్‌ను సెపరేట్ చేస్తున్నారు. ఫైనల్‌గా అమన్, ఝాన్సీ, అపూర్వ, వర్షిణి, రామ్ ప్రసాద్‌ను సెలక్ట్ చేశారు. సుధీర్ సైడ్‌కు తీసుకెళ్లినప్పుడు ఏం జరిగిందో చెప్పమని రోహిత్ అడగటంతో ముఖేష్ ఏం చెప్పాడో అంతా అమన్ చెప్పాడు. అమన్ ఇన్‌ఫ్లూయెన్స్ కాడనుకున్నానని కానీ అయ్యాడని రోహిత్ చెప్పాడు. ఎందుకు అడుక్కునే పరిస్థితికి వచ్చావని రోహిత్ అడిగాడు. తన మాట వినకుండా తనను బయటకు లాగేశాడని.. తనూ బయటకు వచ్చాడని రోహిత్ చెప్పాడు. అమన్‌ను మాటల్లో పెట్టి రెండు డ్యాగర్లూ లాగేశారని కామనర్స్ గ్రహించారు. అసలు భైరవ టీంను మొత్తాన్ని ముఖేష్ నడిపించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఐదుగురికి కెప్టెన్సీ టాస్క్ ప్రారంభమైంది. ఈ టాస్క్‌ను అమన్ చాలా బాగా ఆడాడు. టాస్క్ అందరికంటే ముందుగా ఫినిష్ చేశాడు. దీంతో అమన్ కెప్టెన్ అయ్యాడు. ఇక వర్షిణి వచ్చేసి తన పవర్‌ని వినియోగించుకోవచ్చా బిగ్‌బాస్ అని అడిగింది. దీంతో మేజికల్ కీస్‌ను బిగ్‌బాస్ పంపించారు. దాంతో వర్షిణి.. అమన్ నుంచి కెప్టెన్సీని లాగేసుకుంది. ఝాన్సీ.. ముఖేష్‌ను హగ్ చేసుకుని తను తృప్తి పడేలా లేదు కాబట్టి అది తనకు రాలేదని చెప్పింది.
తన పవర్‌తో అమన్ నుంచి కెప్టెన్సీ లాగేసుకుంటున్నట్టు వర్షిణి చెప్పింది. మొత్తంగా కామనర్స్‌కు పెద్ద దెబ్బ పడింది. అమన్‌కు కెప్టెన్సీ పోయింది. ఇమ్యూనిటీ పోయింది. ఝాన్సీ, ముఖేష్ అయితే చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ కనిపించారు. త్రిగుణ్ ప్లాన్ మాత్రం బాగుందని త్రిగుణ్ పాట పాడుతున్నాడు. వర్షిణి కూడా ఊహించని ప్లాన్ త్రిగుణ్ వేశాడు. సెలబ్రేషన్ ఇంకా ఉందని చెబుతున్నాడు. ముందే స్కెచ్ వేసుకుని మరీ ఇదంతా వర్షిణి చేసింది. ఇదంతా రోహిత్ కారణంగానే చేసినట్టుగా అమన్‌కు వర్షిణి చెప్పింది. బిగ్‌బాస్ కరెక్ట్ టైంకి పంపడం తనకు అర్థం కాలేదని అమన్ అంటే.. బిగ్‌బాస్ పంపలేదు.. వర్షిణి చెప్పడం వల్లనే పంపాడని చరణ్ చెప్పాడు. దీంతో అమన్ అవాక్కయ్యాడు. అసలు వర్షిణి తన టైంలోనే ఎందుకు దెబ్బేసిందో అర్థం కాలేదని చెప్పాడు. మరోవైపు వర్షిణి.. ముఖేష్‌తో ఒక్కరికీ సౌండ్ లేదని చెప్పింది. ఆ ప్లేస్‌లో అమన్ కాకుండా ఝాన్సీ, రామ్ ప్రసాద్ ఉండి ఉంటే తను తీసుకునేదాన్ని కాదని చెప్పింది. వైట్ గోల్డ్ నుంచి గోల్డ్ కాయిన్ వర్షిణికి వచ్చింది.
అమన్‌కు ఏం ఫీల్ కావొద్దని.. నిన్ను కెప్టెన్సీ నుంచి తీసేసిన వాళ్లకు ఇది సమాధానం అని సెలబ్రిటీలంతా హిత బోధ చేశారు. అమన్ పైన దాచిన డ్యాగర్స్‌ను నరేష్ సాయంతో తీయించాడు. అది ప్రమాదకరమని.. మిగతా సభ్యులు చూస్తూ ఊరుకున్నారా? అంటూ బిగ్‌బాస్ ఫైర్ అయ్యారు. ఎవరి దగ్గర డ్యాగర్ ఉంటే వారికే ఇమ్యూనిటీ దక్కుతుందని బిగ్‌బాస్ చెప్పారు. వర్షిణి వెళ్లి ముఖేష్ కాళ్లకు దణ్ణం పెట్టి ఆశీర్వాదం తీసుకోవడం చాలా వింతగా అనిపించింది. ఎవరి దగ్గర ఎన్ని డ్యాగర్స్ ఉన్నాయో బిగ్‌బాస్ చెప్పమంటే.. సుధీర్ దగ్గర 5, సృష్టి దగ్గర 3, వంశీ దగ్గర 6 ఉన్నాయని చెప్పారు. మిగిలిన వారందరి దగ్గర 0 ఉన్నాయి. ఎవరి దగ్గర అయితే ఒక డ్యాగర్ ఉంటుందో వారికి ఇమ్యూనిటీ పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరి దగ్గరైతే రెండుంటాయో వారికి ఇమ్యూనిటీ ఎవరికైనా ఇచ్చే అర్హత ఉంటుందని బిగ్‌బాస్ చెప్పారు. ఆ తరువాత చరణ్, త్రిగుణ్‌కు ఇచ్చారు. ఒక డ్యాగర్ నుంచి ఎక్కువ ఉన్న వారందరి పెయింటింగ్స్ అక్కడ ఏర్పాటు చేశారు. ఎక్కువ డ్యాగర్స్ ఉన్నవారు.. ఒక్క డ్యాగర్ ఉన్నవారి పెయింటింగ్‌ను ఇమ్యూనిటీ రాకుండా తొలగించవచ్చు. అలాగే ఫ్రేమ్ నుంచి తీసిన పెయింటింగ్స్‌ను సైతం మరొకరితో స్వాబ్ చేయవచ్చు.
సృష్టి ముందుగా వెళ్లి వంశీ ఫోటోను తన ఫోటోతో స్వాబ్ చేసింది. ఆ తరువాత సుధీర్ వచ్చి.. సృష్టిని వంశీతో స్వాబ్ చేశాడు. ఝాన్సీ వచ్చేసి తనను జనాలు ఎప్పుడు పంపిస్తే అప్పుడే పోతానని తను ఎవరినీ మార్చాలనుకోవడం లేదని చెప్పింది. త్రిగుణ్‌కు ఇమ్యూనిటీ అవసరం లేదని చెప్పి తీసేసింది. వంశీ వచ్చేసి చరణ్ ఇమ్యూనిటీ తీసుకున్నాడు. ఫైనల్‌గా వంశీ, సుధీర్ ఇమ్యూనిటీ పొందినట్టుగా బిగ్‌బాస్ చెప్పారు. మొత్తంగా కామనర్స్‌కు చాలా పెద్ద దెబ్బ పడింది. సెలబ్రిటీల మాట విని అమన్ తనపై తనే చాలా పెద్ద దెబ్బ వేసుకున్నాడు. కెప్టెన్సీ పొందలేదు పైగా ఇమ్యూనిటీ కూడా దక్కలేదు. మొత్తం ముఖేష్ భైరవ టీంను కూడా నడిపించి కామనర్స్‌కి పెద్ద దెబ్బ పడేలా చేశాడు.
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న భారీ పీరియాడిక్ సినిమా సంబరాల ఏటిగట్టు వ్యవహారం ఇండస్ట్రీలో పెద్ద…
మెగా అభిమానులకు త్వరలోనే అదిరిపోయే న్యూస్ అందబోతోందా అంటే అవుననే సమాధానం బలంగా వినిపిస్తోంది. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర దశాబ్దాలుగా…
టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే సినిమా పేరు మార్మోగిపోతోంది.. అదే డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. దర్శక ధీరుడు…
టాలీవుడ్ స్థాయిని పెంచడమే కాదు, ఏకంగా ఇండియన్ సినిమా ముఖచిత్రాన్ని, రూపురేఖలను పూర్తిగా మార్చేస్తున్న ఏకైక దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి…
టాలీవుడ్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వరుస సినిమాలు నిర్మిస్తూ స్టార్ ప్రొడ్యూసర్‌గా దూసుకుపోతున్న నాగవంశీ, కేవలం నిర్మాణానికే పరిమితం కాకుండా…
ఇవాళ బిగ్‌బాస్ షోలో కూడా త్రిగుణే హైలైట్. ‘లం....’ అనే పదం వాడి నానా రచ్చ చేశాడు. ఇవాళేం జరిగిందంటే..…